2026 జనవరి 26న ఢిల్లీలో గణతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. దీనికోసం ఇప్పటికే రిహార్సల్స్ కూడా ప్రారంభమయ్యాయి. 23న (శుక్రవారం) రిహార్సల్స్ ముగియనున్నాయి. ఈ సందర్భంగా గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల ఒక అడ్వైజరీ జారీ చేసింది.
3000 మంది పోలీసులు
త్వరలో జరగనున్న గణతంత్య్ర దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని.. భారీ వాహనాల ప్రవేశం నిషేధమని పోలీసులు వెల్లడించారు. అంతే కాకుండా భద్రత దృష్ట్యా 3000 కంటే ఎక్కువమంది పోలీసులు మోహరించనున్నట్లు ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. పోలీసులు అనేక ప్రదేశాల్లో సాధారణ దుస్తుల్లో కూడా ఉంటారని ఆయన వివరించారు. ఢిల్లీలో పటిష్టమైన భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అమల్లోకి వచ్చే రూల్స్
జనవరి 22 సాయంత్రం 5 గంటల నుంచి జనవరి 23 మధ్యాహ్నం 1.30 గంటల వరకు మీడియం, హెవీ వెహికల్స్ గురుగ్రామ్ / ఢిల్లీలలోకి ప్రవేశించడం నిషిద్ధం. అదే విధంగా జనవరి 25 సాయంత్రం 5 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా ఇదే రూల్స్ అమల్లో ఉంటాయి. అయితే ట్రాఫిక్ సజావుగా సాగడానికి, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారీ వాహనాల దారి ,మళ్లించడం జరిగింది.
ఎన్‌హెచ్48 పై జైపూర్ నుంచి వచ్చే భారీ వాహనాలను కేఎంపీ ఎక్స్‌ప్రెస్‌వేలోని పచ్‌గావ్ వద్ద మళ్లిస్తారు. అయితే గురుగ్రామ్ స్థానిక ప్రాంతం నుంచి వచ్చే భారీ వాహనాలను హీరో హోండా చౌక్, శంకర్ చౌక్, మెహ్రౌలి బోర్డర్, సోహ్నా, పటౌడి, ఫరూఖ్‌నగర్ వంటి వివిధ పాయింట్ల వద్ద వాహనాలను మళ్లిస్తారు. కాగా పాలు, పండ్లు, కూరగాయలు తరలించే వాహనాలకు.. అగ్నిమాపక వాహనాలకు, అంబులెన్స్, విమానాశ్రయ ప్రయాణికుల వాహనాలపైన లేవు.
భద్రత పెంచడానికి కారణం!
గత కొన్ని రోజులకు ముందు ఢిల్లీలో జరిగిన ఒక ఆత్మహుతి దాడి ఎంతోమందిని ప్రమాదంలోకి నెట్టేసింది. కొందరు అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడటానికి పోలీస్ యంత్రాంగం దేశంలోని ప్రధాన నగరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఢిల్లీలో జరిగే గణతంత్య్ర దినోత్సవ వేడుకలకు చాలామంది వీక్షకులు, ప్రధానమంత్రి, ఇతర మంత్రులు హాజరవుతారు. ఇలాంటి సమయంలో అనుకోని ప్రమాదాలు జరిగితే.. దేశం కన్నీరు కారుస్తుంది. కాబట్టి దేశాన్ని ఉగ్రమూక నుంచి కాపాడుకోవడానికి భద్రతా దళాలు, పోలీసులు గొప్ప భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
ఊరు, వాడల్లో మువ్వన్నెల జెండా!
ఒక్క దేశ రాజధాని నగరంలో మాత్రమే కాకుండా.. హైదరాబాద్, బెంగళూరు, ముంబై మొదలైన మహానగరాల్లో కూడా రిపబ్లిక్ డే సందర్భంగా గట్టి భద్రతను ఏర్పాటు చేయనున్నారు, తప్పకుండా చేయాలి కూడా. అమాయక ప్రజలను కాపాడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, సంబంధిత అధికారులు కూడా కృషి చేస్తున్నారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా జరుపుకునే.. ఈ గణతంత్య్ర దినోత్సవాన్ని దేశంలో ఊరు వాడల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. ఇది జాతీయ పండుగ కాబట్టి దీనికి కుల, మత జాతి మొదలైన బేధాలు ఉండవు. అందరూ కలిసి మువ్వన్నెల జెండా ఎగురవేసి.. స్వాతంత్య్ర సమరంలో ప్రాణాలు అర్పించిన నాయకులను శ్రద్ధాంజలి ఘటిస్తారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.






