ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

BYD Sealion 7 To Launch in India On February 17: 2025 గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఈ నెల 17న (ఫిబ్రవరి 17) భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ ధ్రువీకరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన కారు కానుంది. దీని దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం.

బుకింగ్స్ & డెలివరీలు

కంపెనీ లాంచ్ చేయనున్న బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాబట్టి రూ. 70000 చెల్లించిన దీనిని బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2025 మార్చి 7న ప్రారంభమవుతాయి. కంపెనీ మొదటి దశలో కేవలం 70 యూనిట్లను మాత్రమే డెలివరీ చేయనుంది. ఈ కారు కొనుగోలుపైన సంస్థ 7 సంవత్సరాలు లేదా 1,50,000 కిమీ వారంటీ మరియు ఫ్రీ ఇన్‌స్టాలేషన్‌తో కాంప్లిమెంటరీ 7kW ఏసీ హోమ్ ఛార్జర్ అందిస్తుంది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

వేరియంట్స్ మరియు బ్యాటరీ & రేంజ్

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం మరియు పర్ఫామెన్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇవి రెండూ 82.56 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతాయి. రేంజ్ విషయానికి వస్తే ప్రీమియం మోడల్ 567 కిమీ, పర్ఫామెన్స్ మోడల్ 542 కిమీ అందిస్తాయి.

ప్రీమియం మోడల్ రియర్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది, ఇది 6.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ వేరియంట్ 313 హార్స్ పవర్, 318 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే మోటారును కలిగి ఉంటుంది. పర్ఫామెన్స్ మోడల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. ఇది 0 నుంచి 100 కిమీ / గం వేగవంతం కావడానికి పట్టే సమయం 4.5 సెకన్లు మాత్రమే. ఇందులోని మోటార్ 530 హార్స్ పవర్ మరియు 690 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఫీచర్స్

కొత్త బీవైడీ సీలియన్ 7.. బ్రాండ్ యొక్క ఇతర మోడల్స్ మాదిరిగానే ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్.. డాష్‌బోర్డ్ మధ్యలో ఉంటుంది. హెడ్స్ ఆప్ డిస్ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైట్స్, 12 స్పీకర్లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్ మరియు పవర్ టెయిల్‌గేట్ వంటి ఎన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

Also Read: సింగిల్ ఛార్జ్.. 323 కిమీ రేంజ్: సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ – ధర ఎంతో తెలుసా?

సీలియన్ 7 కారులో 11 ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ డిపార్చర్ అసిస్ట్ వంటి ఏడీఏఎస్ (ADAS) సూట్ వంటి వాటితో పాటు.. 360 డిగ్రీ కెమెరా, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్ హోల్డ్ కంట్రోల్మరియు ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహనదారులకు మంచి భద్రతను అందిస్తాయి.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

కొత్త సీలియన్ 7 కారు ఒక్క చూపుతోనే.. తప్పకుండా ఆకర్శించగలదు. ఎందుకంటే ఇది చూడటానికి కొంత, ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న బీవైడీ సీల్ మాదిరిగా ఉంది. కొత్త బంపర్ డిజైన్, హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ సెటప్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 19 ఇంచెస్ మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్షన్ పొందుతుంది.

Also Read: మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు రంగులలో లభించనుంది. అవి కాస్మోస్ బ్లాక్, అట్లాంటిస్ గ్రే, అరోరా వైట్ మరియు షార్క్ గ్రే కలర్స్. కలర్ ఆప్షన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ కొత్త కారు నాలుగు రంగులలో లభించడం వల్ల, కొనుగోలుదారు తనకు నచ్చిన కలర్ ఎందుకోవచ్చు. కాగా కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ధరలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. లాంచ్ సమయంలో ఆ వివరాలు తెలుస్తాయి.

Leave a Comment