సరస్వతి పుష్కరాలు అప్పుడే: పుణ్యస్నానాలకు వచ్చే పీఠాధిపతులు ఎవరంటే?

Saraswati Pushkaralu 2025: ఈ ఏడాది మే 15 నుంచి జరగనున్న సరస్వతి నటి పుష్కరాలను ఉద్దేశించి.. తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ లాంచ్ చేసింది. ఈ పురష్కారాలు మే 26 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో 17 అడుగుల సరస్వతి దేవి రాతి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు.

భూపాలపల్లి కాళేశ్వరం వద్ద జరగనున్న ఈ పుష్కరాలకు సంబంధించిన సమాచారాన్నిఅందించడానికి ప్రభుత్వం.. వెబ్ పోర్టల్ మరియు ఓ స్పెషల్ యాప్ సైతం రూపొందించి, అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మినిష్టర్ శ్రీధర్ బాబు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొదలైనవారు పాల్గొన్నారు.

రూ.35 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

ఈ పుష్కరాలకు ప్రతి రోజూ 50వేలు నుంచి ఒక లక్ష మంచి జనం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం సుమారు రూ. 35 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు కొండా సురేఖ వెల్లడించారు. వంద గదుల వసతి గృహం మాత్రమే కాకుండా.. డార్మెటరీ భవనం కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండటానికి టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలకు.. కాశీ నుంచి కూడా పండితులు రానున్నారు. వారు ఇక్కడ ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. అంతే కాకుండా పలు రాష్ట్రాల్లోని పీఠాధిపతులు కూడా ఈ పుష్కారాలను విచ్చేసి.. పుణ్య స్నానాలు ఆచరించనున్నారు.

పుణ్యస్నానాలు చేయనున్న పీఠాధిపతులు

➤మే 15: మెదక్ జిల్లా రంగంపేటలో శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద స్వామి, పుష్కరాలను ప్రారంభించి.. పుణ్య స్నానం ఆచరించనున్నారు.
➤మే 17: తుని పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి పుష్కర స్నానము చేయనున్నారు.
➤మే 19: నాసిక్ త్రయంబకేశ్వర్ మహా మండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్ పుణ్యస్నానం చేయనున్నారు.
➤మే 23: హంపీ విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి పుణ్యస్నానం చేయనున్నారు.

Also Read: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం: మైనర్లు వెహికల్ డ్రైవ్ చేస్తే..

సరస్వతి నది పురస్కారాల వెబ్ పోర్టల్ మరియు యాప్ లాంచ్ చేసిన సందర్భంగా ఐటీ మినిష్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం త్రివేణి సంగమం అని అన్నారు. 2013 తరువాత జరగనున్న ఈ పుష్కరాలను మరింత వైభవంగా జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. ప్రజలకు అందాల్సిన అన్ని పథకాలు అందుతున్నాయని శ్రీధర్ బాబు అన్నారు. అయితే గత ప్రభుత్వంలో ఆలయాల నిర్వహణ సరిగ్గా లేదని కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా ఆలయాలను పునరుద్దరించామని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఏది ఏమైనా ప్రజలను మంచి చేయడమే ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని.. సంక్షేమ పథకాలను అందిస్తామని వెల్లడించారు.

Leave a Comment