Actor Avinash Dwivedi Surprise BMW X5 Gift For Wife: ఆధునిక కాలంలో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్ అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు, భార్య భర్తకు, భర్త భార్యకు ఇలా.. సంతోషంగా ఉన్న క్షణాలను ప్రియమైనవారితో పంచుకోవడానికి బహుమతులు ఇచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.
దూపాహియా చిత్రంతో బాగా పాపులర్ అయిన.. అవినాష్ ద్వివేది, తన భార్య ‘సంభావన సేథ్’కు ఖరీదైన బీఎండబ్ల్యూ ఎక్స్5 గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కారును కొనుగోలు చేసి డెలివరీ తీసుకుంటున్న సమయంలో. భార్యతో కలిసి ద్వివేది ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు. ఇందులో తమ పెంపుడు కుక్కలు కూడా ఉండటం చూడవచ్చు.
ఇన్‌స్టా పోస్ట్..
కారు కొనుగోలు చేసిన తరువాత డియర్ వైఫీ.. ఈ క్షణం మనది మాత్రమే కాదు, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం. వారి ప్రేమ మరియు మార్గదర్శకమే ఇలా ఎదగడానికి సాధ్యమైంది. తల్లిదండ్రులు ఈ రోజు మనతో లేకపోయినా.. స్వర్గం నుంచి చూస్తూ మనల్ని ఆశీర్వదిస్తుంటారు. నా భార్య అన్ని విషయాల్లోనూ.. నా బలంగా నిలిచి, తన మద్దతు తెలిపింది. ఇష్టమైన కారును డెలివరీ తీసుకోవడం ఆనందంగా ఉంది. ఇది మా ప్రయాణం, మా త్యాగాల వల్లనే ఇది సాధ్యమైందని.. ద్వివేది తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఈ సందర్భంగా బీఎండబ్ల్యూ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపాడు ద్వివేది.
బీఎండబ్ల్యూ ఎక్స్5
భారతదేశంలో అత్యంత ప్రజాదరణపొందిన మరియు ఎక్కువమంది సినీతారలకు నచ్చిన బ్రాండ్ బీఎండబ్ల్యూ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీఎండబ్ల్యూ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేయడంలో భాగంగానే.. 2023లో ఎక్స్5 ఫేస్‌లిఫ్ట్ లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్లు, రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5) అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఈ కారు ముందు భాగంలోని ఫ్రంట్ బంపర్‌లో వర్టికల్ ఎయిర్ ఇన్‌టేక్‌లు ఉన్నాయి. పెద్ద గ్రిల్ మునుపతిం కంటే కూడా ప్రకాశవంతంగా ఉంది. రిఫ్రెష్డ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, అప్డేటెడ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు, క్లాడింగ్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్ వంటివన్నీ ఈ కారులో చూడవచ్చు. నటుడు ద్వివేది తన భార్య కోసం కొనుగోలు చేసిన కారు xLine ట్రిమ్ అని తెలుస్తోంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 93.90 లక్షలు (పెట్రోల్), రూ. 95.90 లక్షలు (డీజిల్). ఆన్-రోడ్ ధర ముంబైలో రూ. 1.2 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం.
12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటివో కలిగి ఉన్న బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు యాంబియంట్ లైటింగ్ బార్ డాష్‌బోర్డ్ పొందుతుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, యాక్టివ్ సీట్ వెంటిలేషన్, పవర్డ్ స్ప్లిట్ టెయిల్‌గేట్ మొదలైన ఫీచర్స్ అన్నీ కూడా ఈ కారులో ఉన్నాయి.
బీఎండబ్ల్యూ ఎక్స్5 కారు 3.0లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను పొందుతుంది. అంతే కాకుండా ఈ రెండు ఇంజిన్లు 48వోల్ట్స్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని పొందుతాయి. పెట్రోల్ ఇంజిన్ 381 పీఎస్ పవర్ మరియు 520 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తే.. డీజిల్ ఇంజిన్ 285 పీఎస్ పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజిన్లు 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి పవర్ నాలుగు చక్రాలకు డెలివరీ అవుతుంది.
Also Read: ఖరీదైన కారులో తమన్నా: ఓదెల 2 రిలీజ్‌కు ముందే అక్కడ కనిపించిన మిల్కీ బ్యూటీ
భార్యకు ఖరీదైన కారు ఇవ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కొత్తకారు కొనుగోలు చేసిన సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అవినాష్ ద్వివేది, సంభావన సేథ్ 2016 జులై 14న పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు అనోన్యంగా కలిసి జీవితం సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో జన్మించిన ద్వివేది.. డ్యాన్సర్. ఇతడు ఇబిబో ఐ.వీడియోస్టార్, డ్యాన్స్ సంగ్రామ్ వంటి రియాలిటీ షోలలో విజేతగా నిలిచాడు. ఆ తరువాత రన్‌బంకా, నాచానియా, చమేలీ వంటి సినిమాల్లో కనిపించాడు. కాగా దూపాహియా సినిమాలో ఇతడు కుబేర్ త్రిపాఠి పాత్ర పోషించాడు.
View this post on Instagram