‘ఈ ప్రేమ ఆ చూపుతో మొదలయింది’: పలాస హీరో అందమైన లవ్‌స్టోరీ

పలాస ఫేమ్ హీరో రక్షిత్ అట్లూరి, హీరోయిన్ కోమలీ ప్రసాద్ కలిసి జంటగా నటించిన రొమాంటిక్ సినిమా శశివదనే. అక్టోబర్ 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌వీఎస్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఏజీ ఫిలిం కంపెనీ నిర్మాణంలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తుండగా.. సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా శరవణ వాసుదేవన్, సినిమాటోగ్రాఫర్‌గా సాయి కుమార్ దార, ఎడిటర్‌గా గ్యారీ బీహెచ్ వ్యవహరించారు.

మొదటి సినిమా అంతంతమాంత్రంగానే..

రక్షిత్ లండన్ బాబులు సినిమాతో వచ్చినప్పటికి.. ఆ చిత్రం తనకు కొంతమేరకు పాపులరిటీ మాత్రమే తీసుకుని వచ్చింది. అయితే పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర కూడా అంతంత మాత్రం ఫలితాలను రాబట్టింది అనే టాక్ నడించింది. అయితే చాలా గ్యాప్ తరువాత తీసిన పలాస 1978 తన కెరియ‌ర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది.

ఈ సినిమా పేరు తెలియవారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రక్షిత్ అట్లూరికి ఈ సినిమా ఒక మంచి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అంతటి విజయాన్ని సొంతం చేసుకునింది. నాది నక్కిలీసు గొలుసు పాటతో మరింత ప్రేక్షకాదరణ పొందింది. 2019 చివరలో అంటే దాదాపు కరోనా సమయంలో విడుదల అయినప్పటికీ కూడా డైరెక్టర్ కరుణకుమార్ ఎంచుకున్న కథ, సినిమాను నడిపించిన విధానం వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో సఫలం అయింది.

రెండేళ్ల విరామం తరువాత

పలాస తరువాత మళ్ళీ రెండు సంవత్సరాలు విరామం తీసుకొని నరకాసుర, ఆపరేషన్ రావణ చిత్రాలు చేశారు. వరుసగా చేసిన ఈ రెండు కూడా డిసప్పాయింట్ చేశాయనే చెప్పాలి. అటు డబ్బులు పరంగా, ప్రేక్షకుల ఆదరణ పరంగా.. అన్నీ విధాలుగా నిరాశపరిచిందనే చెప్పాలి. కథ, కథనం అన్నీ కూడా అడియన్స్ తికమక పెట్టే విధంగా ఉన్నాయి అని రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు రిలీజ్ కానున్న శశివదనే సినిమా ట్రైలర్ మంచి రొమాంటిక్ వైబ్ తీసుకొచ్చింది. డైలాగ్స్ అన్నీ లవ్ చుట్టూనే తిరుగుతున్నాయి. పలాస, నరకాసుర, ఆపరేషన్ రావణ మూడు చిత్రాలు మాస్ లుక్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ లవర్ బాయ్ ఇమేజ్ తీసుకొచ్చేలాగా ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. వరుసగా ఫెయిల్యూర్స్ కారణంగా శశివదనేతో హిట్ టాక్ తెచ్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగినట్టుగానే సన్నాహకాలు జరుగుతున్నాయి. ఇది రక్షిత్ లైఫ్‌లో బిగ్ హిట్ అవ్వాలని కోరుకుందాం.

హృదయాన్ని హత్తుకునే డైలాగ్స్

”ఈ ప్రేమ ఆ చూపుతో మొదలయింది, కాలం బొమ్మలా ఆగిపోయింది, ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైపోయింది” అని ట్రైలర్‌లో హీరో చెప్పే మాటలు హృదయానికి హత్తుకునేలా ఎంతో ఫీల్‌తో ఉన్నాయి. ”ఒక్కసారి ప్రేమించాలని డిసైడ్ అయ్యామంటే ఎన్ని వచ్చినా యుద్ధం చేయాల్సిందే” అంటూ శ్రీమాన్ రక్షిత్‌తో చెప్పే మాటలు ప్రేమ ఎంత బలమైనదో చెప్పడానికి ఉదాహరణలు. మొత్తంగా ఆడియన్స్ అందరినీ ఫుల్ లవ్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోనున్నారన్నమాట. కథ అంతా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, అమలాపురం చుట్టూ తిరిగినట్లు కనిపిస్తోంది. గోదావరి పరివాహక అందాలు వీడియోలో ఆకట్టుకుంటున్నాయి. శశివదనేతో హీరో రక్షిత్ అట్లూరి ఖాతాలో విజయం ఖాయం అయినట్టే అనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ రక్షిత్.