కాంతారా సినిమా విజయం తరువాత.. దాని సీక్వెల్ కాంతారా చాప్టర్-1 తెరకెక్కిన విషయం తెలిసిందే. ఒక ప్రాంతానికి చెందిన కథను తీసుకుని మలచిన ఈ సినిమా.. అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొంది, భారీ విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా తీయడానికి కారణం ఏంటని.. అందరూ అనుకుంటున్న వేళ.. హీరో రిషబ్ శెట్టి ఆ వివరాలను వెల్లడించారు.
20 ఏళ్లకు ముందు జరిగిన ఓ సంఘటన
రెండు దశాబ్దాల క్రితం (20 ఏళ్లకు ముందు) ఒక గ్రామంలో జరిగిన ఒక యదార్థ ఘటనే.. కాంతారా కథకు మూలమని, డైరెక్టర్ & యాక్టర్ రిషబ్ శెట్టి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సినిమాలో అందరూ క్లైమాక్స్ సన్నివేశాలను గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఏదో ఒక శక్తి నా చేత ఆ సన్నివేశాలను రాయించిందని నేను బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. కాంతారా సినిమా రిలీజ్ చేయాలని అనుకున్నప్పుడే.. ప్రేక్షకులు తప్పకుండా దీనిని ఆదరిస్తారనే నమ్మకం కుదిరింది. ప్రాంతంతో తేడా లేకుండా.. ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయినదని ఆయన అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు.. ప్రేక్షకులు సైతం ఆ సన్నివేశాలకు మంత్రముగ్దులయ్యారంటే.. తప్పకుండా రిషబ్ చెప్పింది నిజమే అని చాలామంది భావిస్తున్నారు.
ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ
20 సంవత్సరాలకు ముందు.. ఒక గ్రామంలో వ్యవసాయ భూమి కోసం అటవీశాఖ అధికారికి, రైతుకు మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది. ఆ సంఘటను నేను ఒక ఘర్షణగా చూడలేదు. ప్రకృతిని కాపాడే వారిమధ్య జరిగిన ఘర్షణగా చూసాను. అదే కాంతారా కథ రాయడానికి కారణమైందని నటుడు రిషబ్ శెట్టి క్లారిటీ ఇచ్చారు. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతోందో అనే ఆలోచన నుంచే కథ పుట్టుకొచ్చిందని అన్నారు.
అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు
కాంతారా సినిమా చూసిన తరువాత.. థియేటర్ బయట కూడా ప్రేక్షకులు సినిమా గురించే చర్చించుకుంటున్నారు ఆంటే.. అది ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రాంతం గురించి, ఒక సంస్కృతి గురించి సినిమా తీసేటప్పుడు.. సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడే దానిని అందరూ ఆదరిస్తారు.
నిజానికి కాంతారా సినిమా కంటెంట్ ఒక ప్రాంతానికి చెందినది. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకునే తపనే కాంతారా సినిమాగా రిషబ్ శెట్టి తెరకెక్కించారు. సినిమాలోని సన్నివేశాలు చాలామందిని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి. ఒక కథ ఎప్పుడైతే ప్రజల జీవన విధానాలకు దగ్గరగా ఉంటుందో.. అప్పుడే అది ప్రజల్లోకి వెళ్తుంది. వారిని ఆకట్టుకుంటుంది.
కాంతారా సినిమాలో పంజుర్లి, గుళిగ దేవుళ్ల గురించి కన్నడ ప్రాంతంలోని వారికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఈ దేవుళ్ల గురించి యావత్ భారతదేశానికి తెలిసింది. ఈ ఘనత తప్పకుండా రిషబ్ శెట్టిదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే రిషబ్ శెట్టి మాత్రం ఆ దేవుళ్ల శక్తితోనే ఇది ఇది సాధ్యమైందని నిస్సందేహంగా చెప్పుకున్నారు. కాగా ఇప్పటికి బ్లాక్ బస్టర్ సాధించిన కాంతారా, కాంతారా చాప్టర్-1 సినిమాల తరువాత చాప్టర్-3 కూడా రాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.