21.7 C
Hyderabad
Friday, April 4, 2025

కల నిజమైన వేళ.. లక్షల ఖరీదైన ‘భవికా శర్మ’ కొత్త కారు (ఫోటోలు)

Actress Bhavika Sharma New BMW Car: సినీనటులు, పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను, బైకులను కొనుగోలు చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ప్రముఖ టెలివిజన్ యాక్టర్ ‘భవికా శర్మ’ (Bhavika Sharma) రూ. 70 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

నటి భవికా శర్మ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ‘3 సిరీస్ గ్రాన్ లిమోసిన్’ (BMW 3 Series Gran Limousine). నటి తన సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. ఆమె బీఎండబ్ల్యూ డీలర్‌షిప్‌కు రావడం, ఆ తరువాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఫిల్ చేయడం వంటివి చూడవచ్చు. ఆ తరువాత బీఎండబ్ల్యూ కారు కీ(తాళం) తీసుకోవడం, ఫ్యామిలీతో కలిసి కేట్ కట్ చేయడం వంటివి కూడా చూడవచ్చు. ఆ తరువాత కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడంతో వీడియో ముగుస్తుంది.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్

భవికా శర్మ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్.. ఏ వేరియంట్ అనేది ఖచ్చితంగా వెల్లడికాలేదు. అయితే ఈమె సొంతం చేసుకున్న సెడాన్ స్కైస్క్రాపర్ మెటాలిక్ యొక్క క్లాసీ షేడ్‌లో ఉండటం చూడవచ్చు.

నిజానికి బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎమ్ స్పోర్ట్ ప్రో ఎడిషన్ ఈ మధ్య కాలంలోనే దేశీయ మార్కెట్లో లాంచ్ అయింది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అమ్ముడవుతున్న ఈ కారు టాప్ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది బ్లాక్ కలర్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, బ్లాక్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. ఈ కారు యొక్క ఫ్రంట్ బంపర్ డార్క్ షాడో మెటాలిక్ ఫినిషింగ్ పొందుతుంది.

మంచి డిజైన్ కలిగిన ఈ బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కర్వ్డ్ డిస్‌ప్ప్లే, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, ఆంత్రసైట్ హెడ్‌లైనర్ అపోల్స్ట్రే, బీఎండబ్ల్యూ 8.5 ఓఎస్, వైర్‌లెస్ ఛార్జర్, పార్క్ అసిస్టెంట్ ప్లస్, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్ మరియు త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.

బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 254 బ్రేక్ హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుందని తెలుస్తోంది.

నటి భవికా శర్మ మాత్రమే కాకుండా.. బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కూడా గత ఏడాది ప్రారంభంలో బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కారును కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. సెలబ్రిటీలకు ఈ కారు అంటే ఎంత ఇష్టమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

భవికా శర్మ

ఆగష్టు 1998న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించిన భవికా శర్మ 17 సంవత్సరాల వయసులోనే.. టీవీ షోలలో పనిచేయడం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచే నటన మీద ఎక్కువ ఆసక్తి కలిగిన ఈమె అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. 2022లో ఈమెకు 21వ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు లభించింది. భవికా ‘ఘుమ్ హై కిసీ కే ప్యార్ మే’లో నటించి బాగా ఫేమస్ అయింది. ఆ తరువాత మేడం సర్, పర్వర్రిష్ వంటి షోలలో కూడా నటించింది.

సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. ఈ రోజు యూట్యూబ్ స్టార్స్ దగ్గర నుంచి పెద్ద పాపులర్ స్టార్స్ వరకు అందరూ తమ స్తోమతకు తగిన విధంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కొంతమంది యూట్యూబర్స్.. సినీ తారలకంటే కూడా ఖరీదైన వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన సెలబ్రిటీల జాబితాలో ఇప్పుడు తాజాగా భవికా శర్మ కూడా చేరారు.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు