కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

Keerthy Suresh Wedding and Car Collection: నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన అభినవ మహానటి ‘కీర్తి సురేష్’ (Keerthy Suresh) పెళ్లి పీటలెక్కనున్న. కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ‘ఆంటోనీ తటిల్’ (Antony Thattil)ను ఈ రోజు (డిసెంబర్ 12న) గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తాను.. ఆంటోనీ 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే కీర్తి సురేష్ వెల్లడించింది. ఇప్పుడు ఇరువురి కుటుంబాల సమక్షంలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగనుంది.

తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. తమిళం మరియు మలయాళం సినిమాల్లో కూడా నటించింది. అయితే తెలుగులోనే ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మహానటిగా ప్రసిద్ధి చెందిన ఈమె నిజ జీవితంలో ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

కీర్తి సురేష్ కార్ కలెక్షన్ (Keerthy Suresh Car Collection)

నటి కీర్తి సురేష్ ఉపయోగించే కార్ల జాబితాలో వోల్వో ఎస్90, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ, మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్‌సీ43, టయోటా ఇన్నోవా క్రిష్టా మరియు బీఎండబ్ల్యూ ఎక్స్7 వంటివి ఉన్నట్లు సమాచారం.

వోల్వో ఎస్90 (Volvo S90)

స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో.. భారతదేశంలో విక్రయిస్తున్న కార్ల జాబితాలో ఎస్90 ఒకటి. దీని ప్రారంభ ధర రూ.68.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). కీర్తి సురేష్ ఉపయోగించే కార్ల జాబితాలో ఈ కారు ఉంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 1969 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 Bhp పవర్, 350 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 8.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 180 కిమీ/గం కావడం గమనార్హం. అజయ్ దేవగన్, సాక్షి తన్వర్ వంటి ప్రముఖుల గ్యారేజిలో కూడా వోల్వో ఎస్90 ఉంది.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ (BMW 7 Series 730Ld)

జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ 730ఎల్‌డీ కూడా కీర్తి సురేష్ గ్యారేజిలో ఉంది. రూ. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. వాహన వినియోగదారులకు కావలసినన్ని లగ్జరీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. 2993 సీసీ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 4000 rpm వద్ద 262 Bhp పవర్ మరియు 2000 rpm వద్ద 620 Nm టార్క్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్‌సీ43 (Mercedes Benz AMG GLC43)

కీర్తి సురేష్ గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ జీఎల్‌సీ43. దీని ధర రూ. 1.10 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 1991 సీసీ పెట్రోల్ ఇంజిన్ 500 న్యూటన్ మీటర్ టార్క్, 416 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగిన ఈ కారు 4.8 సెకన్లలో గంటకు 250 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు గ్యారేజిలో ఈ లగ్జరీ కారు ఉంది.

బీఎండబ్ల్యూ ఎక్స్7 (BMW X7)

కీర్తి సురేష్ ఉపయోగించే మరో ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఎక్స్7. దీని ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. కాబట్టి కీర్తి సురేష్ ఏ మోడల్ ఎంచుకున్నదనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. ఈ కారు డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. ఈ రెండు ఇంజిన్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. డిజైన మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఈ కారులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇది దేశీయ విఫణిలోని ఆడి క్యూ8, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Also Read: పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిష్టా ఒకటి. రూ. 25 లక్షల కంటే ఖరీదైన ఈ కారును.. సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వినియోగిస్తున్నారు. ఇది ఇతర లగ్జరీ కార్ల ధరల కంటే కొంత తక్కువే అయినప్పటికీ.. డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో చాలా గొప్పగా ఉంటుంది. ఇది రోజువారీ వినియోగానికి, కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు కూడా నటి కీర్తి సురేష్ గ్యారేజిలో ఉంది.

కీర్తి సురేష్ పెళ్లి (Keerthy Suresh Marriage)

నటి కీర్తి సురేష్ మరియు బిజినెస్ మ్యాన్ ఆంటోని గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. వీరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్ళికి ప్రముఖ సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు మొదలైనవారు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మహానటి త్వరలో ఏడడుగులు వేయనుంది.

Leave a Comment