అనుకోకుండా తీసుకున్న నిర్ణయం.. ‘నువ్వు నా సొంతమా’ సాంగ్ గురించి చెప్పిన రష్మిక

ఇప్పుడు సోషల్ మీడియాలో రష్మిక మందన్న పేరు తెగ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం రహస్యంగా విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకోవడమే అని తెలుస్తోంది. అయితే ఈ జంట (విజయ్ దేవరకొండ & రష్మిక మందున్న) తమ ఎంగేజ్‌మెంట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే సోషల్ మీడియా ఖాతాలో మాత్రం రష్మిక థామా (Thamma) సినిమా ప్రమోషన్ చేయడంలో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లినట్లు సమాచారం.

సాంగ్ అక్కడే ఎందుకంటే?

థామా సినిమా ప్రమోషన్‌లో భాగంగా రష్మిక మందన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేశారు. నువ్వు నా సొంతమా సాంగ్ రిలీజ్ అయిన సందర్భంగా.. ఈ సాంగ్ ఎందుకు ఆ లొకేషన్‌లో చేయాల్సి వచ్చిందనే విషయాన్ని రష్మిక వెల్లడించారు. మేము 10-12 రోజుల పాటు ఒక అద్భుతమైన, అందమైన ప్రదేశంలో షూటింగ్ చేశాము. అంత అద్భుతమైన ప్రదేశంలో సాంగ్ ఎందుకు తీయకూడదు అని దర్శక, నిర్మాతలకు ఒక ఆలోచన వచ్చింది. ఆ లొకేషన్ నాకు కూడా నచ్చింది. దీంతో మేము 3-4 రోజులు రిహార్సిల్స్ చేసి పాటను షూట్ చేసాము.

నిజానికి మేము అనుకోకుండా తీసుకున్న నిర్ణయంతో.. ఆ లొకేషన్‌లో సాంగ్ షూట్ చేశాము. అది అద్భుతంగా వచ్చింది. పాట పూర్తయ్యాక, అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు. ప్లాన్ చేసి టీసింగ్ షూటింగ్ కంటే కూడా ఈ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగస్వాములైన అందరికీ కృతజ్ఞతలు అంటూ రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అంతే కాకుండా ఈ పాటకు సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా షేర్ చేశారు.

గ్లామర్‌తో కట్టిపడేసిన రష్మిక

ఇక నువ్వు నా సొంతమా అనే పాట విషయానికి వస్తే.. రష్మిక మందన్న తన గ్లామర్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. రష్మిక చెప్పినట్లు లోకేష్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆయుష్మాన్ ఖురానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఆదిత్య సర్పోత్దార్ థామా సినిమాకు దర్శకత్వం వహించారు. అమర్ కౌశిక్, దినేష్ విజన్.. నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం రూ. 60 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.

రష్మిక మందన్న థామా సినిమా రిలీజ్ తరువాత.. ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుందని సమాచారం. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. మొత్తం మీద రష్మిక మందన్న వరుస సినిమాలతో చాలా బిజీ అయిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది.

ఎంగేజ్‌మెంట్ గురించి చెప్పకపోవడానికి కారణం

నిజానికి ఎవరి జీవితంలో అయిన పెళ్లి అనేది చాలా ముఖ్యమైన సెలబ్రేషన్. అంతకు ముంది జరిగే నిశ్చితార్థం.. సగం పెళ్లి అయిపోయినట్టు చెప్పే ఒక తంతు. అలాంటి శుభవార్తను రష్మిక మందన్న గానీ.. విజయ్ దేవరకొండ గానీ ఎందుకు చెప్పుకోవడం లేదో.. అనేది చాలామంది మనసులో పుట్టిన ప్రశ్న. ఏ విషయాన్ని దాచుకున్న ఏం పర్లేదు. కానీ నిశ్చితార్థం, పెళ్లి వంటి విషయాలను తమ అభిమానులకు కూడా తెలియజేయకపోవడం.. ఆశ్చర్యంగా ఉంది. అయితే తమ ఎంగేజ్‌మెంట్ విషయం బయటకు చెప్పకుండా ఉండటానికి ఏమైనా బలమైన కారణం కూడా ఉండొచ్చని ఇంకొందరి వాదన. ఏది ఏమైనా.. ఏ విషయమైనా ఏదో ఒకరోజు బయటకు రావాల్సిందే.