భారత్‌లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే!.. రేటు తెలిస్తే కొనేయాలనిపిస్తుంది

Affordable Electric Car in India MG Comet EV: భారతదేశంలో రోజు రోజుకి కొత్త వాహనాల లాంచ్ పెరుగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లను ఎప్పటికప్పుడు ఆధునిక హంగులతో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని వాహనాలు లాంచ్ అయినా సరసమైన ధరలో లభించే వాహనాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో సరసమైన ధర వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి వివరంగా తెలుసుకుందాం.

దేశీయ విఫణిలో టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, సిట్రోయెన్ ఈ-సీ3 మరియు ఎంజీ జెడ్ఎస్ ఈవీ వంటి కార్లు అందుబాటులో ఉన్నా వీటి ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయి. వీటన్నింటికంటే తక్కువ ధరలో లభించే కారు ఎంజీ మోటార్ కంపెనీకి చెందిన ‘కామెట్ ఈవీ’.

ఎంజీ కామెట్ ఈవీ

భారతదేశంలో విక్రయించబడుతున్న ‘ఎంజీ కామెట్ ఈవీ’ (MG Comet EV) ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.53 లక్షల మధ్య ఉన్నాయి. మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి అంటే.. 2024 జనవరి నుంచి మే 2024 వరకు 4493 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఈ కారుకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.

ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారును సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. మంచి డిజైన్ కలిగి చూడచక్కగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ కారు అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, టెయిల్‌ల్యాంప్‌ వంటి వాటితో పాటు ముందు భాగంలో బ్రాండ్ లోగో, వెనుక కనెక్టింగ్ లైట్స్ వంటివి ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎంజీ కామెట్ ఈవీ ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటి వాటితో పాటు లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌పప్లే, టూ స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

వేరియంట్స్ & ధరలు

భారతదేశంలో విక్రయించబడుతున్న ఎంజీ కామెట్ ఈవీ ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్ (రూ. 6.99 లక్షలు), ఎక్సైట్ (రూ. 7.98 లక్షలు), ఎక్సైట్ ఎఫ్‌సీ (రూ. 8.45 లక్షలు), స్పెషల్ (రూ. 9 లక్షలు) మరియు స్పెషల్ ఎఫ్‌సీ (రూ. 9.37 లక్షలు) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). ఇవన్నీ ఒకే రకమైన డిజైన్ కలిగి ఉన్నప్పటికీ ఫీచర్లలో కొంత భిన్నంగా ఉంటాయి.

ఎంజీ మోటార్ కంపెనీ లాంచ్ చేసిన కొత్త కామెట్ ఈవీ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా మాత్రమే కాకుండా మంచి రేంజ్ అందించేలా రూపొందించబడింది. ఇందులో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటారు ఉంటుంది. ఇది 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 17.3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఐపీ67 రేటెడ్.. కాబట్టి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ మాదిరిగా పనిచేస్తుంది.

కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో లేదా ఫుల్ చార్జితో ఏకంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. అయితే ఈ రేంజ్ అనేది వివిధ వాతావరణ పరిస్థితులను బట్టి కొంత మారే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. అయితే 7.4 కిలోవాట్ ఛార్జర్ ద్వారా కేవలం 3.5 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకుంటుంది.

Don’t Miss: స్వీడన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ కారు కొన్న ప్రముఖ నటి – ఎవరో తెలుసా?

తక్కువ ధర, మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు అత్యధిక రేంజ్ అందిస్తున్న కారణంగా భారతదేశంలో ఈ కారును ఎక్కువమంది కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇప్పటికే గొప్ప అమ్మకాలు పొందుతున్న ఈ కారు రాబోయే రోజుల్లో మరింత మంది కొత్త కస్టమర్లను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.