ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాట్నా (ఎయిమ్స్ పాట్నా) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ప్రాజెక్ట్ రీసెర్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమిటి?, లాస్ట్ డేట్ ఎప్పుడు అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
పోస్టులు & క్వాలిఫికేషన్
ఎయిమ్స్ పాట్నా నోటిఫికేషన్ ప్రకారం రెండు పోస్టులకు మాత్రమే వేకెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ కాగా.. మరొకటి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ జాబ్. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునేవారు సంబంధిత విభాగంలో డిప్లొమా, ఎమ్ఎల్టీ, డీఎమ్ఎల్టీ, బీఏఎమ్ఎస్ వంటి వాటిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అంతే కాకుండా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరెటరీ టెక్నాలజీ లేదా ఆయుర్వేద శాస్త్రంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
నిర్ణీత వయసు & జీతం వివరాలు
ఎయిమ్స్ పాట్నా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల నిర్ణీత వయసు 28 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం విషయానికి వస్తే ప్రాజెక్ట్ రీసర్చ్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 67000, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ. 18000 జీతం ఉంటుందని సమాచారం.
ఎంపిక విధానం & అప్లై చేసే విధానం
ఎయిమ్స్ పాట్నా ఉద్యోగాలకు ఎంపిక విధానం కేవలం ఇంటర్వ్యూ మాత్రమే. అంటే ఇంటర్యూ ద్వారా మాత్రమే ఉద్యోగానికి కావలసిన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. కాగా అప్లై చేసుకోవాలంటే ఈమెయిల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ రేపే (2025 అక్టోబర్ 04). అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది ఆ తరువాత తెలుస్తుంది.
కేవలం రెండు ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ అని నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి కావలసింది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే అన్న విషయం మర్చిపోకూడదు. కాబట్టి మీలో ట్యాలెంట్ ఉంటే తప్పకుండా ఒక ఉద్యోగం మీ సొంతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అర్హతలు కలిగిన వాళ్లు ఒకసారి ఈ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే మంచిది. ఉద్యోగం పొందిన తరువాత కూడా మీ అనుభవాన్ని అభిరుచి బట్టి మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళవచ్చు.
ఉద్యోగాల కోసం ఎలా సన్నద్ధమవ్వాలి
నిజానికి చదువు పూర్తైనవారి ఏకైక లక్ష్యం ఉద్యోగ సంపాదనే. అసలు చదువుకోవడానికి ఉద్యోగం పొందటానికి అని అందరికి దృఢ సంకల్పం. కాబట్టి ఉద్యోగాల కోసం వేచిచూసే అభ్యర్థుల సంఖ్య లక్షల్లో ఉంటోంది. వచ్చే నోటిఫికేషన్ మాత్రం వేలలో కూడా ఉండటం లేదు. ఇలాంటి సమయంలో ఉద్యోగం తెచ్చుకోవడానికి గట్టిగా ప్రిపేర్ అవ్వడమే కాదు. కొన్ని స్కిల్స్ కూడా పెంపొందించుకోవడం చాలా అవసరం. ఇలాంటి స్కిల్స్ కోసం నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగం సంపాదించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న అభ్యర్థి.. యుద్దానికి సిద్దమైన ఒక సైనికునిలాగా ఎప్పుడూ సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మేల్కోక పోతే.. వెనుకపడిపోయే అవకాశం ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉందుకుని సన్నద్ధం కావాలి.