Akkineni Nagarjuna New Car Lexus LM: ఓ వైపు పెద్ద కొడుకు (నాగ చైతన్య) పెళ్లి, మరో వైపు చిన్న కొడుకు (అఖిల్) నిశ్చితార్థం. కుటుంబం మొత్తం సంతోషంగా గడిపేస్తోంది. త్వరలో ఇద్దరు కోడళ్ళు ఇంట్లోకి అడుగు పెద్దబోతున్నారని నాగార్జున దంపతులు కూడా సంబరపడిపోతున్నారు. ఈ తరుణంలో కోడళ్ళకంటే ముందు మరో అతిథి అక్కినేని ఇంట చేరింది. ఇంతకీ ఎవ్వరికీ తెలియని ఆ అతిథి ఎవరు? అనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.
నాగార్జున ఇంట చేరిన ఆ అతిథి ఎవరో కాదు.. లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎమ్ (Lexus LM) కారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర రూ. 2.5 కోట్లు కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింగ్ నాగార్జున.. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏ (RTA) కార్యాలకాయానికి వెళ్లారు. దీనికి TG9 GT/R4874 నెంబర్ తీసుకున్నట్లు సమాచారం. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు కాబట్టి బహుశా దీనికి పెద్దగా ఖర్చు పెట్టలేదని తెలుస్తోంది.
సీటింగ్ ఆప్షన్స్
నిజానికి లెక్సస్ ఎల్ఎమ్ లిమోసిన్ కారు 7 సీటర్ మరియు 4 సీటర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. 4 సీటర్ కారు ధర 7 సీటర్ కారు ధర కంటే తక్కువ. సాధారణంగా ఎక్కడైన 7 సీటర్ కారు ధర ఎక్కువగా ఉంటుంది, 4 సీటర్ ధర తక్కువగా ఉంటుంది. కానీ లెక్సస్ విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది.
డిజైన్
లెక్సస్ ఎల్ఎం అనేది టయోటా వెల్‍ఫైర్ మాదిరిగా జీఏ-కే మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో స్పిండిల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫాగ్‌లాంప్ కోసం వర్టికల్ హోసింగ్ మరియు వెనుక వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో బ్రాండ్ లోగోను బదులుగా లెక్సస్ అనే అక్షరాలను చూడవచ్చు. వెనుక డోరు స్లైడింగ్ సెటప్ పొందుతుంది.
ఫీచర్స్
విశాలమైన క్యాబిన్ కలిగిన లెక్సస్ ఎల్ఎమ్ కారు 5130 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు, 1945 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. 4 సీట్ వెర్షన్‌లో ముందు మరియు వెనుక ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌ల మధ్య విభజన ఉంటుంది. ఎయిర్‌లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్లు, 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్ సరౌండ్ ఆడియో సిస్టం, పిల్లో స్టైల్ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.
Also Read: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!
ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, మల్టిపుల్ యూఎస్‌బీ పోర్ట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్స్, రీడింగ్ లైట్స్, ఫ్రిడ్జ్, రియర్ గ్లోవ్ బాక్స్, యాక్టివ్ నాయిస్ కంట్రోల్ మరియు డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ మరియు ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ లెక్సస్ ఎల్ఎమ్ కారులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భద్రతను నిర్థారిస్తాయి.
ఇంజిన్ వివరాలు
లెక్సస్ ఎల్ఎం అనేది 2.5 లీటర్ 4 సిలిండర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 హార్స్ పవర్ మరియు 239 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఈసీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. కాబట్టి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.
ఇప్పటికే ఈ కారు కొన్న సెలబ్రిటీలు
నాగార్జున 7 సీటర్ కారును కొన్నారా? లేక 4 సీటర్ కారును కొన్నారా అనేది వెల్లడి కాలేదు. అయితే ఇప్పటికే ఈ ఖరీదైన కారును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజయ్ కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఎమ్ కూడా ఒకటిగా మారినట్లు తెలుస్తోంది.
నాగార్జున కార్ కలెక్షన్
కార్లంటే ఎక్కువ ఇష్టపడే సెలబ్రిటీలతో నాగార్జున కూడా ఒకరు. ఇప్పటికే కింగ్ నాగ్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ7, బీఎండబ్ల్యూ ఎం6, టయోటా వెల్‌ఫైర్, నిస్సాన్ జీటీ ఆర్, రేంజ్ రోవర్ వోగ్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఎస్450, కియా ఈవీ6 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లెక్సస్ ఎల్ఎమ్ కారు చేరింది.