అల్లు రామలింగయ్య మనువడు, అల్లు అరవింద్ కుమారుడైన.. అల్లు శిరీష్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నాడు. ఈ విషయాన్ని శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
శిరీష్ ఇన్‌స్టా పోస్ట్
పారిస్‌లోని ఐఫెల్ టవర్ దూరంగా కనిపించే విధంగా చేతులు పట్టుకున్న ఫోటో షేర్ చేస్తూ.. అక్టోబర్ 31న నయనికను పెళ్లి చేసుకోబోతున్నట్లు అల్లు శిరీష్ పేర్కొన్నారు. ఈ రోజు మా తాత అల్లు రామలింగాయ్య జయంతి సందర్భంగా ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇటీవలే మా నుంచి దూరమైనా మా అమ్మమ్మ.. ఎప్పుడూ నా పెళ్లి చూడాలని ఆశపడుతూ ఉండేది. ప్రస్తుతం ఆమె మాతో లేకపోయినా.. మేము కలిసి ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు (పెళ్లి చేసుకున్నప్పుడు).. పైనుంచి తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తుందని శిరీష్ ఒక నోట్ షేర్ చేశారు.
అల్లు శిరీష్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్నాడని, అల్లువారి ఇంట పెళ్లిబాజాలు మోగుతాయని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అయితే ప్రస్తుతం నిశ్చితార్థం తేదీని మాత్రమే వారు విడుదల చేశారు. పెళ్లి ఎప్పుడు?, ఎక్కడ? అనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. నిశ్చితార్థం తరువాత ఈ విషయాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
ఎవరీ నయనిక?
అల్లు శిరీష్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి నయనిక ఎవరనే విషయం తెలుసుకోవడానికి.. నెటిజన్లు తెగ సంబరపడిపోతున్నారు. గూగుల్లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. పొలిటీషియన్ కూతురా?, లేక పారిశ్రామికవేత్త కూతురా? లేక.. చిన్ననాటి స్నేహితురాలా? అని పలురకాలుగా సెర్చ్ చేస్తున్నారు. కానీ శిరీష్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి నయనిక ఎవరనే విషయం మాత్రమే కాకుండా ఫోటో కూడా రిలీజ్ చేయలేదు. నిశ్చితార్థం రోజున ఎవరీ నయనిక? అనే ప్రశ్నకు తప్పకుండా సమాధానం దొరికే అవకాశం లభిస్తుంది.
అల్లు శిరీష్ గురించి
శిరీష్ విషయానికి వస్తే.. సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అల్లు శిరీష్ చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ సాధించలేదు. హీరోగా సినిమాల్లో నటించినప్పటికీ.. అల్లు అర్జున్ అంత క్రేజ్ సంపాదించుకోలేక పోయారు. 2013లో గౌరవం సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్.. ఆ తరువాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ వంటి సినిమాల్లో నటించారు.
2024లో రిలీజ్ అయిన బడ్డీ సినిమా తరువాత అల్లు శిరీష్.. ప్రస్తుతం ఏ సినిమాలో నటించలేదని తెలుస్తోంది. అయితే సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా.. ఐఐఎఫ్ఏ ఉత్సవ్, ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా అవార్డ్స్ వంటి కార్యక్రమాలకు హోస్ట్‌గా కూడా వ్యవహరించారు. 1987 మే 30న జన్మించిన అల్లు శిరీష్.. 38 ఏళ్ల వయసులో పెళ్లి పీటలేక్కబోతున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న అల్లు శిరీష్ & నయనిక జంటను ఎప్పుడెప్పుడు చూస్తామా? అని శిరీష్ అభిమానులు, సినిమా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎంత ఎదురు చూసినా ఈ నెల 31 వరకు వేచి చూడాల్సిందే.