నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు ప్రజలు: సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

నేపాల్‌లో జరుగుతున్న అల్లర్ల కారణంగా.. అక్కడి ప్రభుత్వం అతలాకుతలమైంది. ఈ అల్లర్ల కారణంగానే ఆ దేశంలో పరిస్థితులు తారుమారయ్యాయి. ఇక్కడ నేపాలీ ప్రజలు మాత్రమే కాకుండా.. కొంతమంది తెలుగు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ సుమారు 200 మంది తెలుగు వారు చిక్కుకుపోయారని సమాచారం. వీరిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది.

సమీప దేశమైన నేపాల్‌లో చిక్కుకున్న 200 మంది తెలుగు ప్రజలను కాపాడే బాధ్యతను తీసుకున్న కూటమి ప్రభుత్వం.. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు నాయుడు.. తెలుగు ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు స్పందించడం రాష్ట్ర ప్రభుత్వం విధి అని అన్నారు.

నారా లోకేష్‌కు బాధ్యతలు

నేపాల్‌లో నిరసనలు జరుగుతున్న సమయంలో.. అక్కడే ఇరుక్కున్న తెలుగు కాపాడాలి. రియల్ టైమ్ గవర్నెన్స్‌లో పరిస్థితిని పర్యవేక్షించాలని.. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్‌ను ఆదేశించాను. ఈ క్లిష్ట సమయంలో మన ప్రజలకు స్పందించడం, వారికి తోడుగా నిలబడటం మన విధి అని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలుగు ప్రజలకు సహాయం చేయడానికి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇది పౌరులకుఇ కలిగిన అశాంతిని ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు.. కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడును, ఆంధ్ర భవన్ అధికారులను అన్ని విధాలా సహాయ సహకారాలను అందించాలని కోరినట్లు పేర్కొన్నారు.

భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు

ఇకపోతే.. నేపాల్‌లోని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చింది. ఖాట్మండులోని బఫాల్‌లో సుమారు 30 మంది తెలుగు ప్రజలకు ఆహరం, వసతి, వైద్య సహాయం అందిస్తున్నట్లు శ్రీకాంత్ తెలియజేసారు. దీనికోసం ఆంధ్ర భవన్‌లో అత్యవసర నోడల్ అధికారిగా ఒకరిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా.. అక్కడి పరిస్థితిని పర్యవేక్షించడానికి, తెలుగు ప్రజలను రక్షించడానికి టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వశాఖ మరియు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

ఖాట్మండులోని ఒక హోటల్‌లో బస చేస్తున్న కొన్ని తెలుగు కుటుంబాలను.. నేపాల్ ఆందోళనకారులు బెదిరించారని సమాచారం. ఈ కారణంగానే అధికారుల పర్యవేక్షణలో ఉన్న గెస్ట్ హౌస్‌కు వీరందరిని తరలించారు. ఇక్కడ చిక్కున్న ప్రజలను వీలైనంత తొందరగా.. భారతదేశానికి తీసుకురావడానికి ఇక్కడ ప్రభుత్వం కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

నేపాల్ అల్లర్లకు ప్రధాన కారణం

సోషల్ మీడియా నిషేధం, అవినీతి & శాశ్వత రాజకీయ వారసత్వాలు, నిరుద్యోగం & ఆర్ధిక అవకాశాల తగ్గుదల, పాలనా వ్యవస్థమీద నమ్మకం లేకపోవడం, యువతకు సంబంధించిన చాలా విషయాలను నిర్లక్ష్యం చేయడం మొదలైన కారణాల వల్ల.. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అల్లర్లు చేయడం మొదలు పెట్టారు. ఇదే తీవ్ర స్థాయికి చేరి.. చాలా నష్టం కలిగించింది. ఈ అల్లర్లను తగ్గించడానికి అక్కడ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

Leave a Comment