Aprilia Tuono 457 Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ‘ఏప్రిలియా టువోనో 457’ (Aprilia Tuono 457) భారతదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ EICMA 2024 కార్యక్రమంలో కనిపించిన తరువాత.. మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది. ఈ బైక్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరియు ఇంజిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర & బుకింగ్స్
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఏప్రిలియా టువోనో 457 బైక్ ధర రూ. 3.95 లక్షలు (ఎక్స్ – షోరూమ్, మహారాష్ట్ర). ఈ బైక్ ఆర్ఎస్ 457 బైక్ ఆధారంగా రూపొందించినప్పటికీ.. ఇది స్పోర్ట్ నేక్డ్ బైక్. కానీ యాంత్రికంగా ఆర్ఎస్ 457 మాదిరిగానే ఉంటుంది. ఎలాంటి మార్పులు ఉండవు. ఇంజిన్ ఒకేలా ఉన్నప్పటికీ.. స్టైలింగ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టెస్ట్ రైడ్ మరియు డెలివరీలు 2025 మార్చిలో ప్రారంభమవుతాయి.
డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్
ఏప్రిలియా టువోనో 457 బైక్.. బ్రాండ్ యొక్క ఇతర బైకుల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో చిన్న కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్.. చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముందు భాగంలోని ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్.. టువోనో 1000 ఆర్ బైకును గుర్తుకు తెస్తుంది. ఫ్యూయెల్ ట్యాంక్ ఆర్ఎస్ 457 మాదిరిగా ఉంటుంది. స్టెప్ అప్ సీటు ఇందులో చూడవచ్చు. ఇది రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ.. చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టువోనో 457 బైక్ రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి పిరాన్హా రెడ్ మరియు ప్యూమా గ్రే కలర్స్. ఈ రెండూ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. కొనుగోలుదారులు.. ఇందులో తమకు నచ్చిన కలర్ బైక్ ఎంచుకోవచ్చు.
ఇంజిన్ వివరాలు
కొత్త ఏప్రిలియా టువోనో 457 బైక్.. సాధారణ ఆర్ఎస్ 457 బైకులో ఉండే అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇందులో 457 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ 9400 rpm వద్ద 47.6 హార్స్ పవర్ మరియు 6700 rpm వద్ద 43.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో పాటు.. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ అనేది ఆప్షనల్. ఇక ఫ్రేమ్, సస్పెన్షన్, బ్రేక్స్, ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా సాధారణ ఆర్ఎస్ 457 మాదిరిగానే ఉంటాయి.
ఏప్రిలియా టువోనో 457 బైక్ యొక్క ముందు భాగంలో ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ యూఎస్డీ పోర్క్, 120 మిమీ వీల్ ట్రావెల్ మరియు వెనుక భాగంలో ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్, 130 మిమీ వీల్ ట్రావెల్ ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో 320 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ ఉంటుంది. బైక్ యొక్క రెండు చివర్లలో 17 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. దీని బరువు 175 కేజీలు.. కాగా ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12.7 లీటర్లు కావడం గమనార్హం.
ఫీచర్స్
టువోనో 457 ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 5.0 ఇంచెస్ TFT కలర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది ఏప్రిలియా రైడ్ బై వైర్ సిస్టం పొందుతుంది. కాబట్టి బైక్ గురించి చాలా సమాచారం అందిస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ మాత్రమే కాకుండా ఎకో, స్పోర్ట్స్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు.. ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
Also Read: రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?
యాక్ససెరీస్ మరియు ప్రత్యర్థులు
ఏప్రిలియా టువోనో 457 బైకును మరింత అందంగా తీర్చిదిద్దుకోవడానికి బ్రాండ్ యొక్క యాక్సెసరీస్ ఉపయోగించుకోవచ్చు. ఇందులో క్విక్‌షిఫ్టర్, ఎలక్ట్రానిక్ యాన్తి తెఫ్ట్ సిస్టం, ఫోర్క్ స్లైడర్లు మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలనవెన్నో ఉన్నాయి. మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్ యమహా ఏంటీ-03 మరియు కేటీఎమ్ డ్యూక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ బైక్ అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కంపెనీ లాంచ్ చేసిన టువోనో 457 బైక్ ధర (రూ. 3.95 లక్షలు).. ఆర్ఎస్ 457 ధర కంటే కూడా రూ. 25000 తక్కువ. ధర తక్కువైనా.. అద్భుతమైన ఫీచర్స్.. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగి ఉండటం వల్ల.. ఇది తప్పకుండా గొప్ప అమ్మకాలను పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. సంస్థ ఇప్పటికే.. ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. అయితే ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుంది, ఎంతమంది కస్టమర్లను ఆకర్శించనుంది అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Also Read: రూ.1.07 లక్షలకే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్: పూర్తి వివరాలివిగో..
ఇండియన్ మార్కెట్లోని ఏప్రిలియా టూ-వీలర్స్
భారతీయ విఫణిలో ఏప్రిలియా టువోనో 457 మరియు ఆర్ఎస్ 457 మాత్రమే కాకుండా ఎస్ఆర్ 160, ఎస్ఆర్ 125, ఆర్‌ఎస్‌వీ4, ఆర్ఎస్ 660, ఎస్ఎక్స్ఆర్ 160, స్ట్రోమ్ 125, ఎస్ఎక్స్ఆర్ 125 మరియు టువోనో 660 వంటి బైకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ.. మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి.