34.2 C
Hyderabad
Thursday, April 3, 2025

కొత్త ఫీచర్లతో ప్రత్యర్థులను చిత్తుచేయనున్న ఏథర్ కొత్త స్కూటర్.. ఇదే!

Ather 450 Apex Launches in India: అనేక టీజర్ల తరువాత బెంగళూరు బేస్డ్ కంపెనీ ‘ఏథర్’ (Ather) ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో తన ‘450 అపెక్స్‌’ (450 Apex) లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంత? రేంజ్ ఎలా ఉంది? బ్యాటరీ ఛార్జింగ్ వంటి వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్ (Price And Bookings)

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త ఏథర్ 450 అపెక్స్‌ ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఈ రోజు నుంచి బుకింగ్స్ స్వీకరించడం ప్రారభించింది. డెలివరీలు 2024 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

డిజైన్ (Design)

కొత్త ఏథర్ 450 అపెక్స్‌ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. కాబట్టి సీటు ఎత్తు, వీల్‌బేస్, టైర్ సైజులు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ వంటివి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. ఇందులో కొత్త ఎన్‌క్లోజ్డ్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్‌ ఉంటుంది. ఈ సిస్టం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇతర ఏథర్ మోడల్‌లలోకి అందుబాటులో రానున్నట్లు సమాచారం.

చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. బాడీ ప్యానెల్‌ ఓ స్పెషల్ ఇండియమ్ బ్లూ కలర్‌ను పొందుతుంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే వెనుక భాగం పారదర్శకంగా ఉంటుంది. అంటే దాని లోపల ఉన్న పరికలు బయటకు కనిపిస్తాయి. కాబట్టి ఇందులో ఆరంజ్ కలర్ చాసిస్ చూడవచ్చు.

ఫీచర్స్ (Features)

2024 ఏథర్ 450 అపెక్స్‌ డిజైన్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఫీచర్స్ కూడా పొందుతాయి. ఇందులో ఎల్ఈడీ ఇల్యూమినేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి వాటికి సహకరించే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఆటో బ్రైట్‌నెస్, పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్, ఆటో ఇండికేటర్ కట్ ఆఫ్, కోస్టింగ్ రీజెనరేటివ్ బ్రేకింగ్ మరియు మ్యాజిక్ ట్విస్ట్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

మ్యాజిక్ ట్విస్ట్ అనేది రీజెనరేటివ్ బ్రేకింగ్ ఫీచర్ యొక్క ఆధునిక వెర్షన్ అని కంపెనీ చెబుతోంది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ & రేంజ్ (Battery And Range)

కొత్త ఏథర్ 450 అపెక్స్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇందులోని రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కారణంగా ఈ స్కూటర్ రేంజ్ 157 కిమీ వరకు ఉంటుంది. ఈ స్కూటర్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ చేరుకుంటుంది. వేగం పరంగా ఇది దాని మునుపటి మోడల్ కంటే కొంత ముందు ఉంటుందని తెలుస్తోంది.

బ్రేకింగ్ సిస్టం మరియు సస్పెన్షన్స్ (Braking System And Suspension)

ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు మోనోషాక్‌ కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 200 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 190 మిమీ రియర్ డిస్క్ బ్రేక్ పొందుతుంది. ముందు మరియు వెనుక వైపు 12 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ఈ స్కూటర్ అండర్ సీట్ స్టోరేజ్ 22 లీటర్స్ వరకు ఉంటుంది. దీని బరువు 111.6 కేజీలు.

Don’t Miss: Mercedes Benz: భారత్‌లో అడుగుపెట్టిన కొత్త జర్మన్ లగ్జరీ కారు – ధర ఎంతో తెలుసా?

కొత్త ఏథర్ 450 అపెక్స్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 21000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. అయితే ఈ స్కూటర్ కొనుగోలుమీద ఎటువంటి సబ్సిడీ లభించదు. అయితే కంపెనీ ఈ స్కూటర్ మీద 5 సంవత్సరాల వారంటీ మరియు బ్యాటరీ మీద 60000 కిమీ వారంటీ అందిస్తుంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు