Audi Q5 Bold Edition Launched in India: ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ (Audi) దేశీయ విఫణిలో మరో కొత్త కారు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ కొత్త ఎడిషన్ పేరు ‘క్యూ5 బోల్డ్’ (Q5 Bold). ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర
ఆడి ఇండియా లాంచ్ చేసిన కొత్త క్యూ5 బోల్డ్ ఎడిషన్ ధర రూ. 77.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని టాప్ స్పెక్ టెక్నాలజీ ట్రిమ్ ధర కంటే కూడా రూ. 1.5 లక్షలు ఎక్కువ. క్యూ7, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌ల తరువాత బోల్డ్ ఎడిషన్ ట్రీట్‌మెంట్ పొందిన మోడల్ ఈ క్యూ5. కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. అయితే ఎన్ని కార్లను లేదా ఎన్ని యూనిట్లను విక్రయించనుంది అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు.
డిజైన్ అండ్ కలర్ ఆప్షన్స్
కొత్త ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ యొక్క బ్రాండ్ లోగో, విండో సరౌండ్, ఫ్రంట్ గ్రిల్, రూప్ రెయిల్, వింగ్ మిర్రర్ వంటివన్నీ బ్లాక్ కలర్ పొందుతాయి. మిగిలిన డిజైన్ మొత్తం దాదాపు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇది మొత్తం ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి గ్లేసియర్ వైట్, నవర్రా బ్లూ, మైథోస్ బ్లాక్, డిస్ట్రిక్ట్ గ్రీన్ మరియు మాన్హాటన్ గ్రే కలర్స్. ఇవన్నీ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఐదు రంగులలో లభిస్తుంది, కాబట్టి కస్టమర్ తనకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.
ఫీచర్స్
ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అడాప్టివ్ బంపర్లు, పనోరమిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, యాంబియంట్ లైటింగ్ మరియు 360 డిగ్రీ కెమెరా వంటివి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
పవర్‌ట్రెయిన్
ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ ఉంటుంది. ఇది 265 హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం అందుబాటులో ఉంటుంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎడిషన్ టాప్ స్పీడ్ గంటకు 240 కిమీ కావడం గమనార్హం.
ఆడి కార్లకు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కార్లను లేదా అప్డేటెడ్ కార్లను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు క్యూ5 బోల్డ్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా అత్యుత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే హుందాగా ఉంటుంది.
మార్కెట్లో క్యూ5 బోల్డ్ ఎడిషన్ లాంచ్ చేసిన ఆడి కంపెనీ ఎన్ని యూనిట్లను విక్రయించనుంది అనే విషయం వెల్లడించలేదు. అయితే ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించబడే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో కంపెనీ ఎన్ని యూనిట్లను లేదా ఎంతమందికి విక్రయించనుంది అనే వివరాలు తెలుస్తాయి.
Don’t Miss: కాలగర్భంలో కలిసిపోయినా.. ఈ కార్ల కోసం గూగుల్‌లో వెతికేస్తున్నారు!
నెక్స్ట్ జనరేషన్ ఆడి క్యూ5
ఇదిలా ఉండగా ఆడి కంపెనీ త్వరలో నెక్స్ట్ జనరేషన్ లేదా అప్డేటెడ్ క్యూ5 కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. ఇటీవల కంపెనీ ఈ మోడల్ కారును సౌత్ ఐరోపాలో టెస్ట్ చేస్తూ కనిపించింది. ఇది బహుశా 2026నాటికి మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ కారు డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా ఆడి ఈ-ట్రాన్ మాదిరిగా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.