Baba Ramdev Driving Mahindra Thar Roxx: ప్రముఖ యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన ‘బాబా రామ్‌దేవ్’ (Baba Ramdev) గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. ఈయన యోగా గురువు మాత్రమే కాదు.. పతంజలి బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈయనకు కార్లు, బైకులు నడపడం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే.. గతంలో చాలా సందర్భాల్లో ఖరీదైన కార్లను, బైకులను నడిపారు. ఇప్పుడు తాజాగా మరో కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఇంతకీ బాబా రామ్‌దేవ్ డ్రైవ్ చేసిన కారు ఏది? దాని వివరాలు ఏమిటంటే సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
వీడియోలో గమనించినట్లయితే.. బాబా రామ్‌దేవ్ కారును డ్రైవ్ చేయడం చూడవచ్చు. ఇక్కడ కనిపించే కారు మహీంద్రా కంపెనీకి చెందిన 5 డోర్ వెర్షన్ రోక్స్ అని తెలుస్తోంది. ఈ కారు నలుపు రంగులో చూడచక్కగా ఉండటం చూడవచ్చు. ఆశ్రమం కాంపౌండ్‌లోనే కారును డ్రైవ్ చేసినట్లు సమాచారం. కొంత దూరం డ్రైవ్ చేసిన తరువాత కారును ఆపడం చూడవచ్చు.
మహీంద్రా థార్ రోక్స్ కారును బాబా రామ్‌దేవ్ కొన్నారా?
మహీంద్రా కారును డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. దీనిని బాబా కొనుగోలు చేసారా? అనే సందేహం కలుగవచ్చు. కానీ ఈ కారును బాబా రామ్‌దేవ్ కొనుగోలు చేయలేదని తెలుస్తోంది. ఇది ఎవరో సన్నిహితులకు సంబంధించిన కారు అని సమాచారం. దానిని బాబా టెస్ట్ డ్రైవ్ చేశారు.
థార్ రోక్స్ గురించి (About Mahindra Roxx)
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన 5 డోర్ థార్ ఈ రోక్స్. ఇప్పటికే దేశీయ మార్కెట్లో విస్తృత ఆదరణ పొందిన మహీంద్రా థార్ కారును 5 డోర్ రూపంలో కావాలని కోరుకునే వారి కోసం కంపెనీ దీనిని లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఆరు వేరియంట్లలో మార్కెట్లో విక్రయించబడుతున్న రోక్స్ కారు.. మొత్తం ఏడు రంగులలో లభిస్తోంది. మంచి డిజైన్, కాస్మొటిక్ అప్డేట్స్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన మహీంద్రా థార్ రోక్స్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. పనితీరు పరంగా దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.
బాబా రామ్‌దేవ్ కారు (Baba Ramdev Cars)
యోగ గురువు బాబా రామ్‌దేవ్ రూ. 1.5 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 (Land Rover Defender 130) కారును కలిగి ఉన్నట్లు సమాచారం. దీనిని గత ఏడాది జులైలో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారును రామ్‌దేవ్ బాబా గతంలో డ్రైవ్ చేస్తూ కనిపించారు. చూడటానికి అత్యద్భుతంగా ఉన్న ఈ కారు ఏ ఇంజిన్ ఆప్షన్ అనేది వెల్లడి కాలేదు.
Also Read: కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు
నిజానికి ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారు రెండు ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. అవి 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ (394 బీహెచ్‌పీ పవర్ మరియు 550 న్యూటన్ మీటర్ టార్క్) మరియు 3.0 డీజిల్ ఇంజిన్ (296 బీహెచ్‌పీ & 600 ఎన్ఎమ్ టార్క్). ఇవి మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీ కలిగి ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతాయి.
బాబా రామ్‌దేవ్ వద్ద ఉన్న మరో కారు మహీంద్రా ఎక్స్‌యూవీ 700. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130 కారును కొనుగోలు చేయడానికంటే ముందు.. బాబా ఈ కారును ఉపయోగించేవారు. ఈ కావు తెలుపు రంగులో ఉంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 13.99 లక్షల నుంచి రూ. 25.64 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారులో చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఏడీఏఎస్ టెక్నాలజీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి భద్రతను అందిస్తాయి.
బైక్ రైడ్ చేసిన బాబా రామ్‌దేవ్
కార్లను మాత్రమే కాకుండా.. బైకులను డ్రైవ్ చేయడానికి కూడా బాబాకు చాలా ఇష్టం. ఈ కారణంగానే అప్పుడప్పుడు బైక్ రైడ్ చేస్తూ ఉంటారు. గతంలో హీరో ఇంపల్స్ బైక్ రైడ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయింది. బాబా రామ్‌దేవ్.. సద్గురు (జగ్గీ వాసుదేవ్)తో కలిసి డుకాటీ బైకుపై కనిపించారు. దీన్ని బట్టి చూస్తే బాబాకు కార్లు మరియు బైకుల మీద ఎంత మక్కువో మనం అర్థం చేసుకోవచ్చు.
View this post on Instagram