Bajaj Pulsar NS125 Single Channel ABS:భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) 2025లో సరికొత్త పల్సర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బైక్ ‘పల్సర్ ఎన్ఎస్125’. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. దీని ధర ఇతర వేరియంట్స్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది.
బజాజ్ ఎన్ఎస్125 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఇప్పటికే ఎన్ఎస్125 రూపంలో రెండు వేరియంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ఇప్పుడు లాంచ్ అయిన బైక్.. ముచ్చటగా మూడోది. ఇది చూడటానికి.. కొంత దాని మునుపటి మోడల్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.
ఇంజిన్ డీటైల్స్
ఆరంజ్, రెడ్, గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్లలో లభించే బజాజ్ ఎన్ఎస్125.. 124.45 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 rpm వద్ద 11.82 Bhp పవర్, 7000 rpm వద్ద 11 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. కాబట్టి వాహన ప్రియులు పనితీరు గురించి కంగారుపడాల్సిన అవసరం లేదు.
బజాజ్ ఎన్ఎస్125 బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. బైక్ గురించి చాలా సమాచారాన్ని రైడర్లకు అందిస్తుంది. ఈ బైకును చాలామంది రోజువారి వినియోగానికి మాత్రమే కాకుండా.. లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు.
హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మరియు టీవీఎస్ రైడర్ 125 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే.. బజాజ్ ఎన్ఎస్125 బైక్ స్ప్లిట్ సీటును పొందుతుంది. ఇది రైడర్ మరియు పిలియన్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ బైకును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
బజాజ్ ఎన్ఎస్125 లాంచ్ సందర్భంగా.. బజాజ్ ఆటో లిమిటెడ్ మోటార్ సైకిల్ బిజినెస్ యూనిట్ హెడ్ ‘సారంగ్ కనడే’ మాట్లాడుతూ.. ఇప్పటికి జనరేషన్ ఏమి కోరుకుంటుందో మాకు తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకునే కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ లేదా కొత్త బైకులు లాంచ్ చేస్తోంది. ఇప్పుడు లాంచ్ అయిన కొత్త ఏబీఎస్ పల్సర్ ఎన్ఎస్125 తప్పకుండా బైక్ రైడర్లకు గొప్ప రైడింగ్ అనుభూతిని అందిస్తుందని అన్నారు.
పల్సర్ ఎన్ఎస్125.. 17 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్స్, వెనుక భాగంలో మోనో షాక సస్పెన్షన్ పొందుతుంది. ఈ బైక్ బరువు 144 కేజీలు కాగా.. సీటు ఎత్తు 805 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 179 మీమీ. కాబట్టి ఇది అన్ని విధాలా చాలా ఉపయోగకరమైన బైక్ అని తెలుస్తోంది.
బజాజ్ పల్సర్ సేల్స్
భారతీయ మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న బైకుల జాబితాలో పల్సర్ కూడా ఒకటి. ఇప్పటి వరకు పల్సర్ బైకును 1.4 మిలియన్ (14 లక్షలు) మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. మార్కెట్లో ఈ బైకుకు మంచి డిమాండ్ ఉందని స్పష్టంగా అర్థమవుతోంది.
బజాజ్ పల్సర్ విభాగంలో.. పల్సర్ ఎన్125, పల్సర్ ఎన్ఎస్400జెడ్, పల్సర్ ఆర్ఎస్200, పల్సర్ ఎన్250, పల్సర్ 220ఎఫ్, పల్సర్ ఎన్ఎస్200, పల్సర్ ఎన్ఎస్160, పల్సర్ ఎన్160, పల్సర్ ఎన్150, పల్సర్ 150, పల్సర్ ఎన్ఎస్125 మరియు పల్సర్ 125 వంటివి ఉన్నాయి. ఇవన్నీ చూడటానికి మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి. ఈ కారణంగానే.. బ్రాండ్ బైకులు విపరీతమైన సేల్స్ పొందుతున్నాయి.
Also Read: 2025 హోండా షైన్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా: రూ. 84493 మాత్రమే..
ఇప్పుడు మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త ఎన్ఎస్125 ఏబీఎస్ వేరియంట్.. దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా ఎక్కువ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది.. ప్రత్యర్థుల నుంచి ఎలాంటి పోటీని ఎదుర్కోనుంది వంటి విషయాలు తెలుసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అయితే ఇతర పల్సర్ బండి మాదిరిగానే ఇది కూడా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.