Bentley Flying Spur Hybrid India Launched : భారతీయ మార్కెట్లో కేవలం సాధారణ కార్లకే కాకుండా ఖరీదైన లగ్జరీ కార్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బెంజ్, ఆడి, లెక్సస్ వంటి వాటితో పాటు బెంట్లీ కూడా తమ ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. తాజాగా బెంట్లీ కంపెనీ ఒక హైబ్రిడ్ కారుని మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు డిజైన్, ఫీచర్స్ మరియు ధరల వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర (Price)
ఇండియన్ మార్కెట్లో విడుదల కొత్త ‘బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్’ (Bentley Flying Spur Hybrid) ధర రూ. 5.25 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది బెంట్లీ యొక్క మొత్తం పోర్ట్‌ఫోలియోలో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కలిగిన కారు.
ఇంజిన్ (Engine)
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్ 2.9 లీటర్ ట్విన్ టర్బో వి6 ఇంజిన్ కలిగి ఎలక్ట్రిక్ మోటరుతో జత చేయబడి ఉంటుంది. దీని గరిష్ట పరిధి 805 కిమీ. ఈ హైబ్రిడ్ కారు 544 హార్స్ పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. గంటకు 41 కిమీ వేగంతో ఏకంగా 805 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఎక్ట్సీరియర్ అండ్ ఇంటీరియర్ (Exterior & Interior)
కొత్త బెంట్లీ హైబ్రిడ్ కారు ఏకంగా 60 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ముల్లినర్ కస్టమైజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్ కోసం దాని బ్లాక్‌లైన్ స్పెసిఫికేషన్‌ను అందిస్తోంది. కావున ఇది గ్రిల్, విండో సరౌండ్‌లు, హెడ్‌లైట్ సరౌండ్‌లు, డోర్ ట్రిమ్‌లు మరియు హ్యాండిల్స్‌తో పాటు ఎగ్జాస్ట్ పైపులు మరియు ఫ్లయింగ్ బి మస్కట్ వంటి క్రోమ్ ట్రిమ్‌లకు బ్లాక్-అవుట్ ఉంటుంది.
బెంట్లీ లేటెస్ట్ కారు హైబ్రిడ్ మోడల్ అని గుర్తించడానికి ఇందులో బూట్ లిడ్‌పై ‘హైబ్రిడ్’ బ్యాడ్జ్ ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మొత్తం మీద ఈ కారు చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. బెంట్లీ ఐదు స్టాండర్డ్ మరియు 10 ఆప్షనల్ కలర్ ఆప్షన్‌లతో అపోల్స్ట్రే కోసం 15 కలర్ ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. డాష్‌బోర్డ్ కోసం ఎనిమిది వెనీర్ ఎంపికలను అందిస్తుంది. అంతే కాకుండా బెంట్లీ సీట్లపై కాంట్రాస్ట్ స్టిచింగ్, పైపింగ్ వంటివి కూడా ఉంటాయి.
Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..
ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బెంట్లీ 2024 నాటికి మరిన్ని హైబ్రిడ్ కార్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికీ ఫ్లయింగ్ స్పర్ మరియు బెంటెగా వంటివి హైబ్రిడ్ వేరియంట్లలో విడుదలయ్యాయి. కావున రానున్న రోజుల్లో కాంటినెంటల్ జీటీ హైబ్రిడ్ కారుగా అవతరించనుంది. 2025 నాటికి కాంటినెంటల్ జీతే హైబ్రిడ్ కారుగా విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా కంపనీ 2030 నాటికి తన పోర్ట్‌ఫోలియోలో ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే కలిగి ఉంటుందని తెలిపింది.
ప్రత్యర్థులు (Rivals)
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ హైబ్రిడ్ ప్రపంచ వ్యాప్తంగా మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్580ఈ (Mercedes-Maybach S580e) కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. కానీ భారతీయ మార్కెట్లో ప్రస్తుతానికి ఈ ధర వద్ద సరైన ప్రత్యర్థులు లేదు. అయితే స్టాండర్డ్ ఫ్లయింగ్ స్పర్ మెర్సిడెస్ మేబ్యాక్ ఎస్ క్లాస్ (రూ. 2.69 కోట్లు – రూ. 3.40 కోట్లు) మరియు రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.95 కోట్లు – రూ. 7.95 కోట్లు) వంటి వాటితో పోటీపడుతుంది.