Best Bike Under Rs.2 Lakh in India: ప్రపంచ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో లెక్కకు మించిన వాహనాలు అడుగుపెడుతున్నాయి. ఇందులో లక్ష విలువైన టూవీలర్స్ ఉన్నాయి. పది లక్షలకంటే ఖరీదైన ద్విచక్రవాహనాలు ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఉత్తమ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో ప్రస్తుతం రెండు లక్షల రూపాయలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో హీరో మావ్రిక్ 440, జావా 42, బజాజ్ డామినార్ 250, సుజుకి జిక్సర్ / జిక్సర్ ఎస్ఎఫ్250, హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ మరియు కేటీఎమ్ డ్యూక్ 200 మొదలైనవి ఉన్నాయి.
హీరో మావ్రిక్ 440
భారతదేశంలో దిగ్గజ టూ వీలర్ తయారీ సంస్థగా కీర్తి గడిస్తున్న హీరో మోటోకార్ప్ యొక్క ‘మావ్రిక్ 440’ బైక్ రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న పాపులర్ బైక్. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27 Bhp పవర్ మరియు 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. తద్వారా రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.
జావా 42
ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మందికి ఇష్టమైన బైక్ బ్రాండ్లలో జావా మోటార్‌సైకిల్ ఒకటి. రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులలో ‘జావా 42’ కూడా ఉంది. ఈ బైక్ ధర రూ. 1.96 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి.. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని 293 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 27 Bhp పవర్ మరియు 27 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.
బజాజ్ డామినర్ 250
మనం చెప్పుకుంటున్న రూ. 2 లక్షల కంటే తక్కువ రేటులోనే లభించే బైకులలో బజాజ్ ఆటో యొక్క ‘డామినర్ 250’ కూడా ఒకటి. ఇది చూడటానికి కొంత స్టైలిష్ డిజైన్ కలిగి.. బైక్ రైడర్లను ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఈ బైక్ ధర రూ. 1.78 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 249 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 26.63 Bhp పవర్ మరియు 23.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది రైడింగ్ చేయడానికి ఉత్తమ బైకుగా గుర్తింపు పొందింది.
సుజుకి జిక్సర్ / జిక్సర్ ఎస్ఎఫ్ 250
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థలలో ఒకటి సుజుకి మోటార్‌సైకిల్. ఈ కంపెనీ యొక్క 250 సీసీ జిక్సర్ కూడా మనం చెప్పుకుంటున్న ధర లోపల లభించే ఉత్తమ బైక్. ఇది నేక్డ్ మరియు ఫెయిర్డ్ అనే రెండు రూపాల్లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.89 లక్షలు మరియు రూ. 1.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).
చూడటానికి దాదాపు ఒకే విధంగా ఉన్న ఈ జిక్సర్ బైకులు 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతాయి. ఇది 26.3 Bhp పవర్ మరియు 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకులను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్
నిజానికి కరిజ్మా బైకుల కురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో ఇది కూడా ఉంది. హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్ ధర ప్రారంభ ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 25.15 Bhp పవర్, 20.4 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పనితీరును అందిస్తుంది.
కేటీఎమ్ డ్యూక్ 200
యువకులకు ఇష్టమైన బైకులలో ‘కేటీఎమ్ డ్యూక్ 200’ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ పాపులర్ మోడల్. దీని ధర రూ. 1.96 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 24.67 Bhp పవర్ మరియు 19.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
Don’t Miss: రిటైర్‌మెంట్ ప్రకటించిన టీమిండియా కెప్టెన్.. ‘రోహిత్ శర్మ’ వాడే కార్లు ఇవే!
గమనిక: పైన చెప్పిన బైకుల ధరలు కేవలం ప్రారంభ ధరలు మాత్రమే. అయితే బైక్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా.. బైక్ కొనుగోలుదారులు గమనించాలి.