These Electric Scooters Price Cheaper than iPhone 16 Pro Max: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో ఈవీల హవా జోరుగా సాగుతోంది. అయితే కొందరు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తే.. మరి కొందరు తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు మంచి డిజైన్ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఐఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.
మార్కెట్లో ఐఫోన్లకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం యాపిల్ కంపెనీ ఓ కొత్త మోడల్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 1.44 లక్షలు కావడం గమనార్హం. ధర ఎక్కువైనా వీటికి మాత్రం డిమాండ్ అస్సలు తగ్గడం లేదు. ఈ ఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ 450ఎస్, ఏప్రిలియా ఎస్ఆర్ 160, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ మరియు రివర్ ఇండీ వంటివి ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఎంతోమందిని ఆకర్శించిన ఈ స్కూటర్ ధర ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కంటే తక్కువ. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ బ్యాటరీ లేదా 3.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ వరుసగా 77 కిమీ మరియు 100 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ స్కూటర్లు 4 kW మోటారుకు జతచేయబడి ఉంటాయి. డిజైన్ మరియు
ఏథర్ 450ఎక్స్ (Ather 450x)
మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ 450ఎక్స్. దీని ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఈ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో 111 కిమీ రేంజ్ అందిస్తుంది. గంటకు 90 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ లేటెస్ట్ డిజైన్, కొత్త డిజైన్ పొందుతుంది. రోజు వారీ వినియోగానికి ఇది మంచి ఎంపిక అనే చెప్పాలి.
ఏప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160)
రూ. 1.31 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఏప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్ 160.03 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 7600 rpm వద్ద 10.86 Bhp పవర్ మరియు 6000 rpm వద్ద 11.6 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ స్కూటర్ కొనుగోలోను చేస్తున్నారు.
ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)
భారతదేశంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్.. మార్కెట్లో ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 11 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఇది గరిష్టంగా 192 కిమీ రేంజ్ (ఎకో మోడ్) అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.
Don’t Miss: అర్జున కపూర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రేటు తెలిస్తే మీరు కొనేస్తారు!
రివర్ ఇండీ (River Indie)
దేశీయ విఫణిలో రూ. 1.38 లక్షల ధర వద్ద లభించే రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర కంటే తక్కువే. 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు మాత్రమే. కొత్త డిజైన్, విశాలమైన సీటు కలిగిన ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది మార్కెట్లో చాలామందికి ఇష్టమైన స్కూటర్.