ఆధునిక మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకెళ్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు, కార్లు డ్రైవ్ చేస్తున్నారు, బైక్స్ రైడ్ చేస్తున్నారు. అయితే మోటార్‌సైకిల్ అనగానే పురుషలకే అన్నట్టు చాలామంది అనుకుంటారు. కానీ మహిళలు కూడా రైడ్ చేయడానికి అనువైన టూ వీలర్స్ ఉన్నాయన్న సంగతి బహుశా మరిచారేమో. ఈ కథనంలో మహిళలు రైడ్ చేయడానికి అనుకూలమైన ఐదు స్కూటీల గురించి తెలుసుకుందాం.
హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్
మహిళలు రైడింగ్ చేయడానికి అనుకూలమైన స్కూటర్ల జాబితాలో హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్‌టెక్ ఒకటి. రూ. 74,361 (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లభించే ఈ స్కూటర్ ఎల్ఎక్స్, వీఎక్స్, జెడ్ఎక్స్ ప్లస్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. సుమారు 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 110 సీసీ ఇంజిన్ 8 బీహెచ్‌పీ పవర్, 8.70 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 50 కిమీ/లీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది.
టీవీఎస్ జుపీటర్ 110
మహిళలకు అనువైన స్కూటర్ల జాబితాలో మరో టూ వీలర్ టీవీఎస్ కంపెనీకి చెందిన జుపీటర్ 110. దీని ధర రూ. 72400 (ఎక్స్ షోరూమ్). ఇందులోని 113.3 సీసీ ఇంజిన్ 7.9 బీహెచ్‌పీ పవర్, 9.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 105 కేజీల బరువున్న ఈ స్కూటర్ నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. మంచి డిజైన్ కలిగి.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దీనిని కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఇష్టపడతారు. రోజువారీ వినియోగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110
స్కూటీ జెస్ట్ 100 కూడా టీవీఎస్ కంపెనీకి చెందిన టూ వీలర్. దీని ధర రూ. 73854 (ఎక్స్ షోరూమ్). మంచి రైడింగ్ అనుభూతిని అందించే ఈ స్కూటర్ 109.7 సీసీ ఇంజిన్ ద్వారా 7.7 బీహెచ్‌పీ, 8.8 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. సుమారు 103 కేజీల బరువున్న ఈ స్కూటర్.. రెండు వేరియంట్లలో, మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. డిజైన్, ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైడర్ వినియోగానికి కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
హోండా డియో
ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మందికి ఇష్టమైన బైకులలో.. హోండా డియో ఒకటి. రూ. 91000 ఎక్స్ షోరూమ్ ధర వద్ద లభించే స్కూటర్ స్టైలిష్ డిజైన్ పొందుతుంది. రెండు వేరియంట్లలో లభించే ఈ స్కూటర్.. 109.51 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 7.84 బీహెచ్‌పీ పవర్, 9.03 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ మహిళలకు మాత్రమే కాకూండా.. యువ రైడర్లకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. రైడింగ్ చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
సుజుకి యాక్సెస్ 125
స్టైలిష్ డిజైన్.. అప్డేటెడ్ ఫీచర్స్ కలిగిం సుజుకి యాక్సెస్ 125 కూడా మహిళలు ఉపయోగించడానికి అనుకూలమైన స్కూటర్ల జాబితాలో ఒకటి. 124 సీసీ ఇంజిన్ ద్వారా 8.31 బీహెచ్‌పీ పవర్, 10.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 106 కేజీల బరువున్న ఈ స్కూటర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 71557 (ఎక్స్ షోరూమ్). రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.