బిగ్‏బాస్ 9: హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. వీరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సెప్టెంబర్ 2025లో ప్రారంభమైన బిగ్‏బాస్ 9 ఎదో ఆలా నడుస్తూ ఉంది. ఈ రియాలిటీ షోకు గతంలో ఉన్నంత క్రేజ్ లేకపోవడంతో ప్రజాదరణకూడా తగ్గిందనే చెప్పాలి. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు తప్పా.. చూసేవారికి మాత్రం పెద్దగా ఆసక్తిలేదనే తెలుస్తోంది. దీనికి నిదర్శనమే బాగా తగ్గిపోయిన టీఆర్పీ. కాగా ఇప్పుడు ఈ షోకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి మరో ఆరుమంది కంటెస్టెంట్స్‌లను హౌస్‌లోకి ప్రవేశపెట్టారు.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్

బిగ్‏బాస్ 9లో ఇప్పటివరకు ఆరుమంది (శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, శ్రీజ దమ్ము) ఎలిమినేట్ అయ్యారు. ఈ స్థానాలను భర్తీ చేయడానికి.. మరో ఆరుగురు వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో రమ్య మోక్ష, శ్రీనివాస సాయి, దివ్వెల మాధురీ, నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా ఉన్నారు. ఇకమీదటైనా ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉంటుందా?, లేదా అనేది తెలియాల్సి ఉంది.

రెమ్యునరేషన్ వివరాలు

బిగ్‏బాస్ సీజన్ 9లో పాల్గొనేవారి రెమ్యునరేషన్ వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఒక అంచనా ప్రకారం.. సాధారణ కంటెస్టెంట్స్‌లకు రోజులు రూ. 15,000 నుంచి రూ. 20,000 వరకు ఉంటుంది. సెలబ్రిటీలకు రోజుకు రూ. 30000 నుంచి రూ. 40000 ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే మొదటివారమే ఎలిమినేట్ అయిన శ్రష్టి వర్మ రూ. 2 లక్షలు గెలుచుకుందని, మర్యాద మనీష్ రెండువారాలు రూ. 1.40 లక్షలు సొంతం చేసుకున్నారని, ప్రియా శెట్టి మూడువారాలకు గానూ రూ. 2.10 లక్షలు గెలుచుకున్నారని సమాచారం.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్‏బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కూడా రోజుకు రూ. 1,5000 నుంచి రూ. 20,000 రెమ్యునరేషన్ పొందే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించలేదు. కచ్చితమైన రెమ్యునరేషన్ వివరాలు తెలుసుకోవాలంటే.. బహుశా సీజన్ పూర్తయిన తరువాత కంటెస్టెంట్స్ లేదా బిగ్‏బాస్ యాజమాన్యం వెల్లడించాల్సిందే.

రమ్య మోక్ష

ఇకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మొదటగా అడుగుపెట్టిన రమ్య మోక్ష చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు, తాము చేసిన చిన్న తప్పువల్ల పచ్చళ్ల వ్యాపారం మూసేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఎప్పుడూ తాను ఫిట్‌నెస్ మీదనే ఫోకస్ పెడుతుందనీ.. ఇప్పుడు కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నట్లు తెలిసింది. తాము చేసిన చిన్న తప్పిదం వల్ల.. భారీ ట్రోలింగుకు గురైనట్లు కూడా తెలిసింది. కాగా ఇప్పుడు బిగ్‏బాస్ హౌస్‌లో తనను తాను నిరూపించుకుంటానకి స్పష్టం చేసింది.

మాధురీ దివ్వెల

బిగ్‏బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అడుగుపెట్టిన వారిలో దివ్వెల మాధురీ ఒకరు. తనకు ఇంటర్ చదివేటప్పుడే పెళ్లిచేశారని, తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, అనుకోని కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని తెలిసింది. అంతే కాకుండా తాను దువ్వాడ శ్రీనివాస్‌తో నాలుగేళ్లుగా ఉన్నానని, ఈ సమయంలో లెక్కలేనన్ని విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా.. కుమార్తెలను వదిలేసిందని చాలామంది అన్నారు.. అది ఏ మాత్రం నిజం కాదని, వారే నా భవిష్యత్ అని కూడా ఆమె హౌస్‌లోకి రాకముందే ఒక వీడియోలో పేర్కొన్నారు. కాగా శ్రీనివాస్ అనుమతితోనే బిగ్‏బాస్ సీజన్ 9లోకి అడుగుపెట్టినట్లు కూడా ఆమె స్పష్టం చేసింది.