Bike Do Not Come With Diesel Engine What Is The Reason: మనం నిత్యజీవితంలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు CNG వాహనాలను చాలానే చూస్తున్నాము. ఇందులో చాలా వరకు కార్లు, హెవీ వెహికల్స్, ట్రాక్టర్లు మొదలైనవన్నీ కూడా డీజిల్ ఇంజిన్లను కలిగి ఉంటాయి. డీజిల్ ద్వారానే నడుస్తాయి. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన మరియు చూస్తున్న బైకులు అన్నీ కూడా పెట్రోల్ ద్వారానే నడుస్తున్నాయి. బైకులు పెట్రోలుతోనే ఎందుకు పనిచేస్తుంటాయి, డీజిల్‌తో ఎందుకు పనిచేయవు? కంపెనీలు కూడా బైకులలో ఎందుకు డీజిల్ ఇంజిన్లను ప్రవేశపెట్టడం లేదు? అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ధరలు
పెట్రోలా మరియు డీజిల్ మధ్య ధరల వ్యత్యాసం ప్రధానంగా చెప్పుకోవాలి. నిజానికి గతంలో పెట్రోల్ ధరలు డీజిల్ కంటే కూడా ఎక్కువ ధర వద్ద లభించేవి, కానీ ఇప్పుడు డీజిల్, పెట్రోల్ ధరలు దాదాపు సమానంగానే ఉన్నాయి. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ ధరలు రెండూ కూడా రూ. 100 దాటేశాయి. మొత్తానికి డీజిల్ కంటే పెట్రోల్ కొంత తక్కువకే లభిస్తుందనేది వాస్తవం.
ఇంజిన్ల మధ్య తేడా..
పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి డీజిల్ ఇంజిన్ కంటే కూడా పెట్రోల్ ఇంజిన్ వెంటనే పవర్ డెలివరీ చేస్తుంది. డీజిల్ ఇంజిన్లో కార్బ్యురేటర్ ఉండదు, పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది. అంతే కాకుండా డీజిల్ ఇంజిన్ తయారు చేయడానికి కంపెనీ కొంత ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు లేదంటే?
నిజానికి బైకులు పరిమాణంలో ఇతర వాహనాల కంటే (కార్లు, హెవీ వెహికల్స్) కూడా చిన్నగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ పవర్ కూడా బైకులకు అవసరం లేదు. అంతే కాకుండా పెట్రోల్ కంటే కూడా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ ప్రెజర్ ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రెజర్ అందించడానికి కంపెనీలు వీటిని పరిమాణం పరంగా చాలా పెద్దగా తయారు చేసి ఉంటాయి. ఎక్కువ కంప్రెషన్ కారణంగా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి.
పరిమాణం కార్లు పెద్దవిగా ఉండటం వల్ల వాటికి పవర్ కూడా ఎక్కువ అవసరం, కానీ బైకులకు అంత పవరే అవసరం లేదు. అంతే కాకుండా డీజిల్ ఇంజిన్లు ఎక్కువ ధర కలిగి ఉండటం కూడా బైకులో డీజిల్ ఇంజిన్ లేకపోవడానికి ఒక కారణమనే తెలుస్తోంది.
ఉదాహరణకు ఒక బైక్ విలువ రూ. లక్ష అనుకుంటే.. అందులో డీజిల్ ఇంజిన్ ప్రవేశపెడితే దాని ధర రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో బైకులు కొనేవారి సంఖ్య కూడా భారీగా తగ్గుతుంది. అయితే కార్ల ధరలు కనీసం రూ. 10 లక్షల వరకు ఉంటాయి, వాటిలో డీజిల్ ఇంజిన్లు ప్రవేశపెట్టిన దానిని కొనుగోలుదారుడు సులభంగా భరించగలడు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ప్రధానమైన విషయం ఏమిటంటే.. బైకులో డీజిల్ ఇంజిన్ ఫిక్స్ చేయడానికి కావాల్సిన స్పేస్ కూడా ఉండదు. ఒకవేలా తెగించి డీజిల్ ఇంజిన్లను బైకులలో ప్రవేశపెడితే.. బైకు పరిమాణంలో ఇంజిన్ ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీంతో బైకు పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది.
బైకులో డీజిల్ ఫిల్ చేస్తే ఏమవుతుందంటే?
పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ పోసినా.. డీజిల్ ఇంజిన్‌లో పెట్రోల్ పోసినా చాలా ప్రమాదమే. ఎందుకంటే ఇంజిన్ పూర్తిగా చెడిపోయే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే.. పెట్రోల్ ఇంజిన్ మరియు డీజిల్ ఇంజిన్లు ప్రత్యేకంగా తయారుచేయబడి ఉంటాయి, కాబట్టి డీజిల్ ఇంజిన్ డీజిల్‌తోనే.. పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్‌తోనే పనిచేస్తాయి.
Don’t Miss: బ్యాడ్మింటన్ నుంచి స్టార్ హీరోయిన్.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్ లైఫ్!
పొరపాటున ఎప్పుడైనా డీజిల్ ఇంజిన్‌లో పెట్రోల్ పోసినా.. పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ పోసినా.. వెంటనే మెకానిక్ వద్దకు తీసుకెళ్లి.. ఆయిల్ ట్యాంక్, ఆయిల్ పంపు నుంచి మొత్తం ఫ్యూయెల్ తీసేయాలి. ఆ తరువాత డీజిల్ ఇంజిన్ అయితే.. డీజిల్, పెట్రోల్ ఇంజిన్ అయితే పెట్రోల్ పోసుకోవచ్చు. ఆలా కాదని సాహసించి బైకులో డీజిల్ నింపి స్టార్ట్ చేయడానికి చూస్తే.. ఇంజిన్ పాడవుతుంది. వాహనం వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాలి.