34.4 C
Hyderabad
Friday, March 14, 2025
Home Blog

‘హరి హర వీరమల్లు’ సినిమా అప్పుడే: అధికారిక ప్రకటన వచ్చేసింది

0

Hari Hara Veera Mallu Movie Release Date: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు.. నిర్మాణ సంస్థ శుభవార్త చెప్పింది. 2025 మే 9న తెరమీదకు రానున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నట్లు ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం ఇప్పటికే ప్రకటించింది.

హరి హర వీరమల్లు సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుందని సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంఎం రత్నం సమర్పణలో.. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించగా.. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటికే ‘కొల్లగొట్టినావురో’ పాటకు పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులు అభిమానులను ఫిదా చేశాయి.

ఇతర నటులు

మే 9న తెరమీదకు రానున్న హరి హర వీరమల్లు సినిమాలో అమెరికన్ నటి ‘నర్గిస్ ఫఖ్రి’ (Nargis Fakhri) పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోంది. బాబీ డియోల్, నిధి అగర్వాల్, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, సుబ్బరాజు, నజీర్, సునీల్ మరియు అనసూయ భరద్వాజ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

2023లో విడుదలైన బ్రో సినిమా తరువాత.. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరి హరి వీరమల్లు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే గతంలో ఈ సినిమా మార్చి 28న విడుదలవుతుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా ఇప్పుడు రిలీజ్ డేట్ మే 9కు మారింది. ఈ సినిమా విడుదలకు ఆలస్యం కావడానికి పలు కారణాలు ఉన్నట్లు సమాచారం. అయితే.. ఇప్పుడు ప్రకటించిన తేదీ (మే 9)న ఖచ్చితంగా విడుదలవుతుందని సమాచారం. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

స్వయంగా పాటపాడిన పవన్ కళ్యాణ్

ఇప్పుడు చాలా సినిమాల్లో హీరోలు లేదా హీరోయిన్స్ స్వయంగా పాటలు పాడి అలరిస్తున్నారు. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ చెప్పుకోదగ్గ వ్యక్తి. తమ్ముడు సినిమాలో, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో పవన్ కళ్యాణ్ స్వయంగా పాటపాడి అలరించారు. కాగా ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాలో కూడా పవర్ స్టార్ మాట వినాలి గురుడా.. అంటూ పాట పాడారు.

Also Read: ‘డాకు’ బ్యూటీ జోరు.. అలాంటి కారు కొన్న మొట్టమొదటి నటిగా రికార్డు

పవన్ కళ్యాణ్ మరో సినిమా

హరి హర వీరమల్లు సినిమా కాకుండా పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా ఓజీ (OG). ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా విడుదలైంది. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. కానీ ఎప్పుడు విడుదలవుతుందనే విషయం మాత్రం అధికారికంగా వెల్లడికాలేదు.

ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి, అజయ్ ఘోష్, అభిమన్యు సింగ్, శుభలేఖ సుధాకర్ మొదలైనవారు నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితం లభించదు

0

Daily Horoscope in Telugu 2025 March 14th Friday: శుక్రవారం (14 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, పౌర్ణమి ఉదయం 11:25 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు.

మేషం

వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాల్లో లాభాలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి.

వృషభం

దీర్ఘకాలిక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులపై ఒత్తిడి. సన్నిహితుల ప్రవర్తన కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశగానే ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా ఉంటాయి. విద్యార్థులకు శుభయోగం. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

మిథునం

ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. కీలక విషయాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు. మానసిక సమస్యలు ఎదురవుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశను కలిగిస్తుంది.

కర్కాటకం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతులున్నాయి. వ్యాపారంలో ఆశించిన పురోగతి ఉంది. సంతాన విద్యా విషయంలో సంతృప్తి చెందుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో లాభాలున్నాయి. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు.

సింహం

ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం కూడా కొంత కలిసి వస్తుంది. ఉద్యోగులకు శుభయోగం, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. అవసరానికి కావలసిన డబ్బు సమకూరుతుంది.

కన్య

ఆర్ధిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. దైవ దర్శనం చేసుకుంటారు.

తుల

ఋణదాతల నుంచి ఒత్తిడి, దూర ప్రయాణాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితుల ప్రవర్తన కొంత మానసిక ఆందోళన కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం

దీర్ఘకాలిక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. పారిష్కారం లభిస్తుంది. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన కొనుగోలు ఉంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.

ధనుస్సు

ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళాన్ని కలిగిస్తుంది. నూత వ్యాపార ప్రయత్నాలు కలిసి రావు. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల చికాకు కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుంది.

మకరం

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనలాభం ఉంది. దైవ దర్శనం చేసుకుంటారు.

కుంభం

ఈ రాశివారు జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ప్రతికూల ప్రభావం. వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఆర్ధిక సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో వివాదాలు ఉన్నాయి. అలోచించి తీసుకున్న నిర్ణయాలు శుభం కలిగిస్తాయి.

మీనం

ఈ రాశివారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో నూతనోత్సాహం కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.

గమనించండి: రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. కాబట్టి ఇందులో చెప్పిందే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. గ్రహాల స్థితిగతుల ఆధారంగా.. ఫలితాలు ఉంటాయి. అందులో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయి.

శనివారం నుంచే ఒంటిపూట బడి: సమ్మర్ హాలిడేయ్స్ ఎప్పుడంటే?

Half Day School in 2025: ఎండాకాలం మొదలైపోయింది. ఓ వైపు భానుడి భగభగలు, మరోవైపు నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం.. ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒంటిపూట బడి ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2025 మార్చి 15 (శనివారం) నుంచి.. పాఠశాలలకు ఒంటిపూట బడి (Half Day School) ప్రకటించింది. ఒంటిపూట బడి ప్రారంభమైన తరువాత పాఠశాల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఒంటిపూట బడి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత వేసవి సెలవులు ప్రకటిస్తారు.

ప్రైమరీ, హైస్కూల్, ఎయిడెడ్ మరియు ఇతర ప్రైవేట్ పాఠశాలలకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే పాఠశాలలు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తాయి. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ జేయడంతో.. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటించింది.

ఒంటిపూట బడి ఎందుకు ప్రకటించారు

తీవ్రమైన వేడి నుంచి.. విద్యార్థులను రక్షించాడనికి ప్రభుత్వం ఒంటిపూట బడి ప్రకటించింది. ఇప్పుడే హైదరాబా నగరంలో ఉష్ణోగ్రత 32°C దాటేసింది. ఇది రానున్న రోజుల్లో 35°C దాటేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వేడి తాపాన్ని పిల్లలు భరించడం కొంత కష్టమే. దీనిని దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

వేసవి సెలవులు ఎప్పుడంటే?

ఒంటిపూట బడి విషయం పక్కన పెడితే.. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు (Summer Holidays) ప్రకటించే అవకాశం ఉంది. ఈ సెలవులు జూన్ 11 వరకు కొనసాగుతాయి. అంటే మళ్ళీ స్కూల్ జూన్ 12న తెరుచుకుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేసవి సెలవులు ఏప్రిల్ 23 నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read: వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం: జగన్ భావోద్వేగ పోస్ట్ వైరల్

ప్రస్తుతం ఏపీ, తెలంగాణాలో కూడా ఇంటర్ పరీక్షలు కూడా ఈ నెల చివరి నాటికి ముంగియనున్నాయి. అయితే వీరికి వేసవి సెలవులు కొంత తక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో లేదా ఇతర కోర్సుల కోసం కాలేజీల్లో చేరటానికి ముందుగానే సిద్ధమవుతారు.

పరీక్షల ఫలితాలు

తెలంగాణలో 10వ తరగతి పరీక్షల ఫలితాలు (10th Results) ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పదవ తరగతి ఫలితాలు ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఫలితాలు కూడా ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా ఇంటర్ ఫలితాలు (Inter Results) అదే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎప్పుడు ఇంటర్ ఫలితాలు.. విడుదలవుతాయనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు.

ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంది

0

Daily Horoscope in Telugu 2025 March 13th Thursday: గురువారం (2025 మార్చి 13). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గుణ మాసం, శుక్ల పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:50 నుంచి 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:48 వరకు.

మేషం

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

వృషభం

చేపట్టిన పనులు సమాయానికి పూర్తవుతాయి. ఉద్యోగాల్లో ఆశించిన అభివృద్ధి. ముఖ్యమైన వ్యవహారాలు గొప్ప ఆలోచనలతో ముందుకు సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్ధిక పరమైన అంశాలు కూడా అనుకూలంగా ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది.

మిథునం

ఆర్ధిక పరిస్థితి కొంత దిగజారుతోంది. ముఖ్యమైన కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగవు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి.

కర్కాటకం

రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆశించిన లాభాలు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో.. నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అవసరానికి తగిన ధనం అందుతుంది. వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు.

సింహం

ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. స్థిరాస్థి వివాదాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తికి సంబంధించిన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి.

కన్య

ఆర్ధిక వ్యవహారాలు కలిసి రావు. బంధు మిత్రులతో తగాదాలు. వృత్తి ఉద్యోగాలలో కొంతమంది ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు కనిపించవు. దూరప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు కూడా మందకొడిగా ముందుకు సాగుతాయి. కొన్ని కీలక వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

తుల

దూరప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో కొంత గందర గోళ వాతావరణం. వృధా ఖర్చులు ఎక్కువవుతాయి. అవసరానికి కావాల్సిన ధనం లభించడదు. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి. వృధా ఖర్చులు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు.

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలు వేగంగా పూర్తవుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు పదోన్నతులు ఉన్నాయి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. దైవ చింతన పెరుగుతుంది.

ధనుస్సు

ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో కొంత చికాకులు. ఉద్యోగంలో ఒత్తిడి. వృధా ఖర్చులు ఉన్నాయి. ఖర్చుకు తగిన డబ్బు అందదు. దూరప్రయాణాలు చేస్తారు. ఇంటా బయట ప్రతికూల పరిస్థితి నెలకొంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మకరం

ఈ రాశివారికి శుభయోగం నడుస్తోంది. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. చేపట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం, ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు.

కుంభం

ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభం లేదు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులలో అల్ప ఫలితం పొందుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

మీనం

విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం. స్థిరాస్తి కొనుగోలులో లాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది.

గమనించండి: గ్రహాల స్థితి గతుల ఆధారంగా మాత్రమే రాశిఫలాలు నిర్ణయించడం జరుగుతుంది. గ్రహాల కదలికలలో మార్పు జరిగితే ఫలితాలు మారవచ్చు. కాబట్టి ఎప్పుడు ఎలాంటి ఫలితాలు లభిస్తాయనేది దైవ నిర్ణయం. కాబట్టి రాశిఫలాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే కొంత జాగ్రత్త వహించాల్సిందే.

‘డాకు’ బ్యూటీ జోరు.. అలాంటి కారు కొన్న మొట్టమొదటి నటిగా రికార్డు

0

Urvashi Rautela New Rolls Royce Cullinan: ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏది అంటే.. రోల్స్ రాయిస్ (Rolls Royce) అని టక్కున చెప్పేస్తారు. ఖరీదు ఎక్కువ కావడం చేతనే.. ఈ కార్లను సాధారణ ప్రజలు కొనుగోలు చేయలేరు. ధనవంతులు లేదా సంపన్నులు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు. ఇటీవల ప్రముఖ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఈ బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం.

ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఇటీవల నందమూరి బాలకృష్ణ సరసన డాకు మహారాజ్ సినిమాలో కనిపించింది. ఇప్పుడు ఖరీదైన రోల్స్ రాయిస్ కలినన్ (Rolls Royce Cullinan) కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ. 12 కోట్లు అని తెలుస్తోంది.

ఖరీదైన కారును కొనుగోలు చేయడంతో.. ఊర్వశి ఇప్పుడు ప్రతిష్టాత్మక ఇన్‌స్టాగ్రామ్ ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌లో స్తానం సంపాదించుకుంది. రోల్స్ రాయిస్ కారులో నుంచి బయటకు వస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

రోల్స్ రాయిస్ కలినన్

రోల్స్ రాయిస్ బ్రాండ్ యొక్క అధిక ప్రజాదరణ పొందిన లేదా ఎక్కువమంది ధనవంతులు ఇష్టపడి కొనుగోలు చేసిన కార్లలో కలినన్ ఒకటి. విలాసవంతమైన ఈ కారు.. చాలా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, అధునాతన ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ హీరోయిన్ కూడా ఈ కారును కొనుగోలు చేయలేదని సమాచారం. కాబట్టి ఈ కారును కొనుగోలు చేసిన మొదటి సెలబ్రిటీగా ఊర్వశి నిలిచింది.

అద్భుతమైన డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.7 లీటర్ వీ12 ఇంజిన్ ద్వారా 5000 rpm వద్ద 563 Bhp పవర్ మరియు 1600 rpm వద్ద 850 Nm టార్క్ అందిస్తుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారణంగానే పలువురు రోల్స్ రాయిస్ కలినన్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

Also Read: వరుస బ్లాక్‌బస్టర్స్‌.. కొత్త కారు కొనేసిన రష్మిక: ధర ఎంతో తెలుసా?

రోల్స్ రాయిస్ కలినన్ కార్లను కలిగిన ఇతరులు

నిజానికి భారతదేశంలో రోల్స్ రాయిస్ కార్లు ఎక్కువగా కలిగి ఉన్న వారు అంబానీ ఫ్యామిలీ. వీరు సుమారు 9 రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో కలినన్ మోడల్స్ కూడా ఉన్నాయి. అంబానీ ఫ్యామిలీ కాకుండా.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, అల్లు అర్జున్ మరియు అమితాబ్ బచ్చన్ మొదలైనవారు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే సెలబ్రిటీలలో కూడా ఈ కార్లను కొనుగోలు చేసినవారి సంఖ్య తక్కువే అని స్పష్టమవుతోంది.

ఊర్వశి రౌతేలా కార్ల ప్రపంచం

సాధారణంగా ఊర్వశి రౌతేలాకు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ (రూ. 2.2 కోట్లు), రేంజ్ రోవర్ ఎవోక్ (రూ. 62 లక్షలు), మెర్సిడెస్ బీ-క్లాస్ (రూ. 35 లక్షలు), బీఎండబ్ల్యూ 520డీ (రూ. 66 లక్షలు) మరియు ఫెరారీ 458 స్పైడర్ (రూ. 4.9 కోట్లు) ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి రోల్స్ రాయిస్ కారు చేరింది.

వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం: జగన్ భావోద్వేగ పోస్ట్ వైరల్

0

YSRCP Party Formation Day Jagan Tweet Viral: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ (YSRCP) పార్టీ ఆవిర్భవించి.. 15 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ‘వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి’ (YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి గురయ్యారు. ఓ సందేశాన్ని సైతం తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

నాన్నగారు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి’ ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన వైయస్‌ఆర్‌సీపీ పార్టీ నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది. పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఇప్పటి వరకు.. పార్టీని తమ భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, నాయకులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.

నా ఒక్కడితో మొదలై.. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో బలమైన రాజకీయ పార్టీగా అవతరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. నీటికి 15వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇన్ని సంవత్సరాల కాలం ఈ పార్టీ.. నిరంతరం ప్రజలతోనే, ప్రజల కోసం ఉంది. అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో.. దేశ రాజకీయ చరిత్రలోనే ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు చేయగలిగాము. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించాము. ప్రజల జీవన ప్రమాణాలను పెంచడం, సుస్థిరమైన ఆర్ధిక వృద్ధిని సాధించడం, దేశంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగింది.

విలువలతో.. విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచినా వైయస్‌ఆర్‌సీపీ పార్టీ పార్టీ పట్ల, నా పట్ల నమ్మకంతో.. నాతో నడుస్తున్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు అంటూ.. వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. తమ సపోర్ట్ తెలియజేస్తున్నారు.

రాబోయే రోజుల్లో..

వైఎస్ జగన్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడంతో పాటు, ఈ రోజు తన తండ్రికి పుష్పాంజలి ఘటించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది కార్యకర్తలు, పార్టీ పెద్దలు, ఎంఎల్ఏలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారినందరిని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ.. తమ అభిమానం చాటుకుంటున్నారు.

Also Read: పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?

పార్టీ ఆవిర్భావం

2009లో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసువులు బాసారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలబడలేదు. ఆ తరువాత ప్రజలకోసం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆవిర్భవించింది. ఆ తరువాత ఓదార్పు యాత్ర ప్రారంభించిన జగన్ మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు. దేశంలోనే 5వ అతిపెద్ద రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ అవతరించింది. అయితే గత ఎన్నికల్లో పార్టీ 11 సీట్లకు మాత్రమేపరిమితమైంది. కాగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే పార్టీ నాయకులకు.. వైయస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు.

టెన్షన్‌లో మస్క్‌, సపోర్ట్‌గా ట్రంప్‌.. ఏం చేశారో తెలుసా?

0

US President Donald Trump Buys Tesla Car: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బంధం గురించి దాదాపు అందరికీ తెలుసు. నేడు ట్రంప్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు అంటే.. దానికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మస్క్ కృషి చాలా ఉంది. అమెరికా ఎన్నికలు పూర్తయిన తరువాత మస్క్‌కు డీఓజీఈ (DOGE) బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ మధ్య కాలంలో మస్క్ షేర్స్ గణనీయంగా పడిపోవడంతో.. ఆయన సంపద అమాంతం ఆవిరవుతూ ఉంది. ఈ క్రమంలో మస్క్ కోసం ట్రంప్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అమెరికా ఎన్నికల తరువాత మస్క్ సంపద ఏకంగా రూ. 32 లక్షల కోట్లు దాటేసింది. కాగా గత వారం రోజులుగా మస్క్ సంపద 120 బిలియన్ డాలర్లు (రూ. 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. ప్రస్తుతం మస్క్ సంపద 324.3 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. మస్క్ సంపద భారీగా తగ్గిపోయినప్పటికీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.

మస్క్ సంపద తగ్గడానికి కారణం

ఎలాన్ మస్క్ సంపద భారీగా తగ్గిపోవడానికి కారణం టెస్లా అమ్మకాలు పడిపోవడం అనే తెలుస్తోంది. అమ్మకాలు పడిపోవడంతో.. కంపెనీ షేర్స్ కూడా పడిపోయాయి. గత నెలలో 30 శాతం షేర్స్ పడిపోయాయి. సోమవారం (మార్చి 11) కూడా మస్క్ షేర్స్ 15 శాతం తగ్గాయి. ఈ రోజు 5 శాతం పెరుగుదల నమోదైంది.

డొనాల్డ్ ట్రంప్ కొత్త కారు

ఎలాన్ మస్క్ షేర్స్ గణనీయంగా తగ్గుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఓ కొత్త టెస్లా కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. వైట్ హౌస్ దగ్గర.. ట్రంప్ కొనుగోలు చేసిన రెడ్ కలర్ ‘మోడల్ ఎక్స్’ (Model X) చూడవచ్చు. మస్క్ యొక్క టెస్లా కంపెనీకి మద్దతుగా నిలబడటానికే ట్రంప్ టెస్లా కారును కొనుగోలు చేశారు.

కారును కొనుగోలు చేసిన తరువాత.. వావ్ ఇది చాలా బాగుందని డ్రైవర్ సీటులోకి వెల్తూ ట్రంప్ ప్రశంసించారు. కో ప్యాసింజర్ సీటులో మస్క్ కూర్చుకున్నాడు. ఈ కారు కోసం 80000 డాలర్లు (రూ. 69.77 లక్షలు) చెల్లించినట్లు ట్రంప్ చెప్పారు. అడిగితే మస్క్ డిస్కౌంట్స్ ఇస్తాడు. డిస్కౌంట్స్ తీసుకుంటే.. ఇతర ప్రయోజనాలు పొందుతున్నట్లు విమర్శలు వస్తాయని అన్నారు.

Also Read: పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?

మస్క్ దేశభక్తుడు, ఆయన ఎలాంటి మనిషో నాకు బాగా తెలుసు. ఆయన ఆలోచనలు కూడా గొప్ప పనులను చేస్తాయని ట్రంప్ కొనియాడారు. ప్రస్తుతం ట్రంప్ పాలనలో.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్మమెంట్ ఎఫిషియన్సీ (DOGE) విభాగంలో మస్క్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా మస్క్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు.. పెద్ద విమర్శలకు దారి తీసింది. దీంతో టెస్లా షేర్స్ అమాంతం పడిపోయాయి.

టెస్లా మోడల్ ఎక్స్

గ్లోబల్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన టెస్లా కార్లలో మోడల్ ఎక్స్ అనేది ఒకటి. ఇది మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. అత్యంత సురక్షితమైన భద్రతను అందిస్తుంది. ఈ కారణంగానే దీనిని ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇకపోతే.. మస్క్ యొక్క టెస్లా భారతదేశంలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. దీనికోసం డీలర్షిప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తరువాత టెస్లా కార్లు ఇండియాలో కూడా అందుబాటులో ఉంటాయి. అమ్మకాలు మాత్రమే.. ఉత్పత్తి ఇండియాలో ఉండే అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఉత్పత్తి ఇండియాలో జరుగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

బుధవారం రాశిఫలాలు: వీరు శుభవార్తలు వింటారు

0

Daily Horoscope in Telugu 2025 March 12th Wednesday: శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గుణ మాసం, శుక్ల పక్షం.. బుధవారం (12 మార్చి 2025). రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి మధ్యాహ్నం 12:24 వరకు. అమృత ఘడియలు రాత్రి 01:38 నుంచి 03:18 వరకు.

మేషం

ఈ రాశివారు కొంత ప్రతికూల పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దూరప్రయాణం సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చికాకులు, దైవ చింతన పెరుగుతుంది.

వృషభం

ఓ శుభవార్త వింటారు. సన్నిహితులతో కాలం గడుపుతారు. స్వల్ప తగాదాలున్నవి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు అధికారుల నుంచి ఒత్తిడి పెరిగినప్పటికీ.. నేర్పుతో వ్యవహరించాల్సిన సమయం ఇది. ఆర్ధిక పరిస్థితి కొంత నిరుత్సాహ పరుస్తుంది. దైవ నామస్మరణ శుభం కలిగిస్తుంది.

మిథునం

ఇంటా బయట సానుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులకు తగిన డబ్బు సమకూరుతుంది. స్త్రీ సంబంధ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో చిన్నపాటి తగాదాలు ఉండవచ్చు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కర్కాటకం

సంఘంలో గౌరవం పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు ఉన్నాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతాయి.

సింహం

నూతన కార్యక్రమాల విషయంలో, పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యమైన పనులు కూడా నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం, చిన్న నాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.

కన్య

పని ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆర్ధిక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్ధిక సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు.. సఫలీకృతం అవుతాయి. విద్యార్థులకు శుభయోగం, పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.

తుల

వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించకపోవడం ఉత్తమం. బంధువర్గంలో స్వల్ప వివాదాలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో.. మాటపట్టింపులు ఉన్నాయి. ఆర్ధిక పరమైన విషయాల్లో ఆచి తూచి అడుగు వేయాల్సి ఉంది. దైవ ప్రార్థన మనశ్శాంతిని ఇస్తుంది.

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం లభించదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు

పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగులకు శుభయోగం, పనికి తగ్గ ఫలితం లభిస్తుంది. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరప్రయాణాలు లాభసాటిగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు.

మకరం

ఆర్ధిక పరిస్థితి దిగజారుతోంది. నూతన కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది. ఊహించని సమస్యలు తలెత్తుతాయి. ఇంటా బయట అనవసర సమస్యలు. సంఘంలో గౌరవం తగ్గుతుంది. ఏ మాత్రం నిరాశకు గురికావొద్దు. దైవ దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని కలిగిస్తాయి.

కుంభం

శుభవార్తలు వింటారు. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో తలెత్తే చిన్న చిన్న సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయి.

Also Read: సమ్మర్‌లో పెసలు.. ఆరోగ్యానికి ఎంతో స్పెషల్: ఎలా తినాలంటే?

మీనం

ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆలోచన ప్రధానం. మీరు తీసుకునే నిర్ణయాలే.. మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. దూరప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

గమనించండి: రాశిఫలాలు గ్రహాల స్థితిగతుల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి గ్రహాలలో జరిగే మార్పుల వల్ల ఫలితాలు తారుమారు కావొచ్చు. కాబట్టి దైవ దర్శనం, దైవ నామ స్మరణ తప్పకుండా శుభ ఫలితాలను ఇస్తుంది.

పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?

0

Do You Know About Delhi EV Policy 2.0: దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, అక్కడి ప్రభుత్వం కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘ఢిల్లీ ఈవీ పాలసీ 2.0’ (Delhi EV Policy 2.0) వెలుగులోకి వచ్చింది. ఇంతకీ దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి?, పెట్రోల్, డీజిల్ కార్ల పరిస్థితి ఏమిటి అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఢిల్లీ ఈవీ పాలసీ 2.0

నగరంలో ఈవీ పాలసీ 2.0 కింది.. 2027 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలను గణనీయంగా పెరగనున్నాయి. మొత్తం వాహనాలలో ఎలక్ట్రిక్ వాహనాలు 95 శాతం వరకు ఉంటుందని అంచనా. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో భారతదేశంలో ఢిల్లీ అగ్రగామిగా ఉండాలని.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త పాలసీ విధానం ప్రకారం.. అన్ని సీఎన్‌జీ ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, లైట్ వెయిట్ కమర్షియల్ వాహనాలను దశల వారీగా.. ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రజా రవాణా కోసం బస్సులను కూడా ఎలక్ట్రిక్ రూపంలోనే ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే.. టూ వీలర్స్, త్రీ వీలర్స్, ఎలక్ట్రిక్ కమర్షియల్ వాహనాల కొనుగోలుకు ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం అందించనుంది.

ప్రోత్సాహకాలు

నిజానికి ప్రోత్సాహకాలు.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని తప్పకుండా పెంచుతాయి. గతంలో చాలా రాష్ట్రాలు, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను అందించాయి. దీనికోసం ప్రత్యేకంగా స్టేట్ ఈవీ ఫండ్ ఏర్పాటు చేస్తారు. దీనిని గ్రీన్ లెవీలు, పొల్యూషన్ సెస్, అగ్రిగేటర్ లైసెన్స్ ఫీజులతో నింపుతారు. వాటిని ప్రోత్సాహకాలుగా అందిస్తారు.

ప్రస్తుతం దేశంలో.. దాదాపు అన్ని విభాగాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. కాబట్టి వాహన వినియోగదారులు తమకు నచ్చిన వాహనాలను ఎలక్ట్రిక్ రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలుపైన గణనీయమైన ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కొత్త నిబంధనలనకు అనుగుణంగా ఉండాలి.. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఢిల్లీలో కఠినమైన నియంత్రణ చర్యలు అమలులోకి రానున్నాయి.

స్క్రాపింగ్

ఢిల్లీలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన వినియోగం ఉండాలనే చర్యలో భాగంగా ప్రోత్సాహకాలు అందించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా.. కూడా కొత్త వాహనాల కొనుగోలుపై డిస్కౌంట్ లభిస్తుంది. పాత వాహనాల స్కాపేజ్ కోసం కావాల్సిన సదుపాయాలు పెంచనున్నారు.

మౌలిక సదుపాయాల వృద్ధి & కొత్త ఉద్యోగాలు

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలంటే.. మౌలిక సదుపాయాలు కూడా పెరగాలి. అంటే విస్తృత స్థాయిలో ఛార్జింగ్ స్టేషన్స్ పెరగాలన్న మాట. కాబట్టి ప్రభుత్వం మరిన్ని ఛార్జింగ్ స్టేషన్స్ లేదా ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దీనికోసం అవసరమైతే.. ప్రైవేట్ కంపెనీల మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉంది.

Also Read: సరికొత్త టయోటా హైలెక్స్ బ్లాక్ ఎడిషన్ ఇదే: దీని గురించి తెలుసా?

ఢిల్లీలో ఈవీ పాలసీ 2.0 అమలులోకి వస్తే.. ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్, సర్వీస్, ఫైనాన్సింగ్, బ్యాటరీ నిర్వహణ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. తద్వారా కొంతవరకు నిరుద్యోగం తగ్గుతుంది.

నిజానికి ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 2020లో అమలు చేసింది. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించింది. ఇప్పుడు ఇదే 2.0 రూపంలో రానుంది. మొత్తం మీద దెస రాజధాని నగరంలో పెట్రోల్, డీజిల్ కార్లు కనుమరుగయ్యే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.

Daily Horoscope: మంగళవారం (మార్చి 11) రాశిఫలాలు

0

Daily Horoscope in Telugu 2025 March 11th Tuesday: మంగళవారం (11 మార్చి 2025). శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, పాల్గుణ మాసం, శిశిర ఋతువు, శుక్ల పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు.

మేషం

కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకు లాభాలు, నిరుద్యోగులు.. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. అన్ని రంగాల్లోనూ ఆశాజనక ఫలితాలు లభిస్తాయి.

వృషభం

దీర్ఘకాలిక ఋణసమస్యలు తొలగిపోతాయి. నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులు లభిస్తాయి.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు పదోన్నతులు, విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం.

మిథునం

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులకు స్థానచలనం, వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితి. కుటుంబం వాతావరణం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. చికాకు, అలసట కలుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా ముందుకు సాగవు. ఆర్ధిక పరిస్థితి కొంత కష్టంగానే ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

కర్కాటకం

వ్యాపార రంగంలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులలో కొంత ఆటంకాలు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ద అవసరం. దైవ నామస్మరణ కొంత మనో ధైర్యాన్ని ఇస్తుంది.

సింహం

శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులు లాభాలను పొందుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు మీకు మరింత గౌరవం తెస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కన్య

ఉద్యోగులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు. అధిక ఖర్చులు, ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉండదు. మనసు నిలకడగా ఉండదు. నూతన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.

తుల

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తవుతాయి. వ్యాపారాలకు, కావలసిన పెట్టుబడి అందుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగ సమస్య తీరిపోతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ దర్శనం చేస్తారు.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంది. నూతన కార్యక్రమాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబంలో కలహాలు. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు.. మళ్ళీ మళ్ళీ ఆలోచించడం ఉత్తమం.

ధనుస్సు

ఆర్ధిక సమస్యలు తీరిపోతాయి. చాలా రోజులుగా కొలిక్కి రాని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగులకు శుభయోగం ఉంది. దైవ చింతన అవసరం.

మకరం

అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. వ్యాపారాలలో వృద్ధి. కార్య సిద్ది ఉంది. అనుకున్న పనులు సజావుగా ముందుకు సాగుతాయి.

కుంభం

సన్నిహితులతో సమస్యలు కలుగవచ్చు, వాదోపవాదాలు వద్దు. ఉద్యోగంలో చికాకు, అధికారుల నుంచి ఒత్తిడి. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. విద్యార్థులకు శుభయోగం. ఆర్ధిక సమస్యలు కొంత పట్టుపీడిస్తాయి. కుటుంబంలో చిన్న మాటపట్టింపులు. దైవ చింతన అవసరం.

మీనం

ఇంటా బయట సానుకూలం. ఉద్యోగులకు అదనపు భారం. వృత్తి, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు. ఓ ముఖ్యమైన కార్యక్రమం వాయిదా పడుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉద్యోగులకు ప్రశంసలు ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

గమనించండి: రాశిఫలాలు ఖగోళ శాస్త్ర సంబంధితం. గ్రహాల పరిస్థితులను బట్టి రాశి, జన్మ నక్షత్రాలను బట్టి రాశిఫలాలు నిర్ణయిస్తారు. గ్రహాల గతులు మారినప్పుడు, రాశిఫలాలలో అనూహ్య మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన రాశిఫలాలు కేవలం అవగాహన మాత్రమే. మనిషి జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటా శివయ్య ఆజ్ఞే.