37.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 12

దిగ్గజ తబలా విద్వాంసుడు ‘జాకీర్ హుస్సేన్’ ఇక లేరు

0

Famous Tabla Maestro Ustad Zakir Hussain Passes Away: ప్రముఖ తబలా విద్వాంసుడు మరియు కంపోజర్ ‘జాకీర్ హుస్సేన్’ (Zakir Hussain) ఈ రోజు (డిసెంబర్ 15) శాన్ ప్రాన్సిస్కోలో కన్నుమూశారు. 73 సంవత్సరాల హుస్సేన్ దిగ్గజ తబలా విద్వాంసుడు ‘ఉస్తాద్ అల్లా రఖా’ కుమారుడు. ఈయన గత రెండు వారాల నుంచి గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అయితే నేడు కన్నుమూశారు.

అనారోగ్యం కారణంగానే హుస్సేన్ పలు కచేరీలు కూడా రద్దు చేసుకున్నట్లు సమాచారం. అతని ఆరోగ్య పరిస్థితి కొంత నిరాశాజనంగానే ఉన్నట్లు గత వారంలోనే వైద్యులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కూడా జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం చూసుకోడడానికి భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు.

చిన్నతనం నుంచే తబలా విద్య

1951 మార్చి9న ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ పూర్తి పేరు ‘జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి’. తండ్రి తబలా విద్వాంసుడు కావడం చేత హుస్సేన్ కూడా చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర తబలా నేర్చుకున్నారు. అతి తక్కువ కాలంలోనే తండ్రిని మించిన తనయుడిగా ప్రసిద్ధి చెందిన జాకీర్ హుస్సేన్ అనేక జాతీయ, అంతర్జాతీయ పురష్కారాలు కూడా సొంతం చేసుకున్నారు.

భారత ప్రభుత్వం ‘జాకీర్ హుస్సేన్’ను పద్మ భూషణ్, పద్మశ్రీ మరియు పద్మ విభూషణ్ వంటి అత్యున్నత సత్కారాలతో గౌరవించింది. అయితే ఈయన పదేళ్ల క్రితమే.. భారత్ నుంచి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అనేక సినిమాల్లో కూడా నటించిన జాకీర్ హుస్సేన్.. పలు గ్రామీ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.

అంటొనియా మిన్నేకోలాతో వివాహం

ముంబైలో పూటి పెరిగిన జాకీర్ హుస్సేన్.. అక్కడే చదువుకున్నాడు. ఇతడు మాహిమ్‌లోని సెయింట్ మైఖేల్స్ హైస్కూల్‌లో తన ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసినట్లు సమాచారం. ఈయన కథక్ నృత్యకారిణి మరియు ఉపాధ్యాయురాలు అయిన ‘అంటొనియా మిన్నేకోలా’ను వివాహం చేసుకున్నారు. వీరికి అనిసా ఖురేషి మరియు ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనిసా యూసీఎల్ఏ నుంచి పట్టభద్రురాలు అయింది. ఈమె ఫిల్మ్ మేకర్ కూడా. ఇక ఇసాబెల్లా మాన్‌హాటన్‌లో డ్యాన్స్ నేర్చుకుంటున్నట్లు సమాచారం.

దిగ్గజాల సంతాపం

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మరణం చాలామందిని కలచి వేచింది. కమల్ హాసన్, ఆనంద్ మహీంద్రా, హన్సల్ మెహతా, పినరయి విజయన్, హర్ష గోయెంకా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదలైనవారు జాకీర్ హుస్సేన్ మరణం శాస్త్రీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని సంతాపం తెలియజేసారు.

తబలా విద్వాంసుడుగా ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినా.. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలనేది జాకీర్ హుస్సేన్ సిద్ధాంతం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పడూ అనుకోకూడదని మా నాన్న చుబుతూ ఉండేవాడని హుస్సేన్ గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు. నా రంగంలో నేను ఎన్ని ఉత్తమ ప్రదర్శనకు ఇచ్చినప్పటికీ.. నా కంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు కనీసం 15 కంటే ఎక్కువ చెప్పగలను అని అంటూ ఉండేవారు జాకీర్ హుస్సేన్. దీన్ని బట్టి చూస్తే ఈయన ఎంత వినయమైన స్వభావం కలిగిన వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు.

ఆటోలో ‘అలియా భట్’.. వైరల్ అవుతున్న వీడియో

0

Alia Bhatt in Auto Rickshaw: దేశంలో వాహన సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.. దీంతో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అయిపోతోంది. సాధారణ ప్రజలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు రోజూ చాలా ఇబ్బందులు పడుతూ తమ ప్రయాణాలను కొనసాగుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవల నటి ‘అలియా భట్’ (Alia Bhatt) ట్రాఫిక్ నుంచి బయటపడటానికి లగ్జరీ కారును వదిలేసి.. ఆటో రిక్షాలో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

నటి అలియా భట్ ముంబై ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సమయంలో.. అక్కడ నుంచి బయటపడి గమ్యాన్ని చేరుకోవడానికి, గేట్‌వే ఆఫ్ ఇండియా జెట్టీ నుంచి ఆటో రిక్షాలో ప్రయాణించింది. సాధారణ దుస్తులు ధరించిన అలియా భట్.. పక్కనే బాడీగార్డ్స్ కూడా ఉండటం చూడవచ్చు. ముఖానికి నల్లటి మాస్క్ వేసుకున్నప్పటికీ.. ఆమె అలియా భట్ అని స్పష్టంగా తెలిసిపోతోంది.

ఆటో రిక్షాలో అలియా భట్

ఆటో రిక్షాను సమీపించిన అలియా భట్.. ఆటోలో కూర్చుంది. ఆమె బాడీగార్డ్ కూడా ఆమె పక్కనే ఆటోలో కూర్చున్నాడు. అయితే అలియా భట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోందన్న విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే ఈమె ధరించిన షర్ట్ మాత్రం జిగ్రా చిత్రంలో వేసుకున్నదే అని తెలుస్తోంది.

నిజానికి ట్రాఫిక్ అనేది.. ఆధునిక కాలంలో కూడా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. విలాసవంతమైన లేదా విశాలమైన కార్లలో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ను అధిగమించాలంటే కొంత కష్టమైన పనే. అయితే ఆటో రిక్షాలు, చిన్న కార్లు లేదా టూ వీలర్లలో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ను కొంత వేగంగా అధిగమించవచ్చు. అయితే సెలబ్రిటీలు టూ వీలర్లలో ప్రయాణించడం కొంత కష్టమైన పని. ఎందుకంటే.. సెలబ్రిటీలు బైకుల్లో తిరుగుతూ కనిపిస్తే.. అభిమానులు మీదపడతారు. అది ట్రాఫిక్‌ను మరింత తీవ్రతరం చేస్తుంది.

సెలెబ్రిటీలు ఆటో రిక్షాలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు

నటి అలియా భట్ ఆటో రిక్షాలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఆటోలో ప్రయాణించారు. మరికొందరు మెట్రో రైలులో కూడా ప్రయాణించారు. చేరుకోవాల్సిన గమ్యాన్ని వేగంగా చేరుకోవడానికి మెట్రో ట్రైన్ ఓ ఉత్తమ మార్గం. కాబట్టి పలువురు రాజకీయ నాయకులు కూడా గతంలో మెట్రో రైలులో ప్రయాణించారు.

అలియా భట్ ఉపయోగించే కార్లు

నటి అలియా భట్ తన రోజువారీ వినియోగానికి చాలా ఖరీదైన కార్లను వినియోగిస్తుంది. ఈ జాబితాలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8, ఆడి ఏ8 ఎల్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఆర్8, మెర్సిడెస్ ఏఎంజీ జీ 63, ఆడి ఏ6, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి క్యూ5 మరియు ఆడి క్యూ7, లెక్సస్ ఎల్ఎమ్ (రూ. 2.50 కోట్లు) మొదలైనవి ఉన్నాయి.

అలియా భట్ మాత్రమే కాకుండా.. ఈమె భర్త రణబీర్ కపూర్ కూడా విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారు. రణబీర్ కపూర్ ఉపయోగించే కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ ప్రధానంగా చెప్పుకోదగ్గది. ఇది ప్రత్యేకమైన బెల్గ్రేవియా గ్రీన్ రంగులో ఉంది. ఈ కారంటే అలియా భట్‌కు కూడా చాలా ఇష్టమని సమాచారం.

Also Read: ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

నటి అలియా భట్ ఉపయోగించే చాలా కార్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ ‘1500’గా ఉంటుంది. ఈ నెంబర్ తన ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, ఆడి క్యూ5, ఆడి ఏ6 మరియు బీఎండబ్ల్యూ 7 సిరీస్ వంటి వాటికి ఉంది. అయితే ఈ నెంబర్ ఎందుకు ఎంచుకుంది అనే విషయానికి సంబంధించిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వారు వెల్లడించలేదు.

అలియా భట్ రెమ్యునరేషన్

నటి అలియా భట్ బాలీవుడ్ ఫేమ్ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. ఈమె రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలో నటించింది. ఈ సినిమాకు ఈమె సుమారు రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఈమె ఒక్కో సినిమాకు సుమారు రూ. 10 కోట్ల నుంచి రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్‌ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!

0

Dulquer Salmaan Nissan Patrol Y60 Car in Lucky Bhaskar: ‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపై కనపడాలి’ ఇలా ఒక్కొక్క డైలాగ్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన లక్కీ భాస్కర్ సినిమా.. ఇటీవల కాలంలో ఓ సంచలనం అనే చెప్పాలి. ఎన్నో జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ మూవీ ఎంతోమందిని కదిలించింది. మరెంతోమందికి ఆదర్శమైంది. నటుడు దుల్కర్ సల్మాన్, నటి మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే ఈ సినిమాలో కనిపించే ఒక కారు మాత్రం వాహన ప్రియులకు ఫిదా చేసింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేద్దాం.

గోల్డ్ షాపుకు వెళ్లి బంగారం కొనుక్కున్న తరువాత.. బ్యాంక్ చెక్ యాక్సెప్టబుల్ కాదని సేల్స్‌మెన్ (నాగి) చెబుతాడు. ఆ తరువాత దుల్కర్ సల్మాన్.. మీనాక్షి చోదరితో వెళ్లి కారు కొనుక్కుని.. మళ్ళీ అదే గోల్డ్ షాపుకు వస్తాడు. ఇక్కడ కనిపించే కారు మోడల్ ఎంతోమందికి ఒక్క చూపుకే తెగ నచ్చేసింది. ఈ కారు నిస్సాన్ కంపెనీకి చెందిన ‘పట్రోల్ వై60’ మోడల్. ఎరుపు రంగులో కనిపించే ఈ కారు చాలా విశాలంగా.. చాలా లగ్జరీగా కనిపిస్తోంది.

నిస్సాన్ పట్రోల్ వై60 (Nissan Patrol Y60)

ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన ‘నిస్సాన్ పట్రోల్ వై60’ మోడల్ కారు 1987 నుంచి 1997 వరకు ఉత్పత్తిలో ఉండేది. ఆ తరువాత ఈ కారులో అప్డేటెడ్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇది భారతదేశంలో కూడా 1999 వరకు కూడా అమ్మకానికి అందుబాటులో ఉండేది. ఇది విలాసవంతమైన డిజైన్, మరియు ఫీచర్స్ కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే దశాబ్దాలు ఇది గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి నిలిచింది.

నిస్సాన్ పట్రోల్ వై60 మోడల్ కారులో 4.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 4000 rpm వద్ద 170 హార్స్ పవర్, 3200 rpm వద్ద 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందింది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందించేది. ఈ కారు ధర రూ. 80 లక్షల వరకు ఉండేది సమాచారం. 5 డోర్లు కలిగిన ఈ కారు ఉత్పత్తి ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయింది. అయితే కొంతమంది ఆటోమోటివ్ ఔత్సాహికుల గ్యారేజిలో మాత్రమే ఈ కారు కనిపిస్తోంది. ఈ కారు నటుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో కూడా ఉంది.

దుల్కర్ సల్మాన్ కార్ కలెక్షన్ (Dulquer Salmaan Car Collection)

సాధారణంగా నటుడు ‘దుల్కర్ సల్మాన్’ను కార్లన్నా.. బైకులన్నా అమితమైన ఇష్టం ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో అన్యదేశ్య, ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో నిస్సాన్ పెట్రోల్ వై60 మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఈ30, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం3 ఈ46, జీ63 ఏఎంజీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియు పోర్స్చే పనామెరా వంటి కార్లు ఉన్నాయి.

కార్లు మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ ఖరీదైన బైకులను కూడా వినియోగిస్తున్నారు. ఇందులో ట్రయంఫ్ బోన్నెవిల్లే, బీఎండబ్ల్యూ ఆర్1200జీఎస్, డుకాటీ స్క్రాంబ్లర్ మొదలైన బైకులు ఉన్నాయి.

దుల్కర్ సల్మాన్‌కు మాత్రమే కాకుండా.. ఈయన తండ్రి మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి కూడా కార్లంటే చాలా ఇష్టం. ఈయన ఉపయోగించే కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్600, ఏఎంజీ ఏ45ఎస్, ఫెరారీ 296 జీటీబీ, మినీ కూపర్ ఎస్, జాగ్వార్ ఎక్స్‌జే, ఆడి ఏ7, టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు మిస్టీబిషి పజెరో స్పోర్ట్స్ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.

Also Read: కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. మమ్ముట్టి మరియు దుల్కర్ సల్మాన్ ఉపయోగించే కార్లన్నింటికీ 369 అనే నెంబర్ ప్లేట్ ఉంటుంది. కొందరు సెలబ్రిటీలు ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఇలాంటి నెంబర్ ప్లేట్స్ ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగానే మమ్ముట్టి గ్యారేజిలోని అన్ని కార్లకు ఇదే నెంబర్ (369) ఉంటుంది.

కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

0

Keerthy Suresh Wedding and Car Collection: నేను శైలజ సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన అభినవ మహానటి ‘కీర్తి సురేష్’ (Keerthy Suresh) పెళ్లి పీటలెక్కనున్న. కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన ‘ఆంటోనీ తటిల్’ (Antony Thattil)ను ఈ రోజు (డిసెంబర్ 12న) గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తాను.. ఆంటోనీ 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే కీర్తి సురేష్ వెల్లడించింది. ఇప్పుడు ఇరువురి కుటుంబాల సమక్షంలో హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగనుంది.

తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన కీర్తి సురేష్.. తమిళం మరియు మలయాళం సినిమాల్లో కూడా నటించింది. అయితే తెలుగులోనే ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. మహానటిగా ప్రసిద్ధి చెందిన ఈమె నిజ జీవితంలో ఎలాంటి కార్లను ఉపయోగిస్తుంది? వాటి ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

కీర్తి సురేష్ కార్ కలెక్షన్ (Keerthy Suresh Car Collection)

నటి కీర్తి సురేష్ ఉపయోగించే కార్ల జాబితాలో వోల్వో ఎస్90, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ, మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్‌సీ43, టయోటా ఇన్నోవా క్రిష్టా మరియు బీఎండబ్ల్యూ ఎక్స్7 వంటివి ఉన్నట్లు సమాచారం.

వోల్వో ఎస్90 (Volvo S90)

స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో.. భారతదేశంలో విక్రయిస్తున్న కార్ల జాబితాలో ఎస్90 ఒకటి. దీని ప్రారంభ ధర రూ.68.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). కీర్తి సురేష్ ఉపయోగించే కార్ల జాబితాలో ఈ కారు ఉంది. అద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ కారు 1969 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 Bhp పవర్, 350 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 8.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ 180 కిమీ/గం కావడం గమనార్హం. అజయ్ దేవగన్, సాక్షి తన్వర్ వంటి ప్రముఖుల గ్యారేజిలో కూడా వోల్వో ఎస్90 ఉంది.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ (BMW 7 Series 730Ld)

జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ 730ఎల్‌డీ కూడా కీర్తి సురేష్ గ్యారేజిలో ఉంది. రూ. 1 కోటి రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. వాహన వినియోగదారులకు కావలసినన్ని లగ్జరీ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. 2993 సీసీ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 4000 rpm వద్ద 262 Bhp పవర్ మరియు 2000 rpm వద్ద 620 Nm టార్క్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీఎల్‌సీ43 (Mercedes Benz AMG GLC43)

కీర్తి సురేష్ గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ జీఎల్‌సీ43. దీని ధర రూ. 1.10 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారులో 1991 సీసీ పెట్రోల్ ఇంజిన్ 500 న్యూటన్ మీటర్ టార్క్, 416 బీహెచ్పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగిన ఈ కారు 4.8 సెకన్లలో గంటకు 250 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖులు గ్యారేజిలో ఈ లగ్జరీ కారు ఉంది.

బీఎండబ్ల్యూ ఎక్స్7 (BMW X7)

కీర్తి సురేష్ ఉపయోగించే మరో ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఎక్స్7. దీని ధర రూ. 1.30 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. కాబట్టి కీర్తి సురేష్ ఏ మోడల్ ఎంచుకున్నదనే విషయం స్పష్టంగా వెల్లడి కాలేదు. ఈ కారు డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. ఈ రెండు ఇంజిన్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. డిజైన మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఈ కారులో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇది దేశీయ విఫణిలోని ఆడి క్యూ8, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Also Read: పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

టయోటా ఇన్నోవా క్రిష్టా (Toyota Innova Crysta)

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల జాబితాలో టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా క్రిష్టా ఒకటి. రూ. 25 లక్షల కంటే ఖరీదైన ఈ కారును.. సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ వినియోగిస్తున్నారు. ఇది ఇతర లగ్జరీ కార్ల ధరల కంటే కొంత తక్కువే అయినప్పటికీ.. డిజైన్ మరియు ఫీచర్స్ విషయంలో చాలా గొప్పగా ఉంటుంది. ఇది రోజువారీ వినియోగానికి, కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కారు కూడా నటి కీర్తి సురేష్ గ్యారేజిలో ఉంది.

కీర్తి సురేష్ పెళ్లి (Keerthy Suresh Marriage)

నటి కీర్తి సురేష్ మరియు బిజినెస్ మ్యాన్ ఆంటోని గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలైపోయాయి. వీరి వివాహం గోవాలో జరగనున్నట్లు సమాచారం. ఈ పెళ్ళికి ప్రముఖ సినీ తారలు, పారిశ్రామిక వేత్తలు మొదలైనవారు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద మహానటి త్వరలో ఏడడుగులు వేయనుంది.

ఇది కదా అసలైన గుడ్‌న్యూస్: థార్ కొనుగోలుపై రూ.3 లక్షల డిస్కౌంట్స్

0

Mahindra December Discount On Thar: భారతదేశంలో ఎక్కువమంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్న ఆఫ్ రోడర్ కారు ఏదంటే.. టక్కున వచ్చే సమాధానం మహీంద్రా కంపెనీ యొక్క థార్ (Mahindra Thar). అలాంటి మహీంద్రా థార్ కొనుగోలుపైనా కంపెనీ అద్భుతమైన డిస్కౌంట్ గరిష్టంగా రూ. 3 లక్షల వరకు అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

2024 ముగుస్తున్న తరుణం మాత్రమే కాకుండా.. థార్ 5 డోర్ అమ్మకాలను పెంచుకునే దిశగా మహీంద్రా కంపెనీ అడుగులు వేస్తూ ఈ గొప్ప డిస్కౌంట్ ప్రకటించినట్లు అర్థమవుతోంది. ప్రారంభం నుంచి మంచి అమాంకాలతో దూసుకెళ్తున్న మహీంద్రా థార్ మొత్తం మూడు ఇంజిన్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అవి 152 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 132 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్.. మూడోది 119 హార్స్ పవర్ అందించే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్.

మహీంద్రా థార్ 4డబ్ల్యుడీ (Mahindra Thar 4WD)

థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క డబ్ల్యుడీ వేరియంట్ కొనుగోలుపైన ఏకంగా 3.06 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కారు కొనుగోలు చేసేవారు రూ. 3 లక్షల కంటే ఎక్కువ సేవ్ చేయవచ్చు. ఈ కారు స్పెషల్ కలర్ ఆప్షన్ పొందుతుంది. దీనిని కంపెనీ ‘డెసర్ట్ ఫ్యూరీ’ అని పిలుస్తుంది.

కొత్త మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ యొక్క బి పిల్లర్స్ మీద మరియు రియర్ ఫెండర్ మీద ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జ్‌లు ఉండటం చూడవచ్చు. అయితే ఇందులోని లెదర్ అపోల్స్ట్రే లేత గోధుమ రంగు మరియు నలుపు రంగులలో (డ్యూయెల్ టోన్) ఉండటం చూడవచ్చు. ఈ ఎర్త్ ఎడిషన్ ధర మార్కెట్లో రూ. 15.40 లక్షల నుంచి రూ. 17.60 లక్షల మధ్య ఉంది.

మహీంద్రా థార్ 2డబ్ల్యుడీ (Mahindra Thar 2WD)

కంపెనీ ఇప్పుడు మహీంద్రా థార్ 2డబ్ల్యుడీ కొనుగోలుపైన కొనుగోలుదారులు రూ. 1.31 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది 3 డోర్ మోడల్ మరియు పెట్రోల్ బేస్డ్ వెర్షన్. మార్కెట్లో ఈ కారు ధర రూ. 11.35 లక్షల నుంచి రూ. 14.10 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ప్రస్తుతం మహీంద్రా కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్స్.. గతంలో కంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. ఇది కూడా చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని చేంజస్ గమనించవచ్చు.

గమనిక: డిస్కౌంట్ అనేది నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కంపెనీ అందించే డిస్కౌంట్ స్టాక్ లభ్యతకు లోబడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన డిస్కౌంట్స్ లేదా తగ్గింపులు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలంటే.. సమీపంలోని బ్రాండ్ యొక్క అధికారిక డీలర్షిప్ వద్ద తెలుసుకోవాలి.

మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx)

భారతదేశంలో ప్రారంభం నుంచి గొప్ప అమ్మకాలను పొందిన మహీంద్రా థార్ ఇప్పుడు 5 డోర్ వెర్సన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. దీని పేరు రోక్స్. ఈ థార్ 5 డోర్ మోడల్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇది 5 డోర్ మోడల్ కాబట్టి.. థార్ 3 డోర్ మోడల్ కంటే విశాలంగా ఉండటం చూడవచ్చు.

Also Read: 2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ థార్ మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైనన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 152 హార్స్ పవర్, 330 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అదే విధంగా ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 162 హార్స్ పవర్ మరియు 330 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కంపెనీ ఈ కారు కొనుగోలుపై ఎలాంటి డిస్కౌంట్స్ లేదా తగ్గింపులను అందించడం లేదు.

2024లోనే కారును ఎందుకు కొనాలి.. 2025లో కొంటే వచ్చే నష్టాలు తెలుసా?

0

Cars and SUVs To Get Price Hike From January 2025: 2024 సంవత్సరం చరమదశకు వచ్చేసింది.. ఇంకొన్ని రోజుల్లో కొత్త ఏడాది (2025) మొదలైపోతుంది. చాలామంది కొత్త సంవత్సరంలో కొత్త కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ 2025లో కారు కొనుగోలు చేయడం కన్నా.. 2024 ముగిసేలోపే కారు కొంటే కొంత లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదే కారు కొంటే వచ్చే లాభాలు ఏమిటి.. వచ్చే ఏడాది కొంటే వచ్చే నష్టాలు ఏమిటనే వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం.

జనవరి నుంచి పెరగనున్న ధరలు

భారతదేశంలోని చాలా దిగ్గజ కంపెనీలు 2025 జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు ఇప్పటికే ప్రకటించేసాయి. ఈ జాబితాలో మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా, హ్యుందాయ్ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు మహీంద్రా అండ్ మహీంద్రా మొదలైన కంపెనీలు ఉన్నాయి.

కార్ల తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం మాత్రమే కాకుండా.. దిగుమతి సుంకాలు భారీగా పెరగడం, సరఫరాలో కలుగుతున్న అంతరాయాలు వంటివన్నీ కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి రాయిటర్స్ తన నివేదికలో స్పష్టం చేసింది.

దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki).. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే తన కార్ల ధరలను 4 శాతం వరకు పెంచనుంది. జేఎస్‌డబ్ల్యు మరియు ఎంజీ మోటార్ (JSW MG Motor) కంపెనీల మధ్య ఈ మధ్య కాలంలోనే జాయింట్ వెంచర్ ఏర్పడింది. ఈ సంస్థ కూడా తమ ఉత్పత్తుల ధరలపై 3 శాతం పెరుగుదలను ప్రకటించాయి.

భారతదేశంలోని రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motor) కంపెనీ కూడా తన ఉత్పత్తులపైన ఏకంగా రూ. 25000 పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త ధరలు 2025 జనవరి 1 నుంచే అమలులోకి వస్తున్నాయి. అంటే ఈ కార్ల ధరలు జనవరి ఒకటి నుంచి పెరగనున్నాయి. కొత్త ధరలు అప్పటి నుంచే అమలులోకి రానున్నాయి.

ఆటో పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు

ద్రవ్యోల్బణం మాత్రమే కాకుండా.. పెరుగుతున్న గ్లోబల్ కమోడిటీ ధరలు, లాజిస్టికల్ సవాళ్లు అన్నీ కూడా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ కారణాల వల్లనే కార్ల ధరలు పెరుగుతున్నాయి. ధరల పెరుగుదల కార్ల అమ్మకాల మీద కూడా కొంత ప్రభావాన్ని చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిని కూడా ఆటోమొబైల్ కంపెనీలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

భారతదేశంలో 42 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్న దిగ్గజ కంపెనీ మారుతి సుజుకి.. 2023 జనవరిలో 0.45 శాతం ధరల పెరుగుదలను అమలు చేసింది. అయినప్పటికీ.. ఈ ఏడాది అమ్మకాలు ఉత్తమాంగానే ఉన్నట్లు వెల్లడించింది. మార్కెట్ షేర్స్ కూడా గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. దీన్ని బట్టి చూస్తే.. ధరల పెరుగుదల అమ్మకాల మీద పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని తెలుస్తోంది.

దేశీయ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో 1 శాతం వాటాను కలిగి ఉన్న జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ సంస్థ కూడా నాణ్యమైన ఉత్పత్తులును తీసుకురావడానికి ధరల సవరణ లేదా పెంపు అవసరమని స్పష్టం చేసింది. అంతే కాకుండా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను భర్తీ చేయడానికి కొంత ధరల పెరుగుదల అనివార్యమని జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ‘సతీందర్ సింగ్ బజ్వా’ పేర్కొన్నారు.

ఇతర దిగ్గజ సంస్థల ధరల పెంపు

మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు ఎంజీ మోటార్ కంపెనీలు మాత్రమే కాకుండా.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎస్‌యూవీల ధరలను మాత్రమే కాకుండా కమర్షియల్ వాహనాల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. అదనపు ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read: కాలగర్భంలో కలిసిపోయినా.. ఈ కార్ల కోసం గూగుల్‌లో వెతికేస్తున్నారు!

ఇదే వరుసలో లగ్జరీ కార్ల తయారీ సంస్థలు

దేశీయ దిగ్గజ కంపెనీలు మాత్రమే కాకుండా.. జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటివన్నీ కూడా 2025 ప్రారంభం నుంచే తమ కార్ల ధరలను పెంచడానికి సిద్ధమయ్యాయి. మొత్తం మీద జనవరి 1 నుంచే దాదాపు అన్ని కంపెనీల కార్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 31 లోపల కొత్త కార్లను కొనుగోలు చేసేవారు కొంత తక్కు డబ్బు వెచ్చించి.. కార్లను కొనుగోలు చేయవచ్చు. అదే వచ్చే నెలలో కొనుగోలు చేయాలనుకునే వారు కొత్త కారు కొనుగోలు చేయాలంటే కొంత ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే.

రోల్స్‌ రాయిస్‌ కార్లకు క్రాష్‌ టెస్టే ఉండదు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0

Why Rolls Royce Cars Are Not Crash Tested: మార్కెట్లో దొరికే ఏ వస్తువుకైనా.. వారంటీ లేదా గ్యారంటీ వంటి వాటి గురించి ఆరా తీస్తాం. ఎందుకంటే మనం కొనే వస్తువు యొక్క నాణ్యత దీని ద్వారా తెలుస్తుంది. అంటే ఆ వస్తువు మన్నికను ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇతర వస్తువుల విషయాన్ని పక్కన పెడితే.. కారు కొనుగోలు చేయాలంటే? డిజైన్, ఫీచర్స్, ఇంజిన్ పర్ఫామెన్స్, సేఫ్టీ ఫీచర్స్ వంటి వాటితో పాటు సేఫ్టీ రేటింగ్ వంటి వాటిని గురించి కూడా ఆరా తీస్తాము.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని కార్లకు సేఫ్టీ రేటింగ్ నిర్దారించబడి ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లోబల్ ఎన్‌సీఏపీ (GNCAP), మనదేశంలో అయితే భారత్ ఎన్‌సీఏపీ వంటివి క్రాష్ టెస్ట్ చేసి రేటింగ్ ఇస్తాయి. కానీ రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేసే కార్లకు ఎవరూ క్రాష్ టెస్ట్ చేయరు. బహుశా ఈ విషయం చాలా తక్కువమందికే తెలిసి ఉండొచ్చు. దీని గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

అన్ని కార్లూ ఒకేలా ఉండవు

రోల్స్ రాయిస్ పేరు అందరికీ తెలుసు. ఈ కారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు చేస్తుందని తెలుసు. కానీ క్రాష్ టెస్ట్ ఎందుకు చేయరో తెలుసా? అక్కడికే వచ్చేస్తున్నా.. రోల్స్ రాయిస్ కంపెనీ తయారు చేసే కార్లు చాలా ఖరీదైనవి. అంతే కాదు.. ఈ కంపెనీ తయారు చేసే అన్ని కార్లూ ఒకేవిధంగా ఉండవు.

ప్రస్తుతం మార్కెట్లో కార్లను విక్రయిస్తున్న కంపెనీలు ఒక మోడల్‌ను లక్షల సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తుంది. ఒక బ్రాండ్ ఒకే మాదిరిగా ఉన్న కార్లను అనేకం తయారు చేస్తుంది, కాబట్టి ఆ కంపెనీ కార్లను క్రాష్ టెస్ట్ చేయవచ్చు. కానీ రోల్స్ రాయిస్ కంపెనీ.. ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ తీసుకున్న తరువాత, ఆ వ్యక్తి అభిరుచికి తగిన విధంగా తయారు చేస్తుంది. అంటే ఒక కారు ఉన్నట్లు.. మరో కారు ఉండదు.

ఎందుకు క్రాష్ టెస్ట్ చేయరంటే?

ఒక కారు ఉన్నట్లు, మరో కారు ఉండదు కాబట్టి.. ప్రతి కారును క్రాష్ టెస్ట్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. సాధారణంగా రోల్స్ రాయిస్ కార్లను ఉపయోగించేవారిలో.. ధనవంతులు, సెలబ్రిటీలు లేదా ఇతర ప్రముఖులు మాత్రమే ఉంటారు. కాబట్టి వారికి భద్రత అందించడం కూడా కంపెనీ బాధ్యత. దీనిని దృష్టిలో ఉంచుకుని రోల్స్ రాయిస్ తన కార్లలో కట్టుదిట్టమైన సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. కాబట్టి వీటిని ప్రత్యేకంగా క్రాష్ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.

ఒక కంపెనీ ఏడాదికి లక్ష కార్లను మార్కెట్లో విక్రయిస్తే.. రోల్స్ రాయిస్ మాత్రం పదుల సంఖ్యలోనే కార్లను విక్రయిస్తుంది. కంపెనీ ఉత్పత్తి కూడా తక్కువ కాబట్టి.. వీటిని పగడ్బందీగా రూపొందిస్తుంది. కారులో ఉపయోగించే ప్రతి మెటీరియర్ చాలా నాణ్యత కలిగినదై ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. రోల్స్ రాయిస్ కార్లను ఇప్పటి వరకు క్రాష్ టెస్ట్ చేయకపోయినా.. దీని సేఫ్టీ ఫీచర్స్ గురించి ఒక్క ఫిర్యాదు కూడా ఎవరూ.. ఎప్పుడూ చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. రోల్స్ రాయిస్ కార్లు చాలా పటిష్టమైనవని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

క్రాష్ టెస్ట్ చేయాలంటే?

ఒక బ్రాండ్ కారుకు క్రాష్ టెస్ట్ చేయాలంటే.. కనీసం నాలుగు కార్లైనా అవసరం. ఎందుకంటే క్రాష్ టెస్ట్ అనేది పలు విధాలుగా చేయడం జరుగుతుంది. ముందు నుంచి టెస్ట్ చేయడం, వెనుక నుంచి, పై నుంచి కిందకు వేయడం మరియు పాదచారులకు సంబంధించి.. ఇలా పలువిధాలుగా క్రాష్ టెస్ట్ చేస్తారు.

Also Read: ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

ఒక్కో టెస్ట్ చేయాలంటే.. ఒక్కో కారును ఉపయోగించాల్సి ఉంటుంది. ఒక సారి క్రాష్ టెస్టుకు గురైన కారు మళ్ళీ పనికిరాదు. కాబట్టి ఇతర కంపెనీలు ఎక్కువ కార్లను తయారు చేసినప్పుడు ఈ విధంగా క్రాష్ టెస్ట్ చేయడం సాధ్యమవుతుంది. అయితే ఈ విధంగా రోల్స్ రాయిస్ కార్లను క్రాష్ టెస్టుకు గురు చేయాలంటే సాధ్యమయ్యే పనేనా? అస్సలు సాధ్యం కాదు.

మొత్తం రోల్స్ రాయిస్ కార్లు

రోల్స్ రాయిస్ కంపెనీ ఇప్పటి వరకు ఫాంటమ్ VII, ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే, ఫాంటమ్ కూపే, ఘోస్ట్, వ్రైత్, డాన్, స్వెప్‌టైల్, ఫాంటమ్ VIII, కల్లినన్, బోట్ టెయిల్, స్పెక్టర్ మరియు డ్రాప్‌టెయిల్ అనే కార్లను తయారు చేసింది. ఇందులో అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ డ్రాప్‌టెయిల్ (సుమారు రూ. 250 కోట్లు) కాగా.. స్పెక్టర్ (రూ.7.50 కోట్లు) అనేది ఎలక్ట్రిక్ కారు.

300కిమీ మైలేజ్ ఇచ్చే బైకుపై రూ.10000 డిస్కౌంట్స్: ఇప్పుడు కొనేద్దాం పదండి

0

Bajaj Freedom 125 CNG Gets Rs 10000 Price Cut: ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) దేశీయ మార్కెట్లో ఫ్రీడమ్ సీఎన్‌జీ (Freedom CNG) బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కంపెనీ ఈ బైకును మార్కెట్లో లాంచ్ చేసి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అప్పుడే అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు బజాజ్ సీఎన్‌జీ బైక్ కొంటే.. ఎంత డిస్కౌంట్ లభిస్తుంది? ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గరిష్టంగా రూ.10,000 డిస్కౌంట్

బజాజ్ కంపెనీ తన ఫ్రీడమ్ సీఎన్‌జీ ధరను గరిష్టంగా రూ. 10,000 తగ్గించింది. బేస్ వేరియంట్ డ్రమ్ వేరియంట్ కొనుగోలుపై రూ. 5,000, మిడ్ స్పెక్ వేరియంట్ కొనుగోలుపై రూ. 10,000 తగ్గింపు పొందవచ్చు. అయితే టాప్ వేరియంట్ కొనుగోలుపైన ఎటువంటి డిస్కౌంట్ అందుబాటులో లేదు. తప్పకుండా కొనుగోలుదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

కొత్త ధరలు

కంపెనీ అందించే డిస్కౌంట్స్ తరువాత బజాజ్ సీఎన్‌జీ బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 89997, మిడ్ స్పెక్ వేరియంట్ ధర రూ. 95002 మరియు టాప్ వేరియంట్ లేదా డిస్క్ ఎల్ఈడీ వేరియంట్ ధర రూ. 1.10 లక్షలు (ఈ ధరలో ఎటువంటి మార్పు లేదు) అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ.

బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ అనేది ప్రపంచ మార్కెట్లోనే.. మొట్ట మెదటి సీఎన్‌జీ బైక్. ఈ బైక్ రాక ముందు సీఎన్‌జీతో నడిచే వాహనాలుగా ఆటోలు, కార్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఈ జాబితాలోకి బజాజ్ బైక్ కూడా చేరింది. ఈ బైక్ పెట్రోల్ మరియు సీఎన్‌జీతో నడుస్తుంది. దీనికోసం ఇందులో రెండు ఫ్యూయెల్ ట్యాంక్స్ ఉంటాయి. ఒకటి సీఎన్‌జీ ట్యాంక్ (2 కేజీల సీఎన్‌జీ కెపాసిటీ), మరొకటి పెట్రోల్ ట్యాంక్ (2 లీటర్ల కెపాసిటీ).

ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ రెండు లీటర్ల సీఎన్‌జీతో 200 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. పెట్రోల్‌తో 100 కంటే ఎక్కువ కిమీ రేంజ్ అందిస్తుంది. అంటే మొత్తం మీద బజాజ్ సీఎన్‌జీ 300 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుంది. ఈ బైకులోని 125 సీసీ ఇంజిన్ 9.7 న్యూటన్ మీటర్ టార్క్ మరియు 9.4 Bhp పవర్ అందిస్తుంది.

చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. బజాజ్ సీఎన్‌జీ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి. ఇది దేశీయ మార్కెట్లో ప్రస్తుతం వివిధ ప్రధాన నగరాల్లో విక్రయానికి అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఈ బైక్ ఇప్పటికే ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయింది.

రెండు నెలల్లో 5000 మంది కొన్నారు

బజాజ్ సీఎన్‌జీ బైక్ ఇప్పటికే మంచి అమ్మకాలను పొందింది. భారతదేశంలో ప్రారంభమైన కేవలం 2 నెలల్లో (60 రోజుల్లో) 5,000 కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేశారు. ప్రారంభంలో మహారాష్ట్రలో మాత్రమే సేల్స్ మొదలయ్యాయి. ఆ తరువాత దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరించింది.

నిజానికి బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ అనేది మార్కెట్లో సరికొత్త వాహనం. ఎందుకంటే అప్పటి వరకు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ బైకులు మాత్రమే ఉండేవి. వీటిని ఉపయోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపే ప్రజలు.. ఒక్కసారిగా ఈ సీఎన్‌జీ బైకుల కొనుగోలుకు తక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా దేశంలో పెట్రోల్ బంకులు ఉన్నంత ఎక్కువగా.. సీఎన్‌జీ స్టేషన్స్ లేదు. ఇది కూడా అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం.

సీఎన్‌జీ బైక్ సేల్స్ పెరగాలంటే..

ఇప్పటికి మార్కెట్లో కేవలం ఒక్క సీఎన్‌జీ బైక్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే టీవీఎస్ కంపెనీ కూడా సీఎన్‌జీ బైకును లాంచ్ చేయడానికి యోచిస్తున్నట్లు సమాచారం. ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అంతే కాకూండా బజాజ్ ఆటో 2025లో సరసమైన మరో సీఎన్‌జీ బైక్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ద్విచక్ర వాహన తయారీ సంస్థలన్నీ కూడా సీఎన్‌జీ బైకులను లాంచ్ చేయడం మొదలుపెడితే.. సీఎన్‌జీ స్టేషన్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో సీఎన్‌జీ బైక్ వినియోగించేవారి సంఖ్య కూడా పెరుగుతుంది.

ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

0

Sara Tendulkar Car Collection: సచిన్ టెండూల్కర్ గురించి తెలిసిన అందరికీ.. సారా టెండూల్కర్ గురించి తెలిసే ఉంటుంది. లండల్లో చదువుకున్న సారా ఇటీవల కొత్త బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయాన్ని సచిన్ అధికారికంగా వెల్లడించారు.

టీమిండియా క్రికెటర్ సచిన్ గారాలపట్టి సారా టెండూల్కర్.. లండన్‌లో చదువుకున్నప్పటికీ ఇటీవల ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ (STF) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. వైద్య రంగంకు అనుభవం ఉన్న సారా.. ఈ ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా పేద, దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అత్యుత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పిస్తోంది. వారికి మెరుగైన విద్యాప్రమాణాలను అందించడానికి కృషి చేస్తోంది.

ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ (STF Foundation)

చదువుతో పాటు.. క్రీడారంగంలో నిపుణులుగా తీర్చిదిద్దడమే ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ముఖ్యమైన ఉద్దేశ్యం. ఇప్పుడు ఈ ఫౌండేషన్ బాధ్యతలను సారా టెండూల్కర్ తీసుకున్నారు. ఈ ఫౌండేషన్‌లో యువ ఇండియా, హై 5 యూత్ ఫౌండేషన్, ఐఎన్‌జీఏ, ముకుందా హాస్పటల్స్, మన్‌దేశి ఛాంపియన్, బేసిక్ హెల్త్‌కేర్ సర్వీసెస్, ఏకం ఫౌండేషన్, పరివార్, విద్యా వికాస్ యోజన, శ్రీజ మరియు ది సొసైటీ ఫర్ ద రీహాబిలిటేషన్ ఆఫ్ క్రిపల్ట్ వంటి స్వచ్చంద సంస్థలు ఇందులో భాగస్వామిగా ఉన్నాయి.

ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా హెల్త్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. పేద పిల్లల కోసం ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద పిల్లల ప్రతిభను వెలికి తీయడానికి ఎస్‌టీఎఫ్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు.

సారా టెండూల్కర్ కార్లు (Sara Tendulkar Cars)

తండ్రి బాటలోనే సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి కంకణం కట్టుకున్న సారా టెండూల్కర్ ఖరీదైన కార్లను కూడా ఉపయోగిస్తుంది. సారా ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఐ8 (BMW i8), బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6) మొదలైనవి ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఐ8

భారతదేశంలోని అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లలో ఐ8 కూడా ఒకటి. ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 2.62 కోట్లు (ఎక్స్ షోరూమ్). చూడటానికి చాలా అద్భుతంగా ఉన్న ఈ కారు 1499 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 357 Bhp పవర్ మరియు 570 Nm టార్క్ అందిస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం కలిగిన ఈ కారు అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ బీఎండబ్ల్యూ ఐ8 (BMW i8) అత్యుత్తమ ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎం6

రూ. 1.75 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన బీఎండబ్ల్యూ ఎం6 (BMW M6) కారు కూడా సారా టెండూల్కట్ ఉపయోగిస్తుందని సమాచారం. ఇది 4395 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా.. 560 Bhp పవర్ మరియు 680 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.

Also Read: పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

నిజానికి ఈ కార్లను సారా టెండూల్కర్ కొనుగోలు చేసిందా? లేక.. తన తండ్రి కార్లను ఉపయోగిస్తోందా? అనే విషయం మీద స్పష్టత లేదు. ఎందుకంటే సచిన్ గ్యారేజిలో లెక్కకు మించిన లగ్జరీ కార్లు ఉన్నాయి. అంతే కాకుండా సచిన్ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నారు. ఈ కారణంగానే వీరి గ్యారేజిలో చాలా బీఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్ గ్యారేజిలోని కార్లు (Sachin Tendulkar Car Collection)

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ సీ36 ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం5 30జహ్రే, బీఎండబ్ల్యూ ఎక్స్5ఎం, బీఎండబ్ల్యూ ఎం6 గ్రాన్ కూపే, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్ఐ, ఫెరారీ 360 మోడెన, నిస్సాన్ జీటీఆర్ మరియు లంబోర్ఘిని ఉరుస్ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ సచిన్ మొట్ట మొదటి కారు మారుతి సుజుకి 800 (Maruti Suzuki 800) అని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. ఫియట్ కారు కూడా సచిన్ గ్యారేజిలో ఉన్నట్లు సమాచారం.

పెళ్లి చేసుకోబోతున్న పీవీ సింధు – ఈమె ఎలాంటి కార్లు ఉపయోగిస్తుందో తెలుసా?

0

PV Sindhu Cars And Married Details: పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు).. క్రీడారంగంలో ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే 2016లో జరిగిన రియో ఒలంపిక్ క్రీడల్లో రజత పతాకాన్ని సాధించింది. ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి భారతీయ మహిళగా సింధు ఓ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ తరువాత 2020 టోక్యోలో జరిగి ఒలంపిక్ క్రీడల్లో కూడా ఈమె కాంస్య పతకం సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని సింధు తండ్రి రమణ అధికారికంగా వెల్లడించారు.

సింధు పెళ్లి

పీవీ సింధు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి.. హైదరాబాద్‌కు చెందిన వెంకటదత్త సాయి అని తెలుస్తోంది. ఈయన పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇరు కుటుంబాలకు చాలా కాలం పరిచయం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 22న (డిసెంబర్ 22) వీరి పెళ్లి ఉద‌య్‌పూర్‌లో జరుగుతుంది. ఆ తరువాత 24వ తేదీ హైదరాబాద్‌లోనే రిసెప్షన్ జరగనుంది.

కేవలం క్రీడాకారిణిగానే తెలిసిన చాలామందికి సింధు ఖరీదైన కార్లను ఉపయోగిస్తుందని.. బహుశా తెలిసుండకపోవచ్చు. ఈమె ఉపయోగించే కార్ల జాబితాలో బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 320డీ మరియు మహీంద్రా థార్ వంటి కార్లు ఉన్నాయి.

బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5)

ఎక్కువమంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఎక్కువగా ఇష్టపడే కార్ బ్రాండ్లలో బీఎండబ్ల్యూ ఒకటి. ఈ కంపెనీకి చెందిన ఎక్స్5 కారు సింధు గ్యారేజిలో ఉంది. దీనిని నటుడు అక్కినేని నాగార్జున ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 75 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారును సునీల్ శెట్టి, సచిన్ టెండూల్కర్, కత్రినా కైఫ్ వంటి సెలబ్రిటీలు కూడా కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు.

పీవీ సింధు ఉపయోగించే ఈ బీఎండబ్ల్యూ ఎక్స్5 అద్భుతమైన డిజైన్ కలిగి.. అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ మరియు 3.0 లీటర్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. అయితే పీవీ సింధు ఉపయోగించే కారు ఏ ఇంజిన్ ఆప్షన్ కలిగి ఉందనేది వెల్లడికాలేదు. ఈ కారు ప్రయాణికుల భద్రతకు కావలసిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది.

బీఎండబ్ల్యూ 320డీ (BMW 320D)

పీవీ సింధు ఉపయోగించే కార్లలో మరో బీఎండబ్ల్యూ కారు 320డీ. ఈ కారు ధర రూ. 50 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. దీనిని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒలంపిక్స్ క్రీడలలో మెడల్ సాధించినందుకు సచిన్ ఈ కారును గిఫ్ట్ ఇచ్చారు. ఈ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కృతి సనన్ కూడా ఒకరు. ఇప్పటికే ఈమె ఈ కారును రోజువారీ వినియోగం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి ఎక్కువమంది ప్రముఖులు ఇష్టపడే కార్లలో బీఎండబ్ల్యూ ఒకటి. మంచి డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా.. ఇవి మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. అంతే కాకుండా ఇది అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతాయి. ఈ కారణంగానే చాలామంది ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు.

Also Read: శ్రీవల్లి (రష్మిక) వాడే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే.. ఒక్కో కారు అంత రేటా?

మహీంద్రా థార్ (Mahindra Thar)

పీవీ సింధు ఉపయోగించే కార్లలో మరో కారు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్ కూడా ఒకటి. దీనిని దేశీయ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా అందించారు. భారతదేశంలో మహీంద్రా థార్ కారుకు అమితమైన ప్రజాదరణ ఉంది. ఇప్పటికే లక్షల మంది ఈ కారును కొనుగోలు చేశారు. అయితే సింధు క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచినందుకు ఆనంద్ మహీంద్రా థార్ కారును గిఫ్ట్ ఇచ్చారు.

మహీంద్రా థార్ రోజువారీ వినియోగానికి లేదా నగర ప్రయాణానికి మాత్రమే కాకుండా ఆఫ్-రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని కొనుగోలు చేస్తుంటారు. అద్భుతమైన పనితీరును అందించే మహీంద్రా థార్.. ధరలు రూ. 11.35 లక్షల నుంచి రూ. 17.60 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ప్రస్తుతం ఈ కారు 5 డోర్ రూపంలో (థార్ రోక్స్) కూడా అమ్మకానికి ఉంది. ఇది కూడా గొప్ప అమ్మకాలను పొందుతోంది.