36.7 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 14

కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు

1

Akkineni Nagarjuna New Car Lexus LM: ఓ వైపు పెద్ద కొడుకు (నాగ చైతన్య) పెళ్లి, మరో వైపు చిన్న కొడుకు (అఖిల్) నిశ్చితార్థం. కుటుంబం మొత్తం సంతోషంగా గడిపేస్తోంది. త్వరలో ఇద్దరు కోడళ్ళు ఇంట్లోకి అడుగు పెద్దబోతున్నారని నాగార్జున దంపతులు కూడా సంబరపడిపోతున్నారు. ఈ తరుణంలో కోడళ్ళకంటే ముందు మరో అతిథి అక్కినేని ఇంట చేరింది. ఇంతకీ ఎవ్వరికీ తెలియని ఆ అతిథి ఎవరు? అనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం.

నాగార్జున ఇంట చేరిన ఆ అతిథి ఎవరో కాదు.. లెక్సస్ కంపెనీకి చెందిన ఎల్ఎమ్ (Lexus LM) కారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కారు ధర రూ. 2.5 కోట్లు కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఈ కారుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింగ్ నాగార్జున.. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏ (RTA) కార్యాలకాయానికి వెళ్లారు. దీనికి TG9 GT/R4874 నెంబర్ తీసుకున్నట్లు సమాచారం. ఇది ఫ్యాన్సీ నెంబర్ కాదు కాబట్టి బహుశా దీనికి పెద్దగా ఖర్చు పెట్టలేదని తెలుస్తోంది.

సీటింగ్ ఆప్షన్స్

నిజానికి లెక్సస్ ఎల్ఎమ్ లిమోసిన్ కారు 7 సీటర్ మరియు 4 సీటర్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. 4 సీటర్ కారు ధర 7 సీటర్ కారు ధర కంటే తక్కువ. సాధారణంగా ఎక్కడైన 7 సీటర్ కారు ధర ఎక్కువగా ఉంటుంది, 4 సీటర్ ధర తక్కువగా ఉంటుంది. కానీ లెక్సస్ విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉంటుంది.

డిజైన్

లెక్సస్ ఎల్ఎం అనేది టయోటా వెల్‍ఫైర్ మాదిరిగా జీఏ-కే మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కారు ముందు భాగంలో స్పిండిల్ గ్రిల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫాగ్‌లాంప్ కోసం వర్టికల్ హోసింగ్ మరియు వెనుక వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్ వంటివి ఉన్నాయి. వెనుక భాగంలో బ్రాండ్ లోగోను బదులుగా లెక్సస్ అనే అక్షరాలను చూడవచ్చు. వెనుక డోరు స్లైడింగ్ సెటప్ పొందుతుంది.

ఫీచర్స్

విశాలమైన క్యాబిన్ కలిగిన లెక్సస్ ఎల్ఎమ్ కారు 5130 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు, 1945 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. 4 సీట్ వెర్షన్‌లో ముందు మరియు వెనుక ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌ల మధ్య విభజన ఉంటుంది. ఎయిర్‌లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్లు, 48 ఇంచెస్ టీవీ, 23 స్పీకర్ సరౌండ్ ఆడియో సిస్టం, పిల్లో స్టైల్ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి.

Also Read: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!

ఫోల్డ్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లు, మల్టిపుల్ యూఎస్‌బీ పోర్ట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్స్, రీడింగ్ లైట్స్, ఫ్రిడ్జ్, రియర్ గ్లోవ్ బాక్స్, యాక్టివ్ నాయిస్ కంట్రోల్ మరియు డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ మరియు ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ లెక్సస్ ఎల్ఎమ్ కారులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా భద్రతను నిర్థారిస్తాయి.

ఇంజిన్ వివరాలు

లెక్సస్ ఎల్ఎం అనేది 2.5 లీటర్ 4 సిలిండర్ సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 250 హార్స్ పవర్ మరియు 239 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఈసీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇంజిన్ నికెల్ మెటల్ హైబ్రిడ్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం పొందుతుంది. కాబట్టి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది.

ఇప్పటికే ఈ కారు కొన్న సెలబ్రిటీలు

నాగార్జున 7 సీటర్ కారును కొన్నారా? లేక 4 సీటర్ కారును కొన్నారా అనేది వెల్లడి కాలేదు. అయితే ఇప్పటికే ఈ ఖరీదైన కారును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజయ్ కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో లెక్సస్ ఎల్ఎమ్ కూడా ఒకటిగా మారినట్లు తెలుస్తోంది.

నాగార్జున కార్ కలెక్షన్

కార్లంటే ఎక్కువ ఇష్టపడే సెలబ్రిటీలతో నాగార్జున కూడా ఒకరు. ఇప్పటికే కింగ్ నాగ్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ7, బీఎండబ్ల్యూ ఎం6, టయోటా వెల్‌ఫైర్, నిస్సాన్ జీటీ ఆర్, రేంజ్ రోవర్ వోగ్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఎస్450, కియా ఈవీ6 వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా లెక్సస్ ఎల్ఎమ్ కారు చేరింది.

రూ.1.5 కోట్ల కారు కొన్న అలనాటి తార.. ఫోటోలు చూశారా?

0

Karishma Kapoor Mercedes Benz: సినీ ప్రపంచంలో ‘కరిష్మా కపూర్’ గురించి తెలియని వారు ఉండరు. ఈమె ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన ఆ లగ్జరీ కారు ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన జర్మన్ బ్రాండ్ లగ్జరీ కారు పేరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450. దీని ధర రూ. 1.5 కోట్లు. ఈ కారును ఉపయోగించడానికంటే ముందు ఈమె ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారులో తిరుగుతూ కనిపించేది. ఇప్పుడు బెంజ్ కారును కొనుగోలు చేయడంతో ఈ కారులో కనిపించింది.

కొత్తగా కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ కారుకు కూడా.. కరిష్మా కపూర్ ల్యాండ్ రోవర్ కారుకు మాదిరిగానే, అదే 7774 వీఐపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి ఉండటం చూడవచ్చు. అంటే ఈమె తన బెంజ్ కారు కోసం కూడా ఈ వీఐపీ నెంబర్ కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. అంతే కాకుండా ఇది ఆమె లక్కీ నెంబర్ అని కూడా అర్థమవుతోంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్

నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన బెంజ్ కారు పోలార్ వైట్ కలర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అత్యాధునిక డిజైన్ కలిగిన ఈ కారు.. ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. కాబట్టి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేశారు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ (Mercedes Benz GLE 450 4MATIC) కారు ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, అదే పరిమాణంలో ఉండే ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు మరియు పనోరమిక్ సన్‌రూఫ్, హ్యాండ్ ఫ్రీ పార్కింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, లెదర్ ర్యాప్డ్ సీట్లు, మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

Also Read: టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

నటి కరిష్మా కపూర్ బెంజ్ జీఎల్ఈ 450 4మ్యాటిక్ యొక్క టాప్ వేరియంట్ కొనుగోలు చేసినట్లు సమాచారం. కాబట్టి ఇది 3.0 లీటర్ టర్బో వీ6 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 365 పీఎస్ పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ కూడా పొందుతుంది. ఇది 245 పీఎస్ పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్స్ మంచి పనితీరును అందిస్తాయని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కార్లను కలిగిన సెలబ్రిటీలు

నటి కరిష్మా కపూర్ మాత్రమే కాకుండా.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కారును కొనుగోలు చేశారు. ఈ జాబితాలో టెలివిజన్ నటి మోనా సింగ్, బాలీవుడ్ స్టార్ ఫాతిమా సనా షేక్, సాయి తమ్‌హంకర్, రిచా చద్దా, బోమన్ ఇరానీ మరియు సోహా అలీ ఖాన్ మొదలైనవారు ఉన్నారు.

సినీతారలు లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి కారణం

నిజానికి లగ్జరీ కార్లంటే ఎవ్వరికైనా ఇష్టమే. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉండటం వల్ల సెలబ్రిటీలు మాత్రమే ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా లగ్జరీ కార్లు వ్యక్తి యొక్క స్టేటస్ తెలియజేస్తాయి. ఈ కారణంగానే పలువురు సినీ ప్రముఖులు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే కొంత తక్కువ ధరలో లభించే కార్లను కొనుగోలు చేసి రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారన్న సంగతి మరచిపోకూడదు. సింపుల్ లైఫ్ గడపడంలో భాగంగానే డబ్బు ఉన్నప్పటికీ.. వాహనాలు కోసం వీరు ఎక్కువ డబ్బు వెచ్చించరు.

ఒకేసారి రెండు ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ చేసిన మహీంద్రా: సరికొత్త డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

0

Mahindra BE 6e And XEV 9e Launched: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ ఎలక్ట్రిక్ వాహన విభాగంలో కూడా తన హవా నిరూపించుకోవడానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ రోజు ‘బీఈ 6ఈ’ (BE 6e) కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 18.90 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

బీఈ 6ఈ డెలివరీలు ఎప్పుడంటే..

మహీంద్రా లాంచ్ చేసిన బీఈ 6ఈ ప్రొడక్షన్ మోడల్.. ఇది ఈ మోడల్ యొక్క మొదటి కారు. కంపెనీ త్వరలోనే దీని ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. డెలివరీలు 2025 మార్చి నాటికి ప్రారంభమవుతాయి. అయితే.. ఈ కారు చూడటానికి ఇప్పటికి మార్కెట్లో ఉన్న ఇతర మహీంద్రా కార్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది.

కొత్త డిజైన్..

బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు జే-షేప్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లాంప్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ మరియు ఫ్రంట్ ఫాసియాపైన హెడ్‌ల్యాంప్‌ల మధ్య ఫ్లోటింగ్ ఏరోడైనమిక్ ప్యానెల్ వంటివి పొందుతుంది. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు చూడవచ్చు. యాంగ్యులర్ రేక్డ్ రియర్ విండ్‌స్క్రీన్ వెనుక భాగంలో ఉన్నాయి. అంతే కాకుండా వెనుకవైపు సీ-షేప్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, స్ప్లిట్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్ వంటివి ఉన్నాయి. ఇంకా బ్రాండ్ లోగో, బీఈ 6ఈ బ్యాడ్జ్ వంటివి కూడా ఇక్కడ చూడవచ్చు.

ఫీచర్స్ & ఇంటీరియర్ డిజైన్

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా ఓ కొత్త అనుభూతిని పొందవచ్చు. ఎయిర్‌క్రాప్ట్ కాక్‌పిట్ క్యాబిన్‌కు మంచి ఆకర్షణను అందిస్తుంది. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంట్రల్ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మరియు పనోరమిక్ డిస్‌ప్లే వంటివి కూడా ఇందులో చూడవచ్చు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్ మీద ప్రకాశవంతమైన బీఈ లోగోను కూడా చూడవచ్చు. రియర్ వ్యూ మిర్రర్ సమీపంలో ఓవర్‌హెడ్ స్విచ్‌లు ఉన్నాయి.

ఫీచర్స్ గురించి మాట్లాడితే.. హెడ్ ఆఫ్ డిస్‌ప్లే, పనోరమిక్ గ్లాస్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ, డాల్ఫీ అట్మోస్‌తో కూడిన 16 స్పీకర్ హర్మాన్ కార్టాన్ ఆడియో సిస్టం మరియు లెవెల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS)వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్

మహీంద్రా బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ పొందుతుంది. ఒకటి 59 కిలోవాట్ బ్యాటరీ, మరొకటి 79 కిలోవాట్ బ్యాటరీ. 59 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ 228 హార్స్ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 450 కిమీ నుంచి 500 కిమీ రేంజ్ అందిస్తుంది.

79 కిలోవాట్ బ్యాటరీ విషయానికి వస్తే.. ఇది 281 హార్స్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జీతో 682 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ రెండు వేరియంట్లు మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతాయి. అవి రేస్, రేంజ్ మరియు ఎవ్రిడే. కాబట్టి ఇవి అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ (Mahindra XEV 9e)

కంపెనీ లాంచ్ చేసిన మరో ఎలక్ట్రిక్ కారు ‘ఎక్స్ఈవీ 9ఈ’ (XEV 9e). కంపెనీ ఈ కారును ఐఎన్జీఎల్ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా నిర్మించింది. దీని ప్రారంభ ధర రూ. 21.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారును కంపెనీ 2025 మార్చిలోనే డెలివరీ చేసే అవకాశం ఉంది.

చూడటానికి కొత్తగా కనిపించే ఈ మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ.. ట్రై యాంగిల్ హెడ్‌ల్యాంప్, క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, విశాలంగా కనిపించే బోనెట్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్ వంటివి పొందుతుంది. వెనుక భాగంలో రూఫ్‌లైన్ క్రమంగా తగ్గడం చూడవచ్చు. ఇది విండ్‌షీల్డ్‌తో ముగుస్తుంది. టెయిల్ లాంప్ ముందు భాగంలోని డీఆర్ఎల్ మాదిరిగానే ఉంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ పరిమాణం విషయానికి వస్తే.. ఇది 4789 మీమీ పొడవు, 1907 మిమీ వెడల్పు, 1694 మిమీ ఎత్తు మరియు 2775 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. మొత్తం మీద ఇది బీఈ 6ఈ ఎలక్ట్రిక్ కారుకు సమానంగా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 207 మిమీ వద్ద బీఈ 6ఈ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బూట్ స్పేస్ 663 లీటర్లు.

ఎక్స్ఈవీ 9ఈ ఫీచర్స్

ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఈ కొత్త మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ కారులో ఉన్నాయి. వన్ టచ్ పార్కింగ్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ వంటి వాటితో పాటు.. మూడు స్క్రీన్‌లతో కూడిన వైడ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇందులో ఉన్నాయి. అంతే కాకుండా ఎంట్రీ ప్యాక్ వన్ డ్రైవ్ మోడ్స్, వన్ పెడల్ డ్రైవింగ్ ఫంక్షన్, సెమీ యాక్టివ్ సస్పెన్షన్, క్రూయిజ్ కంట్రోల్, డిస్క్ బ్రేక్స్ మరియు యాపిల్ కార్‌ప్లే, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్స్, రియర్ ఏసీ వెంట్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్ మరియు మల్టి స్టెప్ రిక్లైన్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఈ కారులో పొందవచ్చు.

బ్యాటరీ ఆప్షన్స్, రేంజ్ మరియు ఛార్జింగ్

ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు కూడా రెండు బ్యాటరీ ఆప్షన్స్ పొందుతుంది. అవి 59 కిలోవాట్ మరియు 79 కిలోవాట్ బ్యాటరీ. వీటి రేంజ్ కొడాఆ బీఈ 6ఈ మాదిరిగా ఉంటుంది. చిన్న బ్యాటరీ ఒక ఛార్జీతో 542 కిమీ రేంజ్ అందిస్తే.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 656 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంది.

మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ ఎలక్ట్రిక్ కారు 11 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్, 7.2 కేడబ్ల్యు ఏసీ ఛార్జర్ మరియు 175 కేడబ్ల్యు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 7.2 kW ఏసీ ఛార్జర్ ద్వారా 59 కిలోవాట్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 8.7 గంటలు అయితే.. 140 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. 11 kW ఛార్జర్ ద్వారా చార్ చేయడానికి 6 గంటల సమయం పడుతుంది.

Also Read: పుష్ప 2 విడుదలే కాలేదు.. అప్పుడే లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?

79 కిలోవాట్ బ్యాటరీని 11 kW ఛార్జర్ ద్వారా 8 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవచ్చు. అదే సమయంలో 7.2 Kw ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి పట్టే సమయం 11.7 గంటలు మాత్రమే. దీనిని 175 Kw డీసీ ఛార్జర్ ఉపయోగించి 20 నిమిషాల్లోనే 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం మీద మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన రెండు ఎలక్ట్రిక్ కార్లు.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ మరియు అత్యుత్తమ పనితీరును అందిస్తాయని స్పష్టంగా తెలుస్తోంది.

టాక్‌ ఆఫ్‌ ద టౌన్‌గా లేడీ అఘోరి.. ఆమె వాడే కారేంటో తెలుసా?

0

Lady Aghori Naga Sadhu Car Details: అఘోర అంటేనే.. అన్నీ త్యజించి జనసంచారానికి దూరంగా ఎక్కడో గుహల్లో, అడవుల్లో తపస్సు చేసుకుంటూ బతికేస్తారని చాలా వీడియోల్లో చెబుతుంటారు. అయితే ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగ సాధువుగా చెప్పుకుంటూ నగ్నంగా తిరుగుతున్న ఓ మహిళ మాత్రం తాను ప్రయాణించడానికి ఓ కారును ఉపయోగిస్తోంది. ఇంతకీ ఈమె ఉపయోగించే కారు పేరు ఏంటి? దాని వివరాలు ఏంటనేది ఇక్కడ తెలుసుకుందాం..

మహిళా అఘోరి నాగసాధు ఉపయీగిస్తున్న కారు హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఐ20 (Hyundai i20) అని తెలుస్తోంది. అయితే ఈ కారు సాధారణ కారు మాదిరిగా కాకుండా.. ముందు, వెనుక, సైడ్లలో ఎక్కడ చూసిన కొంత భయాన్ని కలిగించే దేవుని బొమ్మలతో నిండి ఉంది. కారులో లెక్కకు మించిన పుర్రెలు, రుద్రాక్షలు ఉన్నట్లు సమాచారం.

ఇక్కడ తెలుసుకోవకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. అఘోరి ఉపయోగిస్తున్న కారుకు రిజిస్ట్రేషన్ ప్లేట్ లేదు. ఆ ప్రదేశంలో అఘోరి నాగ సాధు అనే అక్షరాలు ఉన్నాయి. ఇది చట్ట రీత్యా నేరం. ఎందుకంటే ఎవ్వరైనా పబ్లిక్ రోడ్డుపై ప్రయాణించాలంటే వారి వాహనానికి నెంబర్ ప్లేట్ తప్పనిసరి. కానీ లేడీ అఘోరి నాగ సాధు కారుకు నెంబర్ ప్లేట్ లేదు. దీనిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

హ్యుందాయ్ ఐ20

ఇక హ్యుందాయ్ ఐ20 కారు విషయానికి వస్తే.. ఇది మార్కెట్లో అత్యధిక అమ్మకాలు పొందిన బ్రాండ్ యొక్క పాపులర్ కారు. ఈ కారు ప్రారంభ ధర రూ. 7.04 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి సింపుల్‌గా ఉన్నప్పటికీ.. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇప్పటి వరకు ఈ కారును సుమారు 18 లక్షల కంటే ఎక్కువ మంది కొనుగోలు చేశారు అని కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.

2008లో భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన హ్యుందాయ్ ఐ20.. కాలక్రమంలో అనేక అప్డేట్స్ పొందింది. ఇది 2023లో చివరిసారి అప్డేట్ పొందినట్లు సమాచారం. ఆరు ఎయిర్‌బ్యాగులు కలిగిన ఐ20 కారు 26 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా.. ఇందులో 60 కంటే ఎక్కువ బ్లూలింక్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇక లేడీ అఘోరీ నాగసాధు విషయానికి వస్తే.. ఈమె బట్టలు లేకుండా మేడలో రుద్రాక్ష మాలలు వేసుకుని, చేతిలో త్రిశూలం పట్టుకుని చాలా దేవాలయాలలోకి ప్రవేశిస్తుంది. దేవాలయాల్లో కూడా తనదైన శైలిలో పూజలు చేస్తుంది. కొంతమంది ఆమెను వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు ఇళ్లకు పిలిపించుకుని ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటున్నారు.

యూట్యూబ్ ఇంటర్వ్యూలలో..

అఘోరి నాగసాధు చాలా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలలో అనేక సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. మెదడును ఆహారంగా తింటానని, నెలసరి (ఋతుక్రమం) సమయంలో ఎవరికీ కనిపించకుండా ఉంటానని, ఇలా చాలా విషయాలను వెల్లడిస్తూ.. సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

కారును కూడా భయం కల్పించే విధంగా డిజైన్ చేసుకుని ఉండటం కూడా చూడవచ్చు. కాళీమాత బొమ్మలు, శివుని బొమ్మకు.. కారు ముందు భాగంలో పుర్రెలు.. అఘోరి అన్న పదానికి సరిగ్గా సూటయ్యే విధంగా కారును రెడీ చేసుకుంది. ఈమె ఎక్కడికెళ్లినా అక్కడ జనం తండోపతండాలుగా గుమికూడుతారు. దీనికి కారణం ఈమె విచిత్ర వేషధారణ అనే చెప్పాలి.

అఘోరి ఆత్మాహుతి..

కొంతమంది ఈ లేడీ అఘోరి నాగసాధుని దైవం భావిస్తే.. మరికొందరు ఈమెను వ్యతిరేకిస్తున్నారు. అఘోరాలు కంటికి కనిపించకుండా దైవధ్యానంలోనే ఉంటారని చెబుతూ.. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె ఆలా చేస్తుందని దూషిస్తున్నారు. మంగళగిరిలో కొంతమంది యువకులు ఆమెను నిలువరిస్తే, వారిపై రాళ్లతో దాటి చేయడమే కాకుండా.. త్రిశూలంతో కూడా వాళ్ళను భయపెట్టేసింది.

Also Read: పుష్ప 2 విడుదలే కాలేదు.. అప్పుడే లగ్జరీ కారు కొనేసింది: దీని రేటెంతో తెలుసా?

కొన్ని రోజులకు ముందు లేడీ అఘోరి ఆత్మాహుతి చేసుకోబోతున్నట్లు కూడా చెప్పి.. సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇలా ఎన్నో సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసి అందరిని భయభ్రాంతులను చేసింది. ఈమెకు వ్యతిరేఖంగా ఇంటర్వ్యూలు ఇచ్చినవారు కూడా చాలామందే తెరమీదకు వచ్చారు. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి నాగసాధు బాగా ఫేమస్ అయిపోయింది.

పుష్ప 2 విడుదలకు ముందే.. లగ్జరీ కారు కొనేసిన శ్రీలీల: దీని రేటెంతో తెలుసా?

0

Pushpa 2 Actor Sreeleela Buys New Range Rover: శ్రీలీల.. చిత్రసీమలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఆ తరువాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి మరియు గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున సినిమా పుష్ప-2లో ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే నటి శ్రీలీల ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర ఏకంగా రూ. 3 కోట్లు కావడం గమనార్హం. ఇటీవల ఈ కారుతో శ్రీలీల హైదరాబద్ విమానాశ్రయంలో కనిపించింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేద్దాం..

రేంజ్ రోవర్

నటి శ్రీలీల కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ‘రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ’ (Range Rover LWB) అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ కారు బోరాస్కో గ్రే కలర్ ఆప్షన్‌లో ఉంది. ఈ రంగు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటం గమనించవచ్చు.

రేంజ్ రోవర్ విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ కార్లను చేర్చారు. ఈ జాబితాలోకి ఇప్పుడు శ్రీలీల కూడా చేరింది. రేంజ్ రోవర్ ప్రారంభ ధరలు రూ. 2.36 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తోంది.

భారతదేశంలో అందుబాటులో ఉన్న రేంజ్ రోవర్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి పెట్రోల్, డీజిల్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్. పెట్రోల్ వెర్షన్ 3.0 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 510 బీహెచ్‌పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్స్ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి.

Also Read: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ డిపార్చర్ వార్ణింగ్, ఫార్వార్డ్ కొలీషియన్ బ్రేక్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ మరియు సీట్ బెల్ట్ వార్ణింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

శ్రీలీల గ్యారేజిలోని ఇతర కార్లు

నటి శ్రీలీల రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా.. హోండా సిటీ కారును కూడా కలిగి ఉంది. అంతకంటే ముందు ఈమె మారుతి ఎస్-ప్రెస్సో కారును ఉపయోగించేది. అయితే వీటన్నింటిలో కంటే.. ఇటీవల కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఖరీదు చాలా ఎక్కువ. మొత్తానికి ఈమె కోట్ల రూపాయల విలువైన కారును కొనుగోలు చేసేసింది.

రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్నా, శృతి హాసన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, మలైకా అరోరా, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అలియా భట్, పూజ హెగ్డే, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరియు పృద్విరాజ్ మొదలైన వారు ఉన్నారు.

శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న సినిమాలు & రెమ్యునరేషన్

ప్రస్తుతం నటి శ్రీలీల మాస్ జాతర, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కనిపించనుంది. ఇక పోతే డిసెంబర్ 4న తెరపైకి రానున్న పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే పాటకు చిందులేస్తూ కనిపించనుంది. శ్రీలీల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈమె ఒక సినిమాలో నటించడానికి సుమారు రూ. 2 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. అయితే పుష్ప సినిమాలో ఒక్క పాటకు మాత్రమే రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్స్: ఒకటి లాంచ్.. మరొకటి రివీల్

0

Royal Enfield New Bikes Goan Classic 350 And Scram 440: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో మరో బైక్ లాంచ్ చేసింది. ఇప్పటికే టూ వీలర్ విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ‘గోవాన్ క్లాసిక్ 350’ (Goan Classic 350) లాంచ్ చేసింది. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైకుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..

ధరలు (Price)

రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త గోవాన్ క్లాసిక్ 350.. బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్. ఇది రెట్రో డిజైన్ పొందుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభించనున్నట్లు సమాచారం. కాబట్టి బేస్ వేరియంట్ ధర రూ. 2.35 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 2.38 లక్షలు (ఎక్స్ షోరూమ్, చెన్నై). కంపెనీ ఈ బైకును 2024 మోటోవర్స్ రైడింగ్ ఫెస్టివల్‌ (2024 Motoverse Riding Festival)లో లాంచ్ చేసింది.

డిజైన్ (Design)

కొత్త గోవాన్ క్లాసిక్ 350 బైక్.. రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ పైలట్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి పొందుతుంది. ఇది పొడవైన హ్యాంగర్ హ్యాండిల్‌బార్ పొందుతుంది. పిలియన్ కోసం సీటును అమర్చుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. అయితే ఈ కొత్త బైక్ పర్పుల్ హేజ్, రేవ్ రెడ్, షాక్ బ్లాక్ మరియు ట్రిప్ టీల్ అనే కలర్ ఆప్షన్​లలో లభిస్తుంది.

ఫీచర్స్ (Features)

గోవాన్ క్లాసిక్ 350 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది డిజిటల్ అనలాగ్ కన్సోల్ పొందుతుంది3. ఇది స్పీడో మీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అయితే ట్రిప్పర్ నావిగేషన్ కోసం సెకండరీ డయల్స్ ఉంటాయి.

ఇంజిన్ (Engine)

రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్ 350 సీసీ విభాగంలో లాంచ్ అయిన బైక్. కాబట్టి ఇది 349 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 20.2 హార్స్ పవర్. 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. సుమారు 197 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు కావడం గమనార్హం.

జావా 42 బాబర్, జావా పెరాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాల్ క్లాసిక్ 350 బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయెల్ రియర్ స్ప్రింగ్ పొందుతుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగిన ఈ బైక్ యొక్క ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక 16 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. అయితే రెండు చివర్లలో డిస్క్ ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మీమీ వరకు ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 (Royal Enfield Scram 440)

కంపెనీ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్ చేయడంతో పాటు.. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఇది చూడటానికి దాని మునుపటి స్క్రామ్ 411 మాదిగిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్డేటెడ్ ఫీచర్లను చూడవచ్చు. ఈ బైకులో 443 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6500 rpm వద్ద 25.4 హార్స్ పవర్ మరియు 4000 rpm వద్ద 34 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

Also Read: భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

కంపెనీ ఆవిష్కరించిన ఈ బైక్ 2025 జనవలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడే దీని ధరలు కూడా వెల్లడవుతాయి. బహుశా ఈ బైక్ ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. టాప్ ఫోర్స్ మోడల్ అల్లాయ్ వీల్స్ కలిగి.. ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుంది. ట్రైల్ వెర్షన్ స్పోక్ వీల్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తుంది. డెలివరీలకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.

సల్మాన్ ఖాన్ తండ్రి మొదటి బైక్ ఇదే.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

0

Salman Khan Reveals His Dad First Bike: ప్రముఖ సినీ నటుడు ‘సల్మాన్ ఖాన్’ (Salman Khan) గురించి దాదాపు అందరికి తెలుసు. సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసు దోచిన ఈ సల్లూభాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో తన తండ్రి బైక్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో కనిపించే బైక్ ఏది? దాని వివరాలు ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

తండ్రితో మంచి అనుబందం కలిగి ఉన్న సల్మాన్ ఖాన్.. తన తండ్రితో తన ప్రేమ, జీవిత ప్రయాణానికి సంబంధించి ‘యాంగ్రీ యంగ్ మెన్’ అనే డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సల్మాన్ ఖాన్ తన తండ్రి మొదటి బైక్ ‘ట్రయంఫ్ టైగర్ 100’ (Triumph Tiger 100) ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది 1956 నాటి బైక్ అయినప్పటికీ.. మంచి కండీషన్‌లో ఉంది.

ట్రయంఫ్ టైగర్ 100

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను గమనిస్తే.. ఒక ఫొటోలో బైకు మీద సల్మాన్ ఖాన్ తండ్రి కూర్చుని ఉన్నారు. మరో ఫొటోలో సల్మాన్ ఖాన్ కూర్చుని ఉండటం చూడవచ్చు. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఫిదా చేసేస్తున్నాయి. లెక్కకు మించిన వీక్షణలు పొందిన ఈ ఫోటోలపై.. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో కూడా ట్రయంఫ్ కంపెనీ బైకులు ఉన్నాయి. కానీ ఈ బ్రాండ్ యొక్క టైగర్ 100 బైకులు ఉత్పత్తి దశలో లేదు. అయితే కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు వీటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడటానికి చాలా గంభీరంగా, శక్తివంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అడ్వెంచర్ బైకుగా కూడా పనికొస్తుంది.

ట్రయంఫ్ టైగర్ 100 బైక్ 1939 – 1940 మరియు 1946 – 1973 మధ్య బాగా ఫేమస్ అయ్యింది. కఠినమైన భూభాగాల్లో కూడా రైడ్ చేయడానికి టైగర్ 100 అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 100 మైల్స్ / గం. అప్పట్లో గొప్ప సక్సెస్ సాధించిన ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. అప్పట్లో ఈ బైక్ ధర రూ. 9,500 నుంచో రూ. 10,500 మధ్య ఉండేదని సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో ట్రయంఫ్ టైగర్ 100 బైక్ లేదు.. కానీ దీని స్థానంలో టైగర్ టీ100 వచ్చింది. ఈ బైక్ ఉత్పత్తి కూడా ప్రస్తుతం లేదు. ఎందుకంటే యుద్ధ సమయంలో జర్మన్లు ట్రయంఫ్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. అయితే టైగర్ 100 బైక్ రియర్ స్వింగ్ ఆర్మ్ సెటప్ పొందింది.

సల్మాన్ ఖాన్ కార్ అండ్ బైక్ కలెక్షన్స్

నటుడు సల్మాన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో 2023 రేంజ్ రోవర్ ఎస్‍వీ ఎల్‌డబ్ల్యుబీ 3.0 (రూ. 4.4 కోట్లు), బుల్లెట్ ఫ్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ (రూ. 2 కోట్లు), బుల్లెట్ ఫ్రూఫ్ ల్యాండ్ రోవర్ క్రూయిజర్ ఎల్‌సీ200 (రూ. 2.10 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ బయోగ్రఫీ (రూ. 1.82 కోట్లు), ఓల్డ్ జనరేషన్ రేంజ్ రోవర్ (రూ. 20 లక్షలు), ఆడి ఆర్ఎస్7 (రూ. 2.24 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ క్లాస్ (రూ. 77.68 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 43 ఏఎంజీ కూపే (రూ. 1.12 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ. 1.86 కోట్లు), బీఎండబ్ల్యూ ఎక్స్6 (రూ. 1.04 కోట్లు), లెక్సస్ ఎల్ఎక్స్ (రూ. 2.82 కోట్లు), సుజుకి ఇంట్రూడర్ ఎం1800ఆర్ (రూ. 15 లక్షలు) మరియు సుజుకి హయబుసా (రూ. 15.1 లక్షలు).

Also Read: భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

సల్మాన్ ఖాన్ పూర్తి పేరు ‘అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్’. ఈయన 1965 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. 1988లో బీవీ హో తో ఐసీ సినిమాతో సల్మాన్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత కాలంలో అనేక సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఈయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం కైవసం చేసుకుంది.

భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

0

Brixton Bikes Launched in India: ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో కూడా ఇదే వరుస కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో అగ్ర ఆటోమొబైల్ మార్కెట్ల సరసన చేసిన ఇండియాలో వాహనాలు విరివిగా లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ‘బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిల్స్’ (Brixton Motorcycle) దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే?.. ఈ కథనం చదివేయాల్సిందే..

బ్రిక్స్‌టన్ బైకులు

  • క్రాస్‌ఫైర్ 500ఎక్స్
  • క్రాస్‌ఫైర్ 500 ఎక్స్‌సీ
  • క్రోమ్‌వెల్ 1200
  • క్రోమ్‌వెల్ 1200 ఎక్స్

బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్ (Brixton Crossfire 500X)

కంపెనీ లాంచ్ చేసిన బైకులలో ఒకటి ఈ క్రాస్‌ఫైర్ 500ఎక్స్. దీని ధర రూ. 4.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది బ్రిక్స్‌టన్ లాంచ్ చేసిన బైకులలో అత్యంత సరసమైన మోడల్. నియో రెట్రో స్టైల్ కలిగిన ఈ బైక్ చూడటానికి హస్క్‌వర్నా విట్‌పిలెన్ మాదిరిగా ఉంటుంది. ఎల్ఈడీ లైటింగ్, అడ్జస్టబుల్ కేవైబీ సస్పెన్షన్ వంటివి ఈ బైకులో ఉంటాయి.

క్రాస్‌ఫైర్ 500ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్ 486 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 47.6 హార్స్ పవర్, 43 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 13.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ 190 కేజిల బరువుంటుంది. ఇది సింగిల్ పిస్టన్ యూనిట్. ముందు, వెనుక వైపు డిస్క్ బ్రేక్స్ కలిగి.. డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా పొందుతుంది.

బ్రిక్స్‌టన్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ (Brixton Crossfire 500XC)

కంపెనీ లాంచ్ చేసిన మరో బైక్ క్రాస్‌ఫైర్ 500ఎక్స్‌సీ విషయానికి వస్తే.. ఇది చూడటానికి 500ఎక్స్ మాదిరిగా ఉన్నప్పటికీ, కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 5.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ అదనపు కాస్మొటిక్ అప్డేటెడ్స్ కలిగి ఉండటం వల్ల ధర కొంత ఎక్కువగా ఉంటుంది. 195 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్రంట్ పెండర్, 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్ వంటివి పొందుతుంది. ఇది 500ఎక్స్ మాదిరిగే అదే ఇంజిన్ పొందుతుంది, కాబట్టి పర్ఫామెన్స్ ఆ బైక్ మాదిరిగానే ఉంటుందని సమాచారం.

బ్రిక్స్‌టన్ క్రోమ్‌వెల్ 1200 (Brixton Cromwell 1200)

క్రోమ్‌వెల్ 1200 బైక్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 7.84 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి ట్రయంఫ్ బోన్‌విల్లే మాదిరిగా ఉండే ఈ బైక్ లిక్విడ్ కూల్డ్ 1222 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్, 108 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో 16 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. దీని బరువు 235 కేజీలు కావడం గమనార్హం.

బ్రిక్స్‌టన్ క్రోమ్‌వెల్ 1200 బైక్ ఎల్ఈడీ లైటింగ్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ సిస్టం వంటివి కూడా పొందుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ స్పోక్డ్ రిమ్స్, ట్యూబ్డ్ టైర్‌లను పొందుతుంది. కాబట్టి దీని ద్వారా ఉత్తమ రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

క్రోమ్‌వెల్ 1200ఎక్స్ (Brixton Cromwell 1200X)

ఇక చివరగా బ్రిక్స్‌టన్ యొక్క నాలుగో బైక్ లేదా చివరి బైక్ క్రోమ్‌వెల్ 1200ఎక్స్. దీని ధర ఏకంగా రూ. 9.11 లక్షలు (ఎక్స్ షోరూమ్). చూడటానికి స్క్రాంబ్లర్ మాదిరిగా ఉన్న ఈ బైక్ క్రోమ్‌వెల్ 1200 బైక్ కంటే కూడా రూ. 1.27 లక్షలు ఎక్కువ. ఇది చిన్న ఫ్లైస్క్రీన్, ట్యాన్ బ్రౌన్ సీటు, హెడ్‌లైట్ గ్రిల్ వంటివి పొందుతుంది.

Also Read: మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్‌.. ఎందుకంటే?

ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకుంటున్న బ్రిక్స్‌టన్ వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో మరో ఎనిమిది (అహ్మదాబాద్, హైదరాబాద్, పూణే, థానే, కొల్హాపూర్, గోవా మరియు బెంగళూరు) నగరాలలో విస్తరించనున్నట్లు సమాచారం. మొత్తానికి బ్రాండ్ దేశీయ విఫణిలో తన హవా చాటుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.

బామ్మ మాట విన్నాడు.. ఇండియాలో మూడో వ్యక్తిగా రికార్డ్ కొట్టాడు

0

Indian Buys Mclaren 675 LT After Grand Mother Suggestion: ఏ కారు కొంటే బాగుంటుంది చెప్పు అని ఎప్పుడైనా.. మీ బామ్మను అడిగారా?, ఒక వేళా అడిగి ఉంటే.. నాకేం తెలుసు మనవడా అని చెప్పే బామ్మలే ఎక్కువగా ఉంటారు.. కదా!. అయితే ఈ కథనంలో మనం చెప్పుకోబోతున్న బామ్మ మాత్రం, ఏకంగా మెక్‌లారెన్ కారును కోనేయ్ మనవడా అంటూ చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనిస్తే బామ్మ మెక్‌లారెన్ కారును కొనాలని చెప్పించి. పోర్స్చే కార్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయని, వాటికి డోర్స్ కూడా రెక్కలు మాదిరిగా లేదని చెబుతూ.. మెక్‌లారెన్ కారు కొనమని చెబుతుంది. బామ్మ మాట ప్రకారమే మనవడు ‘మెక్‌లారెన్ 765 ఎల్‌టీ’ (McLaren 765 LT) కొనుగోలు చేశాడు. ఈ కారు డెలివరీకి సంబంధించిన సంఘటనలను కూడా ఇక్కడ చూడవచ్చు.

బామ్మ కోసం మెక్‌లారెన్

ఈ కారును దుబాయ్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 12 కోట్లు వరకు ఉంటుందని సమాచారం. అయితే దీని ధర దుబాయ్‌లో కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కారు కొనుగోలుతో మనవడు అతి చిన్న వయసులోనే మెక్‌లారెన్ 765 ఎల్‌టీ సొంత చేసుకున్న మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో చాలా తక్కువమంది మాత్రమే మెక్‌లారెన్ కారును కొనుగోలు చేశారు. ఇందులో బామ్మ మాట విన్న మనవడు కూడా ఒకరు కావడం గమనార్హం. ఈ కారును డెలివరీ చేసుకునే సమయంలో ఆ మనవడి కుటుంబం మొత్తం అక్కడ ఉండటం చూడవచ్చు. మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును కొనుగోలు చేసిన మూడో భారతీయుడు అయినప్పటికీ.. కేరళకు చెందిన మొదటి వ్యక్తి ఇతడే కావడం గమనించదగ్గ విషయం.

బామ్మ మాట విని రూ. 12 కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన మనవడు, ఆ కారును ఇండియాకు తీసుకురావడానికి కూడా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. నిజానికి ఈ కారు లిమిటెడ్ ఎడిషన్. కేవలం 765 మంది మాత్రమే దీనిని కొనుగోలు చేయగలరు. ఈ కారు ధర ఎక్కువ కాబట్టి ప్రస్తుతానికి అన్ని యూనిట్లు పూర్తిగా అమ్ముడవ్వలేదు.

ఇండియాలోని మెక్‌లారెన్ 765 ఎల్‌టీ యజమానులు

ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నసీర్ ఖాన్ మొట్ట మొదటి మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును కొనుగోలు చేశారు. రెండో కారును బెంగళూరుకు చెందిన రంజిత్ సుందర్‌మూర్తి కొనుగోలు చేశారు. రెండు కారు దుబాయ్ నుంచి ఇండియాకు దిగుమతి అయినట్లు తెలుస్తోంది. ఇక మూడో కారు బామ్మ మాట విన్న మనవడే అని తెలుస్తోంది.

మెక్‌లారెన్ 765 ఎల్‌టీ

ప్రపంచ మార్కెట్లోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలిచిన మెక్‌లారెన్ కంపెనీకి చెందిన 765 ఎల్‌టీ 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 765 పీఎస్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ సీక్వెన్షియల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి.. వెనుక చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారు స్పైడర్ వెర్షన్ మాదిరిగా కూపే డిజైన్ పొందుతుంది. అయితే దీని బాడీ వర్క్ మొత్తం కార్బన్ ఫైబర్ నిర్మితం. ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి అప్డేటెడ్ ఫ్రంట్ బంపర్, స్ప్లిటర్, సైడ్ స్కర్ట్స్, ర్యాప్‌రౌండ్ రియర్ బంపర్ వంటివన్నీ పొందుతుంది. ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. కాబట్టి ఈ సూపర్ కారు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Also Read: మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్‌.. ఎందుకంటే?

అన్ని విధాలా అనుకూలంగా ఉండే మెక్‌లారెన్ 765 ఎల్‌టీ కారును ధనవంతులు సైతం కొనడానికి వెనుకడుగు వేయడానికి ప్రధాన కారణం అధిక ధర. ఈ ఒక్క బ్రాండ్ కారు మాత్రమే కాకుండా చాలా ఖరీదైన బ్రాండ్ కార్ల పరిస్థితి కూడా ఇదే. కాబట్టి ఖరీదైన కార్ల అమ్మకాలు భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా.. గ్లోబల్ మార్కెట్లో కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి.

 

View this post on Instagram

 

A post shared by ᴀɴᴀɴᴅ (@_anand912)

మూడు కార్లమ్మేసి కొత్తది కొన్న సన్నీలియోన్‌.. ఎందుకంటే?

0

Do You Know Why Sunny Leone Sold Benz And BMW: చిత్రసీమలో అగ్ర కథానాయకిగా.. తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న సెలబ్రిటీ ‘సన్నీ లియోన్’ (Sunny Leone) గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈమె ఒకప్పుడు తన ఖరీదైన కార్లను విక్రయించి.. కొంత తక్కువ ధరలో లభించే కారును కొనుగోలు చేసింది. సన్నీ లియోన్ ఇలా చేయడానికి కారణం ఏమిటి? ఈమె ప్రస్తుతం ఏ కారును ఉపయోగిస్తోంది అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

సన్నీ లియోన్ విక్రయించిన కార్లు

నిజానికి ఇతర సెలబ్రిటీల మాదిరిగానే సన్నీ లియోన్ ఒకప్పుడు ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ క్లాస్ కారుతో పాటు మరో లగ్జరీ కారును ఉపయోగించేది. సన్నీ లియోన్ ఉపయోగించిన మూడో కారు ఏదనేది స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే ఈమె ఆ మూడు కార్లను విక్రయించి రూ. 38 లక్షల విలువైన ‘ఎంజీ గ్లోస్టర్’ (MG Gloster) కారును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం.

లగ్జరీ కార్లను విక్రయించడానికి కారణం?

రుతుపవనాల కారణంగా ముంబైలో విపరీతమైన వర్షాలు కురిశాయని, దీంతో గ్యారేజిలోకి వర్షపు నీరు చేరడం వల్ల ఖరీదైన కార్లను విక్రయించాల్సి వచ్చిందని సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న అత్యంత ఖరీదైన కార్లు కొన్ని సార్లు వర్షాల కారణంగా చాలా దెబ్బతింటాయి. ఆ సమయంలో వాటిని రిపేర్ చేసుకోవడానికి భారీమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది వర్షపు నీటివల్ల రిపేర్ అయిన వాహనాలను దాదాపు విక్రయించేస్తారు.

ఒకసారి నీటిలో మునిగిన కార్లలో చాలా సమస్యలు తలెత్తుతాయి. కారులోని ఎలక్ట్రానిక్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇంజిన్‌లోకి నీరు చేరటం వల్ల దాని పనితీరు కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి వాటిని రిపేర్ చేయడానికి చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోలేకనే.. ఎంత ఖరీదైన కారు అయినా.. వర్షపు నీటిలో మునిగితే దానిని నిర్దాక్షిణ్యంగా విక్రయించే అవకాశం ఉంది.

ఎంజీ గ్లోస్టర్ కొనుగోలు

నటి సన్నీ లియోన్ లగ్జరీ కార్లను విక్రయించి ఎంజీ గ్లోస్టర్ కారును కొనుగోలు చేసింది. ఈ కారుకు సన్నీ లియోన్ ‘ఇండియన్ ట్రక్’ అని పేరుపెట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఎక్కువగా ఈ కారునే వినియోగిస్తున్నట్లు సమాచారం.

ఎంజీ గ్లోస్టర్ కారును కంపెనీ 2020లో మొదటిసారి పరిచయం చేసింది. చూడటానికి విలాసవంతంగా కనిపించే ఈ కారు భారీ ఎస్‌యూవీ. గ్లోస్టర్ 2.0 లీటర్ సింగిల్ టర్బో ఛార్జ్డ్ మరియు ట్విన్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. స్లిగిల్ టర్బో వేరియంట్ 158 బిహెచ్‌పీ పవర్ మరియు 373 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ట్విన్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ 212 బిహెచ్‌పీ, 478 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Also Read: సన్నీలియోన్‌ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్‌ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!

గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ వేరియంట్ 4×4 ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ కారు ధరలు రూ. 38.30 లక్షల నుంచి రూ. 43.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఎంజీ గ్లోస్టర్ ఆధునిక డిజైన్ కలిగి.. చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్లను పొందుతుంది. ఇందులో ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పెద్ద సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

సన్నీ లియోన్ ఉపయోగించిన కార్లు (Sunny Leone కార్ Collection)

నటి సన్నీ లియోన్ ఎంజీ గ్లోస్టర్ కారును మాత్రమే కాకుండా మసెరటి కంపెనీకి చెందిన కార్లను ఉపయోగించారు. ఇందులో మసెరటి ఘిబ్లీ నెరిస్సిమో, మసెరటి క్వాట్రోపోర్టే, ఆడి ఏ5, బీఎండబ్ల్యూ 7 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జెఎల్350డీ వంటివి ఉన్నాయి. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే మసెరటి బ్రాండ్ కార్లను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసిన నటి సన్నీ లియోన్ కావడం గమనార్హం.