26.1 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 18

మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ ఇదే: రేటెంతో తెలుసా?

0

Mahindra Scorpio Boss Edition Launched: అసలే పండుగ సీజన్.. కొత్త కార్లు కొనాలనుకునే వారి ఈ సంశయం కోసమే వేచి చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, కస్టమర్లను తమవైపు ఆకర్శిచుకోవడానికి కంపెనీలు తమదైన రీతిలో సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఉన్న కార్లనే ఆధునిక హంగులతో లాంచ్ చేసి స్పెషల్ ఎడిషన్ అని పేరు పెడుతున్నాయి. ఇవి స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా ఎక్కువ కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతాయి. ఈ నేపథ్యంలో దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra and Mahindra) ఇప్పుడు తన స్కార్పియో క్లాసిక్ కారును నలుపు రంగులో లాంచ్ చేసింది. దీనికి ‘బాస్ ఎడిషన్’ అని పేరు పెట్టింది.

మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్

కంపెనీ లాంచ్ చేసిన మహీంద్రా బాస్ ఎడిషన్ ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ప్రత్యేకింగ్ ఈ కారు యొక్క బయట మరియు లోపలి భాగాల్లో డార్క్ క్రోమ్ యాక్ససరీస్ ఉన్నాయి. వెలుపలి భాగంలోని సాధారణ క్రోమ్ యాక్సెంట్స్ ముదురు రంగులో ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ లాంప్ హోసింగ్ అన్నీ కూడా బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్ పొందుతాయి.

బానెట్ స్కూప్, హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ లాంప్, ఫెండర్ ఇండికేటర్స్ మరియు రియర్ క్వార్టర్ గ్లాస్ కూడా డార్క్ క్రోమ్ ట్రీట్‌మెంట్ పొందుతున్నాయి. రెయిన్ వైజర్స్, ఫ్రంట్ స్కిడ్ ప్లేట్స్ మరియు బ్లాక్ పౌడర్ కోటింగ్‌తో రియర్ గార్డ్ ఉన్నాయి. ఇందులో రివర్స్ కెమెరా కూడా ఉండటం చూడవచ్చు.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ బ్లాక్ సీట్ అపోల్స్ట్రే మరియు నేక్ పిల్లోస్, బ్యాక్ కుషన్స్ వంటి వాటితో కూడిన కంఫర్ట్ కిట్ కూడా పొందుతుంది. అయితే ఈ కింద అనేది టాప్ వేరియంట్‌కు మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్కార్పియో ధరలు రూ. 13.62 లక్షల నుంచి రూ. 17.42 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కాబట్టి క్లాసిక్ బాస్ ఎడిషన్ దారి స్టాండర్డ్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.

ఇంజన్‌లో అప్డేట్ ఉందా?

మహీంద్రా స్కార్పియో బాస్ ఎడిషన్ కాస్మొటిక్ డిజైన్స్ పొందినప్పటికీ.. ఇంజిన్ విషయంలో ఎటువంటి అప్డేట్స్ పొందలేదు. కాబట్టి ఇందులోని 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 130 Bhp పవర్ మరియు 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది. కాబట్టి పనితీరులో ఎటువంటి మార్పు ఉండదు.

స్కార్పియో సేల్స్ ఎలా ఉన్నాయి

నిజానికి భారతదేశంలో మహీంద్రా యొక్క స్కార్పియో కార్లకు మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన సమయంలో కేవలం కొన్ని గంటల్లోనే భారీ బుకింగ్స్ పొందగలిగింది. ఒకప్పుడు మార్కెట్లో సంచలనం సృష్టించిన స్కార్పియో ఇప్పుడు సరికొత్త రూపంలో లాంచ్ అవడంతో చాలామంది దీనిని ఎగబడి గోనుగోలు చేశారు. ఇప్పటికి కూడా దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని తెలుస్తోంది.

మహీంద్రా స్కార్పియో చరిత్ర

ఇండియన్ మార్కెట్లో 2002 నుంచి మహీంద్రా స్కార్పియో అందుబాటులో ఉంది. ఇది గ్లోబల్ మార్కెట్ కోసం నిర్మించిన మహీంద్రా యొక్క మొదటి మోడల్ కావడం గమనార్హం. ప్రారంభంలోనే ఎంతోమందిని ఆకర్శించిన ఈ కారు బిజినెస్ స్టాండర్డ్ మోటరింగ్ నుంచి ‘కార్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు, బీబీసీ వరల్డ్ నుంచి.. బెస్ట్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ మరియు బెస్ట్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను సొంతం చేసుకుంది.

Don’t Miss: కొడుకు కోసం పాపులర్ కారు.. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ అంటే ఆ మాత్రం ఉంటది!

మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మహీంద్రా స్కార్పియో కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది. ఇందులో భాగంగానే ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ కూడా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కస్టమర్లను ఆకర్శించే డిజైన్ మరియు ఫీచర్స్ పొంది ఉండటమే కాకుండా.. అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందాయి. ఆ తరువాత స్కార్పియో.. క్లాసిక్ మరియు స్కార్పియో ఎన్ రూపంలో లాంచ్ అయింది. ప్రస్తుతం ఈ రెండు కార్లూ మార్కెట్లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

కొడుకు కోసం పాపులర్ కారు.. సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ అంటే ఆ మాత్రం ఉంటది!

0

Salman Khan’s Bodyguard Shera Buys Mahindra Thar Roxx: గత కొన్నిరోజులకు ముందు కండల వీరుడు సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా సింగ్ ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా మరో కారును తన కొడుకు కోసం కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేరా కొడుకు అబీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

షేరా సింగ్ తన కొడుకు అబీర్ కోసం కొనుగోలు చేసిన కారు మహీంద్రా థార్ రోక్స్ అని తెలుస్తోంది. షేరా మరియు అబీర్ ఇద్దరూ ఈ కారును డెలివరీ తీసుకున్నారు. ఫోటోలను షేర్ చేస్తూ.. అన్నింటికీ థాంక్స్ నాన్న.. గాడ్‌ బ్లెస్‌యూ అని పేర్కొన్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొడుక్కి కొత్త కారు కొనిచ్చిన షేరాను పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

మహీంద్రా థార్ రోక్స్ (Mahindra Thar Roxx)

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన థార్ రోక్స్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న థార్ 3 డోర్ మోడల్ యొక్క అప్డేటెడ్ వెర్షన్. అయితే ఇది 5 డోర్స్ కలిగి.. 3 డోర్ కారు కంటే కూడా పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఈ కారు లాంచ్ అయిన తరువాత కొన్ని రోజులకు కంపెనీ దీనికోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ స్వీకరించడం మొదలైన కేవలం 60 నిమిషాల్లో ఇది ఏకంగా లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

థార్ రోక్స్ యొక్క డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. ఇప్పటికే మొదటి బ్యాచ్ డెలివరీలు పూర్తయినట్లు సమాచారం. కాగా మిగిలిన డెలివరీలను కూడా కంపెనీ వేగంగా పూర్తి చేస్తుందని భావిస్తున్నాము. ఇది కొత్త డిజైన్ కలిగి, చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. షేరా కొనుగోలు చేసిన మహీంద్రా థార్ రోక్స్ ఎవరెస్ట్ వైట్ షేడ్‌లో ఉండటం చూడవచ్చు. ఇది బ్రాండ్ యొక్క టాప్ ఎండ్ మోడల్ 4×4 వేరియంట్ అని తెలుస్తోంది.

కొత్త మహీంద్రా థార్ రోక్స్ కారు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్, మల్టి జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్ణింగ్, లేన్ కీప్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో ఫీచర్స్ పొందుతుంది.

అద్భుతమైన ఆఫ్ రోడింగ్ అనుభూతిని అందించే మహీంద్రా థార్ రోక్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులో 2.2 లీటర్ ఎంహాక్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ 172 Bhp పవర్ మరియు 370 Nm టార్క్ అందిస్తుంది. 2.0 లీటర్ ఎంస్టాలిన్ సిరీస్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 174 Bhp పవర్ మరియు 380 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మహీంద్రా థార్ రోక్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ రెండూ కూడా మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతాయి. దేశీయ విఫణిలో మహీంద్రా థార్ రోక్స్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి మొదలై రూ. 22.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా) వరకు ఉన్నాయి.

Don’t Miss: టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్: పండుగ సీజన్‌లో ఓ మంచి ఎంపిక

‘మహీంద్రా థార్’కు ఎందుకంత డిమాండ్!

నిజానికి భారతదేశంలో అన్ని కార్లకు మంచి డిమాండ్ ఉంది. చిన్న కార్ల దగ్గర నుంచి లగ్జరీ కార్ల వరకు, ఆయా విభాగాల్లో ఆసక్తి కలిగిన ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఆధునిక కాలంలో ఆఫ్-రోడ్ వాహనాలను వినియోగించేవారి సంఖ్య కొంత ఎక్కువైంది. ఆఫ్ రోడర్స్ రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా.. కఠినమైన రహదారుల్లో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. ఇందులో ఇప్పుడు ప్రధానంగా మహీంద్రా థార్, మారుతి జిమ్నీ, ఫోర్స్స్ గూర్ఖా వంటి కార్లు ఉన్నాయి. అయితే ఇందులో థార్ మాత్రం అధిక ప్రజాదరణ పొందుతోంది. ఎక్కువమంది థార్ కారును ఇష్టపడటానికి తక్కువ ధర, పర్ఫామెన్స్ వంటి అనేక కారణాలు ఉన్నాయి.

టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్: పండుగ సీజన్‌లో ఓ మంచి ఎంపిక

0

Toyota Taisor Limited Edition launched in India: పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్ చేసిన రెండు రోజులకే టయోటా కంపెనీ కూడా ఇదే బాటలో నడిచింది. తాజాగా సరికొత్త ‘టైసర్ లిమిటెడ్ ఎడిషన్’ (Taisor Limited Edition) లాంచ్ చేసింది. ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా ఆధునిక హంగులను పొందుతుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది బయట మరియు లోపలి వైపున కాస్మొటిక్ అప్డేట్స్ పొందటమే కాకుండా కాంప్లిమెంటరీ యాక్సెసరీస్ ప్యాకేజీని పొందుతుంది.

టైసర్ లిమిటెడ్ ఎడిషన్ రూ. 20160 విలువైన టయోటా జెన్యూన్ యాక్సెసరీస్ (TGA) పొందుతుంది. ఇందులో గ్రానైట్ గ్రే అండ్ రెడ్ కలర్ స్పాయిలర్, డోర్ సీల్ గార్డ్స్, హెడ్‌ల్యాంప్ చుట్టూ క్రోమ్ గార్నిష్, ఫ్రంట్ గ్రిల్ మరియు సైడ్ మౌల్డింగ్ వంటివి ఉన్నాయి. క్యాబిల్ లోపల డోర్ వైజర్స్, ఆల్ వెదర్ 3డీ మ్యాట్స్ మరియు డోర్ లాంప్స్ ఉన్నాయి.

టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అన్ని టర్బో వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.56 లక్షల నుంచి రూ. 12.88 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు కంపెనీ యొక్క అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వాహన ప్రేమికులు ఈ కారును కొనుగోలు చేయవచ్చు.

టైసర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 98.6 Bhp పవర్ మరియు 147.6 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుంది. పండుగ సమయంలో మరింత అమ్మకాలను పొందటానికి టయోటా కంపెనీ ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవాలంటే.. కొన్ని రోజులు వేచి చూడాలి.

లిమిటెడ్ ఎడిషన్స్ లాంచ్ చేయడానికి కారణం

నిజానికి కార్లను కొనుగోలు చేసేవారిలో కొంతమంది సాధారణ కార్లకంటే కొంత భిన్నంగా ఉండే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాంటి వాళ్ళ కోసం కొన్ని సంస్థలు కొన్ని కాస్మొటిక్ అప్డేట్లతో కూడా వెర్షన్స్ లాంచ్ చేస్తారు. ఇవి కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఇవి వాటి స్టాండర్డ్ మోడల్స్ కంటే కూడా కొంత భిన్నమైన డిజైన్ పొందుతాయి. అయితే ఇంజిన్లో పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టి పనితీరులో ఎటువంటి అప్డేట్ ఉండదు.

లిమిటెడ్ ఎడిషన్స్ లేదా స్పెషల్ ఎడిషన్స్ ధరలు వాటి సాధారణ మోడల్స్ కంటే కూడా కొంత ఎక్కువగా ఉంటాయి. అయితే ధరకు తగిన ఫీచర్స్ తప్పకుండా పొందవచ్చు. ఇది సాధారణ కార్లకంటే కూడా చాలా లేటెస్ట్ డిజైన్ కలిగి ఉండటం వల్ల.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంటాయి.

ప్రత్యర్థులు

మారుతి సుజుకి ఫ్రాంక్స్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, నిస్సాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న టయోటా టైసర్ లిమిటెడ్ ఎడిషన్ అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము.

Don’t Miss: అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో అద్భుతమైన కొత్త కారు: ధర ఎన్ని కొట్లో తెలుసా..

సేఫ్టీ ఫీచర్స్

స్టాండర్డ్ టైసర్ కారు 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, హెడ్ ఆప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్యాడిల్ షిఫ్టర్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఆధునిక కార్లలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. కాబట్టి ప్రయాణ సమయంలో ప్రాణాలు రక్షించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.

అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో అద్భుతమైన కొత్త కారు: ధర ఎన్ని కొట్లో తెలుసా..

0

Amitabh Bachchan Buys BMW i7 Electric Car: ప్రముఖ బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ గురించి అందరికీ తెలుసు. సినిమాల్లో నటిస్తూ తనదైన రీతిలో ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈయనకు ఖరీదైన / విలాసవంతమైన వాహనాల ఉపయోగించడం పట్ల కూడా అమితాసక్తి ఉంది. ఈ కారణంగానే బిగ్‌బీ ఎప్పటికప్పుడు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సుమారు రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు.

నటుడు అమితాబ్ బచ్చన్ ఇటీవల తన 82వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. బిగ్‌బీ కొనుగోలు చేసిన కొత్త కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 (BMW i7) ఎలక్ట్రిక్ కారు. ఈ సెడాన్ అత్యాధునిక డిజైన్ కలిగి..విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే ఈ మోడల్ కారును అజయ్ దేవగన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి సెలబ్రిటీలు కూడా కలిగి ఉన్నారు.

బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7)

భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లలో బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఒకటి. ఈ కారు ధర కొంత ఎక్కువగా ఉండటం వల్ల కొనుగోలు చేసేవారి సంఖ్య తక్కువే. ఆటోమోటివ్ టెక్నాలజీతో లాంచ్ అవుతున్న కార్ల విభాగంలో బీఎండబ్ల్యూ ఐ7 కూడా ఒకటి. ఇది డ్యూయెల్ టోన్ ఆక్సైడ్ గ్రే మెటాలిక్ రంగులో ఉంటుంది. కాబట్టి ఇది ప్రీమియంగా కనిపిస్తుంది.

బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు 12.3 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్, 14.9 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి పొందుతుంది. వెనుక సీటులో ఉండే ప్రయాణికుల కోసం 31.3 ఇంచెస్ 8కే రిజల్యూషన్ థియేటర్ స్క్రీన్ లభిస్తుంది. ఇది మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. అంతే కాకుండా రియర్ సీట్ ఫంక్షన్స్ కంట్రోల్ చేయడానికి 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా లభిస్తుంది. ఇది లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ విఫణిలో అడుగుపెట్టిన బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుంది. ఇవి 544 హార్స్ పవర్, 754 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ 591 కిమీ నుంచి 625 కిమీ వరకు రేంజ్ అందిస్తుంది. ఈ కారు 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 239 కిమీ.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580ఎం పోర్స్చే టైకాన్, ఆడి ఈ ట్రాన్ జీటీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు అత్యుత్తమ పనితీరును అందించేలా రూపొందించబడింది. అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో ఇప్పటి వరకు అనేక విలవసవంతమైన ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ.. బీఎండబ్ల్యూ ఐ7 అనేది మాత్రం మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారు.

అమితాబ్ బచ్చన్ గ్యారేజిలోని కార్లు

నటుడు అమితాబ్ బచ్చన్ గ్యారేజిలో కొత్తగా చేరిన బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాకుండా.. రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 63 ఏఎంజీ, రేంజ్ రోవర్ 4.4డీ ఏబీ ఎల్‌డబ్ల్యుబీ, బెంట్లీ కాంటినెంటల్,లెక్సస్ ఎల్ఎక్స్ 570, మినీ కూపన్ ఎస్ మరియు పోర్స్చే కేమాన్ వంటివి ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు కారణం ఇదేనా?

ప్రస్తుతం మార్కెట్లో ఫ్యూయెల్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి సుముఖత చూపిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం కావచ్చు, వాతావరణ సమతుల్యతను కాపడం కోసం కావచ్చు.

Don’t Miss: Mahindra Thar Roxx బుక్ చేసుకున్నవారికి గుడ్ న్యూస్!.. ఇక్కడ చూడండి

ఇప్పటికే ఢిల్లీ వంటి మహానగరాల్లో డీజిల్ కార్ల వినియోగాన్ని నిషేదించారు. రాబోయే రోజుల్లో పెట్రోల్ వాహనాల వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంది. ఫ్యూయెల్ కార్ల కంటే కంటే కూడా ఎలక్ట్రిక్ కార్ల వినియోగానికి లేదా మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతున్నారు.

మహీంద్రా థార్ రోక్స్ బుక్ చేసుకున్నవారికి గుడ్ న్యూస్!.. ఇక్కడ చూడండి

0

Mahindra Thar Roxx Deliveries Start in India: బహు నిరీక్షణ తరువాత కొన్ని రోజులకు ముందు భారతీయ విఫణిలో ఆఫ్ రోడర్ కింగ్ మహీంద్రా థార్.. 5 డోర్స్ రూపంలో లాంచ్ అయింది. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో అమ్ముడవుతూ.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తున్న థార్ 3 డోర్ మోడల్, 5 డోర్ కారుగా అడుగుపెట్టడంతో వాహన ప్రియులంతా.. దీనిని కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. ఇప్పుడు కంపెనీ బుక్ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మహీంద్రా థార్ 5 డోర్ కారు రోక్స్ (Roxx) పేరుతో లాంచ్ అయిన విషయం అందరికి తెలిసిందే. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన తరువాత అక్టోబర్ 3 నుంచి రూ. 21000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. సంస్థ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన కేవలం ఒక గంటలోనే లక్ష కంటే ఎక్కువమంది బుక్ చేసుకున్నారు.

ఆరు వేరియంట్స్

5 డోర్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయిన కొత్త థార్ రోక్స్.. దాని స్టాండర్డ్ మోడల్ లేదా 3 డోర్ థార్ కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇది ఎంఎక్స్1, ఎంఎక్స్3, ఏఎక్స్3ఎల్, ఎంఎక్స్5, ఏఎక్స్5ఎల్ మరియు ఏఎక్స్7ఎల్ అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన మహీంద్రా థార్ రోక్స్ మొత్తం ఏడు రంగులలో లభిస్తుంది. అవి స్టీల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బాటిల్ షిప్ గ్రే మరియు బర్న్ట్ సియెన్నా కలర్స్. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో థార్ రోక్స్ లభిస్తున్న కారణంగా కొనుగోలుదారు తమకు నచ్చిన రంగు థార్ రోక్స్ కొనుగోలు చేయవచ్చు.

మహీంద్రా థార్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతాయి. ఇవి 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. ఇది 4×2 మరియు 4×4 వెర్షన్స్ రూపంలో అందుబాటులో ఉంది. కాబట్టి కొనుగోలుదారు తన అభిరుచికి తగిన విధంగా ఏ ఇంజిన్ ఆప్షన్ అనేది ఎంచుకోవచ్చు.

2024 థార్ లేదా థార్ రోక్స్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, మల్టి స్లాట్ గ్రిల్, డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, టెయిల్ గేట్, మౌంటెడ్ స్పేర్ వీల్, సీ-పిల్లర్ మరియు మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్ వంటివి పొందుతుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే.. విశాలమైన క్యాబిన్ కలిగిన థార్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏడీఏఎస్ టెక్నాలజీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 65 వాట్స్ యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ మొదలైనవి పొందుతుంది.

మొదటి యూనిట్ రూ.1.31 కోట్లు

ఇండియన్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క థార్ కారుకు అధిక డిమాండ్ ఉంది. ఇటీవల కంపెనీ లాంచ్ చేసిన థార్ రోక్స్ మొదటి యూనిట్ ఏకంగా రూ. 1.31 కోట్లకు అమ్ముడైంది. థార్ 3 డోర్ మోడల్ లాంచ్ అయినప్పుడు కూడా.. మొదటి యూనిట్ రూ. కోటి కంటే ఎక్కువ ధరకే అమ్ముడైంది.

సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు దాదాపు అందరికీ ఇష్టమైన ఆఫ్-రోడర్లలో థార్ చెప్పుకోదగ్గ మోడల్. ఇది మంచి డిజైన్, ఫీచర్స్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ కలిగి.. ఉత్తమ ఆఫ్-రోడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. 2010 నుంచి సుమారు 1,86,055 మంది థార్ కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు మొదలైనవారు ఉన్నారు.

Don’t Miss: బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్: ధర & వివరాలు చూశారా?

ఇప్పుడు మహీంద్రా కంపెనీ తన థార్ రోక్స్ డెలివరీలను ప్రారంభించింది. కాబట్టి త్వరలోనే బుక్ చేసుకున్న అందరికీ కూడా థార్ రోక్స్ అందించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి థార్ రోక్స్ బుక్ చేసుకున్న వారికి త్వరలోనే డెలివరీలు అందుతాయి. అయితే డెలివరీలు ముందుగా బుక్ చేసుకున్న వారికి ప్రారంభమవుతాయి. కాబట్టి కొంత ఆలస్యంగా బుక్ చేసుకున్న వారికి కొంత ఆలస్యంగానే డెలివరీలు జరిగే అవకాశం ఉంది.

బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్: ధర & వివరాలు చూశారా?

0

Maruti Baleno Regal Edition Launched: మారుతి సుజుకి యొక్క అత్యధిక అమ్మకాలు పొందుతున్న బాలెనో ఇప్పుడు ‘రీగల్ ఎడిషన్’ రూపంలో లాంచ్ అయింది. పండుగ సీజన్‌లో కంపెనీ అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో సంస్థ ఈ లేటెస్ట్ ఎడిషన్ విడుదల చేసింది. ఇది బాలెనో యొక్క అన్ని వేరియంట్లలోనూ అందుబాటులో ఉంది.

బాలెనో రీగల్ ఎడిషన్ ఇప్పుడు పెట్రోల్ మరియు సీఎన్‌జీ రూపాల్లో మార్కెట్లో అందుబాటులో ఉండటం వల్ల, కస్టమర్లు తమకు నచ్చిన ఇంజిన్ ఆప్షన్‌లో ఈ కారును ఎంచుకోవచ్చు. రీగల్ ఎడిషన్ యొక్క ప్రతి వేరియంట్ స్పెషల్ ఫీచర్స్ పొందనుంది. అయితే దీనికోసం యాక్ససరీస్ కిట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

మారుతి బాలెనో రీగల్ ఎడిషన్ యాక్ససరీస్ కిట్ ధరలు

బాలెనో రీగల్ ఎడిషన్ కోసం యాక్ససరీస్ కొనుగోలు చేయాలంటే రూ. 60,199 (సిగ్మా వేరియంట్), రూ. 49,990 (డెల్టా వేరియంట్), రూ. 50,428 (జీటా వేరియంట్), రూ. 45,829 (ఆల్ఫా వేరియంట్) వెచ్చించాల్సి ఉంటుంది.

కొత్త యాక్ససరీస్ కొనుగోలు చేస్తే.. ఫ్రంట్ అండ్ అండర్ బాడీ స్పాయిలర్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్, డ్యూయెల్ టోన్ సీట్ కవర్, బాడీ సైడ్ మోల్డింగ్, మడ్ ప్లాఫ్, 3డీ బూట్ మ్యాప్, గ్రిల్ అప్పర్ గార్నిష్, ప్రీమియం స్టీరింగ్ కవర్, బ్యాక్ డోర్ గార్నిష్, మిడిల్ క్రోమ్ గార్నిష్, హై పర్ఫామెన్స్ వాక్యూమ్ క్లీనర్, ప్రీమియం బాడీ కవర్, డోర్ విజర్, రియర్ పార్సిల్ సెల్ఫ్, లోగో ప్రొజెక్టర్ లాంప్, క్రోమ్ హ్యాండిల్ మొదలైనవి పొందవచ్చు. ఇవన్నీ కారును మరింత హుందాగా చేయడంలో సహాయపడతాయి. అయితే యాక్ససరీస్ అనేవి మీరు కొనుగోలు చేసే ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి.

బాలెనో రీగల్ ఎడిషన్ లాంచ్ సందర్భంగా మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. కస్టమర్ల అంచనాలను అనుకూలంగా.. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో బాలెనో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ పండుగ సీజన్‌లో మా కస్టమర్ల కోసం ఈ సరికొత్త ఎడిషన్ లాంచ్ చేసినట్లు వెల్లడించారు. ఈ కారు దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుందని పేర్కొన్నారు.

అమ్మకాల్లో అగ్రగామిగా బాలెనో

మారుతి సుజుకి తన బాలెనో కారును భారతీయ విఫణిలో లాంచ్ చేసినప్పటి నుంచి సుమారు 15 లక్షల యూనిట్లను విక్రయించినట్లు సమాచారం. అంటే మార్కెట్లో బాలెనో కారును కొనుగోలు చేసిన వాహనదారుల సంఖ్య 1.5 మిలియన్స్ కంటే ఎక్కువ. కంపెనీ యొక్క అమ్మకాలు గణనీయంగా పెరగడానికి బాలెనో చాలా దోహదపడింది. గత నెలలో కూడా బాలెనో అమ్మకాలు 14వేలు దాటాయి. 2023 సెప్టెంబర్ నెలతో పోలిస్తే బాలెనో సేల్స్.. సెప్టెంబర్ 2024లో 22.40 శాతం తగ్గినట్లు తెలుస్తోంది.

బాలెనో ఎక్కువ అమ్మకాలు పొందటానికి కారణం

భారతీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మారుతి కారు బాలెనో. ఇది సింపుల్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి.. ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంది. అంతే కాకుండా ఈ కారు ప్రారంభ ధర దాని ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువే. ఇలాంటి కారణాల వల్ల ఎక్కువమంది బాలెనో కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

Don’t Miss: ఖరీదైన ఫెరారీలో శిల్పా శెట్టి.. ఈ కారు రేటు తెలిస్తే షాకవుతారు!

ఇప్పటికే మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న మారుతి బాలెనో.. తాజాగా రీగల్ ఎడిషన్ రూపంలో లాంచ్ కావడం వాహన ప్రియులకు ఓ శుభవార్త అనే చెప్పాలి. ఈ ఎడిషన్ కూడా గొప్ప అమ్మకాలను పొందుతుందని, కస్టమర్లను పండుగ సీజన్‌లో ఆకర్శించడంలో సక్సస్ సాధిస్తుందని భావిస్తున్నాము. అంతే కాకుండా కంపెనీ తన ఉనికిని మరింత వ్యాపించడానికి, వాహన వినియోగదారులను ఆకర్శించడానికి రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఎలాంటి కార్లను లాంచ్ చేస్తుంది? ఎలక్ట్రిక్ విభాగంలో అడుగుపెట్టనుందా? ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఏ కారును లాంచ్ చేస్తుందనే విషయాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఖరీదైన ఫెరారీలో శిల్పా శెట్టి.. ఈ కారు రేటు తెలిస్తే షాకవుతారు!

0

Shilpa Shetty Arrives Expensive Ferrari Portofino Supercar: సాధారణంగా చాలామంది సెలబ్రటీలు విలాసవంతమైన వాహనాలలో తిరుగుతారని అందరికి తెలుసు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొంతమంది సెలబ్రిటీలు ఖరీదైన కార్లలో కనిపించారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ నటి ‘శిల్ఫా శెట్టి’ (Shilpa Shetty) ఏకంగా రూ. 4 కోట్ల కంటే ఎక్కువ విలువైన సూపర్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనిస్తే.. నటి శిల్పా శెట్టి ‘ఫెరారీ ఫోర్టోఫినో’ (Ferrari Portofino) కారులో నుంచి బయటకు రావడం చూడవచ్చు. ఈ కారులో రాజ్ కుంద్రా కూడా ఉండటం చూడవచ్చు. ఈ సన్నివేశం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. కారు దిగి ఎయిర్‌పోర్ట్ లోపలికి శిల్పా శెట్టి వెళ్తుంది, ఆ సమయంలో ఫరాజ్ కుంద్రా కారును డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఫెరారీ పోర్టోఫినో

నిజానికి ఫెరారీ కంపెనీ పోర్టోఫినో కారును ఉత్పత్తి చేయడం లేదు. ఈ సూపర్ కారు స్థానంలోనే ఫెరారీ రోమా పుట్టుకొచ్చింది. అయితే ఇక్కడ కనిపించే కారు శిల్పా శెట్టి ఫ్యామిలీ కొనుగోలు చేసిందా? లేదా అనే విషయం ఖచ్చితంగా వెల్లడికాలేదు. ఒకవేలా కొనుగోలు చేసినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరి గ్యారేజిలో ఇప్పటికే అనేక లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫెరారీ కారును కొనుగోలు చేసినట్లైయితే.. గ్యారేజిలో మరోకారుకు చోటు లభించినట్లే అవుతుంది.

పోర్టోఫినో అనేది ఫెరారీ బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవెల్ సూపర్ కారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 4.04 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఇది కూడా ఒకటని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటం వల్ల వీటిని చాలా తక్కువమంది మాత్రమే కొనుగోలు చేస్తారు.

ఫెరారీ పోర్టోఫినో సూపర్ కారు హార్డ్ టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) ఫీచర్స్ మరియు వెంటలేటెడ్ అండ్ హీటెడ్ సీట్లను పొందుతుంది. డిజైన్ పరంగా.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించేలా ఉన్నాయి.

పోర్టోఫినో సూపర్ కారు 3.9 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 620 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు 3.45 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే గంటకు 200 కిమీ వేగంతో ప్రయాణించడానికి పట్టే సమయం 9.8 సెకన్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే దీని పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి కనిపించిన ఈ ఫెరారీ పోర్టోఫినో కారును ఇప్పటికే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ కొనుగోలు చేశారు. బహుశా ఈ కారును కొనుగోలు చేసినవారి సంఖ్య చాలా తక్కువనే తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కార్ల యొక్క ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. దీని స్థానంలోనే ప్రస్తుతం రోమా కారును విక్రయిస్తోంది.

శిల్పా శెట్టి కార్ కలెక్షన్

నటి శిల్పా శెట్టి ఉపయోగించే కార్ల జాబితాలో లంబోర్ఘిని అవెంటడోర్, బీఎండబ్ల్యూ ఐ8, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ మొదలైన కార్లు ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా పోర్స్చే కయెన్ జీటీఎస్ కారును రాజ్ కుంద్రా ఉపయోగిస్తారు.

Don’t Miss: గోవాలో జరిగే ‘ఇండియా బైక్ వీక్’ డేట్స్ వచ్చేశాయ్.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?

ఖరీదైన కార్లను ఉపయోగించే ప్రముఖ సెలబ్రిటీల జాబితాలో శిల్పా శెట్టి ఫ్యామిలీ మాత్రమే కాకుండా.. జెనీలియా ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ కూడా ఉన్నాయి. వీరు ఉపయోగించే కార్ల ధరలు చాలా ఎక్కువ. ఇందులో రోల్స్ రాయిస్, బెంట్లీ, లంబోర్ఘిని బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి.

గోవాలో జరిగే ‘ఇండియా బైక్ వీక్’ డేట్స్ వచ్చేశాయ్.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?

0

India Bike Week 2024 Dates: ఆసియాలోనే అతిపెద్ద బైకింగ్ పెస్టివల్ ‘ఇండియా బైక్ వీక్ 2024 లేదా ఐబీడబ్ల్యు 2024’ (India Bike Week 2024) ఎప్పటిలాగే గోవాలోని వాగేటర్‌లో నిర్వహించబడుతుంది. ఇది డిసెంబర్ 6 మరియు 7వ తేదీలలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బైక్ రైడర్లు విచ్చేయనున్నారు.

ఇండియా బైక్ వీక్ అనేది కేవలం బైకింగ్ ఫెస్టివల్ మాత్రమే కాదు.. ఈ ఈవెంట్‌లో అనేక కొత్త బైకులు లాంచ్ అవుతాయి. గత ఏడాది ఐబీడబ్ల్యు 2024 ఈవెంట్‌లో ట్రయంఫ్ రాకెట్ 3, కెటిఎమ్ 790 అడ్వెంచర్, కవాసకి ఎలిమినేటర్, ఏప్రిలియా ఆర్ఎస్457 యొక్క 2024 ఎడిషన్ వంటి కొత్త బైకులు ప్రారంభించబడ్డాయి. ఈ ఏడాది కూడా ఐబీడబ్ల్యు 2024 వేదికగా సరికొత్త బైకులు లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము.

ఐబీడబ్ల్యు 2024 ఈవెంట్‌లో బైక్ రేసింగ్, మోటార్‌సైకిల్స్ మరియు బైకింగ్ గేర్‌ల కోసం వివిధ స్టాల్స్, రైడింగ్‌కు సంబంధించిన సెమినార్స్, లైవ్ మ్యూజిక్ ప్రదర్శనలు వంటివి ఉంటాయి. అంతే కాకుండా ఇప్పటి వరకు కనిపించని చాలా రకాల విచిత్రమైన బైకులు ఈ ఈవెంట్‌లో దర్శనమిస్తాయి. గత ఏడాది జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలను మీరు గమనిస్తే.. బైక్ వీక్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమైపోతుంది.

గోవా ఐబీడబ్ల్యు 2024 ఈవెంట్‌లో బైకుల ప్రదర్శన, రేసింగ్ వంటి వాటితో పాటు ప్రత్యేకమైన గోవా వంటకాలు, ఫాస్ట్ ఫుడ్స్ వంటి అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త ఉత్పత్తులు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏ బైకులు లాంచ్ అవుతాయి అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

టికెట్స్ ఎక్కడ బుక్ చేసుకోవాలంటే

గోవాలో డిసెంబర్ 6, 7న జరిగే.. ఇండియా బైక్ వీక్ 2024లో పాల్గొనాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పాల్గొనాలంటే డే పాస్ కోసం రూ. 1999, వీకెండ్ పాస్ కోసం రూ. 2999 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫుడ్ మరియు బెవరేజ్ కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఇండియా బైక్ వీక్ ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు

బైక్ రైడర్లు ఎంతగానో ఎదురుచూసే ఈ ఇండియా బైక్ అనేది 2013లో ప్రారంభమైనట్లు సమాచారం. దీనిని మార్టిన్ డా కోస్టా ప్రారంభించారు. ఈ బైక్ ఫెస్టివల్‌ ప్రారంభమైనప్పుడే సుమారు 5000 కంటే ఎక్కువమంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ బైక్ వీక్ ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు.

ఇండియా బైక్ వీక్ ఫెస్టివల్‌లో పెట్రోల్‌హెడ్‌లు, భారీ ఆకారంలో ఉండే వివిధ రకాల బైకులు కనిపిస్తాయి. భారతీయ మోటార్ సైకిల్ సంస్కృతిని అన్వేషించడానికి, వివిధ రకాల బైకులను ఒకే చోట చూడటానికి ఐబీడబ్ల్యు ఓ మంచి వేదిక. 2013 నుంచి విజయవంతంగా నిర్వహించబడుతున్న ఈ ఈవెంట్‌కు.. కరోనా మహమ్మారి ఆటంకం కలిగించింది. ఆ తరువాత మళ్ళీ ఈ ఈవెంట్ యధావిధిగా నిర్వహించబడుతోంది. ఈ సారి కూడా ఈ ఈవెంట్ నిర్విఘ్నంగా ముగుస్తుందని భావిస్తున్నాము.

ఇండియా బైక్ వీక్‌లో పాల్గొనే దేశాలు

డిసెంబర్ 6, 7వ తేదీలలో జరగనున్న ఇండియా బైక్ వీక్ 2024లో పాల్గొనడానికి ప్రపంచ నలుమూలల నుంచి ఔత్సాహికులు రానున్నారు. అయితే ఇందులో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయనే విషయం స్పష్టంగా తెలియదు. కానీ రెండు రోజులు జరిగే ఈ ఈవెంట్ కన్నుల పండుగగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు.

Don’t Miss: చిత్రం.. అంతా విచిత్రం!.. ప్రపంచంలో అతిపెద్ద కార్ల మ్యూజియం

ఇప్పటి వరకు మీ కంటికి కనిపించిన ఎన్నో చిత్రమైన వాహనాలను, పురాతన వాహనాలను ఇక్కడ చూడవచ్చు. ఈ కారణంగానే ఐబీడబ్ల్యు ఈవెంట్ ప్రపంచలో ఓ పెద్ద బైక్ ఈవెంట్‌గా నిలిచింది. ఇండియా బైక్ వీక్ చూడటానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉండటం వల్ల.. ఇప్పటికే చాలామంది బైకర్స్ ఈ ఈవెంట్‌లో పాల్గొనటానికి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ సందర్శించాలనుకునే వారు ఎవరైనా ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుని వెళ్ళవచ్చు.

చిత్రం.. అంతా విచిత్రం!.. ప్రపంచంలో అతిపెద్ద కార్ల మ్యూజియం

0

Most Bizarre Car Museum in The World: కారు లేదా బైక్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ బూట్, బర్గర్, బుక్, కంప్యూటర్ వంటివి కార్ల రూపంలోకి మారి పబ్లిక్ రోడ్డుపైకి వచ్చేస్తే.., ఇది వినడానికి కొంత వింతగా అనిపించినా చూస్తే మాత్రం ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇలాంటివి తయారుచేసిన వ్యక్తి ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద విచిత్రమైన వాహనాలను తయారు చేసిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన కన్యబోయిన సుధాకర్. ఈయన తయారుచేసిన కార్లను చూపిస్తూ ఓ వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. సుధాకర్ కూర్చునే టేబుల్ కూడా కారు కావడం గమనార్హం. దీనిని మీరు వీడియోలో చూడవచ్చు.

హ్యాండ్‌బ్యాగ్ ఆకారంలో ఉన్న కారును కూడా సుధాకర్ చూపిస్తారు. తాను 14 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచే ఇలాంటి కార్లను డిజైన్ చేయడం స్టార్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రారంభంలో ఈయన సైకిల్స్ మాత్రమే తయారు చేసినట్లు వెల్లడించారు. అదే ఈ రోజు గిన్నిస్ రికార్డులో చోటు దక్కేలా చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదని సుధాకర్ పేర్కొన్నారు. ఎరుపురంగు షూ ఆకారంలో ఉండే కారును కూడా ఈయన డిజైన్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదే తాను రూపొందించిన మొట్టమొదటి కారు అని తెలుస్తోంది.

విచిత్ర వాహనాలు

షూ ఆకారంలో ఉన్న కారును తయారు చేసిన తరువాత.. కెమెరా కారును చూపించారు. ఇది సుధాకర్ యొక్క రెండో కారు అని తెలుస్తోంది. ఇందులో ఫ్లాష్‌లైట్ హెడ్‌లైటుగా రూపొందించారు. దీని తరువాత 150 సీసీ ఇంజిన్ కలిగిన పెళ్లి దుస్తుల ఆకారంలో కారును రూపొందించారు. ఆ తరువాత టాయిలెట్ ఆకారపు కారు, స్నూకర్ ఆకారపు కారు, షటిల్ కాక్ డిజైన్ కారు, కంప్యూటర్ కారు, కాన్ఫరెన్స్ టేబుల్ కారు, సోఫా ఆకారపు కారు, బ్యాట్ ఆకారపు కారు, టెన్నిస్ బాల్ కారు, ఫుట్‌బాల్ షేప్ కారు, పంజరం మాదిరిగా ఉండే కారు.. ఇలా ఎన్నెన్నో రూపాల్లో ఉండే కార్లను ఇక్కడ చూడవచ్చు. పిల్లలను పంజరంలో బంధిస్తే ఎలా ఉంటుందో ఆ అనుభూతి వారు పొందాలని, ఆ అనుభూతి పొందిన తరువాత వారు ఎప్పుడూ పక్షులను బంధించరని సుధాకర్ అన్నారు.

సుధాకర్ సృష్టించిన ఈ అద్భుతమైన వాహనాలు ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రత్యేకమైన వాహనాలన్నింటినీ వీక్షించడానికి అనుకూలంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి విచిత్రమైన వాహనాలు బహుశా ప్రపంచంలోనే మరో చోట లేదని తెలుస్తోంది. దీంతో ఈయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి చేరింది.

మొత్తం 60 వాహనాలు

విచిత్రమైన కార్లను మాత్రమే కాకుండా.. సుధాకర్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైసైకిల్ తయారు చేశారు. దీని ఎత్తు 12.67 మీటర్లు. ఈయన వద్ద మొత్తం 60 కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్యను 100 చేర్చడానికి తగిన ప్రయత్నాలు చేస్తున్నారు. సుధాకర్ మ్యూజియం హైదరాబాద్‌లో ఉంది. దీనిని రోజుకు 1000 నుంచి 1500 మంది సందర్శకులు, సందర్శిస్తున్నారు. ఇది గత 24 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది.

సుధాకర్ మ్యూజియంలో కార్లను తయారు చేయడానికి ఆరు నెలల సమయం (ఒక్కో కారు తయారు చేయడానికి కనీసం 6 నెలల సమయం) పడుతుందని సమాచారం. మరికొన్ని కార్లను నిర్మించడానికి ఏకంగా మూడు సంవత్సరాల సమయం పట్టినట్లు సుధాకర్ వెల్లడించారు. సాధారణ వాహనాల కంటే కూడా విచిత్రమైన వాహనాల మీద ఆమిసక్తి ఉండటం వల్లనే సుధాకర్ ఈ వాహనాలను రూపొందించారు.

Don’t Miss: రతన్ టాటా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

విచిత్రమైన వాహనాలు రోడ్డుపైన తిరగవచ్చా?

నిజానికి భారతీయ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. మోడిఫైడ్ వాహనాలు ప్రజా రహదారులపైన నడపడం లేదా డ్రైవ్ చేయడం నేరం. దీనికి భారీ జరిమానా విధించడమే కాకుండా వాహన వినియోగదారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి విచిత్రమైన వాహనాలు రోడ్డుపై తిరగటం నేరం. ఇవి ప్రైవేట్ స్థలాల్లో మాత్రమే తిరగవచ్చు. సుధాకర్ క్రియేటివిటీ చాలా గొప్పదే.. అయినప్పటికీ అలంటి వాహనాలు రోడ్డుపై తిరగటానికి అనుమతి ఉండదు. గతంలో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనల్లో చాలా మోడిఫైడ్ వాహనాలను సంబంధిత అధికారులు సీజ్ చేశారు.

రతన్ టాటా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

0

Remembering Interesting Facts About Ratan Tata: ఒక రాజు తన జీవితాన్ని రాజ్య క్షేమం కోసం త్యాగం చేస్తారు. దేశం నాది.. దేశం కోసం నేను ఉన్నాను అని చెప్పే మహానుభావులు క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా.. వేలకోట్లు ధారాదత్తం చేసిన గొప్ప యుగపురుషుడు మన ‘రతన్ టాటా’. ఎనిమిది పదుల వయసుదాటినా.. సమాజ శ్రేయస్సుకోసమే పరితపించిన అభినవ భీష్మ పితామహుడు (రతన్ టాటా) ఇటీవలే కన్నుమూశారు.

ఒక వ్యక్తి మరణిస్తే.. దేశమే కన్నీరు కారుస్తుందంటే.. అతి తప్పకుండా రతన్ టాటా కోసమే అయి ఉండాలి. కలియుగంలో కూడా ముందు వెనుక ఆలోచించకుండా.. విద్య, వైద్యం వంటి వాటికోసం లెక్కకు మించి ఖర్చు చేశారు. ఆయన మరణం దేశానికీ తీరని లోటు. అయితే రతన్ టాటా అంటే గుర్తొచ్చే కొన్ని విషయాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూసేద్దాం..

స్వయంగా డ్రైవ్ చేస్తూ..

రతన్ టాటా తన కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. వేలకోట్ల రూపాయలకు అధినేత అయినప్పటికీ ఎక్కువగా టాటా నానో కారులోనే ప్రయాణిస్తారు. ఈయన తనకోసమే ఎలక్ట్రిక్ నానో కారును రూపొందించుకున్నారు. రతన్ టాటాతో ఎప్పుడు ఓ యువకుడు (శంతను నాయుడు) కనిపిస్తారు.

జేఆర్‌డీ టాటాతో ఉన్న సన్నివేశాలు చాలా ప్రత్యేకమైనవి. 1992కు ముందు టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగంపై ఎక్కువ ద్రుష్టి సారించారు. అప్పట్లో టాటా మోటార్స్ తన మొదటి ప్యాసింజర్ వాహనం విడుదల చేశారు. అప్పట్లో జేఆర్‌డీ టాటాతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ అరుదైన చిత్రం రతన్ టాటాకు ఎంతో ఇష్టమైనది చెబుతారు.

1998లో టాటా ఇండికా..

రతన్ టాటా 1998లో టాటా ఇండికా కారును విడుదల చేశారు. డీజిల్ ఇంజిన్‌తో భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి కారు ఇదే కావడం గమనార్హం. ఇదే తరువాత ఇతర దేశాలకు కూడా ఎగుమతి అయింది. కొన్ని దేశాల్లో ఇదే రివర్ సిటీ సిటీరోవర్‌గా విక్రయించబడింది. టాటా గ్రూప్ ఉనికిని దేశ సరిహద్దులు దాటేలా చేసిన ఘనత రతన్ టాటాకు దక్కింది.

భారతదేశంలో అతి తక్కువ ధరకు కారు లాంచ్ చేసిన ఘనత కూడా రతన్ టాటాకు దక్కింది. 2008లో రతన్ టాటా తన డ్రీమ్ ప్రాజెక్టుగా ఎంచుకుని విజయవంతంగా నానో కారును లాంచ్ చేశారు. ప్రతి కుటుంబం సొంతంగా కారు కలిగి ఉండాలనే సదుద్దేశ్యంతో రతన్ టాటా దీనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి కూడా ఈ కారు భారతీయ రోడ్ల మీద అక్కడక్కగా కనిపిస్తుంది.

నానో కారు విడుదల..

రతన్ టాటా అంటే గుర్తొచ్చే మరో విషయం ఏమిటంటే.. ఫ్యాక్టరీని మార్చడం. నానో కారు విడుదలకు సమీపిస్తున్న సమయంలో టాటా మోటార్స్ వివాదంలో చిక్కుకుంది. 2006లో సింగూరులో తమ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం 997 ఎకరాల వ్యవసాయ భూమిని తయారుదారునికి కేటాయించారు. ఆ తరువాత రైతుల నుంచి కొన్ని వివాదాలు తలెత్తాయి. ఆ తరువాత 2008 మధ్యలో ఈ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించడానికి సిద్ధమయ్యారు. 2008లో ఈ ప్రక్రియ పూర్తయింది. ఇదంతా రతన్ టాటా నాయకత్వంలో జరిగింది.

ప్రముఖ కంపెనీలను రతన్ టాటా కొనుగోలు చేశారు. రతన్ స్టీవార్డ్‌షిప్ కింద.. టాటా సన్స్ టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ మరియు కోరస్ స్టీల్ వంటి మరెన్నో అంతర్జాతీయ బ్రాండ్‌లను కొనుగోలు చేశారు. ఇందులో జాగ్వార్ చెప్పుకోదగ్గ బ్రాండ్. ఆ తరువాత కంపెనీ నలుదిశలా వ్యాపించింది.

ఎయిరిండియా

రతన్ టాటా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చదివి ఉంటారని చాలామంది భావించవచ్చు. కానీ ఈయన ఆర్కిటెక్చర్ చదివారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. చదువు పూర్తయిన తరువాత 1962లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్‌లో ఆపరేషన్స్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 1975లో రతన్ టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేశారు. 1991లో ఈయన టాటా గ్రూప్ చైర్మన్ అయ్యారు.

ఎయిరిండియాను టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. 1932లో టాటా సన్స్ ద్వారా ప్రారంభమైన ఎయిరిండియాను కొన్ని సంవత్సరాల తరువాత ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. ఆ తరువాత నష్టాలను భరించలేక ప్రభుత్వం మళ్ళీ దీనిని టాటా గ్రూపుకు విక్రయించింది. ప్రస్తుతం ఈ సంస్థ టాటా గ్రూప్ అధీనంలో ఉంది.

రతన్ టాటా జెట్స్, హెలికాఫ్టర్లను నడపడానికి కావలసిన లైసెన్స్ కూడా పొంది ఉన్నారు. కాబట్టి 2007లో ఈయన లాక్‌హీడ్ మార్టిన్ ఎఫ్16 ఫ్లయింగ్ ఫాల్కన్ ఫైటర్ జెట్‌కు కో-పైలట్‌గా పనిచేశారు. అంతే కాకుండా తన 69వ ఏట బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా షోలో అరగంటపాటు జెట్ నడిపేందుకు యూఎస్ డిఫెన్స్ కాంట్రాక్టర్ ఆహ్వానం లభించింది.

కుక్కలంటే చాలా ఇష్టం..

జంతువుల పట్ల అమితమైన ప్రేమ కలిగిన రతన్ టాటా.. జంతువుల కోసం ముంబైలో ఓ ప్రత్యేకమైన హాస్పిటల్ నిర్మించారు. రతన్ టాటాకు చిన్నప్పటి నుంచే కుక్కలంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వాటి కోసం ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తారు. జంతువుల పట్ల ప్రేమతో తన నివాసంలో కుక్కలను పెంచుకునేవారు.

రతన్ టాటా పెళ్లి చేసుకోలేదని అందరికి తెలుసు. ఈయన చదువుకునే రోజుల్లో అమెరికాలో ఒక యువతిని ప్రేమిస్తారు. ఇండియాకు తిరిగి వచ్చి.. మళ్ళీ ఆమెను తీసుకురావాలనుకున్నారు. అయితే అప్పట్లో ఇండో – చైనా యుద్ధం కారణంగా తల్లిదండ్రులు రతన్ టాటాను అమెరికా పంపించడానికి ఒప్పుకోలేదు. ఆ తరువాత ఈయన ప్రేమ విఫలమైంది. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండిపోయారు.

Don’t Miss: అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’

దేశానికి చేసిన సేవను గుర్తించి భారత ప్రభుత్వం రతన్ టాటాకు పద్మభూషణ్ అందించింది. అంతే కాకుండా గౌరవ డాక్టరేట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మోడల్, గౌరవ డాక్టర్ ఆఫ్ టెక్నాలజీ, రెస్పాన్సిబుల్ క్యాపిటలిజం అవార్డు, అస్సాం బైభవ్ వంటి మరెన్నో ప్రశంసలు రతన్ టాటాను వరించాయి.