31.2 C
Hyderabad
Monday, March 17, 2025
Home Blog Page 21

10 కోట్లకు చేరిన ఉత్పత్తి: కంపెనీ చరిత్రలోనే అరుదైన ఘట్టం

0

Hyundai Reach New Milestone at 10 Crore Vehicles Globally: సౌత్ కొరియా కార్ల తయారీ దిగ్గజం ‘హ్యుందాయ్ మోటార్’ (Hyundai Motor) ఉత్పత్తిలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. అంటే సుమారు 57 సంవత్సరాల్లో 100 మిలియన్ యూనిట్లు (10 కోట్లు) వాహనాలను ఉత్పత్తి చేసింది. ఇది ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమలోనే అత్యంత వేగవంతమైన ఉత్పత్తిగా సంస్థ ఓ హిస్టరీ క్రియేట్ చేసింది.

హ్యుందాయ్ కంపెనీ తన 10 కోట్ల వాహనంగా ఐయోనిక్ 5 (ioniq 5)ను దక్షిణ కొరియాలోని ఉల్సావ్ ప్లాంట్‌లో కస్టమర్‌కు పంపిణీ చేసింది. ఈ కారుకు సంబంధించిన ఫోటోలను కూడా కంపెనీ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ జేహోన్ చాంగ్ మాట్లాడుతూ.. ”ప్రపంచ వ్యాప్తంగా 100 మిలియన్ వాహనాల ఉత్పత్తి చాలా గొప్ప విషయం. హ్యుందాయ్ బ్రాండ్ వాహనాలను ఎంచుకుని మాకు మద్దతు ఇస్తున్న మా కస్టమర్లకు ధన్యవాదాలు” తెలిపారు.

మొదటి కారు ‘పోనీ’

1968లో హ్యుందాయ్ కంపెనీ ఉల్సాన్ ప్లాంట్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. కొరియన్ ఆటోమొబైల్ పరిశ్రమకు ఇదే జన్మస్థలం కావడం గమనార్హం. కంపెనీ ఉత్పత్తి చేసిన మొట్టమొదటి ఉత్పత్తి పోనీ. దీనిని కంపెనీ 1975లో ఉత్పత్తి చేసినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కంపెనీ ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే హ్యుందాయ్ కంపెనీకి ఆటోమొబైల్ పరిశ్రమలో ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవచ్చు.

కంపెనీ 10 కోట్ల వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న సందర్భంగా హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ అండ్ డొమెస్టిక్ ప్రొడక్షన్ హెడ్, చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ ‘డాంగ్ సియోక్ లీ’ మాట్లాడుతూ.. కంపెనీ ఉన్నతికి, ఉత్పత్తిలో 100 మిలియన్ రికార్డ్ కైవసం చేసుకోవడానికి సహకరించిన ప్రతి ఉద్యోగికి ధన్యవాదాలు. కంపెనీ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలను సాధించడానికి ఇదొక అడుగు అన్నారు.

2013లో 50 మిలియన్ వాహనాలు

హ్యుందాయ్ కంపెనీ 2013లో 50 మిలియన్ వాహనాల ఉత్పత్తి చేసిన ఘనత సాధించింది. కాగా ఇప్పటికి ఈ సంఖ్య 100 మిలియన్లకు చేరింది. కంపెనీ తన వాహనాలను సౌత్ కొరియాలో మాత్రమే కాకుండా టర్కీ, ఇండియా మరియు అమెరికా, చెక్ రిపబ్లిక్ దేశాల్లో కూడా ఉత్పత్తి చేస్తోంది. రాబోయే రోజుల్లో కంపెనీ తన ఉనికిని మరింత పెంచుకోనుంచి. అంతే కాకుండా గ్లోబల్ మార్కెట్లో మరిన్ని కొత్త వాహనాలను లాంచ్ చేయనుంది.

ఇండియాలోని హ్యుందాయ్ కార్లు

ప్రస్తుతం భారదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో హ్యుందాయ్ కంపెనీ తన వాహనాలను విజయవంతంగా విక్రయిస్తోంది. కంపెనీ ఇప్పుడు భారతదేశంలో సుమారు 18 కార్లను విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇందులో హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ వెన్యూ, హ్యుందాయ్ టక్సన్, హ్యుందాయ్ ఐయోనిక్ 5, హ్యుందాయ్ ఐ20, హ్యుందాయ్ ఆరా, హ్యుందాయ్ ఆల్కజార్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్, హ్యుందాయ్ ఐయోనిక్ 6 మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా మరియు వెన్యూ వంటి కార్లు భారతదేశంలో అధిక అమ్మకాలను పొందగలిగాయి. ఇటీవల కంపెనీ తన 2024 ఆల్కజార్ కారును లాంచ్ చేసింది. కంపెనీ యొక్క దాదాపు అన్ని వాహనాలు మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందించేలా రూపొందించబడి ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా హ్యుందాయ్ కార్లను షారుక్ ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇవి రోజువారీ వినియోగానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి.

Don’t Miss: మొన్ననే ఇల్లమ్మేసింది.. ఇంతలోనే కోట్లు పెట్టి కొత్త కారు కొన్న బ్యూటీ

అప్‌కమింగ్ హ్యుందాయ్ కార్లు

ఆటోమొబైల్ పరిశ్రమలో నిరంతరం తన ఉనికిని చాటుకుంటున్న హ్యుందాయ్ కంపెనీ రాబీయే రోజుల్లో మరికొన్ని కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, 2024 కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 6, హ్యుందాయ్ న్యూ శాంటా ఫే మొదలైనవి ఉన్నాయి. ఇవి ఈ ఏడాది చివర నాటికి లేదా.. వచ్చే ఏడాది మార్కెట్లో లాంచ్ కానున్నాయి.

మొన్ననే ఇల్లమ్మేసింది.. ఇంతలోనే కోట్లు పెట్టి కొత్త కారు కొన్న బ్యూటీ

0

Kangana Ranaut Buys New Car After Selling Pali Hill Bungalow: రాజకీయ నాయకురాలు మరియు ప్రముఖ నటి ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, గత ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి బీజేపీ తరపున ఎన్నికల్లో మండి నియోజక వర్గం నుంచి గెలుపొందింది. కాగా ఇటీవల తన బంగ్లాను సుమారు రూ. 32 కోట్లకు విక్రయించింది. ఇప్పుడు రూ. 3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ కారు ఏ బ్రాండ్? దీని విశేషాలు ఏమిటనే వివరాలు వివరంగా తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయాల్సిందే.

ఏక్ నిరంజన్, చంద్రముఖి 2 వంటి తెలుగు సినిమాల్లో నటించిన కంగనా.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయమే. ఈమె కొనుగోలు చేసిన కారు ‘రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ’ (Range Rover Autobiography LWB). దీని ధర ఇండియన్ మార్కెట్లో రూ. 3 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. కొత్త కారు ఫోటోలను కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ.. కంగ్రచ్యులేషన్స్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ అంటూ అభినందనలు తెలిపింది. ఇందులో కంగనా తన కొత్త కారుకు పూజలు చేయడం చూడవచ్చు.

కంగనా రనౌత్ కొనుగోలు చేసిన కారు తెల్లటి సల్వార్ కమీజ్‌లో ఉండటం చూడవచ్చు. కారుకు పూజ చేయడం, మేనల్లుడు అశ్వత్థామతో ఫోటోలకు పోజులివ్వడం వంటివి చూడవచ్చు. నటి కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ 5 సీటర్ కారు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు కంగనాకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ

ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ యొక్క ఆటోబయోగ్రఫీ కూడా ఒకటి. ఇది ఎల్ఈడీ లైట్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, బ్రాండ్ లోగో వంటివి పొందుతుంది. రూఫ్ మౌంటెడ్ యాంటెన్నా, బాడీ కలర్ బంపర్స్, బ్లాక్ ఓఆర్‌వీఎం, ఫ్రంట్ అండ్ రియర్ పవర్ విండోస్, డియర్ డీఫాగర్, రియర్ వైపర్ మొదలైనవన్నీ ఈ కారులో చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ కారు 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, జీపీఎస్ న్యావిగేషన్, వాయిస్ కమాండ్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీ కంట్రోల్స్, 360 డిగ్రీ కెమెరా, క్యాబిన్ బూట్ స్పేస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో పొందుతుంది.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ 2997 సీసీ 6 సిలిండర్ ఇన్‌లైన్‌ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 4000 rpm వద్ద 346 బ్రేక్ హార్స్ పవర్, 1500 rpm వద్ద 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది ఆటోమాటిక్ గేర్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది మంచి పనితీరును అందిస్తుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉండే ఈ లగ్జరీ కారు.. పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.

ఇప్పటికే ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు

ప్రస్తుతం ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కారును కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కంగనా రనౌత్ కాకుండా.. రణబీర్ కపూర్, అలియా భట్, నిమ్రత్ కౌర్, ఆదిత్యరాయ్ కపూర్, సోనమ్ కపూర్, మహేష్ బాబు, మోహన్ లాల్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే మరియు అమితాబ్ బచ్చన్ మొదలైన ప్రముఖులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సెలబ్రిటీలకు రేంజ్ రోవర్ కార్లంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: అర్జున్ కపూర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రేటు తెలిస్తే మీరు కొనేస్తారు!

కంగనా రనౌత్ కార్ కలెక్షన్ (Kangana Ranaut కార్ Collection)

నటి కంగనా గ్యారేజిలో ఇప్పుడు తాజాగా చేరిన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ మాత్రమే కాకుండా.. మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్ 600, మేబ్యాచ్ ఎస్680, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్ 730ఎల్‌డీ మరియు ఆడి క్యూ3 వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.

అర్థంకాని మేధావి RGV.. ఎలాంటి కార్లు ఉపయోగించారో తెలుసా..

0

Do You Know What Kind of Cars Ram Gopal Varma Used: రామ్ గోపాల్ వర్మ అలియార్ RGVగా పిలువబడే ప్రముఖ దర్శకుడు మరియు సినిమా రచయిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాల క్రితమే సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు గొప్ప దర్శహకులుగా పేరుపొందుతున్న పూరీ జగన్నాథ్ వంటి ఎంతోమందికి డైరెక్టర్లకు గురువు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ గోపాల్ వర్మ గురించి ఓ పుస్తకమే రాసేయొచ్చు. అయితే.. సినీ పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదిగిన రామ్ గోపాల్ వర్మ ఎలాంటి వాహనాలను ఉపయోగిస్తారు? అసలు ఈయనకు వాహనాలంటే ఇష్టం ఉందా? లేదా? అనే మరిన్ని విషయాలను ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం..

నిజానికి రామ్ గోపాల్ వర్మ తన రేంజ్‌కు తగిన విధంగా ఒకప్పుడు రేంజ్ రోవర్ కారును వాడేవారని సమాచారం. ఆ తరువాత కొన్ని రోజులు మెర్సిడెస్ బెంజ్ కారును కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మ ఖరీదైన మరియు విలాసవంతమైన లగ్జరీ కార్లను ఉపయోగించడానికి ఇష్టపడతారని తెలుస్తోంది. అంతే కాకుండా.. రామ్ గోపాల్ వర్మ ఓ సారి ఎంతోమందికి ఇష్టమైన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ బైకుపై కూడా కనిపించారు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎలాంటి కార్లను ఉపయోగిస్తున్నారనేది స్పష్టంగా తెలియదు.

సినీ పరిశ్రమలో ఎక్కువమంది ఉపయోగించే కార్ల జాబితాలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు రేంజ్ రోవర్. రేంజ్ రోవర్ కార్లు ఆధునిక డిజైన్ కలిగి, అధునాతన ఫీచర్స్ పొందుతాయి. దీంతో వాహన వినియోగదారులు అత్యుత్తమ రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు. ఈ కారణంగానే టాలివుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అన్ని రంగాలలో రేంజ్ రోవర్ కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఇప్పటికే చాలామంది గ్యారేజిలో ఈ రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి.

ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే మరో కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్. బెంజ్ కార్లను కూడా చాలామంది ప్రముఖుల గ్యారేజిలో ఉంది. అంబానీ దగ్గర నుంచి.. ఓ బుల్లితెర నటుల వరకు చాలామంది ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు. అయితే వీటి ధర సాధారణ కార్ల ధరల కంటే కూడా ఎక్కువ. ఈ కార్లు కూడా ఆధునిక ఫీచర్స్ కలిగి.. మంచి లగ్జరీ ప్రయాణ అనుభూతిని అందింస్తుంది.

ఇక చివరగా రాయల్ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్ బైక్ విషయానికి వస్తే.. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువమంది యువత కొనుగోలు చేస్తున్న బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌ యొక్క క్లాసిక్ ఒకటి. ఈ బైకును చాలామంది సెలబిట్రీలు కూడా కొనుగోలు చేశారు. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఈ బైకును అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది బైక్ ప్రేమికులు దీనికి ఆకర్షితులవుతున్నారు. ఈ బైక్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 1.78 లక్షలు (ఎక్స్ షోరూమ్).

రామ్ గోపాల్ వర్మ సినీ ప్రస్థానం

చిన్నప్పటి నుంచే సినిమాల మీద అమితాసక్తి కలిగిన రామ్ గోపాల్ వర్మ.. స్కూలుకి డుమ్మాకొట్టి చూసిన సినిమాలనే పదేపదే చూసేవాడిని కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సినిమాల్లో కొన్ని సన్నీవేశాలు తనను తెగ ఆకర్శించేవని, ఈ కారణంగానే ఆయన చూసిన సినిమాలనే మళ్ళీ మళ్ళీ చూసేవాడిని వివరించారు. మొదటిసారి 1989లో అక్కినేని నాగేశ్వర్ రావు ‘శివ’ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కొట్టింది. దీంతో సినీ రంగంలో రామ్ గోపాల్ వర్మ విజయ యాత్ర ప్రారంభమైంది.

Don’t Miss: ఇలాంటి స్కూటర్ భారత్‌లో మరొకటి లేదు!.. కొనాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే

శివ సినిమా తరువాత క్షణక్షణం, గులాబీ, రక్త చరిత్ర మరియు రౌడీ వంటి సినిమాలు భారీ విజయం సాధించాయి. తెలుగులో మాత్రమే కాకుండా రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్‌లో కూడా ప్రవేశం ఉందని సమాచారం. బాలీవుడ్‌లో కూడా రామ్ గోపాల్ వర్మ తన ట్యాలెంట్ నిరూపించుకున్నారు. ఎన్నెన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మన లెజండరీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శారీ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి.ఈ సినిమా అక్టోబర్ నెలలో తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.

ఇలాంటి స్కూటర్ భారత్‌లో మరొకటి లేదు!.. కొనాలంటే గుండె ధైర్యం ఉండాల్సిందే

0

BMW CE 02 Electric Scooter India Launch on 1st October 2024: ప్రముఖ వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ‘సీఈ 04’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసిన తరువాత ఇప్పుడు సరసమైన ధరలో సీఈ 02 (CE 02) ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంటుంది. దీనిని కంపెనీ ప్రత్యేకంగా పట్టణ ప్రయాణాల కోసం రూపొందించినట్లు సమాచారం.

విడుదలకు సిద్దమవుతున్న బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ మినిమలిస్టిక్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ పొందుతుంది. ఇలాంటి డిజైన్ కలిగిన స్కూటర్ బహుశా ఇండియన్ మార్కెట్లో మరొకటి లేదు. పరిమాణంలో చిన్నదిగా ఉండటం పార్కింగ్ చేయడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది.

బ్యాటరీ మరియు రేంజ్

బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్.. సీఈ 04 కింద ఉంటుంది. ఇది 2 కిలోవాట్ ఎయిర్ అండ్ కూల్డ్ సింక్రోనస్ మోటార్ పొందుతుంది. కాబట్టి ఇది సింగిల్ చార్జితో 45 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ కావడం గమనార్హం. ఇది సిటీ రైడ్ కోసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువ పవర్ మరియు రేంజ్ వంటివి కావాలనుకున్నప్పుడు డ్యూయెల్ బ్యాటరీ కాన్ఫిగరేషన్ ఎంచుకోవచ్చు.

సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ డ్యూయెల్ బ్యాటరీ ఆప్షన్ ద్వారా గరిష్టంగా 90 కిమీ రేంజ్ అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ 95 కిమీ కావడం గమనార్హం. సీఈ 02 డబుల్ లూప్ స్టీల్ ప్రేమ్ పొందుతుంది. ప్రీమియం అప్‌సైడ్ డౌన్ పోర్క్ మరియు సస్పెన్షన్ కోసం అడ్జస్టబుల్ మోనోషాక్ సెటప్ పొందుతుంది. ఇది 14 ఇంచెస్ వీల్స్ మీద నడుస్తుంది. బ్రేకింగ్ సిస్టం విషయానికి వస్తే.. ఈ స్కూటర్ ముందు భాగంలో 239 మిమీ డిస్క్ మరియు వెనుక భాగంలో 220 మిమీ బ్రేక్స్ ఉన్నాయి.

బీఎండబ్ల్యూ సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.5 ఇంచెస్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే పొందుతుంది. ఇది ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇది స్కూటర్ యొక్క స్పీడ్, రేంజ్ మరియు బ్యాటరీ స్టేటస్ వంటి వాటికి సంబంధించిన విషయాలను చూపిస్తుంది. ఈ స్కూటర్ కేవలం రెండు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. అవి సర్ఫ్ మోడ్ మరియు ప్లో మోడ్.

అంచనా ధర & బుకింగ్స్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలను గురించి అధికారికంగా వెల్లడించలేదు. అయితే బీఎండబ్ల్యూ బ్రాండ్ కాబట్టి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నాము. దీని ధర బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే తక్కువే అయినప్పటికీ.. మార్కెట్లో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే చాలా ఎక్కువని తెలుస్తోంది. కాగా ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. కాగా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2024 అక్టోబర్ 1 లాంచ్ చేయనుంది.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. కాబట్టి కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ బైకులు మరియు కార్లను లాంచ్ చేస్తూ ఉత్తమ అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎండబ్ల్యూ మొటోరాడ్ ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ చేస్తోంది. అయితే వీటి ధరలు ఇతర బైకులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదివరకే మార్కెట్లో లాంచ్ చేసిన సీఈ 04 స్కూటర్ ధర రూ. 14 లక్షల కంటే ఎక్కువ. ఇప్పుడు లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఉండనుంది.

Don’t Miss: రూ.60000 తగ్గింపు!.. ఐఫోన్ గెలుచుకునే అవకాశం: ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా?

ధర ఎక్కువగా ఉండటం వల్ల.. సాధారణ ప్రజలు వీటిని కొనుగోలు చేయలేరు. ఇదే ధరలు మార్కెట్లో ఒక సెకండ్ హ్యాండ్ కారు వచ్చేస్తుంది. ఇలా ఆలోచించే చాలామంది ఈ బీఎండబ్ల్యూ బైకులను కొనుగోలు చేయడానికి ఒక్క అడుగు వెనుక వేస్తారు. అయితే లగ్జరీ అనుభూతిని పొందాలనుకునే వారు, ధనవంతులు లేదా సెలబ్రిటీలు మాత్రం ధర ఎక్కువైనా.. వాహనాల మీద ఉన్న ఆసక్తితోనే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. అయితే బీఎండబ్ల్యూ కంపెనీ లాంచ్ చేయనున్న సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందో తెలియాల్సి ఉంది.

రూ.60000 తగ్గింపు!.. ఐఫోన్ గెలుచుకునే అవకాశం: ఇంతకన్నా మంచి అవకాశం వస్తుందా?

0

Oben Rorr Gets Rs.60000 in This Dussehra Festive Season: దసరా, దీపావళి ముందున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్ ఫెస్టివల్ సేల్స్ ప్రకటించాయి. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు కూడా గొప్ప ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ వంటివి అందించడం మొదలుపెట్టసాయి. ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఒబెన్ ఎలక్ట్రిక్’ (Oben Electric) తన ‘రోర్’ (Rorr) ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలుపైన కనీవినీ ఎరుగని ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో భారీ తగ్గింపులు మాత్రమే కాకుండా.. ఐఫోన్ గెలుచుకునే అవకాశం కూడా కల్పించింది.

రూ. 1,49,999 (ఎక్స్-షోరూమ్) ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఇప్పుడు రూ. 1,19,999లకు సొంతం చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది. అయితే సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 లోపల కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. అంతే కాకుండా ప్రతి కొనుగోలుదారుడు బైకు మీద ఐదేళ్ల వారంటీ మాత్రమే కాకుండా.. ఐఫోన్ 15, ఐప్యాడ్ మినీ మరియు సోనీ హెడ్‌ఫోన్‌ వంటి వాటిని కూడా గెలుచుకోవచ్చు.

దసరా ధమాల్ డే (Dussehra Dhamaal Day)

ఈ ప్రత్యేకమైన ఆఫర్ అందించడానికి కంపెనీ బెంగళూరు, ఢిల్లీ మరియు పూణేలోని షోరూమ్‌లలో ‘దసరా ధమాల్ డే’ ఈవెంట్ కూడా నిర్బహించనున్నట్లు సమాచారం. దీని ద్వారా కస్టమర్ ఏకంగా రూ. 60000 తగ్గింపులను పొందవచ్చు. అంటే 149999 రూపాయల బైకును రూ. 89999 లకు కొనుగోలు చేయొచ్చన్నమాట. ఇది కేవలం పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఒబెన్ ఎలక్ట్రిక్ నిర్వహించనున్న దసరా ధమాల్ డే ఈవెంట్ అనేది ఒక్కో ప్రాంతంలో ఒక్కో రోజు జరుగుతుంది. 2024 సెప్టెంబర్ 29న హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరులో, ఆ తరువాత ఢిల్లీ ద్వారకా షోరూంలో అక్టోబర్ 2న మరియు అక్టోబర్ 6న పూణేలోని వాకాడ్ షోరూంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ అవకాశం వినియోగించుకోవచ్చు.

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ గురించి ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ ఫౌండర్ అండ్ సీఈఓ మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఆనందమైన దసరా జరుపుకోవడానికి కంపెనీ సన్నద్ధమైంది. ఈ సమయంలో రోర్ ఎలక్ట్రిక్ బైకును కస్టమర్లకు మరింత చేరువగా తీసుకెళ్లడంలో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదో గొప్ప అవకాశం అని అన్నారు. ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మంచి పనితీరుకు మాత్రమే కాకుండా, సేఫ్టీ మరియు స్థిరత్వానికి ప్రతీక. విశ్వసనీయమైన వాహనం కావాలనుకునేవారికి ఒబెన్ రోర్ మంచి ఎంపిక. కాబట్టి ఇప్పుడు ఈ అద్భుతమైన ఆఫర్ వినియోగించుకుని రోర్ ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయవచ్చు అని అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న సమయంలో ఒబెన్ ఎలక్ట్రిక్ తన షోరూంలను బెంగళూరు, పూణే, ఢిల్లీ మరియు కేరళ వంటి ప్రాంతాల్లోని 60 ప్రధాన నగరాల్లో ప్రారంభించనున్నట్లు సామాచారం. కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూ.. ప్రత్యర్థులకు కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సన్నద్ధమవుతోంది. 2020లో బెంగళూరులో స్థాపించబడిన ఈ కంపెనీ లేటెస్ట్ ఎలక్ట్రిక్ బైకులు లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలను పొందుతోంది.

Don’t Miss: మీ దగ్గర రూ.21000 ఉంటే Thar Roxx బుక్ చేసుకోవచ్చు: డెలివరీలు ఎప్పుడంటే..

ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ (Oben Rorr Electric Bike)

చూడగానే ఆకర్శించే డిజైన్, మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ మరియు లేటెస్ట్ టెక్నాలజీ పొందిన ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ 4.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ బైక్ ఒక సింగిల్ చార్జితో ఏకంగా 180 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. ఇందులో 8 కేడబ్ల్యు బ్యాటరీ అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 100 కిమీ కావడం గమనార్హం. ఈ బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా ఇది 20 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఇలా ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఈ బైకును ఇప్పుడు భారీ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశం వచ్చింది.

మీ దగ్గర రూ.21000 ఉంటే Thar Roxx బుక్ చేసుకోవచ్చు: డెలివరీలు ఎప్పుడంటే..

0

How To Booking Mahindra Thar Roxx And Price Delivery Details: 2024 ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ యొక్క థార్ 5 డోర్ లేదా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) బుకింగ్స్ ఎట్టకేలకు మొదలయ్యాయి. కంపెనీ ఈ బుకింగ్స్ గురించి అధికారిక ప్రకటన వెల్లడించింది. బుకింగ్స్ ధర ఎంత? ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఎక్కడ బుక్ చేసుకోవాలి? డెలివరీలు ఎప్పుడనే మరిన్ని విషయాలు ఇక్కడ వివరంగా చూసేద్దాం.. రండి.

బుకింగ్ ధర

మహీంద్రా థార్ రోక్స్ కోసం రూ. 21000 చెల్లించి అక్టోబర్ 3 ఉదయం 11 నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్-రోడర్ బుక్ చేసుకోవాలనుకునే వారు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో లేదా కంపెనీ అధీకృత డీలర్‌షిప్లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు దసరా తరువాత లేదా దీపావళి ముందు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇప్పటికే కంపెనీ డీలర్లు థార్ రోక్స్ యొక్క అన్ని వేరియంట్స్ మరియు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించారు. ముందుగా బుక్ చేసుకున్నవారికి డెలివరీలు కూడా ముందుగానే ప్రారంభమవుతాయి.

వేరియంట్స్

మహీంద్రా థార్ రోక్స్ కారు ఎంఎక్స్1, ఎంఎక్స్3, ఎంఎక్స్5, ఏఎక్స్3ఎల్, ఏఎక్స్5ఎల్ మరియు ఏఎక్స్7ఎల్ అనే వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 22.49 లక్షల మధ్య ఉన్నాయి. కాగా థార్ రోక్స్ 4×4 వెర్షన్స్ ధరలు రూ. 18.79 లక్షల నుంచి రూ. 22.49 లక్షల (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి. ధరలు ఎందుకుని వేరియంట్ మరియు ఇంజిన్ ఆప్షన్లను బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కస్టమర్లు దీనిని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త మహీంద్రా థార్ రోక్స్ చూడగానే సాధారణ మోడల్ గుర్తుకు తెస్తుంది. కానీ ఇది పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సీ షేప్ డీఆర్ఎల్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ ఫాగ్ లాంప్ వంటివి ఇందులో చూడవచ్చు. రియర్ ప్రీఫైల్ ఎల్ఈడీ టెయిల్ లాంప్, రియర్ వైపర్ మరియు బ్రాండ్ లోగో వంటివి కూడా ఇక్కడ చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. వేరియంట్‌ను బట్టి కొన్ని ఫీచర్స్ మారుతాయి. కానీ డోర్ ప్యాడ్ మీద మరియు డ్యాష్‌బోర్డ్ మీద సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్, స్లైడింగ్ ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు హుందాగా ఉండే డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇంజిన్ వివరాలు

మహీంద్రా థార్ రోక్స్ అనేది 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 152 Hp పవర్, 330 Nm టార్క్ అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 162 Hp పవర్, 330 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. అయితే 4×4 వేరియంట్ అనేది ఆప్షనల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఎలాంటి పనితీరును అందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

సేఫ్టీ ఫీచర్స్

ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న చాలా కార్లు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందాయి. 5 స్టార్ రేటింగ్ అంటే అది అత్యంత సురక్షితమైన కారుగా పరిగణిస్తారు. అయితే మహీంద్రా థార్ ఎలాంటి స్కోరింగ్ పొందుతుందనేది తెలియాల్సి ఉంది. థార్ రోక్స్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీ కెమెరా వంటి మరెన్నో సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.

మహీంద్రా థార్ రోక్స్ అనేది.. థార్ 3 డోర్ మోడల్ మాదిరిగానే మంచి మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికి కూడా థార్ 3 డోర్స్ కారుకు ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. దీన్ని బట్టి చూస్తే థార్ రోక్స్ కారు కూడా ఎక్కువమందిని ఆకర్షిస్తుందని, గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ కారు ఎలాంటి బుకింగ్స్ పొందుతుందో.. త్వరలోనే తెలిసిపోతుంది.

ఐఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ స్కూటర్స్.. ఇవే – లిస్ట్ ఇదిగో..

0

These Electric Scooters Price Cheaper than iPhone 16 Pro Max: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్లో ఈవీల హవా జోరుగా సాగుతోంది. అయితే కొందరు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తే.. మరి కొందరు తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు మంచి డిజైన్ ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో ఐఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి తెలుసుకుందాం.

మార్కెట్లో ఐఫోన్లకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సంవత్సరం యాపిల్ కంపెనీ ఓ కొత్త మోడల్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఇందులో ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 1.44 లక్షలు కావడం గమనార్హం. ధర ఎక్కువైనా వీటికి మాత్రం డిమాండ్ అస్సలు తగ్గడం లేదు. ఈ ఫోన్ కంటే తక్కువ ధర వద్ద లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఏథర్ 450ఎస్, ఏప్రిలియా ఎస్ఆర్ 160, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ మరియు రివర్ ఇండీ వంటివి ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఎంతోమందిని ఆకర్శించిన ఈ స్కూటర్ ధర ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కంటే తక్కువ. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 1.15 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ స్కూటర్ 2.2 కిలోవాట్ బ్యాటరీ లేదా 3.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవి రెండూ వరుసగా 77 కిమీ మరియు 100 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ స్కూటర్లు 4 kW మోటారుకు జతచేయబడి ఉంటాయి. డిజైన్ మరియు

ఏథర్ 450ఎక్స్ (Ather 450x)

మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఏథర్ 450ఎక్స్. దీని ధర రూ. 1.40 లక్షలు (ఎక్స్ షోరూమ్). 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఈ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో 111 కిమీ రేంజ్ అందిస్తుంది. గంటకు 90 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ లేటెస్ట్ డిజైన్, కొత్త డిజైన్ పొందుతుంది. రోజు వారీ వినియోగానికి ఇది మంచి ఎంపిక అనే చెప్పాలి.

ఏప్రిలియా ఎస్ఆర్ 160 (Aprilia SR 160)

రూ. 1.31 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తున్న ఏప్రిలియా ఎస్ఆర్ 160 స్కూటర్ 160.03 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 7600 rpm వద్ద 10.86 Bhp పవర్ మరియు 6000 rpm వద్ద 11.6 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఎక్కువ మంది ఈ స్కూటర్ కొనుగోలోను చేస్తున్నారు.

ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)

భారతదేశంలో ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న ఓలా ఎలక్ట్రిక్.. మార్కెట్లో ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.34 లక్షలు (ఎక్స్ షోరూమ్). 11 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఇది గరిష్టంగా 192 కిమీ రేంజ్ (ఎకో మోడ్) అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుంది. ఇది కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Don’t Miss: అర్జున కపూర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రేటు తెలిస్తే మీరు కొనేస్తారు!

రివర్ ఇండీ (River Indie)

దేశీయ విఫణిలో రూ. 1.38 లక్షల ధర వద్ద లభించే రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర కంటే తక్కువే. 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 5 గంటలు మాత్రమే. కొత్త డిజైన్, విశాలమైన సీటు కలిగిన ఈ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. కాబట్టి ఇది మార్కెట్లో చాలామందికి ఇష్టమైన స్కూటర్.

అర్జున్ కపూర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు!

0

Arjun Kapoor Buys New BGauss RUV350 Electric Scooter: సెలబ్రిటీ అంటేనే చాలా విలాసవంతమైన జీవితం గడుపుతారు, ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారని అందరూ భావిస్తారు. కానీ అందరు సెలబ్రిటీలు ఒకేలా ఉండరు. ఇప్పటికి కూడా ఖరీదైన లగ్జరీ కారు లేకుండా జీవిస్తున్న దిగ్గజ నటులు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ప్రముఖ బాలీవుడ్ స్టార్ ‘అర్జున్ కపూర్’ (Arjun Kapoor) ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాధారణంగా కార్లు, బైకుల మీద ఆసక్తి కలిగిన అర్జున్ కపూర్ ఇప్పటికే ఖరీదైన మసెరటి లెవాంటే, ఆడి క్యూ5 వంటి కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు తాజాగా బిగాస్ కంపెనీకి చెందిన ‘ఆర్‌యూవీ350’ (BGauss RUV350) ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. ఈ స్కూటర్ రైడ్ చేసుకుంటూ అర్జున్ కపూర్ రావడం వంటివి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అర్జున్ కపూర్ గ్యారేజిలోని మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం గమనార్హం.

బిగాస్ కంపెనీ ఈ మధ్య కాలంలోనే ఆర్‌యూవీ 350 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఆర్‌యూవీ అంటే ‘రైడర్ యుటిలిటీ వెహికల్’ అని అర్థం. ఇది భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఐఈఎక్స్, ఈఎక్స్ మరియు మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.09 లక్షలు, రూ. 1.24 లక్షలు మరియు రూ. 1.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

నటుడు అర్జున్ కపూర్ బిగాస్ ఆర్‌యూవీ350 యొక్క టాప్ వేరియంట్ మ్యాక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది సొగసైన రెట్రో డిజైన్ కలిగి.. ఇన్‌వీల్ హైపర్‌డ్రైవ్ మోటరుతో లభిస్తుంది. ఇందులోని 3 కిలోవాట్ బ్యాటరీ సింగిల్ చార్జితో 120 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 75 కిమీ వంరకు వేగవంతం అవుతుంది.మిగిలిన రెండు వేరియంట్లు 2.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 90 కిమీ రేంజ్ అందిస్తుంది.

బిగాస్ ఆర్‌యూవీ350 ఎలక్ట్రిక్ స్కూటర్ 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. 5 ఇంచెస్ కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, హోల్ హోల్డ్ అసిస్ట్, నోటిఫికేషన్ అలర్ట్, న్యావిగేషన్ ప్రాంప్ట్, ఫాల్ సేఫ్ టెక్నాలజీ వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. అన్ని వేరియంట్లు డ్రమ్ బ్రేక్స్ పొందుతాయి. కాబట్టి రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

అర్జున్ కపూర్ గ్యారేజిలోని లగ్జరీ కార్లు

నిజానికి అర్జున్ కపూర్ గతంలో ఎప్పుడూ బైక్ లేదా స్కూటర్ రైడ్ చేసిన సంఘటనలు వెలుగులోకి రాలేదు. మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేస్తూ కనిపించరు. అర్జున్ కపూర్ గ్యారేజిలో ఇప్పటికే మెర్సిడెస్ బెంజ్ ఎమ్ఎల్ 350, వోల్వో ఎక్స్సీ90, మసెరటి లెవాంటే, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియు మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్600 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.

ఎలక్ట్రిక్ స్కూటర్ల వల్ల ఉపయోగాలు

రోజువారీ వినియోగానికి లేదా తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి ఎంపిక అవుతాయి. ఇది మెయింటెనెన్స్ ఖర్చులను కూడా బాగా తగ్గిస్తుంది. ట్రాఫిక్ వంటి సమయాల్లో కూడా సజావుగా ముందుకు సాగటానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అనుకూలంగా ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది సాధారణ ప్రజలు మరియు సెలబ్రిటీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. కాబట్టి మార్కెట్లో లాంచ్ అవుతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతోంది.

Don’t Miss: యమహా కొత్త స్కూటర్ ఇదే: రూ. 98130 మాత్రమే

ఆటో రంగంలో ప్రస్తుతం భారతదేశంలో కూడా అగ్రగ్రామి దేశాల జాబితాలో ఉంది. దేశీయ ఆటోమొబైల్ రంగం దేశ ఆర్ధిక వ్యవస్థను పెంచడానికి చాలా ఉపయోగపడుతుందని పలువురు రాజకీయం నాయకులు చాలా సందర్భాల్లో వెల్లడించారు. రాబోయే రోజుల్లో భారత్ ఆటోమొబైల్ రంగంలో చైనాను దాటేస్తుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మొత్తం మీద ప్రస్తుతం పెట్రోల్ వాహనాల మాదిరిగానే.. ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.

యమహా కొత్త స్కూటర్ ఇదే: రూ. 98130 మాత్రమే

0

Yamaha New RayZR Street Rally 125 Fi Launched in India: ఇండియన్ మార్కెట్లో యమహా టూ వీలర్లకు ఉన్న క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బైక్ ప్రేమికులను ఒక్క చూపుతోనే కట్టిపడేసే డిజైన్ కలిగిన బైకులను, స్కూటర్లను లాంచ్ చేస్తున్న యమహా దేశీయ విఫణిలో మరో స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దాదాపు అన్ని స్కూటర్ల కంటే కూడా భిన్నంగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది.

యమహా కంపెనీ దేశీయ మార్కెట్లో లాంచ్ చేసిన కొత్త స్కూటర్ ‘రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ’ (RayZR Street Rally 125 Fi)). ఇది చాలా వరకు అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. సరికొత్త డిజైన్ కలిగిన ఈ స్కూటర్ దాని పాత మోడల్ కంటే రూ. 2000 ఎక్కువ ధర వద్ద లభిస్తోంది. కాబట్టి ఈ స్కూటర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే..

ప్రైస్

యమహా లాంచ్ చేసిన కొత్త రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ ధర రూ. 98130 (ఎక్స్ షోరూమ్). అంటే దీని ధర దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా రూ. 2000 ఎక్కువ. ధర కొంచెం ఎక్కువైనా.. దానికి తగిన ఫీచర్స్ మాత్రం ఇందులో తప్పకుండా పొందవచ్చు.

డిజైన్ మరియు ఫీచర్స్

ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే కొత్త యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ స్కూటర్ మంచి డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్ చూడవచ్చు. ఇది నెంబర్ ప్లేట్ పైభాగంలో కనిపిస్తుంది. కలర్ స్కీమ్ కూడా కొంత అప్డేట్ చేయబడి ఉంది. కాబట్టి ఇది ఇప్పుడు సైబర్ గ్రీన్ అనే కొత్త రంగులో లభిస్తుంది. ఇది మాత్రమే కాకుండా ఐస్ ఫ్లూ వెర్మిలియన్, స్పెషల్ బ్లూ మరియు బ్లాక్ మ్యాట్ బ్లాక్ కలర్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ స్కూటర్ ఆన్సర్ బ్యాక్ ఫీచర్ పొందుతుంది. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో స్కూటర్‌ను గుర్తించడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది ఆధునిక కాలంలో చాలా గొప్పగా ఉపయోగపడే ఫీచర్ అనే చెప్పాలి. దీనిని స్మార్ట్‌ఫోన్‌లోని వై కనెక్ట్ యాప్ ద్వారా యాక్సెస్ చెయ్యవచ్చు.

ఇంజిన్ వివరాలు

అప్డేటెడ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్స్ కలిగిన యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ స్కూటర్ అదే ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజిన్ ద్వారా 5000 ఆర్పీఎం వద్ద 10.2 న్యూటన్ మీటర్ టార్క్ మరియు 6500 ఆర్పీఎం వద్ద 8.2 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

కొత్త యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్ 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజిని పొందుతుంది. ఈ స్కూటర్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్ మరియు వెనుక మోనో షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

ప్రత్యర్థులు

ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త యమహా రేజెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్.. ఇప్పటికే ఉత్తమ అమ్మకాలను పొందుతున్న హోండా డియో 125, సుజుకి అవెనిస్ 125 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఇవ్వాల్సి ఉంటుంది.

దసరా, దీపావళి పండుగలు మొదలవుతున్నాయి. ఈ సమయంలో కొత్త బైక్ కొనాలనుకునేవారికి యమహా యొక్క కొత్త రేజెడ్ఆర్ స్కూటర్ తప్పకుండా మంచి ఎంపిక అవుతుందని భావిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుంది? ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందా? లేదా? అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి.

Don’t Miss: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకోలెక్క!.. వచ్చేసింది నెక్సాన్ సీఎన్‌జీ

మార్కెట్లోని యమహా బైకులు

భారతదేశంలో యమహా బైకులు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ దేశీయ మార్కెట్లో యమహా ఆర్3, యమహా ఆర్15ఎం, యమహా ఎమ్‌టీ 03, యమహా ఆర్15 వీ4, యమహా ఆర్15ఎస్, యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్, యమహా ఎఫ్‌జెడ్-ఎఫ్ఐ వంటి బైకులు మాత్రమే కాకుండా ఏరోక్స్ 155, రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ, ఫాసినో 125 ఎఫ్ఐ మొదలైన స్కూటర్లు ఉన్నాయి.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకోలెక్క!.. వచ్చేసింది నెక్సాన్ సీఎన్‌జీ

0

Tata Nexon iCNG Launched in India: భారతీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) చెప్పినట్లుగా నెక్సాన్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో అందుబాటులో ఉన్న ఈ కారు ఇప్పుడు సీఎన్‌జీ విభాగంలోకి కూడా అడుగుపెట్టింది. సీఎన్‌జీ విభాగంలో అడుగుపెట్టిన నెక్సాన్ యొక్క డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏంటి? మైలేజ్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ మరియు ధరలు

ముందుగా తెలుసుకోవాల్సిన విషయం నెక్సాన్ సీఎన్‌జీ (Tata Nexon CNG) యొక్క ధరలు. ఇది మొత్తం ఎనిమిది వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త సీఎన్‌జీ వెర్షన్ ధరలు రూ. 8.99 లక్షల నుంచి రూ. 14.59 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు ధర దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా రూ. లక్ష ఎక్కువని తెలుస్తోంది. అయితే ఇది మంచి మైలేజ్ అందిస్తుంది.

స్మార్ట్: రూ. 8.99 లక్షలు
స్మార్ట్ ప్లస్: రూ. 6.69 లక్షలు
స్మార్ట్ ప్లస్ ఎస్: రూ. 9.99 లక్షలు
ప్యూర్: రూ. 10.69 లక్షలు
వ్యూస్ ఎస్: రూ. 10.99 లక్షలు
క్రియేటివ్: రూ. 11.69 లక్షలు
క్రియేటివ్ ప్లస్: రూ. 12.19 లక్షలు
ఫియర్‌లెస్ ప్లస్ ఎస్: రూ. 14.59 లక్షలు

డిజైన్

చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉండే టాటా నెక్సాన్ సీఎన్‌జీ అదే హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు సైడ్ ప్రొఫైల్ పొందుతుంది. అయితే ఇది సీఎన్‌జీ వెర్షన్ అని గుర్తించడానికి బ్యాడ్జెస్ట్ పొందుతుంది. వీటి ద్వారా ఇది సీఎన్‌జీ కారు అని ఇట్టే కనిపెట్టవచ్చు.

ఫీచర్స్

టాటా నెక్సాన్ సీఎన్‌జీ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వాయిస్ అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, నాలుగు స్పెయికర్లు, లెదర్ అపోల్స్ట్రే, 360 కెమెరా మరియు వైపర్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఏసీ వెంట్స్ మొదలైనవన్నీ మునుపటి మోడల్లో ఉన్నట్లే ఉంటాయి.

పవర్‌ట్రెయిన్ & మైలేజ్

టాటా నెక్సాన్ సీఎన్‌జీ కారు డ్యూయెల్ సిలిండర్ సీఎన్‌జీ కిట్ పొందుతాయి. ఇది 1.2 లీటర్ త్రీ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 98.6 Bhp పవర్ మరియు 110 Nm టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 24 కిమీ / కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది.

నెక్సాన్ సీఎన్‌జీ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు. ఒక ఫుల్ ట్యాంక్ సీఎన్‌జీతో నెక్సాన్ 1440 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. డ్యూయెల్ సిలిండర్ టెక్నలజీ కలిగి ఉండటం వల్ల ఈ కారులో బూట్ స్పేస్ కొంత ఎక్కువగానే లభిస్తుంది. కాబట్టి నెక్సాన్ సీఎన్‌జీ బూట్ స్పేస్ 321 లీటర్లు. అయితే ఇది పెట్రోల్ మరియు డీజిల్ కార్ల బూట్ స్పేస్ కంటే కూడా తక్కువే అని తెలుస్తోంది.

టాటా మోటార్స్ తన సీఎన్‌జీ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగానే నెక్సాన్ కారును సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేసింది. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి ఫ్రాంక్స్ సీఎన్‌జీ, టయోటా టైసర్ సీఎన్‌జీ, మారుతూ బ్రెజ్జా సీఎన్‌జీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Don’t Miss: రూ. 5.65 లక్షలకే.. వ్యాగన్ ఆర్ కొత్త ఎడిషన్: మంచి డిజైన్ & సరికొత్త ఫీచర్స్

ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లో ఎన్నెన్నో కార్లు లాంచ్ అయ్యాయి. అయితే ఒకే కారు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ విభాగాల్లో లాంచ్ కావడం అనేది జరగలేదు. ఇది కేవలం టాటా మోటార్స్ కంపెనీకి మాత్రమే సాధ్యమైంది. దీన్ని బట్టి చూస్తే టాటా మోటార్స్ అంటే ఇండియన్ మార్కెట్లో ప్రజలకు ఎంత నమ్మకమో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రగామిగా ఉన్న నెక్సాన్.. సీఎన్‌జీ విభాగంలో కూడా గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.