30.2 C
Hyderabad
Tuesday, March 18, 2025
Home Blog Page 24

హీరో ‘అజిత్ కుమార్’ రూ.3.5 కోట్ల కారు ఇదే!.. మొన్న ఫెరారీ.. ఇప్పుడు

0

Famous Actor Ajith Kumar Buys Porsche GT3 RS: సాధారణ ప్రజలతో పోలిస్తే.. సెలబ్రిటీల కార్ కలెక్షన్ భారీగానే ఉంటుంది. ఇందులో అధికంగా హీరోలే ఉన్నాయి. కొన్ని రోజులకు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగ చైతన్య పోర్స్చే కంపెనీకి చెందిన ‘911 జీటీ3 ఆర్ఎస్’ కారును కొనుగోలు చేసారని చదువుకున్నాం. ఇప్పుడు ఇలాంటి కారునే నటుడు ‘అజిత్ కుమార్’ (Ajith Kumar) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అజిత్ భార్య ‘షాలిని’ తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది.

ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో అజిత్ కుమార్.. కారు వెనుక భాగంలో నిలబడి ఉండటం చూడవచ్చు.

పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్ (Porsche 911 GT3 RS)

భారతదేశంలో ఈ కారును కొనుగోలు చేసిన సెలబ్రిటీల సంఖ్య చాలా తక్కువ. ఈ జాబితాలోకి ఇప్పుడు హీరో అజిత్ కూడా చేరారు. ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో రూ. 3.50 కోట్లు. దేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన పోర్స్చే కారు ఇదే. చక్కని డిజైన్ కలిగిన ఈ కారు ఎక్కువ భాగం కార్బన్ ఫైబర్ పొందుతుంది.

అజిత్ కుమార్ కొనుగోలు చేసిన పోర్స్చే కారు రెడ్ వీల్స్ కలిగి ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ఈ కారు 3996 సీసీ సిక్స్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 518 Bhp పవర్ మరియు 468 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 296 కిమీ/గం.

ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్

నటుడు అజిత్ కుమార్ పోర్స్చే కారు కొనుగోలు చేయడానికంటే ముందు.. సుమారు రూ. 9 కోట్ల విలువైన ఓ ఫెరారీ కారును కూడా కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని పేరు ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ (Ferrari SF90 Stradale). ఇది ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన మొట్ట మొదటి మిడ్ ఇంజిన్ ఫెరారీ. దీనిని కంపెనీ ఈ మధ్య కాలంలోనే లాంచ్ చేసింది. ఇది బ్రాండ్ యొక్క మొదటి హైబ్రిడ్ సిరీస్ అని తెలుస్తోంది. ఇది లంబోర్ఘిని యొక్క రెవెల్టో కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఫెరారీ ఎస్ఎఫ్90 స్ట్రాడేల్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి ఇది 986 హార్స్ పవర్, 800 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది 7.9 కిలోవాట్ బ్యాటరీతో జతచేయబడి ఉంటుంది. ఇది 217 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులోని బ్యాటరీ ఫుల్ చార్జితో 26 కిమీ రేంజ్ అందిస్తుంది.

ప్రస్తుతం అజిత్ సినిమా షూటింగ్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఈయన కేవలం తమిళ ప్రజలకు మాత్రమే కాకుండా తెలుగువారికి కూడా సుపరిచయమే. కాబట్టి ఈయనకు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా అజిత్ ఒక ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో ఖరీదైన కార్లు మరియు బైకులు ఉన్నాయి.

అజిత్ గ్యారేజిలోని కార్లు, బైకులు (Ajith Kumar Car and Bike Collection)

హీరో అజిత్ కుమార్ గ్యారేజిలో ఖరీదైన లంబోర్ఘిని, ల్యాండ్ రోవర్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ మొదలైన కార్లు ఉన్నాయి. బైకుల విషయానికి వస్తే.. ఈ జాబితాలో బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలియా మరియు కవాసకి నింజా జెడ్ఎక్స్-145 వంటి ఖరీదైన బైకులు ఉన్నాయి.

Don’t Miss: రూ.3.5 కోట్ల కారు కొన్న నాగ చైతన్య.. హైదరాబాద్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!

అజిత్ కుమార్ 2003 ఫార్ములా బీఎండబ్ల్యూ ఆసియా ఛాంపియన్‌షిప్ మరియు 2010 ఎఫ్ఐఏ ఫార్ములా టూ ఛాంపియన్‌షిప్ వంటి అనేక అంతర్జాతీయ రేసింగ్ ఈవెంట్‌లలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఈయన అప్పుడప్పుడు తన బీఎండబ్ల్యూ బైకులో లాంగ్ రైడ్ కూడా చేస్తుంటారు. అజిత్ బైక్ రైడింగ్ చేసిన చిత్రాలు ఇప్పటికే పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఉదయ్‌పూర్ యువరాజు మనసుదోచిన బైక్ ఇదే!.. దీని రేటెంతో తెలుసా?

0

Prince Lakshyaraj Singh Mewar Gets BSA Gold Star 650: సాధారణ ప్రజలు, సెలబ్రిటీల మాదిరిగానే ఉదయ్‌పూర్ యువరాజు ‘లక్ష్యరాజ్ సింగ్ మేవార్’కు (Lakshyaraj Singh Mewar) కూడా బైకులు, కార్లు అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఈయన ఎప్పటికప్పుడు తనకు నచ్చిన బైక్స్ లేదా కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ‘బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650’ (BSA Gold Star 650) బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో లక్ష్యరాజ్ సింగ్ మేవార్ తీసుకోవడం చూడవచ్చు. కంపెనీ ఈ బైకును యువరాజుకు చెందిన సిటీ ప్యాలెస్‌లోని తన నివాసంలో డెలివరీ చేసింది. ఈ ఫోటోలు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి.

2024 బీఎస్ఏ గోల్డ్ స్టార్

దేశీయ దిగ్గజం మహింద్ర అండ్ మహీంద్రా యాజమాన్యంలోని బీఎస్ఏ కంపెనీ గత నెలలో 650 సీసీ విభాగంలో ‘గోల్డ్ స్టార్ 650’ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ యొక్క ఇంటర్‌సెప్టర్ 650కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ప్రారంభ ధర రూ. 2.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

చూడగానే ఆకర్షించబడే డిజైన్ కలిగిన బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ఒక రెట్రో టూరర్ మోటార్‌సైకిల్. కాబట్టి ఇది క్రేడిల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ పోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఈ బైక్ టియర్ డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్ పొందుతుంది. మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ ధరలు ఎంచుకునే కలర్ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ 652 సీసీ 4 వాల్వ్ డీఓహెచ్సీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 45 బ్రేక్ హార్స్ పవర్ మరియు 55 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ 160 కిమీ/గం అని తెలుస్తోంది. 650 సీసీ విభాగంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బైకులలో గోల్డ్ స్టార్ 650 కూడా ఒకటి కావడం విశేషం.

లక్ష్యరాజ్ సింగ్ మేవార్ గ్యారేజిలోని వాహనాలు

యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ స్వయంగా ఉదయ్‌పూర్ రాజకుటుంబానికి చెందినవారు కావడంతో.. రాజస్థాన్‌లోని తన రాజమందిరంలో లెక్కకు మించిన పాత కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే లక్ష్యరాజ్ మాత్రం ఈ కాలానికి తగిన విధంగా.. రోజువారీ వినియోగానికి వైట్ కలర్ రేంజ్ రోవర్ కారును ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా లక్ష్యరాజ్ సింగ్ మేవార్ కొత్త మహీంద్రా థార్, ఓల్డ్ మోడల్ మహీంద్రా థార్ 700, ఫోర్స్ మోటార్స్ అర్బేనియా మరియు రోల్స్ రాయిస్ వంటి కార్లను కలిగి ఉన్నారు. వీటిని కూడా అప్పుడుడప్పుడు వినియోగిస్తుంటారని సమాచారం.

మహీంద్రా థార్

భారతదేశంలో ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన మహీంద్రా థార్.. యువరాజు లక్ష్యరాజ్ సింగ్ మేవార్ మనసు కూడా దోచేసింది. దీంతో ఆయన థార్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. ఎరుపు రంగులో ఉన్న ఈ కారును కంపెనీ ఉదయ్‌పూర్‌లోని.. ఆయన నివాసంలోనే డెలివరీ చేశారు. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో థార్ 5 డోర్స్ వెర్షన్ రూపంలో కూడా అందుబాటులో ఉంది. ఇది థార్ రోక్స్ పేరుతో విక్రయానికి రానుంది.

మహీంద్రా థార్ 700

బహుశా మహీంద్రా థార్ 700 గురించి చాలామందికి తెలియకపోవచ్చు. థార్ 3 డోర్ వెర్షన్ లాంచ్ అవ్వడానికి ముందు థార్ 700 అందుబాటులో ఉండేది. ఈ కారు కూడా లక్ష్యరాజ్ సింగ్ గ్యారేజిలో ఉంది. మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఈ కారును స్వయంగా యువరాజుకు అందించారు. ఈ కారు ఒక లిమిటెడ్ ఎడిషన్. ఇది ప్రత్యేకమైన ఆక్వామెరైన్ బ్లూ రంగులో ఉండటం ఇక్కడ చూడవచ్చు.

ఫోర్స్ మోటార్స్ అర్బేనియా

మహీంద్రా థార్ కార్లు మాత్రమే కాకుండా.. ప్రిన్స్ లక్ష్యరాజ్ సింగ్ ఫోర్స్ మోటార్స్ యొక్క అర్బేనియా ఎమ్‌పివీని కూడా కలిగి ఉన్నారు. ఈ కారును కూడా కంపెనీ ప్రిన్స్ యొక్క సిటీ ప్యాలెస్ కాంపౌండ్ లోపలే డెలివరీ చేసింది. ఇది ఒక వ్యాన్ మాదిరిగా.. కుటుంబం మొత్తం ప్రయాణించడానికి అనుకూలంగా ఉండేలా ఉంది. అయితే ప్రిన్స్ లక్ష్యరాజ్ ఏదైనా కొత్త వాహనాన్ని తానె స్వయంగా డెలివరీ తీసుకుంటారు.

Don’t Miss: బైక్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్.. విచిత్రంగా కేక్ కటింగ్: నెట్టింట్లో వీడియో వైరల్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే రోల్స్ రాయిస్ కంపెనీ యొక్క ఘోస్ట్ కూడా లక్ష్యరాజ్ గ్యారేజిలో ఉంది. దీనిని ఈయన 2012లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది నలుపురంగులో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారును లక్ష్యరాజ్ డ్రైవింగ్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే లక్ష్యరాజ్ సింగ్ మేవార్‌కు కార్లు మరియు బైకుల మీద ఎంత ఆసక్తి ఉందో గమనించవచ్చు.

బైక్‌కు బర్త్‌డే సెలబ్రేషన్స్.. విచిత్రంగా కేక్ కటింగ్: నెట్టింట్లో వీడియో వైరల్

0

Man Celebrates Bike Birthday Video Goes Viral: పుట్టిన రోజు అనేది సాధారణంగా మనుషులే జరుపుకుంటారు. అయితే జంతు ప్రేమికులు లేదా పక్షులను ప్రేమించేవారు.. వాటికి కూడా బర్త్‌డే చేసి తెగ మురిసిపోతుంటారు. కానీ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ కొందరు బైక్‌కు బర్త్‌డే చేస్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? బైక్‌కు బర్త్‌డే ఎందుకు చేశారు అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనిస్తే.. కొందరు వ్యక్తులు బైకును బాగా శుభ్రం చేసి దానికి పూల మాల వేసి ఉండటం చూడవచ్చు. ఆ బైక్ ముందు టైరుకు కేక్ కట్ చేయడానికి కట్టిన కట్టి ఉండటం కూడా గమనించవచ్చు. దానికి ముందు మరో వ్యక్తి చేతిలో కేక్ పట్టుకున్నారు. బైకును పట్టుకున్న వ్యక్తి దానిని ముందుకు నెట్టడం ద్వారా కేట్ కట్ చేయడం జరుగుతుంది. ఈ వేడుకకు ఓ కుటుంబం మొత్తం హాజరైనట్లు తెలుస్తోంది.

ఈ వీడియోను ఇప్పటికే 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించారు. 17 లక్షల కంటే ఎక్కువమంది దీనిని లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమకు నచ్చిన విధంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరు బైకుకు పుట్టిన రోజు చేసిన వ్యక్తిని అభినందిస్తుంటే.. మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

బైకుపై ఆ వ్యక్తికి ఉన్న మమకారం చాలా గొప్పదని, అతని క్రియేటివిటీ అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు. మరికొందరు సైలెన్సర్ ఉపయోగించి క్యాండిల్స్ వెలిగించి ఉండొచ్చు కదా అని చమత్కరించారు. మనిషి తనకు నచ్చిన వస్తువునైనా ఎంత జాగ్రత్తగా.. ఎంత ప్రేమగా చూసుకుంటాడో అనే దానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఖచ్చితంగా వెల్లడి కాలేదు.

హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor+)

ఇక్కడ వీడియాలో కనిపించే బైక్ హీరో మోటోకార్ప్ యొక్క స్ప్లెండర్ ప్లస్ అని తెలుస్తోంది. ఈ బైకుకు భారతదేశంలో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. చూడటానికి సింపుల్ డిజైన్ కలిగి ఆకర్షణీయంగా ఉన్న ఈ బైక్ ఎక్కువ మైలేజ్ అందించే ద్విచక్ర వాహనాల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ బైక్ ప్రారంభ ధరలు రూ. 74155 మాత్రమే (ఎక్స్ షోరూమ్).

హీరో స్ప్లెండర్ ప్రస్తుతం భారతీయ మార్కెట్లో నాలుగు వేరియంట్లు.. ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 97.2 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 8000 rpm వద్ద 7.91 Bhp పవర్ మరియు 6000 rpm వద్ద 8.05 Nm టార్క్ అందిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే.. ఇది లీటరుకు 60 కిమీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. ఈ బైకును పట్టణ ప్రాంతాల్లో కంటే కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.

సుమారు 112 కేజీల బరువున్న హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 9.8 లీటర్లు కావడం గమనార్హం. ఒక ఫుల్ ట్యాంకుతో ఈ బైక్ 400 కిమీ కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 785 మీమీ వరకు ఉంటుంది. కాబట్టి పొట్టి రైడర్లకు కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది.

ప్రకాశవంతమైన లైటింగ్ సెటప్, రైడర్లకు కావలసిన అన్ని ఫీచర్స్ కలిగి ఉన్న ఈ బైక్.. ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అడ్జర్బార్, వెనుక 5 స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. ఇది డ్రమ్ బ్రేక్స్ పొందుతుంది. కాబట్టి అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

Don’t Miss: ఇప్పుడు ‘మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ’ రూపంలో.. 32.85 కిమీ మైలేజ్: ధర తెలిస్తే..

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకు డిమాండ్

భారతదేశంలో ఎన్నెన్ని బైకులు అందుబాటులో వచ్చినప్పటికీ.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవడానికి ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులనే చాలామంది ఎంచుకుంటారు. జాబితాలో హీరో మోటోకార్ప్ బైకులు అగ్రస్థానంలో ఉన్నాయి. వీటి ధరలు తక్కువగా ఉండటం మాత్రమే ఆధునిక డిజైన్.. అత్యాధునిక ఫీచర్స్ కలిగి ఉంటాయి. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఈ బైకులను రోజువారీ ఉపయోగానికి విచ్చలవిడిగా ఉపయోగించుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా ఎక్కువ మైలేజ్ అందించే బైకులను మార్కెట్లో లాంఛ్ చేస్తూ మంచి అమ్మకాలను పొందుతున్నాయి.

ఇప్పుడు ‘మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ’ రూపంలో.. 32.85 కిమీ మైలేజ్: ధర తెలిస్తే..

0

Maruti Swift CNG Launched in India: మారుతి సుజుకి (Maruti Suzuki) అంటే అందరికీ గుర్తొచ్చే కారు స్విఫ్ట్. ప్రారంభం నుంచి ఎంతోమంది వాహన ప్రేమికుల మనసుదోచిన ఈ కారు ఇప్పటికి కూడా మార్కెట్లో గొప్ప అమ్మకాలను పొందుతూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఇప్పటి వరకు ఫ్యూయెల్ కారుగానే మార్కెట్లో విక్రయించబడిన స్విఫ్ట్.. ఎట్టకేలకు సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయింది.

సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయిన కొత్త ‘మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ’ (Maruti Swift CNG) చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ ఇందులో సీఎన్‌జీ బ్యాడ్జెస్ వంటివి ఉండనున్నట్లు సమాచారం. వీటి ద్వారానే ఇది సీఎన్‌జీ కారు అని గుర్తించడానికి సాధ్యమవుతుంది.

వేరియంట్స్ & ధరలు

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ.. ప్రారంభ ధర రూ. 8.20 లక్షలు. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి వీఎక్స్ఐ, వీఎక్స్ఐ (ఓ) మరియు జెడ్ఎక్స్ఐ వేరియంట్స్. వీటి ధరలు వరుసగా రూ. 8.20 లక్షలు, రూ. 8.47 లక్షలు మరియు రూ. 9.20 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).

కొత్త మారుతి సుజుకి సీఎన్‌జీ ధర దాని పెట్రోల్ మోడల్ కంటే కూడా రూ. 90000 ఎక్కువ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. దేశ వ్యాప్తంగా స్విఫ్ట్ సీఎన్‌జీ కారును విక్రయించే ముందు.. గుజరాత్‌లో మాత్రమే విక్రయించనున్నారు. ఆ తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలలో విక్రయించనున్నారు.

సీఎన్‌జీ ఇంజిన్ వివరాలు

మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ కారు 1.2 లీటర్ జెడ్ సిరీస్ ఇంజిన్ పొందుతుంది. సీఎన్‌జీలో ప్రయాణించే సమయంలో ఇది 69 Bhp పవర్, 102 Nm టార్క్ అందిస్తుంది. పెట్రోల్ ఆప్షన్లో నడిచే సమయంలో ఇది 80.4 Bhp పవర్, 112 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారులో కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

డిజైన్ & ఫీచర్స్

ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానీ మారుతి స్విఫ్ట్ సీఎన్‌జీ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో డీఆర్ఎల్, అల్లాయ్ వీల్స్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్, ఎల్ఈడీ హెడ్‌లైట్స్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 7 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, రియర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్, యూఎస్బీ పోర్ట్స్ మరియు 60:40 స్ప్లిట్ రియర్ సీటు మొదలైనవి ఉన్నాయి.

మారుతి సుజుకి సీఎన్‌జీ సేల్స్

దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఇప్పటికి పద్నాలుగు (స్విఫ్ట్ సీఎన్‌జీతో కలిపి) సీఎన్‌జీ కార్లను లాంచ్ చేసింది. దీంతో సీఎన్‌జీ విభాగంలో మారుతి సుజుకి అగ్రగామిగా ఉంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఆరు లక్షల కంటే ఎక్కువ ప్యాసింజర్ సీఎన్‌జీ మరియు ఎస్‌యూవీలను విక్రయించింది. గత ఏడాది భారతదేశంలో 4.77 లక్షల సీఎన్‌జీ కార్లను మారుతి సుజుకి విక్రయించింది. కాగా 2024 ఏప్రిల్ నుంచి ఆగష్టు మధ్యలో 2.21 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క సీఎన్‌జీ కార్లకు దేశీయ విఫణిలో ఎంత డిమాండ్ ఉందొ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Don’t Miss: వేలానికి Mahindra Roxx మొదటి కారు: మీరు కూడా సొంతం చేసుకోవచ్చు

స్విఫ్ట్ సీఎన్‌జీ సేల్స్ ఎలా ఉండబోతున్నాయి?

నిజానికి ఇండియన్ మార్కెట్లో మారుతి సుజుకి యొక్క స్విఫ్ట్ కారుకు అధిక డిమాండ్ ఉంది. అయితే ఇది ఇప్పటి వరకు కేవలం పెట్రోల్ వెర్షన్ రూపంలోనే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో అందుబాటులోకి వచ్చేసింది. అంతే కాకుండా ఈ కారు మైలేజ్ 32.85 కిమీ/కేజీ. ఇది పెట్రోల్ కారు మైలేజ్ కంటే కూడా చాలా ఎక్కువ దీన్ని బట్టి చూస్తే.. స్విఫ్ట్ కొనాలనుకే ఎవరైనా ఇప్పుడు తప్పకుండా సీఎన్‌జీ వెర్షన్ స్విఫ్ట్ కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

వేలానికి Mahindra Roxx మొదటి కారు: మీరు కూడా సొంతం చేసుకోవచ్చు

0

First Mahindra Thar Roxx Car To Be Auctioned: మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ 2024 ఆగష్టు 15న దేశీయ విఫణిలోకి ‘థార్ రోక్స్’ (Mahindra Thar Roxx) లేదా 5 డోర్స్ థార్ లాంచ్ చేసింది. సంస్థ ఈ కొత్త కారు కోసం అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. అంతకంటే ముందు కంపెనీ తన మొదటి రోక్స్ కారును వేలం వేయడానికి సంకల్పించింది. దీని నుంచి వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు సమాచారం.

థార్ రోక్స్ కారును కంపెనీ వేలం వేయడానికి సిద్ధమైంది, కాబట్టి ఇందులో పాల్గొనాలనుకునేవారు సెప్టెంబర్ 12నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్ లాంచ్ అయినప్పుడు కూడా కంపెనీ వేలం నిర్వహించి.. మొదటి కారును ఏకంగా రూ. 1.1 కోట్లకు విక్రయించింది. దీనిని ఢిల్లీకి చెందిన ఆకాష్ మిండా కొనుగోలు చేసారు. అప్పట్లో ఈ వేలంలో సుమారు 5500 కంటే ఎక్కువమంది పాల్గొన్నారు.

మహీంద్రా థార్ 3 డోర్ మోడల్ మాదిరిగానే.. థార్ రోక్స్ కూడా భారీ ధరకు వేలంలో అమ్ముడవుతుందని భావిస్తున్నాము. అయితే ఎవరు సొంతం చేసుకోనున్నారు? ఎంత ధరకు సొంతం చేసుకోనున్నారు? అనే మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. వేలంలో విక్రయించనున్న మహీంద్రా థార్ రోక్స్ కారు టాప్ స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. ఇది VIN001 అనే బ్యాడ్జింగ్ పొందుతుంది. అంతే కాకుండా #1 అనే బ్యాడ్జింగ్ కూడా కనిపించనున్నట్లు సమాచారం.

క్యాబిన్ లోపల మెటల్ ప్లేట్స్, వీఐపీ నెంబర్ మరియు ”మేడ్ ఇన్ ఇండియా విత్ ప్రైడ్” అని కూడా ఉంటుంది. వేలంలో కారును సొంతం చేసుకునే బిడ్డర్ కోరిక మేరకు కలర్ మరియు పవర్‌ట్రెయిన్ వంటివి అందిస్తారు. కాబట్టి విజేత ఎవరనేది త్వరలోనే తెలిసిపోతుంది.

థార్ రోక్స్ గురించి

మహీంద్రా థార్ రోక్స్ అనేది.. 3 డోర్ థార్ మోడల్ యొక్క నవీనీకరణ. కాబట్టి చూడటానికి థార్ మాదిరిగానే ఉన్నప్పటికీ పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఇది 5 డోర్స్ పొందుతుంది. ఇది స్టీల్త్ బ్లాక్, బర్న్ సియన్నా, డీప్ ఫారెస్ట్, బాటిల్‌షిప్ గ్రే, నెబ్యులా బ్లూ, టాంగో రెడ్ మరియు ఎవరెస్ట్ వైట్ అనే ఏడు రంగులలో లభిస్తుంది. ఈ కారు కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్మితమై ఉండటం చేత.. చాలా దృఢంగా ఉంటుంది.

థార్ రోక్స్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 6 స్లాట్ గ్రిల్, ట్వీక్ చేయబడిన వీల్ ఆర్చెస్, కొత్త రూఫ్ లైన్, అప్డేటెడ్ రియర్ ఫ్రొఫైల్ మరియు 19 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఇది పూర్తిగా మెటాలిక్ బాడీ పొందుతుంది. ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే కాకుండా ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా అప్డేట్ పొందుతుంది. కాబట్టి ఇది విశాలమైన క్యాబిన్ పొందుతుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. మహీంద్రా థార్ రోక్స్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమాటిక్ ఏసీ, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లువంటి అనేక అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు లెవెల్ 2 ఏడీఏఎస్ సిస్టం కూడా పొందుతుంది. ఇది వాహన వినియోగదారుల భద్రతను నిర్దారించడంలో ఉపయోగపడుతుంది.

మహీంద్రా థార్ రోక్స్ 2.2 ఎంహాక్ డీజిల్ ఇంజిన్ మరియు 2.0 ఎంస్టాలిన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 173 బ్రేక్ హార్స్ పవర్ మరియు 370 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. పెట్రోల్ ఇంజిన్ 175 బ్రేక్ హార్స్ పవర్ (Bhp), 380 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది.

Don’t Miss: కొత్త కారు కొనుగోలుపై లక్షల డిస్కౌంట్స్!.. పండుగ సీజన్‌లో సరికొత్త ఆఫర్స్

థార్ 5 డోర్ వెర్షన్ అత్యుత్తమ పనితీరును అందించడానికి కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. పెట్రోల్ మోడల్ 12.4 కిమీ/లీ మైలేజ్ అందించగా.. డీజిల్ వెర్షన్ 15.20 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. మహీంద్రా థార్ రోక్స్ 4×2 వేరియంట్ ధరలు రూ. 12.99 లక్షల నుంచి రూ. 20.49 లక్షల మధ్య ఉన్నాయి. కంపెనీ 4×4 వెర్షన్ ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కాగా కంపెనీ ఈ కారును బుక్ చేసుకున్న వారికి విజయదశమి నాటికి డెలివరీ చేసే అవకాశం ఉంది.

కొత్త కారు కొనుగోలుపై లక్షల డిస్కౌంట్స్!.. పండుగ సీజన్‌లో సరికొత్త ఆఫర్స్

0

Biggest Discounts On Midsize SUVs in India Festive Season: భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభామైపోయింది. ఈ సమయంలో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలని చూస్తుంటారు. అలంటి వారి కోసం పలు కంపెనీలు గొప్ప డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం మొదలు పెట్టేశాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్, మారుతి సుజుకి, కియా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మరియు జీప్ వంటి అనేక కంపెనీలు. ఈ కథనంలో ఏ కంపెనీ.. ఏ కారు కొనుగోలు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తుందని వివరాలు వివరంగా తెలుసుకుందాం..

జీప్ కంపాస్ (Jeep Compass)

అమెరికన్ బ్రాండ్ అయిన జీప్ కంపెనీ తన ‘కంపాస్’ కొనుగోలుపైన ఏకంగా రూ. 3.15 లక్షల వరకు బెనిఫీట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 2.5 లక్షల క్యాష్ డిస్కౌంట్స్ ఉంది. ఇండియన్ మార్కెట్లో జీప్ కాంపస్ ధరలు రూ. 18.99 లక్షల నుంచి రూ. 28.33 లక్షల మధ్య ఉన్నాయి. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 170 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది. టాప్ స్పెక్ జీప్ కాంపస్ యొక్క ఎస్ వేరియంట్ మాత్రమే 4×4 ఆప్షన్ పొందుతుంది. ఈ కారు దేశీయ విఫణిలో టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun)

కొత్త కార్లు కొనాలనుకునేవారి కోసం ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ కూడా తన టైగన్ కారు మీద రూ. 3.07 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో కూడా 2023 మోడల్ టైగన్ 1.5 జీటీ మీద గరిష్ట తగ్గింపులు లభిస్తాయి. 1.0 లీటర్ ఇంజిన్ 2024 మోడల్ మీద రూ. 60000 నుంచి రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రూ. 11.70 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కారు దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, టాటా కర్వ్ మరియు సిట్రోయెన్ బసాల్ట్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయినప్పటికీ.. ఈ కారు ప్రారంభం నుంచి ఉత్తమ అమ్మకాలను పొందుతూనే ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400 (Mahindra XUV400)

దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఎక్స్‌యూవీ400 కొనుగోలు మీద కూడా రూ. 3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. మహీంద్రా యొక్క ఏకైన ఎలక్ట్రిక్ మోడల్ అయిన ఈ కారు ధరలు రూ. 16.74 లక్షల నుంచి రూ. 17.49 లక్షల మధ్య ఉన్నాయి. టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ మరియు ఎంజీ విండ్సర్ ఈవీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ400.. 39.4 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 456 కిమీ రేంజ్ అందిస్తుంది.

జీప్ మెరిడియన్ (Jeep Meridian)

మెరిడియన్ కారు మీద కంపెనీ రూ. 2.8 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 2 లక్షల వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 30 లక్షల నుంచి రూ. 37.14 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న ఈ 7 సీటర్ జీప్ కారు దేశీయ మార్కెట్లో స్కోడా కొడియాక్ కారుకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఎక్కువమంది ప్రజలకు, సెలబ్రిటీలకు ఇష్టమైన జీప్ బ్రాండ్ ఈ మెరిడియన్ అని తెలుస్తోంది.

టాటా సఫారీ (Tata Safari)

భారతీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ యొక్క సఫారీ కొనుగోలు మీద రూ. 1.65 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. సఫారీ యొక్క మిడ్ స్పెక్ ప్యూర్ ప్లస్ ఎస్ మరియు ప్యూర్ ప్లస్ ఎస్ డార్క్ వేరియంట్ల కొనుగోలుపైన అధిక ప్రయోజనాలను పొందవచ్చు. 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతాయి. రూ. 15.49 లక్షల నుంచి రూ. 27.34 లక్షల ధర మధ్య అందుబాటులో ఉన్న సఫారీ ఇండియన్ మార్కెట్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా హారియర్ (Tata Harrier)

హారియర్ కారు కొనుగోలుపైన కంపెనీ రూ. 1.45 లక్షల ప్రయోజనాలను అందిస్తుంది. హారియర్ 5 సీటర్ మోడల్ మీద రూ. 1.20 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. 2023 మోడల్ మీద అదనంగా రూ. 25000 తగ్గింపు పొందవచ్చు. ఈ కారు ధరలు దేశీయ విఫణిలో రూ. 14.99 లక్షల నుంచి రూ. 26.44 లక్షల మధ్య ఉన్నాయి. ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ700, జీప్ కంపాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

కియా సెల్టోస్ (Kia Seltos)

భారతదేశంలో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న కియా కంపెనీ యొక్క సెల్టోస్ మీద రూ. 1.3 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా యాక్ససరీస్ ప్యాకేజ్, ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. ఇది హ్యుందాయ్ క్రెటా, టాటా కర్వ్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

కియా సెల్టోస్ కారు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ మరియు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్స్ పొందుతుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు సీవీటీ ఆప్షన్స్ పొందుతుంది. టర్బో పెట్రోల్ ఇంజిన్ ఐఎంటీ మరియు డ్యూయెల్ క్లచ్ ఆప్షన్ పొందుతుంది. మార్కెట్లో సెల్టోస్ ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 20.37 లక్షల మధ్య ఉన్నాయి.

మారుతి గ్రాండ్ విటారా (Maruti Grand Vitara)

దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ ముందుకు సాగుతున్న మారుతి గ్రాండ్ విటారా కొనుగోలుపైన కూడా కస్టమర్లు రూ. 1.28 లక్షల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కారు ధరలు రూ. 18.43 లక్షలు రూ. 19.93 లక్షల మధ్య ఉంటుంది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ మరియు CNG రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

హ్యుందాయ్ ఆల్కజార్ (Hyundai Alcazar)

ఆల్కజర్ కొనుగోలుపైన హ్యుందాయ్ కంపెనీ రూ. 90000 వరకు ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇది ఇండియన్ మార్కెట్లో టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా కంపెనీ యొక్క ఆల్కజార్ ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా అందుబాటులో ఉంది.

హోండా ఎలివేట్ (Honda Elevate)

ఇక చివరగా హోండా కంపెనీ కూడా తన ఎలివేటర్ కారు కొనుగోలుపైనా రూ. 75000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ తగ్గింపులు 2024 ఏప్రిల్ ముందు వరకు తయారు చేయబడిన కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కారు ధర మార్కెట్లో రూ. 11.91 లక్షల నుంచి రూ. 16.51 లక్షల మధ్య ఉన్నాయి. హోండా ఎలివేట్ మల్టిఫుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, త్రీ పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: ఒలంపిక్‌ విజేత ‘మను భాకర్’కు ఖరీదైన గిఫ్ట్.. ఇది ఇండియాలోనే ఫస్ట్‌!

గమనిక: ప్రస్తుతం పండుగ సీజన్ కాబట్టి.. వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల మీద మంచి తగ్గింపులు అందిస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనాలు లేదా డిస్కౌంట్స్ అనేవి నగరాన్ని బట్టి మారుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులు గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే కంపెనీ యొక్క అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవడం ఉత్తమం.

ఒలంపిక్‌ విజేత ‘మను భాకర్’కు ఖరీదైన గిఫ్ట్.. ఇది ఇండియాలోనే ఫస్ట్‌!

0

Indian Shooter Manu Bhaker Gifted Tata Curvv EV: 2024 ప్యారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటి రెండు కాంస్య పతకాలను గెలుచుకున్న ‘మను భాకర్’ (Manu Bhaker)ను ఇటీవల దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఘనంగా సత్కరించింది. ఇందులో భాగంగానే కంపెనీ రూ. 17 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ‘టాటా కర్వ్ ఈవీ’ (Tata Curvv EV) కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఒలింపిక్స్‌లో రెండు పతకాలను సాధించిన దేశం గర్వించేలా చేసిన మను భాకర్.. భారతదేశపు మొట్ట మొదటి కర్వ్ ఈవీ కారును సొంతం చేసుకుంది. గురుగ్రామ్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఇందులో ఆమెకు కారును అందించారు. ఇందులో కంపెనీ అధికారులతో పాటు.. మను భాకర్ తల్లిదండ్రులు రామ్ కిషన్ మరియు సుమేధా భాకర్ కూడా ఉన్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో.. మను భాకర్ ఫోటోలకు పోజులివ్వడం వంటి దృశ్యాలను కూడా చూడవచ్చు. ఇక్కడ కనిపించే కారు ప్యూర్ గ్రే క్లాసీ షేడ్‌లో ఉంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. మనుకు అభినందనలు చెబుతున్నారు.  ఇప్పటికే ఈ పోటోలను లెక్కకు మించిన యూజర్లు లైక్ చేశారు.

టాటా కర్వ్ ఈవీ

భారతీయ విఫణిలో ఇటీవల టాటా మోటార్స్ తన కర్వ్ కూపేను.. పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరలు రూ. 17.49 లక్షలు కాగా.. టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 21.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉన్నాయి. చూడగానీ నెక్సాన్ ఈవీని తలపించే ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉంది. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు సింగిల్ చార్జితో ఏకంగా 585 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. అయితే రేంజ్ అనేది వాస్తవ పరిస్థితుల్లో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్ ప్లస్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లలో లభించే టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్స్ పొందుతాయి. అవి 45 కిలోవాట్ బ్యాటరీ.. 55 కిలోవాట్ బ్యాటరీ. ఈ రెండూ వరుసగా 502 కిమీ రేంజ్ మరియు 585 కిమీ రేంజ్ అందిస్తాయి. మను భాకర్ పొందిన కార్ టాప్ వేరియంట్ (55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్) అని తెలుస్తోంది.

మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, 3 పాయింట్ సీట్ బెల్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కలిగిన టాటా కర్వ్ ఈవీ.. ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్ మొదలైన లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ విఫణిలో ప్రధానంగా ‘ఎంజీ జెడ్ఎస్ ఈవీ’కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) అందుకోనున్న మను భాకర్

ఇప్పుడు టాటా కర్వ్ ఈవీ కారును గిఫ్ట్‌గా పొందిన మను భాకర్ కోసం ఎంజీ మోటార్ వారి కొత్త ‘విండ్సర్ ఈవీ’ కూడా ఎదురు చూస్తోంది. ఈ కారును కూడా ఈమె గిఫ్ట్‌గా పొందనుంది. ఇప్పటికే ఈ విషయం అధికారికంగా వెల్లడైంది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన ప్రతి ఒక్కరికీ జేఎస్‌డబ్ల్యు గ్రూప్ ఎంజీ విండ్సర్ ఈవీ కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కాబట్టి ఈ కారును వారు ఏ సమయంలో అయిన అందించవచ్చు.

ఎంజీ విండ్సర్ ఈవీ కారు ఈ రోజు (సెప్టెంబర్ 11) అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు 38 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 331 కిమీ అందిస్తుందని సమాచారం. ఈ లేటెస్ట్ మోడల్ కొత్త డిజైన్ కలిగి ఉండటమే కాకుండా.. ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది.

Don’t Miss: చిన్న కారు కొన్న పెద్ద హీరోయిన్.. దీని రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు

మను భాకర్ ఎంజీ గ్లోస్టర్

ఒలంపిక్ కాంస్య పతక విజేత మను భాకర్ ఎంజీ గ్లోస్టర్ కారును కలిగి ఉన్నట్లు సమాచారం. ఇది స్టార్రీ బ్లాక్ షేడ్‌లో ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మను భాకర్ ఉపయోగించే ఎంజీ గ్లోస్టర్ ఏ వేరియంట్ అనేది తెలియాల్సిన విషయం. అయితే ఈ కారు ప్రారంభ ధర రూ. 38.80 లక్షలు అని తెలుస్తోంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన MG Windsor EV: సింగిల్ ఛార్జ్ 331 కిమీ రేంజ్

0

MG Windsor EV Launched in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ (MG Motors) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన ‘విండ్సర్ ఈవీ’ (Windsor EV) కారును అధికారికంగా లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందుతున్న ఎంజీ మోటార్ ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందినట్లు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ యొక్క ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో జేఎస్‌డబ్ల్యూ (JSW) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న తరువాత దేశీయ విఫణిలో లాంచ్ చేసిన మొదటి ఉత్పత్తి లేదా మొదటి ఎలక్ట్రిక్ కారు విండ్సర్ కావడం గమనార్హం.

బుకింగ్స్ మరియు డెలివరీలు

ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన కొత్త విండ్సర్ ఈవీ బుకింగ్స్ 2024 అక్టోబర్ 3 నుంచి అధికారికంగా ప్రారంభమవుతాయి. డెలివరీలు అదే నెలలో (అక్టోబర్ 13) ప్రారంభమవుతాయని సమాచారం. ఎంజీ విండ్సర్ ఈవీ అనేది కంపెనీ యొక్క మూడో ఎలక్ట్రిక్ కారు కావడం గమనించదగ్గ విషయం. ఇప్పటికే జెడ్ఎస్ ఈవీ మరియు కామెట్ ఈవీ రెండూ కూడా ఉత్తమ అమ్మకాలను పొందగలిగాయి. కాబట్టి విండ్సర్ ఈవీ కూడా తప్పకుండా మంచి సేల్స్ పొందుతుందని భావిస్తున్నాము. అయితే టెస్ట్ డ్రైవ్స్ ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతాయి.

వేరియంట్స్ మరియు కలర్ ఆప్షన్స్

ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభించే ఎంజీ విండ్సర్ ఈవీ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి స్టార్‌బర్స్డ్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్ మరియు టర్కోయిస్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చూడచక్కగా.. చూడగానే ఆకర్శించబడే విధంగా ఉంటాయి.

డిజైన్

దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త కొత్త ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు విలాసవంతమైన డిజైన్ పొందుతుంది. చూడటానికి ఇది పెద్ద హ్యాచ్‌బ్యాక్ మాదిరిగా ఉంటుంది. రెండు వరుసల సీటింగ్ పొజిషన్ కలిగిన ఈ కారులో ఐదుమంది ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ కొత్త విండ్సర్ ఈవీ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ముందు భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ లైట్ బార్ ఉన్నాయి. బంపర్ మీద అమర్చబడిన హెడ్‌ల్యాంప్స్ స్టెప్డ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ పొందుతాయి. రియర్ ప్రొఫైల్ కూడా అద్భుతమైన డిజైన్ పొందుతుంది. వెనుక కూడా వెడల్పు అంతటా లైట్ బార్ విస్తరించి ఉంటుంది. బ్రాండ్ లోగో మరియు విండ్సర్ అనే అక్షరాలను ఇక్కడ చూడవచ్చు.

ఫీచర్స్

డిజైన్ మాదిరిగానే విండ్సర్ ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉన్నాయి. క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డులో పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం చూడవచ్చు. ఇందులో ప్లోటింగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు. సీటింగ్ పొజిషన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సెంట్రల్ స్క్రీన్ కింద హీటింగ్, వెంటిలేషన్ మరియు ఏసీ కంట్రోల్స్ వంటివి ఉన్నాయి.

పవర్డ్ టెయిల్‌గేట్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆరు స్పీకర్లతో ఆడియో సిస్టం మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పనోరమిక్ గ్లాస్ రూప్ వంటివి ఇందులో ఉన్నాయి. మొత్తం మీద వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఎంజీ విండ్సర్ ఈవీలో చూడవచ్చు.

బ్యాటరీ & రేంజ్

ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్ లిథియం ఐరన్ పాస్పేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 331 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 136 హార్స్ పవర్ మరియు 200 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్ మరియు స్పోర్ట్స్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

Don’t Miss: వాహన ప్రియులకు శుభవార్త.. సరికొత్త హీరో బైక్ వచ్చేసింది: రూ.10000 తక్కువ

కొత్త విండ్సర్ ఈవీ కొనుగోలు చేసేవారికి కంపెనీ బ్యాటరీ మీద లైఫ్‌టైమ్ వారంటీ అందిస్తుంది. అంతే కాకుండా కంపెనీ మొదటి ఏడాది ఫ్రీ పబ్లిక్ ఛార్జింగ్ కూడా అందిస్తుంది.కాబట్టి ఈ కారు కొనుగోలుదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. కంపెనీ అందించే కొన్ని ఆఫర్స్ కూడా పొందవచ్చు.

వాహన ప్రియులకు శుభవార్త.. సరికొత్త హీరో బైక్ వచ్చేసింది: రూ.10000 తక్కువ

0

2024 Hero Xtreme 160R 2V launched in India: భారతదేశంలో అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) కొన్ని నెలల క్రితం ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ బైకును అప్డేట్ చేసి మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కొన్ని స్వల్ప అప్‌డేట్‌లతో ‘ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ’ (Xtreme 160R 2V) లాంచ్ చేసింది.

ధర (Price)

హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైక్ ధర రూ. 1.11 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ ధర దాని మునుపటి మోడల్ కంటే రూ. 10,000 తక్కువ. ఇది స్టెల్త్ బ్లాక్ కలర్ స్కీమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. పండుగ సీజన్‍లో అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీ ఈ బైకును తక్కువ ధర వద్ద లాంచ్ చేసినట్లు తెలుస్తోంది.

డిజైన్ (Design)

చూడటానికి దాని స్టాండర్డ్ బైకు మాదిరిగానే అనిపిస్తుంది. కానీ ఇందులో సూక్షమైన అప్డేట్స్ గుర్తించవచ్చు.టెయిల్ లాంప్ డిజైన్ కొంత అప్డేట్ పొందింది. అయితే హెడ్‌ల్యాంప్ డిజైన్, ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్ అన్నీ కూడా సాధారణ బైకు మాదిరిగానే ఉన్నాయి. సీట్ డిజైన్ కూడా ఎలాంటి మార్పు పొందలేదు. సింగిల్ పీస్ సీటు అయినప్పటికీ.. స్టెప్ అప్ మాదిరిగా ఉంటుంది.

ఫీచర్స్ (Features)

ఇక్కడ గమనించాల్సిన అదిపెద్ద అప్డేట్ ఏమిటంటే డిజిటల్ డ్యాష్ రెండు మోడ్‌లతో డ్రాగ్ రేస్ టైమర్ పొందుతుంది. ఈ బైక్ యొక్క వెనుక భాగంలో సింగిల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. టెలిస్కోపిక్ పోర్క్ మరియు మోనోషాక్ సెటప్ కలిగిన ఈ బైక్ 100/80-17 సెక్షన్ ఫ్రంట్ మరియు 130/70 ఆర్17 రియర్ టైర్ పొందుతుంది.

అప్డేటెడ్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్లు. సీటు ఎత్తు 795 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి రైడర్ మరియు పిలియన్ ఇద్దరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. సీటు ఎత్తు మునుపటి కంటే కూడా కొంత తగ్గించబడి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద ఇది రైడర్లకు అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంజిన్ వివరాలు (Engine Details)

2024 హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైక్ యొక్క ఇంజిన్ ఎటువంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి అదే 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8500 rpm వద్ద 15 హార్స్ పవర్ మరియు 6500 rpm వద్ద 14 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరుని అందిస్తుంది.

ప్రత్యర్థులు (Rivals)

భారతీయ విఫణిలో బజాజ్ పల్సర్ ఎన్150 మరియు యమహా కంపెనీ యొక్క ఎఫ్‌జెడ్ శ్రేణి బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ.. మార్కెట్లో ఎలాంటి అమ్మకాలు పొందుతుందో చూడాలి. ధర తక్కువే కాబట్టి ఈ బైక్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.

అప్డేటెడ్ బైకులు లాంచ్ చేయడానికి కారణం

వాహన ప్రియులు ఎప్పటికప్పుడు కొత్త బైకులు లేదా అప్డేటెడ్ బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే హీరో మోటోకార్ప్ కూడా 2024 ఎక్స్‌ట్రీమ్ బైక్ లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతూ.. అధిక ప్రజాదరణ పొందుతున్న కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూ.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు కంపెనీ లాంచ్ చేసిన అప్డేటెడ్ ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ బైకును రూ. 10000 తక్కువ ధరకే లాంచ్ చేసింది.

Don’t Miss: చిన్న కారు కొన్న పెద్ద హీరోయిన్.. దీని రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు

హీరో మోటోకార్ప్ ఇప్పటికే దేశీయ మార్కెట్లో అత్యుత్తమ మైలేజ్ అందించే బైకులను లాంచ్ చేసి అధిక అమ్మకాలు పొందుతోంది. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారు.. ఈ రోజుకు కూడా హీరో మోటోకార్ప్ యొక్క వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు అంటే.. ఈ కంపెనీకి దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

చిన్న కారు కొన్న పెద్ద హీరోయిన్.. దీని రేటు తెలిస్తే మీరూ కొనేస్తారు

0

Bollywood Actress Kirti Kulhari Buys New MG Comet EV: ఎంజీ కామెంట్ ఈవీ (MG Comet EV).. ఈ రోజు భారతదేశంలో సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు అందరూ ఇష్టపడి కొనుగోలు చేస్తున్న పాపులర్ ఎలక్ట్రిక్ కారు. ధర తక్కువ.. రేంజ్ ఎక్కువ ఇవ్వడంలో రోజు వారీ వినియోగానికి.. నగర ప్రయాణానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల రద్దీగా ఉండే నగరాల్లో కూడా ఇది సజావుగా ముందుకు దూసుకెళ్లగలుగుతుంది. ఈ కారును ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీ.. ప్రముఖ నటి ‘కిర్తీ కుల్హారీ’ (Kirti Kulhari) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.

వీడియోలో గమనించినట్లయితే.. నటి కిర్తీ కుల్హారీ ఎంజీ కామెట్ ఈవీ కారును డెలివరీ తీసుకోవడం, పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వంటివి మాత్రమే కాకుండా కేక్ కట్ చేయడం వంటివి చూడవచ్చు. ఆ తరువాత కారును డ్రైవ్ చేయడం వంటివి కూడా వీడియోలో చూడవచ్చు. ఫోటోలను షేర్ చేస్తూ ”మేరే ఘర్ ఆయీ ఏక్ నాన్హీ పరి” అని క్యాప్షన్ ఇచ్చింది. నేను భారతదేశంలోని అతి చిన్న కారును కొనుగోలు చేసాను.. దీనిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అని కూడా వెల్లడించింది.

ఎంజీ కామెట్ ఈవీ

ప్రస్తుతం భారతదేశంలో తక్కువ ధరకు లభించే ఉత్తమ ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ మోటార్స్ యొక్క ”కామెట్ ఈవీ” ఒకటి. మూడు వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.53 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి.

నటి కిర్తీ కుల్హారీ కొనుగోలు చేసిన కారు టాప్ స్పెక్ వేరియంట్ ఎక్స్‌క్లూజివ్ అని తెలుస్తోంది. దీని ధర రూ.9 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఇది అరోరా సిల్వర్ క్లాసీ షేడ్ పొందుతుంది.చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఈ కారు అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది.

ఎంజీ కామెట్ ఈవీ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. దీనిని సాధారణ హోమ్ సాకెట్ (3.3 కేడబ్ల్యు ఛార్జర్) ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని మోటారు 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కామెట్ ఈవీ ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

ఎంజీ కామెట్ ఈవీ కలిగిన ఇతర సెలబ్రిటీలు

చిన్న కారు.. పాపులర్ మోడల్ ఎంజీ కామెట్ ఈవీను కిర్తీ కుల్హారీ మాత్రమే కాకుండా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కొనుగోలు చేశారు. ఈ జాబితాలో కన్నడ స్టార్ హీరో సునీల్ శెట్టి, మలయాళీ నటి మీనాక్షి టెలివిజన్ స్టార్ రోహిత్ రాయ్ మొదలైనవారు ఉన్నారు. సెలబ్రిటీలు మాత్రమే కాకుండా చాలామంది సంపన్నులు కూడా ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం నగరప్రయాణానికి ఇది అనుకూలంగా ఉండటమే.

రోజు వారీ ప్రయాణానికి అనుకూలంగా ఉండే ఈ కారు హాలోజన్ హెడ్‌ల్యాంప్, హాలోజన్ టెయిల్‌లాంప్, ఇల్యూమినేటెడ్ ఎంజీ బ్రాండ్ లోగో, వీల్స్ కవర్స్ కలిగిన 12 ఇంచెస్ స్టీరింగ్ వీల్ వంటివి పొందుతుంది. మూడు డోర్స్ కలిగిన ఈ కారులో నలుగురు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

టాటా టియాగో ఈవీ మరియు సిట్రోయెన్ ఈసీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఎంజీ మోటార్స్ యొక్క కామెట్ ఈవీ.. ఇప్పటికే దేశీయ మార్కెట్లో వేలసంఖ్యలో అమ్ముడైంది. ఈ కారు మొత్తం ఆరు కలర్ (గ్రీన్ విత్ బ్లాక్ రూఫ్, క్యాండీ వైట్ విత్ స్టార్రి బ్లాక్, స్టార్రీ బ్లాక్, అరోరా సిల్వర్, క్యాండీ వైట్) ఆప్షన్లలో లభిస్తుంది.

Don’t Miss: హ్యుందాయ్ లాంచ్ చేసిన సరికొత్త పెద్ద కారు: ధర ఎంతో తెలుసా

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎంజీ కామెట్ ఈవీ కారు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, మాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. మొత్తం మీద పొట్టి కారు అయినప్పటికీ.. బహు గట్టి ఫీచర్స్ ఉండటం వల్ల ఎక్కువమంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.