24.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 36

ఇంత ఖరీదైన స్కూటర్లను ఎప్పుడైనా చూశారా? ధర తెలిస్తే తప్పకుండా షాకవుతారు!

0

Most Expensive Scooters In India: బైక్ ధర ఎక్కువా? స్కూటీ ధర ఎక్కువా? అని ఎవరినైనా అడిగితే.. అందరూ బైక్ ధరే ఎక్కువని చెబుతారు. కానీ రూ. 10 లక్షల కంటే ఖరీదైన స్కూటర్లు (స్కూటీ) కూడా భరతదేశంలో అమ్మకానికి ఉన్న విషయం బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ కథనంలో దేశంలోనే అత్యంత ఖరీదైన స్కూటర్లు ఏవి? వాటి ధర ఎంత అనే వివరాలు వివరంగా తెలుసుకుందాం.

వెస్పా 946 డ్రాగన్

సాధారణ వెస్పా స్కూటర్లతో పోలిస్తే.. వెస్పా 946 డ్రాగన్ ధర చాలా ఎక్కువ. అంటే దీని రేటు అక్షరాలా రూ. 14.28 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత ఖరీదైన స్కూటర్. లూనార్ న్యూ ఇయర్ సందర్భంగా కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 1888 యూనిట్ల వెస్పా 946 డ్రాగన్ స్కూటర్లను మాత్రమే విక్రయిస్తుంది. అంటే దీనిని 1888 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు.

వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ 150 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది సాధారణ వెస్పా స్కూటర్ల కంటే కొంత భిన్నంగా ఉంటుంది. గోధుమ రంగు పెయింట్ స్కీమ్ పొందిన ఈ స్కూటర్.. డ్రాగన్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇది 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి ధర కూడా కొంత ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ సీ400 జీటీ

భారతదేశంలో అత్యంత ఖరీదైన స్కూటర్ల జాబితాలో బీఎండబ్ల్యూ సీ400 జీటీ కూడా ఒకటి. ఇదొక మ్యాక్సీ స్కూటర్. దీని ధర రూ. 11.25 లక్షలు. దీనిని కంపెనీ మొదటిసారి 2021లో సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్)గా పరిచయం చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత శక్తివంతమైన స్కూటర్లలో బీఎండబ్ల్యూ సీ400 జీటీ కూడా ఒకటి.

బీఎండబ్ల్యూ సీ400 జీటీ అనేది ఒక మ్యాక్సీ స్కూటర్ కావడం వల్ల.. ఇది సాధారణ స్కూటర్ల కంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ లైన్స్ మరియు క్రీజులను పొందుతుంది, వీ-షేప్ హెడ్‌ల్యాంప్ ఇక్కడ గమనించవచ్చు. అల్లాయ్ వీల్స్, స్టెప్డ్ సీటు కూడా ఇందులో చూడవచ్చు. ఈ స్కూటర్ 350 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 33.5 Bhp పవర్ మరియు 35 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 139 కిమీ కావడం గమనార్హం.

కీవే సిక్స్టీస్ 300ఐ

వినడానికి పేరు కొత్తగా ఉన్నా.. ఇది ఓ మంచి స్టైలిష్ స్కూటర్. దీని ధర రూ. 3.30 లక్షలు (ఎక్స్ షోరూమ్). కీవే అనేది చైనీస్ మోటార్‌సైకిల్ తయారీదారు కియాన్‌జియాంగ్ మోటార్‌సైకిల్ గ్రూపులో భాగం. ఈ స్కూటర్ స్పెషల్ డిజైన్ కలిగి.. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కంపెనీ దీనిని 60వ దశకానికి నివాళిగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్ రిట్రో డిజైన్ ఎలిమెంట్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. కస్టమర్ ఎంచుకునే కలర్ ఆప్షన్ బట్టి మెటాలిక్ యాక్సెంట్స్ ఉంటాయి. ఇది ఒక పాత మోడల్ స్కూటర్‌ను గుర్తుకు తెస్తుంది. ఇది మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్ మరియు మ్యాట్ గ్రే అనే మూడు రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇందులోని 278.2 సీసీ ఇంజిన్ 18.4 Bhp పవర్ మరియు 23.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

కీవే వీస్టే 300

భారతదేశంలో అమ్ముడవుతున్న మరో ఖరీదైన స్కూటర్ కీవే వీస్టే 300. ఈ స్కూటర్ ధర రూ. 3.25 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని ‘కీవే సిక్స్టీస్ 300ఐ’తో కలిపి ప్రారంభించింది. దీని డిజైన్ మ్యాక్సీ స్కూటర్ తరహాలో ఉంటుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, అల్లాయ్ వీల్స్, షార్ప్ లుకింగ్ బాడీ లైన్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. ఈ స్కూటర్ 278.2 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 18.4 Bhp పవర్ మరియు 22.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

ఏథర్ 450 అపెక్స్

ఇక చివరగా మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు ఖరీదైన స్కూటర్ ఏథర్ 450 అపెక్స్. కంపెనీ దీన్ని 10వ యానివెర్సరీ సందర్భంగా లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీనిని కంపెనీ పరిమితి కాలం మాత్రమే విక్రయించే అవకాశం ఉంది. చూడటానికి స్టాండర్డ్ ఏథర్ 450 ఎక్స్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇదొక స్పెషల్ పెయింట్ స్కీమ్ పొందుతుంది.

Don’t Miss: అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ ఖరీదైన కార్లు ఇవే!.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ఏథర్ 450 అపెక్స్ 3.7 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ స్కూటర్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటివి పొందుతుంది. ఈ స్కూటర్ 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. మొత్తం మీద ఇది మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తుందని తెలుస్తోంది.

అనంత్ అంబానీ & రాధికా మర్చంట్ ఖరీదైన కార్లు ఇవే!.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

0

Anant Ambani and Radhika Merchant Car Collection: భారతీయ దిగ్గజ వ్యాపారవేత్త మరియు ఆసియాలోని అత్యంత ధనవంతులైన ప్రముఖ జాబితాలో ఒకరైన ముకేశ్ అంబానీ.. తన చిన్న కుమారుడు ‘అనంత్ అంబానీ’కి జులై 12న ‘రాధికా మర్చెంట్’తో వివాహం చేయనున్నారు. ఇప్పటికే రెండు సార్లు ఈ జంటకు ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిపారు. కాగా వీరిరువురు త్వరలో ఒక్కటి కానున్నారు.

త్వరలో మూడుముళ్లతో ఒక్కటి కానున్న ఈ జంట (అనంత్ & రాధిక) ఖరీదైన అన్యదేశ్య కార్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో రోల్స్ రాయిస్, బెంజ్, ఆడి మొదలైన కార్లు ఉన్నాయి. ఈ కథనంలో అనంత్, రాధికా మర్చెంట్ ఉపయోగించే కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

అనంత్ అంబానీ ఉపయోగించే కార్లు
రోల్స్ రాయిస్ కల్లినన్

అనంత్ అంబానీ ఉపయోగించే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ కారు రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన కల్లినన్. దీని ధర రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు 6.75 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 571 హార్స్ పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. తద్వారా వాహన వినియోగదారు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63

అనంత్ అంబానీ ఉపయోగించే మరో ఖరీదైన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఏఎంజీ జీ63. దీని ధర రూ. 3 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. ఇది 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 416 హార్స్ పవర్ మరియు 612 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు కేవలం 5.8 సెకన్లలో గంటకు 0 నుంచి 96 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ/గం వరకు ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఐ8

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ8 కూడా అనంత్ అంబానీ ఉపయోగించే కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. దీని ప్రారంభ ధర రూ. 2.14 కోట్లు అని తెలుస్తోంది. ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇందులో 11.6 కిలోవాట్ బ్యాటరీతో కూడిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 369 హార్స్ పవర్ మరియు 571 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 4.3 సెకన్లలో 0 నుంచి 96 కిమీ/గం వరకు వేగవంతమవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 250 కిమీ/గం కావడం గమనార్హం.

మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్

అనంత్ అంబానీ ఉపయోగించే మరో ఖరీదైన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ కంపెనీకి చెందిన ‘ఎస్-క్లాస్’. ఈ కారు ధర రూ. 1.77 లక్షల నుంచి రూ. 1.81 కోట్లు. ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇప్పటికే దేశంలోని పలువురు ప్రముఖ సెలబ్రిటీల గ్యారేజిలో కూడా ఈ కారు ఉంది. దీనిని చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇష్టపడి కొనుగోలు చేస్తారు.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ

ఇక చివరగా అనంత్ అంబానీ ఎక్కువగా ఉపయోగినే ఖరీదైన కారు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. సుమారు రూ. 2.12 కోట్ల ఖరీదైన ఈ కారు.. ఏకంగా 2.5 టన్నుల కంటే ఎక్కువ బరువు ఉంటుంది. ఈ కారులో 4.4 లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 523 హార్స్ పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇందులోని ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు కేవలం 4.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగవంతమవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 240 కిమీ/గం.

రాధికా మర్చంట్ ఉపయోగించే కార్లు
మెర్సిడెస్ బెంజ్ ఈ220డీ

అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్న రాధికా మర్చెంట్ కూడా విలాసవంతమైన కార్లను ఉపయోగిస్తారు. ఈమె వద్ద ఉన్న కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ ఈ220డీ. సుమారు రూ. 80 లక్షల ఖరీదైన ఈ కారు 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 192 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. గంటకు 240 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

Don’t Miss: బర్త్‌డేకు చిన్న కారు కొన్న హీరోయిన్.. ధర తెలిస్తే మీరే కొనేస్తారు (ఫోటోలు)

బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ

నీతా అంబానీ, ముకేశ్ అంబానీ ఈ కారును రాధికా, అనంత్ అంబానీ నిశ్చితార్థం తర్వాత రాధికా మర్చెంట్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ధర కోట్ల రూపాయలు ఉంటుంది. భారతదేశంలోని అత్యంత విలాసవంతమైన కార్ల జాబితాలో ఇది ఒకటి కావడం గమనార్హం. ఇది 6.0 లీటర్ డబ్ల్యు12 ఇంజిన్ పొందుతుంది. ఇది 659 పీఎస్ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు 3.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది ఎలక్ట్రినిక్ లిమిటెడ్ సల్పి డిఫరెన్షియల్ ఫీచర్ కూడా పొందుతుంది. కాబట్టి ఇది శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

బర్త్‌డేకు చిన్న కారు కొన్న హీరోయిన్.. ధర తెలిస్తే మీరే కొనేస్తారు (ఫోటోలు)

0

Actress Namratha Gowda Buys MG Comet EV: సాధారణంగా సెలబ్రిటీ అంటే ఖరీదైన కార్లు, లగ్జరీ కార్లు లేదా సూపర్ కార్లు కొంటారని అందరికి తెలుసు. కానీ నేడు ట్రెండ్ మారిందా అనిపిస్తుంది. ఎందుకంటే బుల్లితెర నటుల నుంచి ప్రముఖ సినీ నటుల వరకు చాలామంది తక్కువ ధరలో లభించే కార్లను కూడా కొనుగోలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. గత కొన్ని రోజులకు ముందు సినీల్ శెట్టి.. ఎంజీ కామెట్ ఈవీ కొనుగోలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ కన్నడ నటి నమ్రత గౌడ కామెట్ ఈవీ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నమ్రత గౌడ కొత్త కారు

బుల్లితెర మీద పాపులర్ అయిన నమ్రత గౌడ (Namratha Gowda) సినిమాల్లో కూడా తనదైన రీతిలో నటిస్తూ అభిమానుల మనసు దోచేస్తోంది. అంతకంటే ముందు కన్నడ బిగ్‌బాస్ 10 సీజన్‌లో కూడా నటించారు. ఇటీవల ఈమె తన పుట్టిన రోజుకి ఓ ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేశారు. ఇది దేశీయ మార్కెట్లోని అతి తక్కువ ధర వద్ద లభిస్తున్న కార్లలో ఒకటి. అదే ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV).

కొత్త కారు కొనుగోలు చేసిన తరువాత దానిని డెలివరీ తీసుకోవడానికి.. తల్లిదండ్రులతో కలిసి డీలర్షిప్ చేరుకున్నారు. కారును డెలివరీ తీసుకునే సమయంలో ఈమె ఫోటోలకు ఫోజులిచ్చారు. బెంగళూరు వంటి నగరాల్లో ఇలాంటి కారు చాలా ఉత్తమంగా ఉంటుందని ఈ కారును కొనుగోలు చేసినట్లు నమ్రత పేర్కొన్నారు.

ఎంజీ కామెట్ ఈవీ

భారతదేశం ప్రస్తుతం సరసమైన ధర వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో ఇది ఒకటి. ఈ కారు ప్రారంభ ధర రూ. 668800 (ఎక్స్ షోరూమ్). అయితే ధర అనేది ఎందుకుని వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఇటీవల 100 ఇయర్స్ ఎడిషన్ రూపంలో కూడా లాంచ్ అయింది. అయితే నమ్రత గౌడ కొనుగోలు చేసిన కారు సాధారణ ఎంజీ కామెట్ ఈవీ అని తెలుస్తోంది. ఈ కారు ఎల్ఈడీ లైట్ బార్, ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ మరియు బ్రాండ్ లోగో వంటివి చూడవచ్చు. వెనుక భాగం కూడా చాలా స్టైలిష్ డిజైన్ పొందుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారు లోపలి భాగం వైట్ అండ్ గ్రీ కలర్ పొందుతుంది. 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 10.25 డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటితో పాటు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ, పవర్ విండోస్, లెదర్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకూండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఈ కారులో నిక్షిప్తమై ఉన్నాయి. ఎంజీ కామెట్ ఈవీలో ప్రధానంగా మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే కాకుండా.. 3 పాయింట్ సీట్ బెల్ట్, పిల్లల కోసం ఐసోఫిక్స్ యాంకర్ పాయింట్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, రివర్స్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం మొదలైనవన్నీ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఇక ప్రధానంగా చెప్పుకోదగ్గ విషయం రేంజ్. ఎంజీ కామెట్ ఈవీ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ రేంజ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులోని 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఒక సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ కారులో 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఈ కారు ఫుల్ ఛార్జ్ (0 నుంచి 100 శాతం) కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటారు 42 పీఎస్ పవర్ 100 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తం మీద ఈ కారు రోజు వారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

Don’t Miss: ఇలాంటి ల్యాండ్ రోవర్ ఎప్పుడైనా చూసారా? ఫోటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

నిజానికి ప్రస్తుతం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా.. చాలామంది ప్రజలు కూడా వారి రోజువారీ వినియోగానికి ఈ కారును కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం ధర తక్కువని మాత్రమే కాదు.. ఎక్కువ రేంజ్ అందిస్తుందని కూడా. రాబోయే రోజుల్లో ఈ కారు మరింత గొప్ప అమమకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే కంపెనీ భవిష్యత్తులో ఈ కారు రేంజ్ పెంచడానికి ఏమైనా అప్డేట్స్ చేస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇలాంటి ల్యాండ్ రోవర్ ఎప్పుడైనా చూసారా? ఫోటోలు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

0

Green Colour Land Rover Defender 110: ఇతర దేశాలతో పోలిస్తే.. భారతదేశంలో వాహనాల వినియోగం బాగా ఎక్కువగా ఉంది. ప్రతి వ్యక్తి సొంత వాహనం కలిగి ఉండాలనుకోవడంతో వెహికల్స్ సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. అయితే కొంతమంది సంపన్ను లేదా సాధారణ వ్యక్తులు కొంత భిన్నంగా లేదా ప్రత్యేకంగా ఉండే కార్లను ఉపయోగించడానికి అమితాసక్తి చూపుతారు. అలాంటి వారు కొన్ని స్పెషల్ కార్లను కొనుగోలు చేయడానికి పూనుకుంటారు. గతంలో మనం అంబానీ రంగులు మార్చే కారును చూసాము. పింక్ కలర్ ల్యాండ్ రోవర్ కార్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఓ కేరళ బిజినెస్ మ్యాన్ గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ కారు కొనుగోలు చేసే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..

గ్రీన్ కలర్ కారు

నిజానికి ల్యాండ్ రోవర్ కార్లు బ్లాక్, వైట్, గ్రే వంటి రంగులలో లభిస్తాయని అందరికి తెలుసు. కొన్ని స్పెషల్ కలర్స్.. ఎల్లో (పసుపు), ఆకుపచ్చ, పింక్ మొదలైన రంగులు చాలా అరుదు, బహుశా ఇలాంటివి చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు. కానీ ఓ కేరళ వ్యాపారవేత్త ప్రత్యేకంగా ఉండటానికి ”గ్రీన్ కలర్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 హెచ్ఎస్ఈ” (Green Colour Land Rover Defender HSE) కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో గమనించినట్లయితే.. ప్రేమ్షా అనే వ్యక్తి తన ల్యాండ్ క్రూయిజర్ కారులో రావడం చూడవచ్చు. ఈయన ఫ్యామిలీ కూడా కారు డెలివరీకి డీలర్‌షిప్‌కు వచ్చింది. డీలర్షిప్ యాజమాన్యం వాళ్ళను సాదరంగా ఆహ్వానించారు. కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పూర్తి చేసిన తరువాత.. కారు మీద ఉన్న గుడ్డను తొలగిస్తారు. ఆ తరువాత కొనుగోలుదారు కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు. ప్రేమ్షా కొనుగోలు చేసిన కారు గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్ పొందినట్లు కనిపిస్తుంది. మొత్తం మీద కారు చూడటానికి కొత్తగా మాత్రమే కాదు, చాలా అద్భుతంగా ఉంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 హెచ్ఎస్ఈ

కేరళ వ్యాపారవేత్త ప్రేమ్షా ఎంచుకున్న ల్యాండ్ రోవర్ ఎడిషన్ 110 హెచ్ఎస్ఈ. దీని ధర రూ. కోటి కంటే ఎక్కువగానే ఉంటుంది. దేశీయ మార్కెట్లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 90, 110 మరియు 130 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఈ మూడు వేరియంట్లు చూడతనికి ఒకే మాదిరిగా అనిపించినప్పటికీ.. ఫీచర్స్ మరియు పరిమాణం పరంగా కొంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ధరల్లో కూడా మార్పులు ఉంటాయి.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.. ఒకటి 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్, మరొకటి 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 5500 rpm వద్ద 296 Bhp పవర్ మరియు 1500 rpm వద్ద 400 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు ఫోర్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. తద్వారా మంచి పనితీరును అందిస్తుంది. ఇది కేవలం 7.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 191 కిమీ కావడం గమనార్హం. డీజిల్ ఇంజిన్ కూడా ఉత్తమ పవర్ మరియు టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Don’t Miss: హీరోయిన్ ‘శృతి హాసన్’ కొన్న కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే షాకవుతారు!

డిఫెండర్ అనేది పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారు పొడవు 5018 మిమీ, వెడల్పు 2105 మిమీ, ఎత్తు 1967 మిమీ, వీల్‌బేస్ 3022 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 218 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్రిటీష్ బ్రాండ్ అయినప్పటికీ భారతదేశంలో ల్యాండ్ రోవర్ కార్లు బాగా ప్రజాదరణ పొందాయి. ఈ కారణంగానే చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ బ్రాండ్ కార్లను ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఇది కేవలం రోజువారీ వినియోగానికి మాత్రమే కాకుండా ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దీనికిదే సాటి అని చెప్పాలి.

హీరోయిన్ ‘శృతి హాసన్’ కొన్న కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే షాకవుతారు!

0

Famous Actress Shruti Hassan New BMW Car: ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారాల తనయ శృతి హాసన్ గురించి పెద్దగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే.. తనకు తానుగానే ఎదిగి సినీ ప్రపంచంలో ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం నటి మాత్రమే కాదు. సింగర్ కూడా. తెలుగు, తమిళ భాషల సినిమాల్లో కూడా ఈమె పాటలు పాటి ప్రేక్షలకును మెప్పించింది. కాగా ఇటీవల శృతి హాసన్ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇంతలీ శృతి హాసన్ కొన్న కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

శృతి హాసన్ కొత్త కారు

నటి శృతి హాసన్ కొనుగోలు చేసిన కారు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ‘740డీ ఎమ్ స్పోర్ట్’ (BMW 740D M Sport). ఈ కారు ధర సుమారు రూ. 2 కోట్లు వరకు ఉంటుంది. జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ అయినా ఈ మోడల్ బీఎండబ్ల్యూ యొక్క 7 సిరీస్ అని తెలుస్తోంది. ఈ కారులోనే శృతి హాసన్ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో శృతి హాసన్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి బీఎండబ్ల్యూ కారు నుంచి కిందికి దిగటం చూడవచ్చు.

బీఎండబ్ల్యూ 740డీ స్పోర్ట్

నటి శృతి హాసన్ కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ 740డీ ఎమ్ స్పోర్ట్.. డీజిల్ వెర్షన్. ఇది 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 286 బీహెచ్‌పీ పవర్ మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా పొందుతుంది. తద్వారా 18 బీహెచ్‌పీ పవర్ మరియు 200 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

అద్భుతమైన డిజైన్ కలిగిన బీఎండబ్ల్యూ 740డీ కారు 19 ఇంచెస్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో క్రిస్టల్ లైట్స్ మరియు ఎల్ఈడీ డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. లోపలి భాగంలో 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఈ కారులో రూప్ మౌంటెడ్ 31.3 ఇంచెస్ 8కే సినిమా స్క్రీన్ ఉంటుంది. వెనుక డోర్ ప్యాడ్ మీద 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

శృతి హాసన్ గ్యారేజిలోని ఇతర కార్లు

నటి శృతి హాసన్ గ్యారేజిలో ఇప్పటికే రూ. 1.69 నుంచి రూ. 2.80 కోట్ల ఖరీదైన ల్యాండ్ రోవర్ స్పోర్ట్ హెచ్ఎస్ఈ, రూ. 86.92 లక్షల ఆడి క్యూ7, రూ. 67 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎవోక్ మరియు రూ. 33.43 లక్షల నుంచి రూ. 51.44 లక్షల ఖరీదైన టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లు ఉన్నాయి. కాగా ఇటీవలే ఈ జాబితాలోకి బీఎండబ్ల్యూ కారు కూడా చేసింది. ప్రస్తుతం శృతి హాసన్ గ్యారేజిలో ఇదే ఖరీదైన కారు అని తెలుస్తోంది.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ కలిగి ఉన్న ఇతర సెలబ్రిటీలు

ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో హీరో ధనుష్, దుల్కర్ సల్మాన్ మరియు దిశా పటాని మొదలైనవారు ఉన్నారు.

హీరో ధనుష్ వద్ద ఉన్న బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు 740ఐ ఎమ్ స్పోర్ట్. దీని ధర రూ. 1.78 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తోంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 3.0 లీటర్ ఇన్-లైన్ సిక్స్ సిలిండర్ ట్విన్ టర్బోఛార్జ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 375 బీహెచ్‌పీ పవర్ మరియు 520 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్ సిస్టం మరియు 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

Don’t Miss: సలార్ నటుడి కొత్త కారు.. వారెవ్వా కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ మరియు ఆయన తండ్రి మమ్ముట్టి కూడా బీఎండబ్ల్యూ 740ఐ ఎమ్ స్పోర్ట్ వేరియంట్స్ కలిగి ఉన్నారు. చాలా సార్లు వీరు ఈ కారులో ప్రయాణిస్తూ కనిపించారు. వీరు మాత్రమే కాకుండా నటి దిశా పటాని గ్యారేజిలో కూడా బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఈ కారు సెలబ్రిటీలను ఆకర్శించడంలో విజయం సాధించిందని తెలుస్తోంది.

ఈ నెలలో (జులై) లాంచ్‌ అయ్యే కొత్త కార్లు ఇవే!.. పూర్తి వివరాలు

0

Upcoming Car Launches in 2024 July: 2024 ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో అనేక కార్లు, బైకులు లాంచ్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో (జులై 2024) దేశీయ విఫణిలో లాంచ్ కావడానికి కొన్ని కార్లు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 5 సిరీస్ ఎల్‌డబ్ల్యుబీ, నిస్సాన్ ఎక్స్-ట్రైల్, మినీ కూపన్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ మరియు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ వంటివి ఉన్నాయి. ఈ కార్లు ఎప్పుడు లాంచ్ అవుతాయి, వివరాలు ఏంటనేది వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

బీఎండబ్ల్యూ 5 సిరీస్ ఎల్డబ్ల్యుబీ (BMW 5 Series LWB)

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇప్పటికే దేశీయ విఫణిలో లెక్కకు మించిన కార్లను లాంచ్ చేసి అధిక ప్రజాదరణ పొందింది. అయితే ఇప్పుడు 5 సిరీస్ ఎల్‌డబ్ల్యుబీ కారును లాంచ్ చేయడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ఇది ఈ నెల 24 (జులై 24)న అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఈ కారు దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

పరిమాణం పరంగా అద్భుతంగా ఉండే ఈ లగ్జరీ కారు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ వంటివి పొందుతుంది. ఇందులో 2.0 లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుందని సమాచారం. ఇందులో 48 వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail)

దేశీయ మార్కెట్లో ప్రజాదరణ పొందిన నిస్సాన్ కంపెనీ.. ఈ నెల చివరి (జూలై) నాటికి తన ఎక్స్-ట్రైల్ లాంచ్ చేయనుంది. సుమారు 10 సంవత్సరాలకు ముందు కంపెనీ ఈ కారును మార్కెట్లో విక్రయించేది. అది మళ్ళీ ఇప్పుడు ఆధునిక హంగులతో మార్కెట్లో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్ దాని మునుపాటి మోడల్స్ కంటే కూడా మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందనున్నట్లు సమాచారం. ఇది 7 సీటర్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ SUV లోపల 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లే వంటివి పొందుతుందని తెలుస్తోంది. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, పాటిల్ షిఫ్టర్, బోస్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్స్ కూడా ఉందొ ఉండనున్నట్లు తెలుస్తోంది.

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. కంపెనీ దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెల్లడించలేదు. అయితే ఇందులో 161 Bhp పవర్ ప్రొడ్యూస్ చేసే 1.5 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్, 201 Bhp పవర్ అందించే స్ట్రాంగ్ హైబ్రిడ్ వంటివి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మినీ కూపర్ ఎస్ (Mini Cooper S)

ఈ నెల 24న (జూలై 24వ తేదీ) దేశీయ మార్కెట్లో మినీ కూపర్ ఎస్ కూడా లాంచ్ అవుతుంది. ఇది నాల్గవ తరం మినీ కూపర్ ఎస్ మోడల్ అని తెలుస్తోంది. మంచి డిజైన్ కలిగి, కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, కొత్త టెయిల్ లైట్స్ వంటి వాటితో పాటు.. లోపల పెద్ద రౌండ్ సెంట్రల్ డిస్‌ప్లేతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడవచ్చు.

త్వరలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మినీ కూపన్ ఎస్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 201 Bhp పవర్ మరియు 300 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి మంచి పనితీరుని అందిస్తుంది. ఇది కేవలం 6.6 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవతమవుతుంది.

మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ (Mini Countryman Electric)

భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. ఈ కారణంగానే సంస్థ ఇండియన్ మార్కెట్లో కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది కూడా ఈ నెలలో (జూలై 24) లాంచ్ అవ్వడానికి సన్నద్ధమైంది. ఇది కొత్త సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్, రీడిజైన్ చేయబడిన హెడ్‌లైట్స్, కొత్త టెయిల్ లైట్స్ వంటివి పొందుతుంది. ఇందులో 9.5 ఇంచెస్ రౌండ్ ఓఎల్ఈడీ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది.

కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఒకటి సింగిల్ మోటార్ కలిగిన మోడల్, రెండోది డ్యూయెల్ మోటార్ కలిగిన మోడల్. సింగిల్ మోటార్ మోడల్ 201 Bhp పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డ్యూయట్ల్ మోటార్ మోడల్ 309 Bhp పవర్ మరియు 494 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు వెర్షన్లు 66.45 కిలోవాట్ బ్యాటరీ ద్వారా శక్తిని పొందుతాయి. రేంజ్ 462 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ధరలకు సంబంధించిన అధికారిక వివరాలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ (Mercedes Benz EQA)

దేశీయ మార్కెట్లో ఈ నెలలో లాంచ్ అయ్యే మరో మోడల్.. మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఈక్యూఏ. ఇది జులై 8న దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి మూడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే బెంజ్ కంపెనీ ఈ నెలలో ఈక్యూఏ కారును లాంచ్ చేయనుంది.

Don’t Miss: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా కెప్టెన్‌.. ‘రోహిత్‌ శర్మ’ వాడే కార్లు ఇవే​!

మెర్సిడెస్ బెంజ్ లాంచ్ చేయనున్న ఈక్యూఏ అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10.25 ఇంచెస్ డిస్‌ప్లేలు, యాంబియంట్ లైటింగ్‌ వంటివి ఉంటాయి. అయితే ఈ కారుకు సంబంధించిన బ్యాటరీ వివరాలు మరియు ధరలు వంటివి లాంచ్ సమయంలో కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. ఈ మోడల్ ఒక సింగిల్ చార్జితో 560 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం.

రూ.2 లక్షల కంటే తక్కువ.. బెస్ట్ బైక్ కావాలనుకునేవారికి కరెక్ట్ ఆప్షన్!

0

Best Bike Under Rs.2 Lakh in India: ప్రపంచ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో లెక్కకు మించిన వాహనాలు అడుగుపెడుతున్నాయి. ఇందులో లక్ష విలువైన టూవీలర్స్ ఉన్నాయి. పది లక్షలకంటే ఖరీదైన ద్విచక్రవాహనాలు ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఉత్తమ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

భారతదేశంలో ప్రస్తుతం రెండు లక్షల రూపాయలకంటే తక్కువ ధర వద్ద లభించే బైకుల జాబితాలో హీరో మావ్రిక్ 440, జావా 42, బజాజ్ డామినార్ 250, సుజుకి జిక్సర్ / జిక్సర్ ఎస్ఎఫ్250, హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ మరియు కేటీఎమ్ డ్యూక్ 200 మొదలైనవి ఉన్నాయి.

హీరో మావ్రిక్ 440

భారతదేశంలో దిగ్గజ టూ వీలర్ తయారీ సంస్థగా కీర్తి గడిస్తున్న హీరో మోటోకార్ప్ యొక్క ‘మావ్రిక్ 440’ బైక్ రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న పాపులర్ బైక్. దీని ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 27 Bhp పవర్ మరియు 36 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. తద్వారా రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

జావా 42

ఇండియన్ మార్కెట్లో ఎక్కువ మందికి ఇష్టమైన బైక్ బ్రాండ్లలో జావా మోటార్‌సైకిల్ ఒకటి. రూ. 2 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులలో ‘జావా 42’ కూడా ఉంది. ఈ బైక్ ధర రూ. 1.96 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగి.. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులోని 293 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 27 Bhp పవర్ మరియు 27 Nm టార్క్ అందిస్తుంది. కాబట్టి పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

బజాజ్ డామినర్ 250

మనం చెప్పుకుంటున్న రూ. 2 లక్షల కంటే తక్కువ రేటులోనే లభించే బైకులలో బజాజ్ ఆటో యొక్క ‘డామినర్ 250’ కూడా ఒకటి. ఇది చూడటానికి కొంత స్టైలిష్ డిజైన్ కలిగి.. బైక్ రైడర్లను ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. ఈ బైక్ ధర రూ. 1.78 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 249 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 26.63 Bhp పవర్ మరియు 23.5 Nm టార్క్ అందిస్తుంది. ఇది రైడింగ్ చేయడానికి ఉత్తమ బైకుగా గుర్తింపు పొందింది.

సుజుకి జిక్సర్ / జిక్సర్ ఎస్ఎఫ్ 250

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థలలో ఒకటి సుజుకి మోటార్‌సైకిల్. ఈ కంపెనీ యొక్క 250 సీసీ జిక్సర్ కూడా మనం చెప్పుకుంటున్న ధర లోపల లభించే ఉత్తమ బైక్. ఇది నేక్డ్ మరియు ఫెయిర్డ్ అనే రెండు రూపాల్లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 1.89 లక్షలు మరియు రూ. 1.94 లక్షలు (ఎక్స్ షోరూమ్).

చూడటానికి దాదాపు ఒకే విధంగా ఉన్న ఈ జిక్సర్ బైకులు 249 సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతాయి. ఇది 26.3 Bhp పవర్ మరియు 22.2 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ బైకులను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్

నిజానికి కరిజ్మా బైకుల కురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే బైకుల జాబితాలో ఇది కూడా ఉంది. హీరో కరిజ్మా ఎక్స్ఎమ్ఆర్ బైక్ ధర ప్రారంభ ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 210 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 25.15 Bhp పవర్, 20.4 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పనితీరును అందిస్తుంది.

కేటీఎమ్ డ్యూక్ 200

యువకులకు ఇష్టమైన బైకులలో ‘కేటీఎమ్ డ్యూక్ 200’ కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ పాపులర్ మోడల్. దీని ధర రూ. 1.96 లక్షలు (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇందులోని 199.5 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 24.67 Bhp పవర్ మరియు 19.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

Don’t Miss: రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా కెప్టెన్‌.. ‘రోహిత్‌ శర్మ’ వాడే కార్లు ఇవే​!

గమనిక: పైన చెప్పిన బైకుల ధరలు కేవలం ప్రారంభ ధరలు మాత్రమే. అయితే బైక్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా.. బైక్ కొనుగోలుదారులు గమనించాలి.

రిటైర్‌మెంట్‌ ప్రకటించిన టీమిండియా కెప్టెన్‌.. ‘రోహిత్‌ శర్మ’ వాడే కార్లు ఇవే​!

0

Indian Cricketer Rohit Sharma Car Collection: సుమారు 13సంవత్సరాల నిరీక్షిణ తరువాత భారత్ టీ20 ప్రపంచ కప్ ముద్దాడి జెగజ్జేతగా నిలిచింది. యావత్ భారతదేశం మొత్తం ఈ రోజు కోసమే వేయి కళ్ళతో ఎదురు చూసింది. ఎట్టకేలకు టీమిండియా ఈ కలను నెరవేర్చింది. ఈ సమయంలో ప్రముఖ క్రికెటర్ మరియు స్టార్ ఓపెనర్ ‘రోహిత్ శర్మ’ (Rohit Sharma) రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ టీ 20 క్రికెట్ కెరీర్‌లో 159 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. సుమారు 4231 పరుగులు సాధించారు. ఇందులో ఇది సెంచరీలు, 32 హాఫ్ సెంచరీలు సాధించిన తన ఖాతాలో అరుదైన రికార్డ్ సాధించారు.

రోహిత్ శర్మ గొప్ప క్రికెటర్ మాత్రమే కాదు.. ప్రముఖ ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఈ కథనంలో రోహిత్ శర్మ గ్యారేజిలోని లేదా ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం..

క్రికెటర్ రోహిత్ శర్మ ఉపయోగించే కార్ల జాబితాలో లంబోర్ఘిని ఉరుస్, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్, బీఎండబ్ల్యూ ఎక్స్5, టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ ఎమ్5, స్కోడా లారా మరియు రేంజ్ రోవర్ కార్లు ఉన్నట్లు సమాచారం..

లంబోర్ఘిని ఉరుస్

భారతదేశంలో ఎక్కువమందికి ఇష్టమైన ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్ లంబోర్ఘిని. ఇందులో కూడా ఉరుస్ కారుకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ కారును ప్రముఖ సినీ తారలు మాత్రమే కాకుండా క్రికెటర్లు కూడా ఇష్టపడి కొనుగోలు చేశారు. ఇందులో ఒకరు రోహిత్ శర్మ. ఈయన గ్యారేజిలోని లంబోర్ఘిని ఉరుస్ కారు ధర సుమారు రూ. 4.18 కోట్లు. ఈ కారు అద్భుతమైన డిజైన్, అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

లంబోర్ఘిని ఉరుస్ కారు 4 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 657 Bhp పవర్ మరియు 850 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. రోహిత్ శర్మ ముంబై – పూణే ఎక్స్‌ప్రెస్‌వేలో వేగంగా వెళ్తున్న సమయంలో చలాన్ కూడా అందుకున్నట్లు గతంలో ఓసారి వార్తల్లో నిలిచారు.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసిన లగ్జరీ కార్లలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఎస్ కూడా ఒకటి. ఈ కారు క్రికెటర్ రోహిత్ శర్మ గ్యారేజిలో కూడా ఉంది. దీని ధర సుమారు రూ. 1.32 కోట్ల నుంచి రూ. 1.37 కోట్ల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ డీజిల్ మరియు పెట్రోల్ అనే రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇందులోని 3.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 375 Bhp పవర్ మరియు 500 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 362 Bhp పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇవి రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయి.

టయోటా ఫార్చ్యూనర్

ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా ఈ టయోటా ఫార్చ్యూనర్ కార్లను ఉపయోగిస్తున్నారు. రోహిత్ శర్మ కూడా ఈ కారును కలిగి ఉన్నారు. దీని ధర రూ. 32.5 లక్షలు. చూడచక్కని డిజైన్ కలిగిన ఈ కారు, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారును ఇప్పటికి కూడా చాలామంది సెలబ్రిటీలు ఉపయోగిస్తున్నారు.

స్కోడా లారా

రోహిత్ శర్మ గ్యారేజిలోని కార్ల జాబితాలో స్కోడా కంపెనీకి చెందిన లారా కూడా ఒకటి. దీని ధర రూ. 12.5 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని సమాచారం. ఈ కారును కంపెనీ 2009లో భారతదేశంలో ప్రారంభించింది. బహుశా ఇప్పుడు ఈ కారు ఉత్పత్తి దశలో లేదని తెలుస్తోంది. ఇది 2.0 లీటర్ టీడీఐ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 138 Bhp పవర్ మరియు 302 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్3

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎక్స్3 కారు కూడా రోహిత్ శర్మ గ్యారేజిలో ఉంది. సుమారు రూ. 68 లక్షల ఖరీదైన ఈ కారు దేశీయ విఫణిలో 2017లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ కారు మార్కెట్లో మంచి అమ్మకాలను పొందుతోంది. పలువురు సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు కూడా ఈ కారును తమ గ్యారేజిలో కలిగి ఉన్నారు. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు పనితీరుపరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రోహిత్ శర్మ ఎక్కువగా ఈ కారునే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: లాంచ్‌కు సిద్దమవుతున్న సీఎన్‌జీ కార్లు ఇవే!.. ఎక్కువ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్

బీఎండబ్ల్యూ ఎం5

రోహిత్ శర్మ గ్యారేజిలో మరో ఖరీదైన బీఎండబ్ల్యూ కారు ఎం5. దీనిని భారతదేశంలోని చాలా తక్కువమంది ధనవంతులు మరియు ప్రముఖ వ్యక్తులు మాత్రమే కలిగి ఉన్నట్లు సమాచారం. దీని ధర రూ. 1.74 కోట్ల నుంచి రూ. 1.79 కోట్ల మధ్యలో ఉంటుంది. ఈ కారు 4.4 లీటర్ వీ8 ట్విన్ టర్బోఛార్జ్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 560 పీఎస్ పవర్ మరియు 680 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు రోహిత్ శర్మకు చాలా ఇష్టమైన కారు అని కూడా తెలుస్తోంది.

లాంచ్‌కు సిద్దమవుతున్న సీఎన్‌జీ కార్లు ఇవే!.. ఎక్కువ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్

0

Upcoming CNG Car Launches in India: భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ వాహనాల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సంస్థలు తమ కార్లను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో లాంచ్ కానున్న సీఎన్‌జీ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ, మీరుతి స్విఫ్ట్ ఐ-సీఎన్‌జీ, మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎస్-సీఎన్‌జీ మరియు హ్యుందాయ్ హై-సీఎన్‌జీ డ్యూయో రేంజ్ ఉన్నాయి. ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్.. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయింది. కాగా ఇప్పుడు సీఎన్‌జీ రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ఈ కారు ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానికి సంబంధించిన అధికారిక వివరాలు అందుబాటులో లేదు.

టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ అనేది టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగిన భారతదేశపు మొదటి సీఎన్‌జీ మోడల్ కానుంది. ఇది చూడటానికి దాదాపు దాని పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ లేదా సీఎన్‌జీ బ్యాడ్జెస్ ఉండటం చూడవచ్చు. కంపెనీ ఇందులో ఉపయోగించనున్న ఇంజిన్ గురించి అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్‌జీ

ఇటీవలే 30 లక్షల యూనిట్లు విక్రయించబడి అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకున్న మారుతి స్విఫ్ట్ త్వరలోనే ఎస్-సీఎన్‌జీ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. అయితే కంపెనీ ఈ సీఎన్‌జీ కారును ఎప్పుడు లాంచ్ చేస్తుందనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

మే 2024లో మారుతి సుజుకి తన కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారును అధికారికంగా లాంచ్ చేసింది. కాగా ఇప్పుడు కంపెనీ సీఎన్‌జీ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో 1197 సీసీ త్రీ సిలిండర్ ఇంజిన్ ఉండనున్నట్లు సమాచారం. ఇది 80.4 Bhp పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుందని భావిస్తున్నారు. అయితే కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త కారు కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే అవకాశం ఉంటుంది. సంస్థ ఇండియన్ మార్కెట్లో స్విఫ్ట్ సీఎన్‌జీ లాంచ్ చేసిన తరువాత మరిన్ని గొప్ప అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎస్-సీఎన్‌జీ

స్విఫ్ట్ కారును మాత్రమే కాకుండా మారుతి సుజుకి తన డిజైన్ కారును కూడా సీఎన్‌జీ రూపంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ స్విఫ్ట్ డిజైన్ యొక్క నాల్గవ తరం కారును ఇంకా లాంచ్ చేయలేదు. కానీ అంతకంటే ముందు ఇది సీఎన్‌జీ రూపంలో లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ కారు లాంచ్ ఈ ఏడాది చివరి లోపల ఉంటుందని సమాచారం.

హ్యుందాయ్ హై-సీఎన్‌జీ & డ్యూయో రేంజ్

టాటా మోటార్స్ మరియు మారుతి సుజుకి మాత్రమే కాకుండా.. హ్యుందాయ్ కంపెనీ కూడా హై-సీఎన్‌జీ మరియు హై-సీఎన్‌జీ డ్యూయో పేరుతో సీఎన్‌జీ మోడల్స్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. కంపెనీ వీటి కోసం ఇప్పటికే ట్రేడ్‌మార్క్ కోసం అప్లై చేసినట్లు సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కార్ల గురించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. హ్యుందాయ్ కంపెనీ సీఎన్‌జీ విభాగంలో కూడా గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: కార్లు వాలీబాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

సీఎన్‌జీ కార్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతుందంటే?

నిజానికి మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడో సెంచరీ దాటేశాయి. అంతే కాకుండా.. ప్రస్తుతం మార్కెట్లో లాంచ్ అవుతున్న కార్లు కూడా ఎక్కువ మైలేజ్ అందించలేకపోతున్నాయి. సీఎన్‌జీ వెహికల్స్ పెట్రోల్ కార్ల కంటే ఎక్కువ మైలేజ్ అందిస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త కార్లను కొనుగోలు చేసే వారు సీఎన్‌జీ వాహనాల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బైక్ విభాగంలో.. మొదటిసారి బజాజ్ ఆటో తన బైకుని సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది వచ్చే నెలలో అధికారికంగా లాంచ్ అవుతుంది.

కార్లు వాలీబాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

0

Porsche Cars Volleyball Game: సాధారణంగా ఎక్కడైనా మనుషులే ఫుట్‌బాల్, వాలీబాల్ మొదలైన ఆటలు ఆడుతారు. కార్లు ఎప్పుడైనా వాలీబాల్ ఆడటం చూసారా? ఇది వినటానికి కొంత వింతగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూస్తే నమ్మకుండా ఉండలేరు. ఇంతకీ కార్ల వాలీబాల్ గేమ్ ఏంటి? గతంలో ఇలాంటి సంఘటనాలు ఏమైనా జరిగాయా అనే విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

పోర్స్చే కార్స్ వాలీబాల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో పోర్స్చే కంపెనీకి చెందిన కార్లు ఒక ఇండోర్ స్టేషయంలో వాలీబాల్ ఆడటం చూడవచ్చు. ఇందులో బ్రాండ్ యొక్క 911 జీటీ మోడల్ మరియు పనామెరా కార్లు ఉన్నాయి. నెట్‌కు అటువైపు రెండు కార్లు, ఇటువైపు రెండు కార్లు ఉన్నాయి. మొత్తం మీద నాలుగు కార్లు వాలీబాల్ గేమ్ ఆడుతున్నాయి.

ఇక్కడ కనిపించే నాలుగు కార్లు నాలుగు కలర్ ఆప్షన్‌లలో ఉండటం చూడవచ్చు. కార్లు స్టార్ట్ అయ్యే ఉన్నాయి. ఒక కారు బాల్‌ను టచ్ చేసి.. ఇటువైపు కోర్లులోకి పంపిస్తే.. ఇటువైపు ఉన్న కార్లు కూడా అదే విధంగా అటువైపుకు బాల్ పంపిస్తున్నాయి. ఈ వీడియో చూడటానికి చాలా కొత్తగా.. ఆసక్తికరంగా ఉంది. కేవలం కొన్ని సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే గతంలో మునుపెన్నడూ.. కార్లు వాలీబాల్ ఆడిన సన్నివేశాలు చాలా అరుదు, లేదా.. అలంటి ఘటన వెలుగులోకి రాలేదనే చెప్పాలి.

ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో చూసి వాహన ప్రేమికులు ఫిదా అవుతున్నారు. కార్లు వాలీబాల్ ఆడుతుంటే.. తమదైన రీతిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ వ్యూయ్స్ మరియు లైక్స్ పొందిన ఈ వీడియో ఎంతోమంది వీక్షకుల మనసు దోచింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో తప్పకుండా మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాము.

పోర్స్చే కార్లు

నిజానికి భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో పోర్స్చే కార్లకు మంచి డిమాండ్, గిరాకీ ఉంది.ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ పోర్స్చే కార్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. వీటి ధరలు కొంత ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య ప్రజలు కొనటానికి వెనుకడుగు వేసినప్పటికీ.. ఆటోమొబైల్ ఔత్సాహికులు, డబ్బున్న ధనవంతులు మాత్రమే అస్సలు వెనుకడుగు వేయడం లేదు.

పోర్స్చే కంపెనీ లాంచ్ చేసిన కార్లలో 911 జీటీ మరియు పనామెరా వంటి మోడల్స్ ఎక్కువ అమ్మకాలు పొందినట్లు సమాచారం. పోర్స్చే పనామెరా ధర రూ. 1.68 కోట్లు అని తెలుస్తోంది. ఇక పోర్స్చే 911 జీటీ ధర ఏకంగా రెండు కోట్ల రూపాయల కంటే ఎక్కువే అని సమాచారం. ధరలు భారీగా ఉన్నప్పటికీ.. ధరలకు తగ్గ డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ మరియు అత్యద్భుతమైన పర్ఫామెన్స్ అందించడం వల్ల వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

కార్లతో వాలీబాల్ సురక్షితమేనా?

ఇక వీడియోలో కనిపించిన సంఘటన చూడటానికి బాగానే ఉన్నప్పటికీ.. కార్లతో వాలీబాల్ ఆటడం సులభం కాదు, ఓ రకంగా చెప్పాలంటే ప్రమాదం కూడా. ఎందుకంటే వాలీబాల్ కోర్టుకు అటువైపు నుంచి బాల్‌ను ఇటువైపు పంపినప్పుడు.. అటువైపు ఉన్న కార్లు దాన్ని మళ్ళీ ఇటువైపు పంపించడానికి.. ముందుకు లేదా వెనక్కు కదలాల్సి ఉంటుంది. ఆ సమయంలో పక్కన ఉన్న కార్లను లేదా ఎదురుగా ఉన్న కార్లను ఢీ కొట్టే అవకాశం ఉంది. కాబట్టి కార్లతో వాలీబాల్ గేమ్ సురక్షితం కాదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియో కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే రికార్డ్ చేసినట్లు అనిపిస్తోంది. అంతే కాకుండా ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు.

Don’t Miss: 30 లక్షల మంది ఈ కారును కొనేశారు!.. దీనికే ఎందుకింత డిమాండ్ అంటే..

ఇండియన్ మార్కెట్లో పోర్స్చే

భారతీయ విఫణిలో పోర్స్చే కంపెనీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. కస్టమర్ల అభిరుచికి తగిన విధంగా పోర్స్చే కార్లను రూపొందించి లాంచ్ చేస్తోంది. మార్కెట్లో తన ఉనికిని తెలియజేసుకోవడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ దాని ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి కూడా సర్వత్రా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే కొత్త పోర్స్చే కార్లు మార్కెట్లో అడుగుపెడుతున్నాయి, వాహన ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి.