24.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 37

30 లక్షల మంది ఈ కారును కొనేశారు!.. దీనికే ఎందుకింత డిమాండ్ అంటే..

0

Maruti Swift Achieves 30 Lakh Sales Milestone: మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చే కారు ‘స్విఫ్ట్’ (Swift).. అంతలా భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఈ కారు అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2005లో మారుతి స్విఫ్ట్ విక్రయాలు ప్రారంభమైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు (సుమారు 19 సంవత్సరాలు) కంపెనీ 30 లక్షల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

సెప్టెంబర్ 2021 నాటికి 25 లక్షల యూనిట్స్

2005లో స్విఫ్ట్ అమ్మకాలు మొదలైనప్పటి నుంచి.. ఈ కారు ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. కంపెనీ 30 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకోవడానికి ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన నాల్గవ తరం స్విఫ్ట్ కూడా దోహదపడింది. సెప్టెంబర్ 2021 నాటికి కంపెనీ 25 లక్షల అమ్మకాల మైలురాయిని ఛేదించింది. ఆ తరువాత 5 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకోవడానికికి కంపెనీకి 3 సంవత్సరాల సమయం పట్టింది.

మారుతి బ్రాండ్ కార్లను కొనాలనుకునే పది మందిలో కనీసం ఐదు మంది కంటే ఎక్కువ స్విఫ్ట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కారు అత్యధిక అమ్మకాలు పొందిన బెస్ట్ హ్యాచ్‌బ్యాక్‌గా రికార్డ్ సాధించింది.

మారుతి స్విఫ్ట్ పవర్‌ట్రెయిన్

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి స్విఫ్ట్ 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 82 హార్స్ పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కంపెనీ ఈ కారును ఈ ఏడాది చివరి నాటికి సీఎన్‌జీ రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో లాంచ్ కానున్న స్విఫ్ట్ సీఎన్‌జీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. మారుతి స్విఫ్ట్ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 4.2 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, రియర్ కెమెరా, పవర్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ వింగ్ మిర్రర్స్ వంటివి పొందుతుంది.

మారుతి స్విఫ్ట్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. వాహన వినియోగదారులకు కావలసిన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇది ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటిని పొందుతుంది.

ధరలు

మారుతి సుజుకి యొక్క నాల్గవ తరం ఎడిషన్ స్విఫ్ట్ మోడల్ మే 2024లో లాంచ్ అయింది. దీని ధర రూ. 6.49 లక్షల నుంచి రూ. 9.50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. కంపెనీ ఈ కారును లాంచ్ చేసిన తరువాత ఒక నెలలోనే మొత్తం 19393 యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లను విక్రయించింది. కాగా ఇప్పటికే కొత్త స్విఫ్ట్ 40000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది.

Don’t Miss: సలార్ నటుడి కొత్త కారు.. వారెవ్వా కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

కంపెనీ దేశీయ విఫణిలో లాంచ్ చేసిన ఈ కొత్త మారుతి స్విఫ్ట్.. ఇప్పటికే భారతీయ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ కంపెనవె యొక్క ఐ10 నియోస్, టాటా మోటార్స్ యొక్క టియాగో, సిట్రోయెన్ కంపెనీ యొక్క సీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. పలు కార్లకు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ మారుతి స్విఫ్ట్ మాత్రం అమ్మకాల్లో దూసుకెళ్తోంది.

స్విఫ్ట్ అమ్మకాలకు ప్రధాన కారణం

మారుతి స్విఫ్ట్ దేశంలో భారీ అమ్మకాలను పొందటానికి ప్రధాన కారణం సరసమైన ధర మాత్రమే కాదు. సింపుల్ డిజైన్, వాహన వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ లభించడం కూడా. ప్రస్తుతం కంపెనీ సేఫ్టీ పరంగా కూడా అత్యుత్తమ ఫీచర్స్ అందిస్తోంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ కారణాల వల్ల మారుతి స్విఫ్ట్ అమ్మకాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి.

సలార్ నటుడి కొత్త కారు.. వారెవ్వా కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

0

Prithviraj Sukumaran Buys New Porsche 911 GT3: సెలబ్రిటీలు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ప్రముఖ సినీతాలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ (Prithviraj Sukumaran) ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇంతకీ నటుడు కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొనుగోలు చేసిన కారు ‘పోర్స్చే’ (Porsche) కంపెనీకి చెందిన ‘911 జీటీ3’ (911 GT3). దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పోర్స్చే యాజమాన్యం కారును నటుడికి ఇంటివద్దే డెలివరీ చేయడం చూడవచ్చు. డెలివరీ చేసిన తరువాత కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ఈ కారు ధర రూ. 3కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

డిజైన్ మరియు ఫీచర్స్

చూడగానే ఆకర్షించబడే డిజైన్ కలిగిన పోర్స్చే 911 జీటీ3 కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్లాంప్ వంటివి పొందుతుంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో, వెనుక భాగంలో పోర్స్చే అనే అక్షరాలు కనిపిస్తారు. టర్న్ ఇంకేటర్స్ ఇక్కడ గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చాలా సింపుల్‌గా.. అద్భుతంగా ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు ఏసీ వెంట్స్, స్టీరింగ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్

ఉత్తమ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన పోర్స్చే 911 జీటీ3 కారు 3996 సీసీ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8400 rpm వద్ద 493 bhp పవర్ మరియు 6100 rpm వద్ద 470 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ సిస్టం (RWD) పొందుతుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమౌతుంది. దీని టాప్ స్పీడ్ 318 కిమీ/గం. ఈ కారు 12.70 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుంది. మొత్తం మీద పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

రెండు డోర్స్ కలిగిన పోర్స్చే 911 జీటీ3 కారు పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4562 మిమీ, వెడల్పు 1852 మిమీ, ఎత్తు 1271 మిమీ, వీల్‌బేస్ 2457 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 105 మిమీ మరియు బూట్ స్పేస్ 125 లీటర్లు ఉంది. కాబట్టి ఈ కారు అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్స్

పోర్స్చే 911 జీటీ3 కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పవర్ డోర్ లాక్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, చైల్డ్ సేఫ్టీ లాక్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిసంచడానికి సహాయపడతాయి. తద్వారా ప్రమాదం సమయంలో ఇవి ప్రయాణికుల ప్రాణాలను కాపాడంలో తోడ్పడతాయి.

Don’t Miss: పెళ్లి తరువాత జహీర్ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే.. సోనాక్షి సిన్హా దిల్ ఖుష్

కారు డెలివరీ చేసిన సమయంలో.. పోర్స్చే ఇండియా అధికారులు నటుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డెలివరీకి సంబంధించిన వీడియోలో పోర్స్చే యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ ఫ్యామిలీ మరింత చిరునవ్వులతో కూడా ప్రయాణం ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ గ్యారేజిలోని ఇతర కార్లు

నటుడు పృథ్వీరాజ్ యొక్క గ్యారేజిలో పోర్స్చే 911 జీటీ3 కారు మాత్రమే కాకుండా.. లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే కయెన్, టాటా సఫారీ మరియు మినీ కూపర్ జేసీడబ్ల్యు ఖరీదైన అన్యదేశ్య కార్లకు కలిగి ఉన్నారు. వీటి ధరలు దాదాపు కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు కార్ల మీద ఎంత ఆసక్తి ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

మూడేళ్లలోపే ‘మహీంద్రా ఎక్స్‌యూవీ700’ అరుదైన రికార్డ్ – కరికొత్త కలర్స్ కూడా..

0

Mahindra XUV700 Crossed 2 Lakh Units Production Milestone: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ700 (XUV700) లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న విషయం తెలిసిందే. భారతీయ విఫణిలో ప్రారంభం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ పొందిన ఈ కారు ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ ఎస్‌యూవీ తాజాగా ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఈ తరుణంలో కంపెనీ రెండు కొత్త కలర్ ఎక్స్‌యూవీ700 కార్లను కూడా పరిచయం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

33 నెలల్లో 2 లక్షల యూనిట్లు

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్స్‌యూవీ700 కార్లను మహీంద్రా ఏకంగా రెండు లక్షల వరకు ఉత్పత్తి (తయారు) చేసినట్లు వెల్లడించింది. కంపెనీ ఈ కారును భారతదేశంలో లాంచ్ చేసిన కేవలం 33 నెలల సమయం మాత్రమే పట్టింది. ఎక్స్‌యూవీ700 ఉత్పత్తి ప్రారంభమైన 21 నెలల్లో కంపెనీ 1 లక్ష యూనిట్లను తయారు చేసింది. ఆ తరువాత 1 లక్ష యూనిట్ల మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లను ఉత్పత్తి చేయడానికి కేవలం 12 నెలల సమయం మాత్రమే పట్టినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే మార్కెట్లో ఈ కార్లకు ఎంత డిమాండ్ ఉందో ఇట్టే అర్థమైపోతుంది.

భారతీయ విఫణిలో మహీంద్రా ఎక్స్‌యూవీ700 నెలకు సగటున 8000 యూనిట్ల బుకింగ్స్ పొందినట్లు సమాచారం. గత నెలలో కంపెనీ బ్లేజ్ ఎడిషన్ పేరుతో సరికొత్త ఎక్స్‌యూవీ700 లాంచ్ చేసింది. ఈ ఎడిషన్ కేవలం ఏఎక్స్5 సెలక్ట్ వేరియంట్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ ఎడిషన్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా అనిపించినప్పటికీ.. కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ పొంది ఉన్నట్లు సమాచారం.

కొత్త కలర్ మహీంద్రా ఎక్స్‌యూవీ700 కార్లు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ రెండు లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసిన సందర్భంగా రెండు కొత్త పెయింట్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి డీప్ ఫారెస్ట్ కాగా, మరొకటి బర్న్ట్ సియెన్నా కలర్. ఈ కలర్స్ కాకుండా కంపెనీ తన ఎక్స్‌యూవీ700 కారును సిల్వర్, ఎలక్ట్రిక్ బ్లూ, ఎవరెస్టు వైట్, మిడ్‌నైట్ బ్లాక్, రెడ్ రేజ్ మరియు నాపోలి బ్లాక్ మొదలైన సింగిల్ టోన్ రంగులలో కూడా అందిస్తోంది. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎక్స్‌యూవీ700 మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

ఎక్స్‌యూవీ700 కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 197 బీహెచ్‌పీ పవర్ మరియు 380 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డీజిల్ ఇంజిన్ 182 బీహెచ్‌పీ పవర్ మరియు 420 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్స్ పొందినట్లు సమాచారం. ఈ రెండూ ఉత్తమ పనితీరును అందిస్తాయని సమాచారం.

ధరలు

భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన మహీంద్రా ఎక్స్‌యూవీ700 ధరలు రూ. 13.99 లక్షల నుంచి రూ. 26.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారు మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న టాటా సఫారీ, టాటా హారియర్, ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ ఆల్కజార్ మరియు జీప్ కంపాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాగా మహీంద్రా కంపెనీ త్వరలోనే ఎక్స్‌యూవీ700 యొక్క ఫుల్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఎక్స్‌యూవీ.ఈ8 పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Don’t Miss: కేవలం రూ. 54999లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజువారీ వినియోగానికి కరెక్ట్ ఆప్షన్!

నిజానికి భారతదేశంలో అత్యుత్తమ డిజైన్, ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కార్ల జాబితాలో ఎక్స్‌యూవీ700 చెప్పుకోదగ్గ మోడల్. ఇది మల్టిపుల్ ట్రిమ్‌లలో లభిస్తుంది. ఇండియన్ మార్కెట్లో మొట్ట మొదటి ఏడీఏఎస్ (అడ్వాన్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) ఈ కారులోని ప్రారంభమైంది. ఈ ఘనత కేవలం మహీంద్రా కంపెనీకే చెందుతుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పుడు మార్కెట్లో లాంచ్ అవుతున్న దాదాపు చాలా కార్లలో అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తుంది.

పెళ్లి తరువాత జహీర్ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే.. సోనాక్షి సిన్హా దిల్ ఖుష్

0

Zaheer Iqbal Gift BMW i7 To His Wife Sonakshi Sinha: ప్రముఖ బాలీవుడ్ నటి ‘సోనాక్షి సిన్హా’ (Sonakshi Sinha) ఇటీవల జహీర్ ఇక్బాల్‌ను (Zaheer Iqbal) పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. కొన్ని రోజులకు ముందు కుటుంబ సమక్షంలో ఏడడుగులు వేశారు. పెళ్ళైన తరువాత జహీర్ ఇక్బాల్ తన భార్య సోనాక్షికి సుమారు రూ. 2 కోట్ల విలువైన కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ జహీర్.. సోనాక్షికి గిఫ్ట్ ఇచ్చిన కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

జహీర్ ఇక్బాల్ గిఫ్ట్

సోనాక్షి సిన్హాతో పెళ్లయిన తరువాత జహీర్ మొదటి గిఫ్ట్‌గా ‘బీఎండబ్ల్యూ ఐ7’ (BMW i7) ఇచ్చారు. దీని విలువ రూ. 2 కోట్లకంటే ఎక్కువే ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లయిన తరువాత జహీర్, సోనాక్షి ఇద్దరూ కలిసి రావడం.. ఆయా తరువాత అప్పటికే అక్కడ వేచి చూస్తున్న బీఎండబ్ల్యూ ఐ7 కారులో ఎగ్గడం చూడవచ్చు. కారును ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తుంటే.. జహీర్, సోనాక్షి సిన్హా ఇద్దరు వెనుక సీటులో కూర్చుని ఉండటం చూడవచ్చు.

బీఎండబ్ల్యూ ఐ7

సోనాక్షి సిన్హా గిఫ్ట్‌గా పొందిన బీఎండబ్ల్యూ ఐ7 కారు తెలుపు రంగంలో ఆకర్షణీయంగా ఉంది. ఈ మోడల్ కారును ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు కూడా కొనుగోలు చేశారు. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉండి.. అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.

బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారు యొక్క ముందు భాగంలో పెద్ద కిడ్నీ గ్రిల్, గ్రిల్ మీద ‘ఐ’ వంటివి పొందుతుంది. నాలుగు చక్రాలకు నాలుగు డిస్క్ బ్రేకులు, 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉండటం చూడవచ్చు. అధునాతన ఏడీఏఎస్ ఫీచర్లతో నిండిన ఈ కారు సెన్సార్లు, రాడార్లు మరియు కెమరాలను కలిగి ఉంటుంది. హెడ్‌లైట్ మరియు టెయిల్‌లైట్ కూడా ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ సెడాన్ ఆటోమాటిక్ డోర్స్ పొందుతుంది. ఒకసారి బటన్ నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది. మరోసారి బటన్ నొక్కితే డోర్ క్లోజ్ అవుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. బీఎండబ్ల్యూ ఐ7 కారు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కర్వ్డ్ డిస్‌పప్లే పొందుతుంది. వీటితోపాటు ఇందులో 31.33 ఇంచెస్ 8కే సినిమా స్క్రీన్ కూడా ఉంది. ఇది రూప్ భాగంలో అమర్చబడి ఉంటుంది. అవసరమైనప్పుడు కిందికి దించుకోవచ్చు. అవసరం లేదనుకుంటే పైకి ఫోల్డ్ చేయవచ్చు. వెనుక డోర్స్ వద్ద కూడా 5.5 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్, క్లైమేట్ కంట్రోల్, సీట్లను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది.

ఐ7 ఎలక్ట్రిక్ కారు xDrive 60 అనే ఒకే వేరియంట్లో లభిస్తుంది. ఇందులో రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. ఇవి 544 పీఎస్ పవర్ మరియు 745 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ కారులో 101.7 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 591 కిమీ నుంచి 625 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది ఏసీ ఛార్జింగ్ మరియు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 34 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది.

Don’t Miss: ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

బీఎండబ్ల్యూ ఐ7 కొనుగోలు చేసిన ఇతర సెలబ్రిటీలు

ఇప్పటికే బీఎండబ్ల్యూ ఐ7 ఎలక్ట్రిక్ కారును నటి రేఖ, జాక్విలిన్ ఫెర్నాండెజ్, అజయ్ దేవగన్, కిమ్ శర్మ మరియు నటుడు శేఖర్ సుమన్ మొదలైన బాలీవుడ్ ప్రముఖులు కూడా కొనుగోలు చేశారు. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.13 కోట్లు అని తెలుస్తోంది. ఆన్ రోడ్ ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

కేవలం రూ. 54999లకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రోజువారీ వినియోగానికి కరెక్ట్ ఆప్షన్!

0

iVoomi S1 Lite Electric Scooter Details: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చిన్న కంపెనీల నుంచి పెద్ద కంపెనీల వరకు ఎలక్ట్రిక్ విభాగంలో వాహనాలను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ‘ఐవూమి’ (iVOOMi).. దేశీయ విఫణిలో అతి తక్కువ ధరలోనే ఓ సరికొత్త ‘ఎస్1 లైట్’ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. నిజానికి ఈ స్కూటర్ ధర యాపిల్ ఐఫోన్ 14 ప్రో కంటే కూడా చాలా తక్కువే అని తెలుస్తోంది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ధర & బుకింగ్స్

ఐవూమి కంపెనీ లాంచ్ చేసిన కొత్త ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి గ్రాఫెన్ అయాన్ బ్యాటరీ, మరొకటి లిథియం అయాన్ బ్యాటరీ. వీటి ధరలు వరుసగా రూ. 54999 మరియు రూ. 64999 మాత్రమే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం కస్టమర్లు దేశంలోని కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ చూడగానే ఆకరించబడుతుంది. ఇందులో పెద్ద హెడ్‌ల్యాంప్, సింగిల్ పీస్ సీటు, బ్యాక్ రెస్ట్ మొదలైనవి గమనించవచ్చు. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇది పెర్ల్ వైట్, మూన్ గ్రే, స్కార్లెట్ రెడ్, మిడ్‌నైట్ బ్లూ, ట్రూ రెడ్ మరియు పీకాక్ బ్లూ అనే ఆరు రంగులలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇందులో కస్టమర్లు తమకు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు.

రేంజ్ (పరిధి) & ఛార్జింగ్ టైమ్

చూడటానికి సింపుల్ డిజైన్ కలిగిన ఐవూమి ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ చార్జితో 75+ కిమీ (గ్రాఫెన్ అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్), 85+ కిమీ (లిథియం అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్) రేంజ్ అందిస్తుంది. గ్రాఫెన్ వేరియంట్ టాప్ స్పీడ్ గంటకు 45 కిమీ. ఇది 3 గంటల సమయంలో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు, అంతే ఫుల్ ఛార్జ్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది.

లిథియం అయాన్ వేరియంట్ విషయానికి వస్తే.. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిమీ. ఇది 1.5 గంటల సమయంలో 50 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. ఈ లెక్కన ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు మాత్రమే. రెండు వేరియంట్లలోని బ్యాటరీలు వాటర్ రెసిస్టెన్స్ ఐపీ67 అని తెలుస్తోంది. కాబట్టి నీరు మరియు దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది. రోజు వారీ వినియోగానికి ఈ స్కూటర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫీచర్స్

మంచి డిజైన్ కలిగిన ఐవూమి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డిస్‌ప్లే, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్ వంటి వాటిని పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బూట్ స్పేస్ 18 లీటర్లు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వివిధ భూభాగాల్లో రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా రూపొందించింది. ఈ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ వరకు ఉంది.

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నెన్నో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లను కొనుగోలు చేయడానికి కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఐవూమి లాంచ్ చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర కేవలం రూ. 54999 మాత్రమే. రోజువారీ వినియోగానికి, తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఐవూమి ఎస్1 లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓ మంచి ఆప్షన్ అని తెలుస్తోంది.

Don’t Miss: ప్రభాస్ కల్కి విడుదలకు ముందే.. కల్కి సైకిల్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

ఇంకా ఎక్కువ రేంజ్ ఎక్కువ కావాలనుకునే వారు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ వంటివి ఉన్నాయి. కాబట్టి కొనుగోలుదారులు అవసరాలను బట్టి నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ప్రభాస్ కల్కి విడుదలకు ముందే.. కల్కి సైకిల్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

0

EMotorad Kalki Limited Edition Doodle E Cycle Details: ప్రపంచం మొత్తం ఓవైపు త్వరలో విడుదలకానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం వేచి చూస్తోంది. మరోవైపు వాహన ప్రియుల కోసం ‘ఈమోటోరాడ్’ (EMotorad) కంపెనీ ‘కల్కి లిమిటెడ్ ఎడిషన్ డూడుల్’ (Kalki Limited Edition Doodle) అనే ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరించింది. ఇంతకీ ఈ సైకిల్ ధర ఎంత? బుకింగ్ ప్రైస్ ఎంత? డిజైన్ ఎలా ఉంది? టాప్ స్పీడ్ ఎంత అనే మరిన్ని ఆస్కతికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ధర మరియు బుకింగ్స్

ఫేమస్ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ ఈమోటోరాడ్ లాంచ్ చేసిన ఈ కల్కి లిమిటెడ్ ఎడిషన్ సైకిల్.. కల్కి సినిమా స్ఫూర్తితో రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 55999. ఈ సైకిల్ బుక్ చేసుకోవాలనుకునే వారు రూ. 2898 చెల్లించి ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. సినిమా టైటిల్‌లో చూపించే అక్షరాలా ప్రకారం ఈ బుకింగ్ ప్రైస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్

కొత్త కల్కి లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ సైకిల్ ఒక అడ్వెంచర్ వెహికల్ మాదిరిగా కనిపిస్తుంది. ముందు మరియు వెనుక భాగంలో సాధారణ సైకిల్స్‌కు ఉండే టైర్లు మాదిరిగా కాకుండా పెద్ద పెద్ద టైర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఈ సైకిల్ కల్కి మరియు డూడుల్ అనే అక్షరాలను కూడా కలిగి ఉంది. చూడటానికి అద్భుతంగా ఉన్న ఈ సైకిల్ ఫోల్డబుల్.. అంటే దీన్ని మడతపెట్టి తీసుకెళదానికి అనుకూలంగా ఉంటుంది.

కంపెనీ ప్రభాస్ సినిమా థీమ్ ఆధారంగా రూపోంచిందిన ఈ సైకిల్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అంటే దీన్ని కొంతమంది మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే కంపెనీ ఎన్ని యూనిట్లను విక్రయిస్తుందనే విషయాన్ని వెల్లడించలేదు.

ఫీచర్స్ & రేంజ్

కొత్త కల్కి లిమిటెడ్ ఎడిషన్ సైకిల్ అనేది మంచి డిజైన్ కలిగి ఉండటమే కాకూండా.. వినియోగదారులకు అవసరమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఐదు రైడింగ్ మోడ్స్ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. మోడ్స్ గురించి తెలుసుకోవడానికి హ్యాండిల్ బార్ మీద ఒక చిన్న డిస్‌ప్లే ఉండటం చూడవచ్చు. ముందు భాగంలో ఓ చిన్న లైట్.. బ్రేకింగ్ కోసం దృఢమైన సెటప్ వంటివి ఇందులో గమనించవచ్చు.

ఇక రేంజ్ విషయానికి వస్తే.. కల్కి లిమిటెడ్ ఎడిషన్ టాప్ స్పీడ్ 25 కిమీ అని తెలుస్తోంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 60 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని సమాచారం. కాబట్టి దీన్ని రోజు వారీ వినియోగానికి నగరంలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ట్రాఫిక్ సమయంలో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది. ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ సైకిల్ కోసం రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ వంటివి అవసరమే లేదు. మొత్తం మీద ఇది వాహన ప్రియుల అభిరుచికి తగిన విధంగా ఉందని అర్థమవుతోంది.

ఈ కొత్త సైకిల్ ఆవిష్కరణ సందర్భంగా.. ఈమోటోరాడ్ కంపెనీ సీఈఓ ‘కునాల్ గుప్తా’ మాట్లాడుతూ.. ప్రభాస్ ఒక లెజెండ్. మార్కెట్లో ఈ ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ డూడుల్ వీ 3 ఈ సైకిల్‌ను పరిచయమ్ చేయడానికి కల్కితో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. కస్టమర్ల ఆసక్తిని మాత్రమే కాకుండా అభిమానుల ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ సైకిల్ విడుదల చేయడం జరిగిందని, ఇది తప్పకుండా అభిమానులను ఆకర్షిస్తుందని భావిస్తున్నానని అన్నారు.

Don’t Miss: తరాలు మారినా.. చరిత్రలో నిలిచిపోయే బైకులు ఇవే!.. ఒక్కొక్కటి ఓ అద్బుతం

కల్కి 2898 ఏడీ సినిమా..

డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడుగా నటించిన కల్కి సినిమా జూన్ 27న విడుదలకానుంది. ఇందులో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ వంటి అగ్ర సినీ ప్రముఖులు కూడా ప్రధాన పాత్రలో నటించారు. కాగా.. ఈ సినిమా టికెట్స్ కోసం ఇప్పటికే ఫ్రీ బుకింగ్స్ కూడా మొదలైపోయాయి. టికెట్స్ అందుబాటులోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అన్ని అమ్ముడైపోయినట్లు వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారనేది ఇట్టే అర్థమైపోతుంది. ఈ సినిమా కూడా గొప్ప విజయాన్ని సాధిస్తుందని భావిస్తున్నాము.

కొడుకు కోసం మాజీ మంత్రి ‘రోజా’ కొన్న కారు ఇదే.. దీని ధర ఎంతో తెలుసా?

0

Do You Know About RK Roja Mercedes Benz Car: సినీనటి, రాజకీయ నాయకురాలు ‘ఆర్కే రోజా’ గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. రాయలసీమలో (చిత్తూరు) పుట్టిన రోజా.. తిరుపతి పద్మావతి యూనివర్సిటిలో చదివి, ఆ తరువాత నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. అప్పట్లోనే డాక్టర్ శివ ప్రసాద్ ప్రోత్సాహంతో రాజేంద్ర ప్రసాద్ సరసన ప్రేమతపస్సు సినిమాలో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత తనదైన రీతిలో అభిమానులను మెప్పించిన ఈమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఖ్యాతి పొందారు.

తమిళ చిత్ర దర్శకుడు ‘సెల్వమణి’ని పెళ్లి చేసుకున్న రోజాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలు రోజాకు రెండు కళ్లులాంటి వారు అని చెప్పడంలో సందేహం లేదు. బిడ్డలను ప్రేమగా పెంచుతూ అడిగింది కొనిచ్చే రోజా.. అక్టోబర్ 2022లో తన కొడుకు కోసం ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ తరువాత ఎన్నో విమర్శలకు గురయ్యారు. ఇంతకీ మాజీ మంత్రి రోజా తన కొడుకు కోసం కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

కొడుకు కోసం బెంజ్ కారు

ఆంధ్రప్రదేశ్ పర్యాటకమంత్రిగా ఉన్నప్పుడు.. రోజా తన కొడుకు ‘క్రిష్ణ కౌశిక్’ కోసం కొనుగోలు చేసిన కారు ‘మెర్సిడెస్ బెంజ్’ (Mercedes Benz) కంపెనీకి చెందిన ‘జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్’ (GLS 400D 4Matic) అని తెలుస్తోంది. ఈ లగ్జరీ కారు ధర రూ. 1.50 కోట్లు. రోజా కొనుగోలు చేసిన కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మాజీ మంత్రి రోజా కొనుగోలు చేసిన బెంజ్ కారు తెలుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ కారును కొనుగోలు చేసిన తరువాత రోజా కారును డ్రైవ్ చేస్తూ ఉంటే.. ఆమె కొడుకు పక్కన సీటులో కూర్చుని ఉన్నారు. నిజానికి ఇది దాదాపు రెండు సంవత్సరాల క్రితం కొన్న కారు.

ఈ కారును కొనుగోలు చేసిన తరువాత ప్రతిపక్ష నాయకులు, నేతలు కూడా చాలా విమర్శించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. యాంకర్లుగా చేస్తున్న ఎంతోమంది ఖరీదైన కార్లు కొంటున్నారు. నేను అగ్ర సినీనటిగా ఎదిగాను, కస్టపడి డబ్బు సంపాదించాను. నా కష్టార్జితంతోనే ఈ కారును కొన్నానని చెప్పారు. అంతే కాకుండా తన కొడుక్కి బ్రాండ్స్ అంటే ఇష్టమని.. తన కోసమే ఆ కారు కొన్నానని కూడా వెల్లడించారు. నిజనఁ చెప్పాలంటే పిల్లల కోరికలను తీర్చడం తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి రోజా కారును కొనుగోలు చేసిందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్

ఇక మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ 4మ్యాటిక్ విషయానికి వస్తే.. చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ కారు, వాహనం వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అంతే కాకుండా పలువురు రాజకీయ, వ్యాపారవేత్తలకు కూడా ఈ మోడల్ అంటే చాలా ఇష్టమని సమాచారం.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ కారు ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటి వాటిని పొందుతుంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తం మీద ఇది ఒక్క చూపుతోనే ఆకర్శించే డిజైన్ పొందినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Don’t Miss: ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

ఈ లగ్జరీ కారు యొక్క ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వాయిస్ కమాండ్ ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి. ఇందులో వాహన వినియోగదారుల రక్షణకు కావాల్సిన సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 400డీ కారు 2925 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 3600 rpm వద్ద, 1200 rpm వద్ద 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ లగ్జరీ కారు కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. ఈ కారు టాప్ స్పీడ్ 238 కిమీ/గం కావడం గమనార్హం. మొత్తం మీద పనితీరు పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కారణాల వల్ల చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.

11వ బిడ్డకు తండ్రైన ఎలోన్ మస్క్.. ఈయన గ్యారేజిలోని ప్రత్యేకమైన కార్లు చూశారా?

0

Lets Know About Elon Musk Special Cars: ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ వంటి కంపెనీల బాస్ ‘ఎలోన్ మస్క్’ (Elon Musk) తాజాగా 12వ బిడ్డకు తండ్రయ్యారు. ఇప్పటికే 10మంది పిల్లలకు తండ్రైన మస్క్ ఇప్పుడు 11వ బిడ్డకు న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ ‘శివోన్ జిలిస్’ ద్వారా తండ్రి అయ్యారు. ఈ విషయాన్ని జిలిస్ కూడా స్పందించలేదు. అయితే పలు దిగ్గజ వార్త సంస్థలు ఈ విషయాన్ని బయటపెట్టాయి.

వ్యాపార, సాంకేతిక రంగాల్లో దూసుకెల్తూ.. ఎంతోమందికి రోల్ మోడల్‌గా నిలిచిన మస్క్ తన మొదటి భార్య జస్టిస్ మస్క్ ద్వారా ఐదు మంది, రెండో భార్య గ్రిమ్స్ ద్వారా ముగ్గురు, మూడో భార్య జిలిస్ ద్వారా ముగ్గురు పిల్లలను కన్నారు. దీంతో ఎలోన్ మస్క్ పిల్లల సంఖ్య 11కి చేరింది. ఇకపోతే వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న మస్క్ అత్యంత ఖరీదైన మరియు ప్రత్యేకమైన కార్లను తన గ్యారేజిలో కలిగి ఉన్నారు. ఈ కథనంలో మస్క్ కార్ల ప్రపంచం గురించి వివరంగా తెలుసుకుందాం.

1957 జాగ్వార్ ఈ-టైప్ రోడ్‌స్టర్

బిలినీయర్ ఎలోన్ మస్క్ గ్యారేజిలోని ప్రత్యేకమైన కారు ఈ 1957 జాగ్వార్ ఈ-టైప్ రోడ్‌స్టర్. ఈ కారును ప్రపంచంలోనే అందమైన అభివర్ణిస్తారు. దీనిని ఎంజో ఫెరారీ కంపెనీ తయారు చేసింది. మస్క్ చిన్నప్పటి నుంచి ఈ కారును కొనాలని కలలు కనేవారని, చివరకు ఈ కారును సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు 4.2 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ ద్వారా పని చేస్తుంది. ఇది 256 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ రూపొందించిన ఈ అరుదైన కారు చాలా తక్కువమంది ధనవంతుల దగ్గర మాత్రమే ఉంది. అందులో మస్క్ ఒకరు కావడం గమనార్హం.

1997 మెక్‌లారెన్ ఎఫ్1

ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసిన మెక్‌లారెన్ ఎఫ్1 ఎలోన్ మస్క్ గ్యారేజిలో ఉంది. ఈ కారును గోర్డాన్ ముర్రే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు రెండు డోర్స్ మాత్రమే పొందింది. అయితే మస్క్ వద్ద ఉన్న ఈ కారు ఒకానొక సందర్భంలో క్రాష్ అయినట్లు, దానిని రిపేర్ చేయడానికే చాలా డబ్బు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా దీనిని చివరకు విక్రయించినట్లు సమాచారం.

1976 లోటస్ ఎస్ప్రిట్

నిజానికి ఎలోన్ మస్క్ గ్యారేజిలోని అత్యంత ఖరీదైన మరియు చెప్పుకోదగ్గ కారు 1976 లోటస్ ఎస్ప్రిట్. ఇది చూడటానికి కారు మాదిరిగా ఉన్నప్పటికీ.. నీటిలోపల కూడా ప్రయాణించగలదు. దీనిని జేమ్స్ బాండ్ సినిమాలో బహుశా కొంతమంది చూసి ఉండవచ్చు. అయితే ఈ సినిమాలో నీటిలో ప్రయాణించే వాహనంగా మాత్రమే ఉపయోగించారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది భూమిపైన కూడా ప్రయాణించగలదు. దీనిని మస్క్ 2013లో జరిగిన ఒక వేలంలో సొంతం చేసుకున్నారు. ఈ కారుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో చూడవచ్చు.

బీఎండబ్ల్యూ ఎం5

ఎలోన్ మస్క్ గ్యారేజిలో బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎం5 కారు కూడా ఉంది. ఈ కారును ప్రత్యేకంగా హమాన్ మోటార్‌స్పోర్ట్‌లోని బీఎండబ్ల్యూ నిపుణులు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ పొందుతుంది. నాలుగు డోర్స్ కలిగిన ఈ కారు 660 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ 322 కిమీ / గం అని తెలుస్తోంది. దీన్ని బట్టి ఇది ఎంత వేగంగా ప్రయాణించగలదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన కారు కూడా ఎలోన్ మస్క్ గ్యారేజిలో ఉంది.

టెస్లా రోడ్‌స్టర్

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టెస్లా కంపెనీకి చెందిన ‘రోడ్‌స్టర్’ కారు కూడా మస్క్ గ్యారేజిలో ఉంది. ఇది టెస్లా యొక్క మొదటి కారు అని సమాచారం. ఈ రోజు కూడా ఈ మోడల్ కారును చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది. ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

Don’t Miss: ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

ఇండియాకు టెస్లా?

భారతదేశంలో టెస్లా సంస్థ తన కార్యకలాపాలను ప్రారభించడాని గత కొన్ని సంవత్సరాలుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన దేశప్రధాని ‘నరేంద్ర మోదీ’తో కూడా చర్చలు జరిపారు. ఆ తరువాత టెస్లా భారతదేశంలోని గుజరాత్ సమీపంలో తన తయారీ కర్మాగారం ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైనట్లు కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఇండియన్ మార్కెట్లో టెస్లా కంపెనీ అడుగుపెడుతుంది కేంద్రమంత్రి ‘హెచ్డీ కుమారస్వామి’ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంస్థ ఎప్పుడు భారతీయ విఫణిలో అడుగుపెడుతుందనే విషయం అధికారికంగా వెల్లడి కాలేదు.

ప్రియుడితో సోనాక్షి సిన్హా పెళ్లి.. ఈ హీరోయిన్ గ్యారేజిలో ఇన్ని లగ్జరీ కార్లు ఉన్నాయా?

0

Sonakshi Sinha Got Marriage With Zaheer Iqbal And Their Cars: బాలీవుడ్ బ్యూటీ ‘సోనాక్షి సిన్హా’ (Sonakshi Sinha).. అంటే తెలుగు వారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ లింగ సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన భారతి అంటే మాత్రం అందరికి ఇట్టే గుర్తొచ్చేస్తుంది. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు ఈ రోజు (జూన్ 23)న తాను ప్రేమించిన ‘జహీర్ ఇక్బాల్’ను పెళ్లి చేసుకుంది. పెళ్ళికి ముందు సోనాక్షి ఫ్యామిలీ నిర్వహించిన పూజలో ఈమె చాలా సింపుల్ డ్రెస్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కథనంలో నటి ‘సోనాక్షి సిన్హా’ ఎలాంటి కార్లను ఉపయోగిస్తోంది.. వాటి ధర ఎంత? అనే ఆసక్తికరమైన వివరాలు వివరంగా తెలుసుకుందాం.

సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసు దోచుకున్న సోనాక్షి సిన్హా.. 2010లో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తరువాత ఎన్నెన్నో బ్లాక్ బ్లస్టర్ సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదించింది. ప్రస్తుతం ఈమె కార్ గ్యారేజిలో ‘మెర్సిడెస్ బెంజ్ ఎస్350, జీఎల్ఎస్ 350డీ మరియు బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ’ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్350 (Mercedes Benz S350)

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఎస్350 కారు సోనాక్షి సిన్హా గ్యారేజిలో ఉంది. ఈ కారు ధర సుమారు రూ. 1.77 కోట్లు అని తెలుస్తోంది. ఈ లగ్జరీ కారు మంచి డిజైన్ కలిగి, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 286 Bhp పవర్ మరియు 600 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 6.0 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ. ఇది 15.5 కిమీ మైలేజ్ అందిస్తుంది.

బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ (BMW 6 Series GT)

సోనాక్షి సిన్హా గారేజీలోని మరో ఖరీదైన జర్మన్ బ్రాండ్ కారు.. బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 6 సిరీస్ జీటీ. రూ.75.90 లక్షల ఖరీదైన ఈ కారు అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉండే ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ కారు 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 261.4 Bhp పవర్ మరియు 620 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 6.1 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 250 కిమీ వరకు ఉంటుంది. ఈ లగ్జరీ కారు 17.19 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ (Mercedes Benz GLS 350D)

సోనాక్షి సిన్హా గ్యారేజిలోని మరో బెంజ్ కారు.. జీఎల్ఎస్ 350డీ. దేశీయ మార్కెట్లో ఈ లగ్జరీ కారు ధర కోటి రూపాయల కంటే ఎక్కువే. ఈ కారు వీ6 ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 255 Bhp పవర్ మరియు 620 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు కేవలం 4.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

Don’t Miss: పెళ్ళికి ముందే కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫోటోలు చూశారా?

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఎస్ 350డీ కారు యొక్క టాప్ స్పీడ్ గంటకు 222 కిమీ వరకు ఉంటుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు యొక్క మైలేజ్ లీటరుకు 11.5 కిమీ వరకు ఉంటుంది. ఇది వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే ఎక్కువ మంది సెలబ్రిటీలు ఈ కారును ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు.

జహీర్ ఇక్బాల్ కార్స్ అండ్ బైక్స్

సోనాక్షి సిన్హా భర్త జహీర్ ఇక్బాల్ వద్ద కూడా ‘మెర్సిడెస్ బెంజ్ ఎం-క్లాస్’ మరియు ‘డుకాటీ స్క్రాంబ్లర్’ బైకు ఉంది. ఈ బైక్ ధర సుమారు రూ. 9 లక్షల వరకు ఉంది. ఈ బైక్ మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. లగ్జరీ ఫీచర్స్ కలిగిన ఈ బైక్ రైడింగ్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ చాలామంది సెలబ్రిటీల గ్యారేజిలో ఉంది.

పెళ్ళికి ముందే కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ – ఫోటోలు చూశారా?

0

Shobha Shetty Gift Mahindra XUV700 For Her To Be Husband: సాధారణంగా ఎక్కడైనా అబ్బాయిలే అమ్మాయిలకు గిఫ్ట్స్ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. అది ప్రేమించే సమయంలో కావచ్చు, పెళ్ళికి ముంచు కావొచ్చు.. లేదా పెళ్లి తరువాతైనా కావొచ్చు. అయితే ఇటీవల ప్రముఖ బుల్లితెర నటి ‘శోభా శెట్టి’ (Shobha Shetty) కాబోయేవాడికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ మన శోభా శెట్టి.. తనకు కాబోయే భర్తకు ఏ కారు గిఫ్ట్ ఇచ్చింది? దాని ధర ఎంత? వంటి మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

కార్తీక దీపం మోనిత (శోభా శెట్టి)

నిజానికి నటి శోభా శెట్టి గురించి తెలుగు ప్రజలకు మాత్రమే పెద్దగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే బిగ్‌బాస్ సీజన్ 7లో అమర్ దీప్, ప్రియాంకలతో కలిసి పెద్ద హంగామా చేసి.. మంచి గుర్తింపు తెచ్చుకుని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్‌బాస్‌లోకి రావడానికంటే ముందు ఈ అమ్మడు ‘కార్తీక దీపం’ సీరియల్‌లో మోనిత.. విలన్ పాత్రలో అందరిని ఆకట్టుకుంది.

సీరియల్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తరువాత బిగ్‌బాస్‌ సీజన్ 7లోకి అడుగుపెట్టింది. కార్తీక దీపంలో నటిస్తున్నప్పుడే శోభా శెట్టికి.. తన సహనటుడు యశ్వంత్‌కు మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే ఆ తరువాత ప్రేమగా మారింది. వీరిద్దరూ ఇటీవలే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇక త్వరలో ఒక్కటి కానున్నారు.

శోభా శెట్టి తన పెళ్ళికి ముందే కాబోయే వాడి పుట్టిన రోజుకు ‘మహీంద్రా’ (Mahindra) కంపెనీ యొక్క ‘ఎక్స్‌యూవీ 700’ (XUV 700) కారును గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కొత్త కారు కొన్న సందర్భంగా ఫోటోలను తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ.. నేను, నా పప్పు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కొత్త కారు కొన్న సందర్భంగా శోభా శెట్టి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మహీంద్రా ఎక్స్‌యూవీ 700 (Mahindra XUV 700)

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో తన ఎక్స్‌యూవీ 700 కారును లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఇప్పటికి కూడా ఈ కారుకున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. నిజానికి ఈ కారు మార్కెట్లో లాంచ్ కావడానికి ముందే కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ పొంది.. బుకింగ్స్ పరంగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

మహీంద్రా కంపెనీ తన ఎక్స్‌యూవీ 700 కారును మల్టిపుల్ వేరియంట్లలో లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధర లాంచ్ సమయంలో రూ. 11.99 లక్షల నుంచి రూ. 21.59 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్). ఇది 5 సీటర్ మరియు 7 సీటర్ వేరియంట్లలో లాంచ్ అయింది. అయితే బుల్లితెర నటి శోభా శెట్టి.. యశ్వంత్‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన కారు ఏ వేరియంట్? ఏ ఇంజిన్ ఆప్షన్ పొంది ఉంది అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోల ప్రకారం ఇది 7 సీటర్ వేరియంట్ అయి ఉంటుందని భావిస్తున్నాము.

ఎక్స్‌యూవీ 700 కారు రెండు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఒక 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ 200 హార్స్ పవర్ మరియు 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. డీజిల్ ఇంజిన్ 155 హార్స్ పవర్ మరియు 360 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. పనితీరు పరంగా ఈ కార్లు చాలా ఉత్తమంగా ఉంటాయని ఇప్పటికే చాలామంది నిర్థారించారు.

Don’t Miss: తరాలు మారినా.. చరిత్రలో నిలిచిపోయే బైకులు ఇవే!.. ఒక్కొక్కటి ఓ అద్బుతం

భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, ఆల్కజార్, కియా సెల్టోస్, ఎంజీ హెక్టర్, హెక్టర్ ప్లస్, స్కోడా కుషాక్ మరియు టాటా సఫారీ వంటి వాటికి ప్రత్యరహిగా ఉండే మహీంద్రా ఎక్స్‌యూవీ 700 చూడగానే ఆకర్శించబడే డిజైన్ కలిగి.. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ పొందుతుంది.

మహీంద్రా కంపెనీ మొదటిసారిగా ఏడీఎస్ఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం) టెక్నాలజీ ప్రవేశపెట్టింది. ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతహను నిర్థారిస్తుంది. ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవడసరం లేదు. ఎందుకంటే ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ ప్రయాణికులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. మొత్తం మీద ఎక్స్‌యూవీ 700 అనేది భారతీయుల మది దోచిన అత్యుత్తమ మోడల్ అని తెలుస్తోంది.