34.7 C
Hyderabad
Saturday, March 15, 2025
Home Blog Page 9

ఆటో ఎక్స్‌పో 2025లో హీరో.. ఒకేసారి నాలుగు వెహికల్స్

0

Hero MotoCorp Bikes and Scooter Launches in Auto Expo 2025: మార్కెట్లో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఖ్యాతి గడించిన ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ‘భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025’ (Auto Expo 2025) వేదికగా నాలుగు టూ వీలర్స్ లాంచ్ చెసించి. ఇందులో రెండు స్కూటర్లు, మరో రెండు బైకులు ఉన్నాయి. ఈ వెహికల్స్ ధరలు, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా చూసేద్దాం.

హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ (Hero Xtreme 250R)

హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన బైకులలో ‘ఎక్స్‌ట్రీమ్ 250ఆర్’ ఒకటి. దీని ధర రూ. 1.80 లక్షలు (ఎక్స్ షోరూమ్). ప్రస్తుతం మార్కెట్లో 250ఆర్ అత్యంత శక్తివంతమైన బైక్ అని కంపెనీ పేర్కొంది. ఇది 250 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. కాబట్టి 30 హార్స్ పవర్ మరియు 25 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కేవలం 3.25 సెకన్లలో 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్, మోనోశాక్ సెటప్ వంటివి పొందుతుంది. కాబట్టి దృఢంగా ఉంటుంది.

కంపెనీ ఈ బైక్ కోసం వచ్చే నెలలో (2025 ఫిబ్రవరి) బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. డెలివరీలు మార్చిలో ప్రారంభమతాయి. మంచి డిజైన్ కలిగి.. రైడర్ మరియు పిలియన్లకు అనుకూలంగా ఉండే సీటింగ్ కూడా అందిస్తుంది. ఈ బైక్ మార్కెట్లో సుజుకి జిక్సర్ 250, కేటీఎమ్ 250 డ్యూక్, హస్క్‌వర్నా విట్‌పిలెన్ 250 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హీరో ఎక్స్‌పల్స్ 210 (Hero Xpulse 210)

ఆటో ఎక్స్‌పో 2025లో హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన మరో బైక్ ‘ఎక్స్‌పల్స్ 210’. ఈ అడ్వెంచర్ బైక్ ధర రూ. 1.76 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ దీని కోసం ఫిబ్రవరిలో బుకింగ్స్ స్వీకరించ నుంచి, డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి.

ఎక్స్‌పల్స్ 210 బైక్ 24.6 హార్స్ పవర్, 20.7 న్యూటన్ మీటర్ టార్క్ అందించే ఇంజిన్ పొందుతుంది. 170 కేజీల బరువున్న ఈ టూ-వీలర్ దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 29000 ఎక్కువ. ఇది 210 మిమీ ట్రావెల్‌తో.. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక 205 మిమీ ట్రావెల్‌తో మోనోషాక్ సెటప్ పొందుతుంది. ఇందులో 4.2 ఇంచెస్ TFT డ్యాష్ బోర్డు మరియు డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

హీరో జూమ్ 160 (Hero Xoom 160)

ఆటో ఎక్స్‌పో 2025లో కంపెనీ కేవలం బైకులను మాత్రమే కాకుండా స్కూటర్లను కూడా లాంచ్ చేసింది. అందులో ఒకటి ‘జూమ్ 160’. దీని ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది బ్రాండ్ యొక్క మ్యాక్సీ స్కూటర్. కాబట్టి యమహా ఎరోక్స్ 155కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది కేవలం ఓకే వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది.

జూమ్ 160 స్కూటర్ 165 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 14 హార్స్ పవర్, 13.7 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కీలెస్ ఇగ్నీషన్, ఫుల్లీ డిజిటల్ డ్యాష్, రిమోట్ సీట్ ఓపెనింగ్, స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి కొత్త ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ బరువు 141 కేజీలు. అయినప్పటికీ మంచి పనితీరును అందిస్తుంది. ఈ స్కూటర్ బుకింగ్స్ కూడా ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయి. డెలివరీలు మార్చిలో జరిగే అవకాశం ఉంది.

Also Read: రూ.3.25 లక్షలకే ఎలక్ట్రిక్ కారు: సోలార్ రూఫ్ కూడా గురూ..

హీరో జూమ్ 125 (Hero Xoom 125)

భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన మరో స్కూటర్ హీరో జూమ్ 125. దీని ప్రారంభ ధర రూ. 86,900 (ఎక్స్ షోరూమ్) మాత్రమే. ఇది వీఎక్స్ మరియు జెడ్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ స్కూటర్ డెలివరీలు మార్చిలో ప్రారంభమవుతాయి. బుకింగ్స్ అంతకంటే ముందు.. ఫిబ్రవరిలో మొదలయ్యే అవకాశం ఉంది.

హీరో జూమ్ 125 స్కూటర్ 124 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 9 హార్స్ పవర్, 10.4 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కాల్ / ఎస్ఎమ్ఎస్ అలర్ట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీతో.. డిజిటల్ డిస్‌ప్లే.. టర్న్ ఇండికేటర్స్ వంటివి పొందుతుంది. కాబట్టి ఇది ఈ ఆధునిక కాలంలో రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందించగలదని విశ్వసిస్తున్నాము.

రూ.3.25 లక్షలకే ఎలక్ట్రిక్ కారు: సోలార్ రూఫ్ కూడా గురూ..

0

Vayve Eva Launched At Auto Expo 2025: ఢిల్లీలో జరుగుతున్న ‘2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో పూణేకు చెందిన ‘వేవ్’ (Vayve) మొబిలిటీ కంపెనీ తన మొట్ట మొదటి ‘సోలార్ పవర్’తో నడిచే బుల్లి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ చిట్టి కారు ధర ఎంత? ఎన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది? బుకింగ్స్ ధర, డెలివరీలు ఎప్పుడనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ & ధరలు

ఆటో ఎక్స్‌పోలో లాంచ్ అయిన కొత్త వేవ్ ఎలక్ట్రిక్ కారు మూడు మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి నోవా, స్టెల్లా మరియు వేగా. వీటి ధరలు వరుసగా రూ. 3.99 లక్షలు, రూ. 4.99 లక్షలు మరియు రూ. 5.99 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ధరలు వేరుగా ఉంటాయి. అంటే కొనుగోలుదారు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకుంటే వీటి ధరలు రూ. 3.25 లక్షలు, రూ. 3.99 లక్షలు మరియు రూ. 4.49 లక్షలు వద్ద ఉంటాయి.

కంపెనీ ఈ కారు ధరలను మొదటి 25000 మందికి మాత్రమే పరిమితం చేసింది. ఆ తరువాత ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ కారును కంపెనీ మొదటిసారి 2023 ఆటో ఎక్స్‌పోలోనే ప్రదర్శించింది. ఇప్పుడు దానిని లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక ఛార్జ్‌తో 250 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం.

బుకింగ్స్ మరియు డెలివరీలు

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. దీనిని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు రూ. 5000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2026లో ప్రారంభమవుతాయి. దీనికి కారణం ఈ కారు ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. పూర్తయిన తరువాత డెలివరీలు స్టార్ట్ అవుతాయి.

డిజైన్ & పరిమాణం

కొత్త వేవ్ ఎలక్ట్రిక్ కారు చూడటానికి చిన్నదిగా ఉన్నప్పటికీ.. అత్యుత్తమ పనితీరును అందిస్తుందని సమాచారం. ఇది 3060 మిమీ పొడవు, 1150 మిమీ వెడల్పు, 1590 మిమీ ఎత్తు మరియు 2200 మిమీ వీల్‌బేస్ పొందుతుంది. ఈ కారు కేవలం రెండు డోర్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న సీట్లు మాత్రమే. ముందు భాగంలో ఒక డ్రైవర్ సీటు లేదా సెంట్రల్ సీటు, వెనుక ఇద్దరు కూర్చోవడానికి సరిపోయే సీటు (బెంచ్ సీటు) ఉంటుంది.

క్వాడ్రిసైకిల్ డిజైన్ కలిగి ఉండటం వల్ల ఈ కారు.. రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో కూడా సజావుగా ముందుకు సాగుతుంది. ఇది 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. మొత్తం మీద ఇది సింపుల్ డిజైన్ కలిగి, చిన్న ఫ్యామిలీ ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని స్పష్టమవుతోంది.

కలర్ ఆప్షన్స్ & ఫీచర్స్

ఈ కొత్త సోలార్ కారు మొత్తం ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మూన్‌స్టోన్ వైట్, లైట్ ప్లాటినం, రోజ్ కోరల్, స్కై బ్లూ, షాంపైన్ గోల్డ్ మరియు చెర్రీ రెడ్ కలర్స్.

వేవ్ ఎలక్ట్రిక్ కారు.. ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే టచ్‌స్క్రీన్ పొందుతుంది. అంతే కాకుండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఇందులో ఉంది. 6 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమరా, హిల్ అసిస్ట్, వెహికల్ డయాగ్నస్టిక్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్స్ అన్నీ కూడా ఇందులో చూడవచ్చు.

బ్యాటరీ & రేంజ్

వేవ్ ఎలక్ట్రిక్ కారు 18 కిలోవా బ్యాటరీ ద్వారా 250 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా 9 కిలోవాట్ బ్యాటరీ మరియు 12 కిలోవాట్ బ్యాటరీ ద్వారా 125 కిమీ మరియు 175 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే మీరు సోలార్ ప్యానెల్ ఎంచుకుంటే.. అదనంగా మీ డ్రైవింగ్ పరిధిని మరో 10 కిమీ పెంచుకోవచ్చు. సోలార్ ప్యానెల్ వార్షిక మైలేజ్ 3000 కిమీ వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Also Read: స్టైలిష్ కారు ‘ఎంజీ సైబర్‌స్టర్’ బుకింగ్స్ షూరూ: డెలివరీలు ఎప్పుడంటే?

కొత్త సోలార్ ఎలక్ట్రిక్ కారు కేవలం 5 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 70 కిమీ/గం. ఇందులోని బ్యాటరీ ఐపీ67 వాటర్ ప్రూఫ్ రేటింగ్ పొందింది. ఈ కారును డీసీ ఛార్జర్ ద్వారా 15 నిమిషాల్లో 10 నుంచి 70 శాతం ఛార్జ్ చేయవచ్చు. అయితే 15ఏ హోమ్ సాకేట్ ద్వారా 10 నుంచి 70 శాతం ఛార్జ్ కావడానికి 5 గంటల సమయం పడుతుందని సమాచారం. ఈ కారులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్ మరియు ప్రయాణికులందరికీ సీట్ బెల్ట్ వంటివి ఉన్నాయి.

ఇది కదా బైక్ అంటే.. రేటు అక్షరాలా రూ.21.20 లక్షలండోయ్

0

BMW S 1000 RR Launched in India: బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) సంస్థ ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’లో తన అప్డేటెడ్ ఎస్ 1000 ఆర్ఆర్ (S 1000 RR) బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర అక్షరాలా రూ. 21.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించిన బైక్ అప్డేటెడ్ మోడల్, కాబట్టి ఇందులో పెద్దగా ఆశించదగ్గ మార్పులు లేదా అప్డేట్స్ లేదు. కాబట్టి చూడటానికి అదే డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. కొత్త బాడీవర్క్ పొందినట్లు స్పష్టమవుతోంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా మొదలుపెట్టింది. కాగా డెలివరీలో ఏప్రిల్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

డిజైన్

కొత్త 2025 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్.. చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. కొత్త ఫెయిరింగ్, వింగ్‌లెట్ డిజైన్‌తో అప్డేట్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో వీల్ కవర్ ఉండటం చూడవచ్చు. ఇది ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లకు చల్లని గాలిని ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా ఈ బైకులో చెప్పుకోదగ్గ మార్పులు లేవు.

ఫీచర్స్

2025 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ఓడోమీటర్, డిజిటల్ స్పీడోమీటర్, హాజర్డ్ వార్ణింగ్ ఇండికేటర్, స్టాండ్ అలారం, గేర్ ఇండికేటర్, ఫ్యూయెల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, ఎల్ఈడీ లైటింగ్ సెటప్, జీపీఎస్ న్యావిగేషన్, ఎలక్ట్రిక్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటివన్నీ ఉన్నాయి.

కొత్త బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి బ్లాక్ స్టార్మ్ మెటాలిక్, బ్లూస్టోన్ మెటాలిక్ మరియు లైట్ వైట్ సాలిడ్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ సూపర్ బైకులో నాలుగు రైడింగ్ మోడ్స్ (రెయిన్, రోడ్, డైనమిక్ మరియు రేస్) ఉన్నాయి. కాబట్టి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

Also Read: స్టైలిష్ కారు ‘ఎంజీ సైబర్‌స్టర్’ బుకింగ్స్ షూరూ: డెలివరీలు ఎప్పుడంటే?

ఇంజిన్ వివరాలు

2025 బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్ బైక్ 999 సీసీ ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 13750 rpm వద్ద 210 హార్స్ పవర్, 11000 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 300 కిమీ కావడం గమనార్హం. ఇది అడ్జస్టబుల్ లివర్స్ మరియు బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటి కూడా పొందుతుంది.

ఖరీదైన బైకులకు డిమాండ్ ఎలా ఉందంటే?

ప్రస్తుతం భారతదేశంలో లెక్కలేనన్ని బైక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో సరసమైన బైకులు ఉన్నాయి, అత్యంత ఖరీదైన బైకులు ఉన్నాయి. సాధారణంగా రోజువారీ వినియోగానికి చాలామంది తక్కువ ధర వద్ద కొంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులనే కొనుగోలు చేస్తుంటారు. కానీ కొంతమంది బైక్ లవర్స్ మాత్రమే ఈ ఖరీదైన బైకులను కొనుగోలు చేస్తుంటారు.

Also Read: లక్షలమంది మెచ్చిన ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

ఖరీదైన బైకులు లాంగ్ రైడ్ చేయడానికి లేదా అడ్వెంచర్స్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలాంటి బైకులను కొనుగోలు చేసేవారు మైలేజ్ గురించి పెద్దగా పట్టించుకోరు. అంతే కాకుండా బైక్ తయారీ సంస్థలే.. వీటికి పెద్ద ఫ్యూయెల్ ట్యాంక్ అందిస్తాయి. కాబట్టి ఒక ఫుల్ ట్యాంక్ ఇంధనం ద్వారా ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లోని ఖరీదైన బైకులు

భారతీయ మార్కెట్లో చాలా ఖరీదైన బైకులు ఉన్నాయి. ఇందులో బీఎండబ్ల్యూ కంపెనీ లాంచ్ చేసిన ఎస్ 1000 ఆర్ఆర్ మాత్రమే కాకుండా.. కవాసకి నింజా హెచ్2ఆర్ (రూ. 79.90 లక్షలు), డుకాటీ పాణిగెల్ వీ4 ఆర్ (రూ. 70 లక్షలు), బీఎండబ్ల్యూ ఎమ్ 1000 ఆర్ఆర్ (రూ. 49 లక్షలు), హార్లే డేవిడ్సన్ రోడ్ గ్లైడ్ స్పెషల్ (రూ. 41.79 లక్షలు), హోండా గోల్డ్‌వింగ్ టూర్ (రూ. 39.20 లక్షలు) మొదలైనవి ఉన్నాయి.

స్టైలిష్ కారు ‘ఎంజీ సైబర్‌స్టర్’ బుకింగ్స్ షూరూ: డెలివరీలు ఎప్పుడంటే?

0

MG Cyberster At Auto Expo 2025: ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన 2025 ఆటో ఎక్స్‌పోలో ‘జేఎస్‌డబ్ల్యు – ఎంజీ మోటార్ ఇండియా’ (JSW-MG Motor) తన స్టైలిష్ సైబర్‌స్టర్ (Cyberster) కారును ప్రదర్శించింది. అంతే కాకుండా దీని కోసం ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఎంజీ సైబర్‌స్టర్ అనేది భారతదేశంలో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా అమ్ముడవుతుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

బ్యాటరీ & రేంజ్

కొత్త ఎంజీ సైబర్‌స్టర్ టాప్ స్పెక్ వేరియంట్ 77 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఈ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగి ఉండటం వల్ల ప్రతి యాక్సిల్‌పై ఒక మోటారు ఉంటుంది. కాబట్టి పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 510 హార్స్ మరియు 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 3.2 సెకన్లు మాత్రమే. కాగా ఇది ఒక ఫుల్ ఛార్జ్ మీద గరిష్టంగా 580 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. అంతే కాకుండా కంపెనీ ఈ కారును 64 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.

కలర్ ఆప్షన్స్ & డిజైన్

ఎంజీ సైబర్‌స్టర్ చూడటానికి కొంత లంబోర్ఘిని కారు మాదిరిగా అనిపిస్తుంది. ఇది మొత్తం నాలు కలర్ (ఎరుపు, బూడిద, తెలుగు మరియు పసుపు) ఆప్షన్లలో లభించే అవకాశం ఉంటుంది. కాగా ప్రపంచ మార్కెట్లో ఈ కారు ఆరు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది.

ఇక డిజైన్ విషయానికి వాశి.. ఎంజీ సైబర్‌స్టర్ అనేది బ్రాండ్ యొక్క అన్ని ఇతర మోడల్స్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది డ్రాప్ టాప్ టూ సీటర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎంజీ బీ రోడ్‌స్టర్ నుంచి ప్రేరణ పొందినట్లు సమాచారం. ఇందులో ఆక్టాగోన్ ఎంజీ బ్యాడ్జ్ మరియు పొడవైన బోనెట్ వంటివి ఉన్నాయి. కారులో 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో బాణం ఆకారంలో ఉండే టెయిల్ లైట్స్ ఉన్నాయి. అంతే కాకుండా వెనుక వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ ఉంటుంది. మొత్తం మీద దీని డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది.

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్

కొత్త ఎంజీ సైబర్‌స్టర్ గొప్ప ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది. ఇందులోని ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్.. ఆక్టాగోనల్ ఎంజీ లోగో పొందుతుంది. దీని వెనుక 10.25 ఇంచెస్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. దీనికి ఇరువైపులా 7 ఇంచెస్ స్క్రీన్స్ ఉంటాయి. అంతే కాకుండా సెంటర్ కన్సోల్ డ్రైవ్ సెలక్టర్ పక్కన నిలువగా అమర్చబడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కూడా ఉంది. దీనికి కింద భాగంలో కంట్రోల్స్ ఉంటాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఎంజీ సైబర్‌స్టర్ కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్ణింగ్ వంటి అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రత్యేకించి వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

Also Read: లక్షలమంది మెచ్చిన ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

భారతదేశంలో రోజువారీ వినియోగానికి, వ్యాపార ప్రయోజనాలకు ఎలక్ట్రిక్ కార్లు విరివిగా అందుబాటులో ఉన్నాయి. కానీ స్పోర్ట్ కార్ల విభాగంలో ఎలక్ట్రిక్ కార్లు చాలా తక్కువ. కానీ ఈ విభాగంలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ఎంజీ మోటార్ తన సైబర్‌స్టర్ కారును ప్రవేశపెట్టింది. కాబట్టిన ఇది మార్కెట్లో వాహన ప్రియులను ఆకర్షిస్తుందా?.. ఎలాంటి అమ్మకాలను పొందుతుంది.. అనే విషయాలు తెలియాల్సి ఉంది.

లక్షలమంది మెచ్చిన ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

0

Hyundai Creta EV Launched in India At Auto Expo 2025: భారతదేశంలో లక్షల మంది ప్రజలను ఆకర్శించిన ‘హ్యుందాయ్ క్రెటా’ (Hyundai Creta) నేడు (జనవరి 17) ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

వేరియంట్స్ & బుకింగ్ ప్రైస్

దేశీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ క్రెటా ఈవీ (Hyundai Creta EV) కోసం కంపెనీ ఇప్పటికే ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాబట్టి ఆసక్తి కలిగిన వాహన ప్రేమికులు ఈ కారును కొనుగోలు చేయడానికి రూ. 25000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

మార్కెట్లో లాంచ్ అయిన క్రెటా ఈవీ మొత్తం 6 వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎగ్జిక్యూటివ్ (రూ. 17.99 లక్షలు), స్మార్ట్ (రూ. 19.00 లక్షలు), స్మార్ట్ (ఓ) (రూ. 19.50 లక్షలు), స్మార్ట్ (ఓ) ఎల్ఆర్ (రూ. 21.50 లక్షలు), ప్రీమియం (రూ. 20.00 లక్షలు) మరియు ఎక్సలెన్స్ (రూ. 23.50 లక్షలు).. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా.

క్రెటా ఈవీ కొనుగోలుదారులు స్మార్ట్ (ఓ), ప్రీమియం మరియు ఎక్సలెన్స్ వేరియంట్ల కోసం 11 కిలోవాట్ ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్ చేసుకోవచ్చు. అయితే దీని కోసం అదనంగా రూ. 73000 చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్, రేంజ్ & ఛార్జింగ్

కొత్త హ్యుందాయ్ క్రెటా ఈవీ 42 కిలోవాట్ మరియు 51.4 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతుంది. చిన్న బ్యాటరీ 390 కిమీ రేంజ్ అందిస్తే.. పెద్ద బ్యాటరీ ప్యాక్ 473 కిమీ రేంజ్ అందిస్తుంది.

క్రెటా ఈవీ 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 171 హార్స్ పవర్, 255 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారును డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 58 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే 11 కిలోవాట్ ఏసీ ఛార్జర్ ద్వారా 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది.

కలర్ ఆప్షన్స్ & డిజైన్

కొత్త హ్యుందాయ్ క్రెటా ఈవీ అద్భుతమైన కలర్ ఆప్షన్స్ పొందుతుంది. అవి స్టార్రీ నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్ మరియు ఓషన్ బ్లూ మెటాలిక్ విత్ బ్లాక్ రూఫ్ కలర్స్. ఇందులో ఓషన్ బ్లూ మెటాలిక్ విత్ బ్లాక్ రూఫ్ అనేది కొత్త పెయింట్ స్కీమ్.

డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి కొంత సాధారణ క్రెటా మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. క్లోజ్ చేయబడిన గ్రిల్, ఎయిర్ డ్యామ్, బ్రాండ్ లోగోపై ఫ్రంట్ కెమరా, ఛార్జింగ్ పోర్ట్ వంటివన్నీ ఇంచులో చూడవచ్చు. ఏరో అల్లాయ్ వీల్స్, బ్లాక్ అవుట్ సీ పిల్లర్స్ ఇందులో ప్రత్యేకంగా కనిపిస్తాయి.టెయిల్‌గేట్‌పై ఎలక్ట్రిక్ బ్యాడ్జ్ ఉండటం చూడవచ్చు.

ఇంటీరియర్ ఫీచర్స్ అండ్ సేఫ్టీ ఫీచర్స్

హ్యుందాయ్ క్రెటా ఈవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 10.25 ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 8 స్పీకర్ బోస్ ఆడియో సిస్టం, డ్యూయెల్ జోన్ ఏసీ వెంట్స్, ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎమ్ వంటి వాటితో పాటు.. వాయిస్ కమాండ్స్, బ్లూలింక్ కార్ కనెక్టివిటీ, సీట్ అపోల్స్ట్రే కూడా ఉన్నాయి.సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు ఆటో హోల్డింగ్ డ్రైవ్ మోడ్‌లు కూడా ఇందులో లభిస్తాయి.

Also Read: ఆటో ఎక్స్‌పో 2025: టికెట్స్ ఎలా పొందాలి? టైమింగ్స్ ఏంటి? – ఇదిగో పూర్తి వివరాలు

క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టార్ట్ మరియు డిసెంట్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. ఈ కారు మారుతి ఈ విటారా, మహీంద్రా బీఈ 6, టాటా హారియర్ ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు: కేవలం రూ. లక్ష మాత్రమే!

0

Most Affordable Car in India Ligier Myli Mini EV: లక్ష రూపాయలు పెట్టినా.. ఓ మంచి బైక్ / స్కూటర్ కొనలేము. అలాంటిది కేవలం రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు వస్తుందంటే నమ్ముతారా?. బహుశా ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు నమ్మాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే లక్షకే కారు అందిస్తామంటూ.. ఓ కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు

లిజియర్ (Ligier) అనే కంపెనీ కేవలం లక్ష రూపాయలకే మినీ ఎలక్ట్రిక్ కారును అందించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం కంపెనీ ఈ కారును టెస్టింగ్ దశలో ఉంచినట్లు సమాచారం. అనుకున్న విధంగా అన్నీ సవ్యంగా జరిగితే.. ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లోనే ఇదే సరసమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.

రెండు సీట్లు కలిగిన ఈ కారు.. చూటడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇది యూరోపియన్ డిజైన్‌తో ప్రేరణ పొందినట్లు సమాచారం. ఈ కారు మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభిస్తుంది. అయితే ఇది ఒక సింగిల్ ఛార్జ్‌పై 63 కిమీ నుంచి 192 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. రోజువారీ ప్రయాణానికి.. నగర ప్రయాణానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. పరిమాణంలో చిన్నదిగా ఉండటం వల్ల రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా ఇది సజావుగా ముందుకు సాగుతుంది.

బ్యాటరీ ఫ్యాక్స్ & రేంజ్

లిజియర్ మినీ ఈవీ ఎలక్ట్రిక్ కారు.. మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. అవి G.OOD, I.DEAL, E.PIC మరియు R.EBEL వేరియంట్లు. ఇవి 4.14 కిలోవాట్ బ్యాటరీ, 8.2 కిలోవాట్ బ్యాటరీ మరియు 12.42 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ పొందుతాయి. కాబట్టి రేంజ్ కూడా 63 కిమీ, 123 కిమీ మరియు 192 కిమీ వరకు ఉంటుంది.

ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్

విడుదలకు సిద్దమవుతున్న కొత్త లిజియర్ మినీ ఈవీ ఎలక్ట్రిక్ కారు మోపెడ్ మాదిరిగా ఉంటుంది. దీని పొడవు 2958 మిమీ, వెడల్పు 1499 మిమీ మరియు ఎత్తు 1541 మిమీ వరకు ఉంటుంది. కాబట్టి ఇది ఇద్దరు ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. రెండు డోర్లను మాత్రమే కలిగి ఉన్న ఈ కారు 12 ఇంచెస్ మరియు 13 ఇంచెస్ వీల్స్ పొందుతుందని తెలుస్తోంది.

Also Read: ఆటో ఎక్స్‌పో 2025: టికెట్స్ ఎలా పొందాలి? టైమింగ్స్ ఏంటి? – ఇదిగో పూర్తి వివరాలు

ఫీచర్స్ విషయానికి వస్తే.. లిజియర్ మినీ ఈవీ ఎలక్ట్రిక్ కారు లేటెస్ట్ అండ్ స్పోర్టీ డిజైన్ పొందుతుందని తెలుస్తోంది. ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటివి పొందుతుంది. ఇవి కాకుండా ఈ కారులో పవర్డ్ స్టీరింగ్ వీల్, హీటెడ్ డ్రైవర్ సీట్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు కార్నర్ ఏసీ వెంట్స్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. కాగా.. ఇంకా లిజియర్ మినీ ఈవీకి సంబంధించిన చాలా వివరాలు తెలియాల్సి ఉంది. ఇవన్నీ కూడా త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

అతి చిన్న కారు

భారతీయ మార్కెట్లో రూ. 5 లక్షల నుంచి రూ. కోట్ల విలువ చేసే కార్ల వరకు వినియోగంలో ఉన్నాయి. అయితే లక్ష రూపాయలకే కారు అంటే.. చాలామంది తప్పకుండా దీనిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. గతంలో ‘రతన్ టాటా’ తక్కువ ధరలో ఫ్యామిలీ కారు అందించాలనే ఉద్దేశ్యంతో ‘టాటా నానో’ కారును ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ కారు ఉత్పత్తి దశలో లేదు. కానీ ఎలక్ట్రిక్ కారుగా మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే నానో కారు కంటే చిన్నదైన కారు ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులోకి రాలేదనే చెప్పాలి. కాబట్టి లిజియర్ కంపెనీ లాంచ్ చేయనున్న కారు.. మార్కెట్లోకి అడుగుపెట్టనున్న అతి చిన్న కారు అని స్పష్టమవుతోంది. డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా దీని ధర వద్ద ఉత్తమాంగానే ఉన్నాయని తెలుస్తోంది. కానీ ఈ కారులో ఎలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయనేది తెలియాల్సి ఉంది.

ఆటో ఎక్స్‌పో 2025: టికెట్స్ ఎలా పొందాలి? టైమింగ్స్ ఏంటి? – ఇదిగో పూర్తి వివరాలు

0

Auto Expo 2025 Venues Timings Tickets and How to Go: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో జపాన్, చైనా, కొరియా మొదలైన దేశాలకు చెందిన వాహనాలు కనిపించనున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్ మూడు ప్రదేశాల్లో (భారత్ మండపం (ప్రగతి మైదాన్), ద్వారకా వద్ద ఉన్న యశోభూమి మరియు గ్రేటర్ నోయిడా) జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఎలా వెళ్ళాలి? టికెట్స్ ఎలా పొందాలి? టికెట్ కోసం డబ్బు చెల్లించాలా అనే విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

టికెట్స్ ఎలా పొందాలి? డబ్బు ఎంత చెల్లించాలి

నిజానికి రేపు (జనవరి 17) జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో పాల్గొనటానికి టికెట్స్ తప్పనిసరి. అయితే ఈ టికెట్స్ క్యూఆర్ కోడ్ రూపంలో పొందాల్సి ఉంటుంది. దీని కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆటో ఎక్స్‌పో సందర్శించాలనుకునే వ్యక్తి ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తరువాత.. విజిటర్ రిజిస్టర్ సెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఆ తరువాత మీకు సంబంధించిన సమాచారం లేదా ప్రాథమిక సమాచారం ఫిల్ చేసిన తరువాత.. రిజిస్టర్ ఈ మెయిల్ ఐడీకీ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఇదే ఎంట్రీ పాస్ మాదిరిగా పనిచేస్తుంది.

సందర్శకులు ఎప్పుడు హాజరవ్వాలి? సమయం వివరాలు

జనవరి 17న ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో కార్యక్రమానికి.. మొదటి రోజు (శుక్రవారం) మీడియా సిబ్బందిని మాత్రం అనుమతిస్తారు. జనవరి 18 (శనివారం) ప్రత్యేక ఆహ్వానితులకు మరియు డీలర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆ తరువాత జనవరి 19 (ఆదివారం) నుంచి జనవరి 22 (బుధవారం) వరకు ప్రజలు సందర్శించవచ్చు. అయితే సందర్శలు ఆ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది.

ఆటో ఎక్స్‌పోలో కనిపించే బ్రాండ్స్

2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హ్యుందాయ్, ఎంజీ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, స్కోడా, ఇసుజు, కియా మోటార్స్, టయోటా మోటార్స్ వంటి దిగ్గజ కార్ల తయారీదారులతో పాటు.. ఓలా ఎలక్ట్రిక్, రాయల్ ఎన్ఫీల్డ్, హోండా మోటార్‌సైకిల్, హీరో మోటోకార్ప్ వంటి టూ వీలర్స్ బ్రాండ్స్ కనిపించనున్నాయి. అంతే కాకుండా టైర్ షో, బ్యాటరీ షో, మొబిలిటీ టెక్, స్టీల్ ఇన్నోవేషన్ మరియు ఇండియా సైకిల్ షో కూడా ఇక్కడ జరగనున్నాయి.

ముఖ్య అతిధులు ఎవరంటే?

రేపు జరగనున్న 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈయనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. మోదీ మాత్రమే కాకుండా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మొదలైనవారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. కానీ వీరు ఎప్పుడు హాజరవుతారు అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఆటో ఎక్స్‌పో 2025 వేదికకు ఎలా చేరుకోవాలి

దేశ రాజధాని నగరంలో జరగనున్న ఈ 2025 ఆటో ఎక్స్‌పో ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో జరుగుతుంది. ఢిల్లీ చేరుకున్న వారు ఈ వేదిక సమీపానికి మెట్రో ద్వారా చేరుకోవచ్చు. సందర్శకులు బ్లూ లైన్ మెట్రోలో సుప్రీంకోర్టు స్టేషన్‌కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి సులభంగా వేదికను చేరుకోవచ్చు. కారులో వెళ్లాలనుకునే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి.

Also Read: 2025 Auto Expo: డేట్స్, బ్రాండ్స్ & పూర్తి వివరాలు ఇవే

రేపు ప్రారంభం కానున్న 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో దేశీయ వాహనాలు మాత్రమే కాకుండా.. అన్యదేశ్య వాహనాలు కనిపించనున్నాయి. ఇప్పటికే ఏ వాహనాలు ఆటో ఎక్స్‌పోలో కనిపించనున్నాయి అనే దానికి సంబంధించిన కొంత సమాచారం వెల్లడైంది. అయితే ఏ కంపెనీలు ఈ కార్యక్రమంలో కనిపించలేదని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలుస్తుంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాలు పెద్ద ఎత్తున కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో టూ వీలర్, ఫోర్ వీలర్స్ మాత్రమే కాకుండా.. త్రీ వీలర్ వాహనాలు కూడా ఉండే అవకాశం ఉందని సమాచారం.

మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..

0

Five Viral Moments in 2025 Maha Kumbh: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం లేదా కార్యక్రమంగా పరిగణించే.. మహా కుంభమేళా (Maha Kumbha Mela 2025) ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది.

గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి సంగమం (Triveni Sangam) వద్ద సుమారు 40 కోట్లమంది స్నానాలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఆత్మను శుద్ధి చేసుకోవడానికి.. పాపాలను పోగొట్టుకుని, ఆధ్యాత్మిక విముక్తి పొందటానికి ఇక్కడ స్నానం చేయాలని ప్రజలు విశ్వసిస్తారు. ఈ కారణంగానే ప్రపంచ నలుమూలల నుంచి లెక్కకు మించిన భక్తులు ఇక్కడకి విచ్చేసారు.

ప్రస్తుతం.. కోలాహలంగా, పెద్ద ఎత్తున జరుగుతున్న కుంభమేళాలో కొన్ని సంఘటనలు ఎంతోమందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అవి ప్రస్తుతం నెట్టింలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం..

13000 అడుగుల ఎత్తులో కుంభమేళా జెండా

ఉత్తరప్రదేశ్‌లోని.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ‘అనామిక శర్మ’ బ్యాంకాక్‌లో సుమారు 13000 అడుగుల ఎత్తులో మహా కుంభమేళా జెండాను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియోలో గమనిస్తే.. అనామిక శర్మ విమానం ఎక్కడానికి ముందు జెండా చూపిస్తారు. ఆ తరువాత విమానం గాలిలోకి ఎగురుతుంది. విమానం ఎత్తుకు ఎగిరిన తరువాత.. అక్కడి నుంచి కిందికి దూకి, జెండాను ప్రదర్శిస్తుంది.

ఐఐటీ బాబా

ఎంతో ప్రాచీన చరిత్ర ఉన్న మహా కుంభమేళాకు ఎంతోమంది సాధువులు, ఋషులు మరియు మతపెద్దలు హాజరవుతారు. అయితే అందరినీ దృష్టిని ఓ వ్యక్తి ఆకర్శించాడు. ఆయనే ఐఐటీ బాబాగా పిలువబడే ‘అభయ్ సింగ్’. ఐఐటీ బొంబాయి నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేసిన ఈయన ఉద్యోగం చేసి, కొన్ని సంవత్సరాలు తరువాత ఉద్యోగం కూడా చేసినట్లు సమాచారం. ఆ తరువాత ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరవడానికి సన్యాసిగా మారాడు. ఈయన పరమశివ భక్తుడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by SANGAM NAGRI (@sangam_nagri999)

కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ సతీమణి

మహా కుంభమేళాలో దివంగత.. ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ భార్య ‘లారెన్ పావెల్ జాబ్స్’ (Laurene Powell Jobs) కనిపించారు. ఈమె ప్రత్యేకంగా కుంభమేళా కోసం భారతదేశానికి వచ్చారు. అంతే కాకుండా ఆమె స్వామి కైలాసనంద గిరి ద్వారా ‘కమల’గా పేరు మార్చుకున్నారు. ఈమె జనవరి 15 వరకు ఇక్కడే ఉండి.. 20వ తేదీ అమెరికాలో జరగనున్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈమె తన భర్త ఆఖరి కోరికను తీర్చటానికి మాత్రమే కాకుండా.. భారతీయ సంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవాన్ని మరియు ఆధ్యాత్మికత పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేయడానికి పవిత్ర కుంభమేళాకు హాజరైనట్లు తెలుస్తోంది.

హార్లే డేవిడ్‌సన్ బైకులో సీర్

త్రివేణి సంగమం పవిత్ర స్నానానికి ప్రతిరోజూ లక్షలాది మంది హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి మరింత చైతన్యాన్ని పెంపొందించడానికి ఒక సీర్ హార్లే డేవిడ్‌సన్ బైకుపై (Harley Davidson X440) కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: ఆ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ – కొత్త కారు కొనేవారికి దబిడిదిబిడే

చాయ్ వాలే బాబా ఐఏఎస్ కోచింగ్

మహా కుంభమేళా 2025లో చాయ్ వాలే బాబాగా ప్రసిద్ధి చెందిన ‘దినేష్ స్వరూప్ బ్రహ్మచారి’ కూడా అందరి దృష్టిని ఆకర్శించారు. కేవలం చాయ్ (టీ) మాత్రమే తాగుతూ బ్రతుకుతున్న ఈయన 40 సంవత్సరాలుగా ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ చాయ్ వాల్ బాబ్ నోరు విప్పి మాట్లాడారు. సైగలతో.. వాట్సాప్ సందేశాల ద్వారా విద్యార్థులకు వచ్చే డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తుంటారు.

జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 40 కోట్లమంది జనం వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఏకంగా.. 2 లక్షల కోట్ల రూపాయలను ఆర్జించే అవకాశం ఉంది. అయితే కుంభమేళా 2025 కోసం ప్రభుత్వం రూ. 7000 కోట్లు ఖర్చు పెట్టనుంది. 2019లో జరిగిన అర్ద కుంభమేళా సమయంలో ప్రభుత్వం రూ. 1.2 లక్షల కోట్లు ఆర్జించింది.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం రూ.79999 మాత్రమే: సింగిల్ చార్జితో..

0

Ampere Magnus Neo EV Launched in India: మార్కెట్లో ప్రస్తుతం లెక్కలేనన్ని స్కూటర్లు, బైకులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక సాధారణ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేసి ఉపయోగించాలంటే.. కనీసం రూ. 1 లక్ష రూపాయలైన పెట్టాల్సిందే. డబ్బున్నవారికి లక్ష రూపాయాలు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కానీ కింది తరగతి కుటుంబాలకు మాత్రం చాలా ఎక్కువే. అలాంటి వారు కూడా తమ రోజువారీ వినియోగానికి ఓ స్కూటర్ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో.. ‘ఆంపియర్’ కంపెనీ తక్కువ ధరతో ‘మాగ్నస్ నియో’ పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ లాంచ్ చేసింది. దీని ధర లక్ష కంటే తక్కువే. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ధర & కలర్ ఆప్షన్స్

ఆంపియర్ లాంచ్ చేసిన మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 79,999 మాత్రమే (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). ఈ స్కూటర్ డ్యూయెల్ టోన్ ఫినిషింగ్ కలిగి ఎరుపు, తెలుపు, నీలం, బూడిద రంగు మరియు నలుపు అనే ఐదు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుండటం వల్ల.. ఈ స్కూటర్ ఎక్కువమంది వాహన ప్రేమికులను ఆకర్శించే అవకాశం ఉందని ఆశిస్తున్నాము.

బ్యాటరీ అండ్ రేంజ్

ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ 2.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక సింగిల్ ఛార్జీతో 70 నుంచి 80 కిమీ రేంజ్ అందిస్తుంది. కాబట్టి ఇది రోజువారీ ప్రయాణానికి, తక్కువ దూరాలకు లేదా నగర ప్రయాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని ఇతర మోడల్స్ కంటే దీని రేంజ్ కొంత తక్కువే అయినప్పటికీ.. ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

కొత్త మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 65 కిమీ. స్పీడ్ పరంగా ఇది దాని ఇతర వేరియంట్ల కంటే కొంత ఎక్కువే అని తెలుస్తోంది. ఈ బైక్ 10 ఇంచెస్ వీల్స్ కాకుండా 12 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అయితే ఇందులోని అన్ని ఫీచర్స్.. దాదాపు దాని మునుపటి మోడళ్లలో మాదిరిగానే ఉంటాయి. ఇందులో చిన్న డిజిటల్ డ్యాష్ బోర్డు చూడవచ్చు.

ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుందని తెలుస్తోంది. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. రివర్స్ మోడ్ కూడా ఉంది. ఇది రివర్స్ చేసే సమయంలో చాలా ఉపయోగపడుతుంది. కంపెనీ ఈ స్కూటర్ కొనుగోలుపై 5 సంవత్సరాల వ్యారంటీ.. బ్యాటరీ మీద 75000 కిమీ వ్యారంటీ అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్కూటర్ అమ్మకానికి ఉంది.

తక్కువ ధరలో బెస్ట్ స్కూటర్

ప్రస్తుతం మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్.. భారతదేశంలో అత్యంత సరసమైన స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది. తక్కువ ధరలో ఓ మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలని కోరుకునే వారికి ఇది ఓ మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఇది సింపుల్ డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులకు లేదా బైక్ రైడర్లకు అవసరమైన ఫీచర్స్ పొందుతుంది. తద్వారా ఇది అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తున్న కంపెనీలో ఆంపియర్ కూడా ఒకటి. ఇది దేశీయ మార్కెట్లో ఆంపియర్ నెక్సస్, ఆంపియర్ రియో ఎల్ఐ ప్లస్, ఆంపియర్ ప్రైమస్ మరియు ఆంపియర్ జీల్ ఈఎక్స్ అనే స్కూటర్లను విక్రయిస్తోంది. వీటి ధరలు.. ఇతర కంపెనీల స్కూటర్ల ధరల కంటే తక్కువే. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను చాలామంది తమ రోజువారీ వినియోగానికి కొనుగోలు చేస్తున్నారు.

Also Read: ఆ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ – కొత్త కారు కొనేవారికి దబిడిదిబిడే

నిజానికి పెట్రోల్ బైకుల కంటే కూడా ఎలక్ట్రిక్ బైకుల మెయింటెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టవు. ఇవి జీరో ఉద్గారాలను విడుదల చేయడం వల్ల వాతావరణంలో కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతాయి. కాగా ఇప్పుడు మార్కెట్లో ఆంపియర్ లాంచ్ చేసిన మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందో తెలుసుకోవడానికి కొంతకాలం వేచి ఉండక తప్పదు.

ఆ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ – కొత్త కారు కొనేవారికి దబిడిదిబిడే

0

Parking Certificate Mandatory For New Car Registration: ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండాలనే ఆలోచనతో.. దేశంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న వాహనాల సంఖ్య భారీ రద్దీకి లేదా ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయి. అంతే కాకుండా పార్కింగ్ చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురువవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది.

ఇకపై మహారాష్ట్రలో వాహనాలు కొనుగోలు చేసేవారు, తప్పకుండా పార్కింగ్ ప్రదేశాలను చూపించాల్సి ఉంటుందని.. దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా చూపించాలని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రవాణా కమిషనర్ వివేక్ భీమేశ్వర్.. రాష్ట్ర ముఖ్యమంత్రి ‘దేవేంద్ర ఫడ్నవీస్’కు సమర్పించారు. ఈ కొత్త ప్రతిపాదనను ప్రవేశపెట్టడానికి ముందు, సంబంధించిన అధికారులతో చర్చించి.. నివేదికను మరింత చక్కగా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు.

మూడు నెలల్లో చర్చలు

మహారాష్ట్రలో కొత్త నియమాలను ప్రవేశపెట్టడానికి.. రవాణా శాఖ వచ్చే మూడు నెలల్లో వాటాదారులతో చర్చలు జరపడానికి సిద్ధమైంది. ఈ ప్రతిపాదన అమలైతే.. రాష్ట్రంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని సమాచారం. అయితే రాష్ట్రంలో కొంతవరకు ట్రాఫిక్ లేదా వాహనాల రద్దీని తగ్గించవచ్చు.

రాష్ట్రంలో కొత్త కొత్త నియమాలను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం.. రద్దీని తగ్గించడానికి మాత్రమే కాదు, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా అని రవాణా శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ముంబై, పూణే నగరాల్లో కొత్త చట్టం ఆమోదించబడితే.. వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు పార్కింగ్ సర్టిఫికెట్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్రతిపాదనను రూపొందించే సమయంలో.. విదేశాలలోని చట్టాలను కూడా పరిశీలించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నియమం ఇప్పటికే జపాన్, లండన్ నగరాల్లో ఉందని తెలుస్తోంది.

పార్కింగ్ ప్లేస్ ఉండాలి

కారు కొనుగోలుచేసే వారికి.. తప్పకుండా పార్కింగ్ ప్లేస్ ఉండాలి అని చెప్పడం మంచి విషయమే. అయితే కొన్ని నగరాల్లో పార్కింగ్ చేసుకోవడానికి కూడా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. కార్ల వినియోగదారులకు ఇది ఆర్థికంగా కూడా కొంత నష్టమే. కారు మెయింటెనెన్స్ లేదా నిర్వహణకే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంటే.. పార్కింగ్ కోసం కూడా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితులను ఎదుర్కోవడం మరో సమస్య అనే చెప్పాలి.

పట్టణాలు రోజు రోజుకీ అభివృద్ధి చెందుతున్న సమయంలో.. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కారు ఉండాలనుకోవడం కొంత కష్టమే. కారు కొనుగోలు చేయడం పెద్ద సమస్య కాకపోయినప్పటికీ.. దాని పార్కింగ్, రోడ్డుపై ట్రాఫిక్ రెండూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటి నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం వీలైనంత వరకు ప్రజా రవాణాలో ప్రయాణించడం. ఆలా కాకున్నా.. ఓ ఇంట్లో నాలుగుతున్నారనుకుంటే, వారికి ఒక కారు ఉంటే సరిపోతుంది. నాలుగు కార్లు అవసరం లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా కొంత అవగాహనా పెంచుకోవాలి.

దేశంలో వాహనాల సంఖ్య

సుమారు 145 కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న భారతదేశంలో లెక్కకు మించిన కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. ప్రజా రవాణా ఉన్నాయి. 3.287 మిలియన్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన దేశంలో నివాస, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉపయోగాలు పోనూ మిగిలిన ప్రదేశాల్లోనే వాహనాల వినియోగం జరుగుతోంది. ఓ వైపు జనాభా సంఖ్య పెరిగిపోయి, మరోవైపు వాహనాల సంఖ్య పెరిగిపోతూ ఉంటే.. దేశం విస్తీర్ణంలో మార్పు ఉండదు కదా. కాబట్టి ఉన్న విస్తీర్ణం.. జనాభా పెరుగుదల వంటి వాటిని కూడా ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలి.

Also Read: 2024లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఎంతమంది కొన్నారో తెలిస్తే.. షాకవవుతారు!

భారీస్థాయిలో పెరుగుతున్న వాహనాలు వాతావరణ సమతుల్యతను దెబ్బ తీస్తాయి. ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. నేడు గాలిలో ఆక్సిజన్ పరిమాణం తెగిపోయి, కార్భన్ వాయువుల స్థాయి పెరిగిపోతోంది. ఇప్పటికే కాలుష్యం కారణంగా కొన్ని చిన్న పక్షి, జంతు జాతులు పూర్తిగా మరుగున పడ్డాయి. వాహనాల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే.. మనుషు ఆక్సిజన్ సిలిండర్లను భుజాన వేసుకుని తిరగాల్సిన పరిస్తితులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.