దేశీయ మార్కెట్లో BMW కొత్త కారు లాంచ్.. ధర & వివరాలు ఇక్కడ చూడండి

BMW 620d M Sport Signature Launched In India: భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ (BMW) ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త ‘620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్’ (620d M Sport Signature) కారును లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారు ధర రూ. 78,90,000 (ఎక్స్ షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ జీటీ స్పోర్ట్ వేరియంట్ కంటే రూ.3.4 లక్షలు ఎక్కువ.

ఇది చూడటానికి దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇందులో కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ గమనించవచ్చు. ఇందులో సాఫ్ట్ క్లోజ్ డోర్స్, ఫుల్లీ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఫ్రంట్ కంఫర్ట్ సీట్లు, మెమొరీ ఫంక్షన్ మరియు లంబార్ సపోర్ట్.. వెనుక సీట్ల కోసం స్పెషల్ బ్యాక్‌రెస్ట్ కుషన్‌లు ఉన్నాయి. కంఫర్ట్ సీట్లు డకోటా లెదర్‌లో ప్రత్యేకమైన స్టిచ్చింగ్ మరియు కాంట్రాస్ట్ పైపింగ్‌తో నలుపు రంగులో చూడచక్కగా ఉంటాయి.

ఫీచర్స్ (Features)

కొత్త బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రిమోట్ కంట్రోల్ పార్కింగ్, కీలెస్ ఎంట్రీ, ఆటోమాటిక్ లాకింగ్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి వాటితోపాటు 10.25 ఇంచెస్ స్క్రీన్‌లతో కూడిన రియర్ సీట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొఫెషనల్‌తో కూడిన బీఎండబ్ల్యూ డిస్ప్లే కీ ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా ఇందులో ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హర్మాన్ కార్డాన్ 16 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్‌బ్లైండ్‌ వంటివి ఉన్నాయి.

ఇంజిన్ (Engine)

ఇంజిన్ విషయానికి వస్తే.. ఇందులో 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 190 హార్స్ పవర్ మరియు 400 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం జీటీ 7.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

సేఫ్టీ ఫీచర్స్ (Safety Features)

ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ప్రత్యర్థులు (Rivals)

దేశీయ మార్కెట్లో ‘బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్’ పెట్రోల్ వేరియంట్ల ధర రూ. 73.50 లక్షల నుంచి రూ. 76.90 లక్షలు కాగా.. డీజిల్ వేరియంట్‌ల ధర రూ. 75.50 లక్షల నుంచి రూ. 78.90 లక్షల వరకు ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్ మరియు ఆడి ఏ6 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: ఒకప్పుడు సైకిల్.. ఇప్పుడు కోట్లు ఖరీదైన లగ్జరీ కార్లు – ఎవరీ అనురాగ్..

భారతీయ మార్కెట్లో బీఎండబ్ల్యూ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే సంస్థ తాజాగా బీఎండబ్ల్యూ 620డీ ఎం స్పోర్ట్ లాంచ్ చేసింది. ఇది కూడా తప్పకుండా దేశీయ విఫణిలో మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. కంపెనీ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తుందని భావిస్తున్నాము.

నిజానికి బీఎండబ్ల్యూ కంపెనీ దాని ప్రత్యర్థులకు కూడా గట్టిపోటీ ఇస్తూ.. అమ్మకాల్లో దూసుకెల్తూ ఉంటుంది. అమ్మకాల్లో బీఎండబ్ల్యూ కంపెనీ దూసుకెళ్లడానికి ప్రధాన కారణం.. కార్ల యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా.. పనితీరు పరంగా కూడా అద్భుతంగా ఉండటమనే తెలుస్తుంది. రాబోయే రోజుల్లో కూడా కంపెనీ ఇంతకు మించిన అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము.