అంబానీ గ్యారేజిలో కూడా లేదు!.. ఈ ఒక్క నటి దగ్గర మాత్రమే ఆ కారు ఉంది

Bollywood Actress Krishna Shroff Hummer H3: చాలామంది సెలబ్రిటీలు బెంజ్ కార్లు లేదా ఆడి కార్లను ఇష్టపడి కొనుగోలు చేస్తారు. రోజువారీ వినియోగానికి కూడా వాటినే వినియోగిస్తుంటారు. కానీ ప్రముఖ నటుడు ‘జాకీ ష్రాఫ్’ (Jackie Shroff) .. కుమార్తె ‘కృష్ణ ష్రాఫ్’ (Krishna Shroff) భిన్నంగా పాపులర్ అమెరికన్ బ్రాండ్ కారును తన రోజువారీ వినియోగానికి ఉపయోగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈమె నటించే కారు ఏది? దాని ధర ఎంత? ఈ మోడల్ కారును కలిగి ఉన్న సెలబ్రిటీలు ఎవరనేది.. ఇక్కడ చూసేద్దాం.

లెజండరీ జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణ ష్రాఫ్.. ఉపయోగించే కారు ‘హమ్మర్ హెచ్3’ (Hummer H3). ముంబై విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో ఈ కారులోనే కనిపించింది. మ్యాట్ బ్లాక్ కలర్‌లో కనిపించే ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆఫ్ రోడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండే ఈ కారు ధర ఇండియన్ మార్కెట్లో చాలా ఎక్కువే.

అమెరికన్ బ్రాండ్.. హమ్మర్ హెచ్3 కారు ధర ఎక్కువగా ఉండటం వల్ల.. ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయలేరు. ప్రస్తుతం హమ్మర్ కారును కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో మహేంద్ర సింగ్ ధోని, మికా సింగ్, సునీల్ శెట్టి మరియు హర్భజన్ సింగ్ వంటివారు ఉన్నారు. అయితే హమ్మర్ హెచ్3 కారును కలిగిన ఏకైక నటి ‘కృష్ణ ష్రాఫ్’ కావడం గమనించదగ్గ విషయం.

జీఎమ్ఆర్ హమ్మర్ హెచ్3 (GMR Hummer H3)

భారతదేశంలో ఎక్కువ మందికి ఇష్టమైన కార్లలో ఒకటి హమ్మర్ హెచ్3. ఇది చూడటానికి భారీగా ఉండటమే కాకుండా.. అద్భుతమైన పనితీరును కూడా అందిస్తుంది. నిజానికి జీఎమ్ఆర్ అనేది హమ్మర్ యొక్క మాతృ సంస్థ. ఇది హమ్మర్ హెచ్2 మరియు హెచ్3 కార్లను రూపొందించింది. అయితే కంపెనీ తన కార్లను అధికారికంగా విక్రయించలేదు. కానీ చాలా దేశాలలోని ప్రైవేట్ దిగుమతి దారులు.. ఈ కార్లను దిగుమతి చేసుకుని కస్టమర్లను విక్రయించారు. అప్పట్లో హమ్మర్ హెచ్3 కారు ధర రూ. 70 లక్షల నుంచి రూ. 80 లక్షల మధ్య ఉండేది. ఆ తరువాత ఈ కారును యూస్డ్ మార్కెట్ ద్వారా రూ. 40 లక్షల నుంచి రూ. 60 లక్షల మధ్య విక్రయించారు.

ఇంజిన్ ఆప్షన్స్

హమ్మర్ హెచ్3 అనేది ప్రపంచ మార్కెట్లో రెండు ఇంజిన్ ఎంపికలతో లభిస్తోంది. ఇందులో ఒకటి 3.7 లీటర్ ఇన్‌లైన్ 5 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 245 పీఎస్ పవర్ మరియు 328 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆప్షనల్ 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

ఇక రెండో ఇంజిన్.. 5.3 లీటర్ వీ8 పెట్రోల్. ఇది 4 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఈ ఇంజిన్ 305 పీఎస్ పవర్ మరియు 434 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. భారీ పరిమాణం కలిగిన ఈ కారు టైర్లు 32 ఇంచెస్ వరకు ఉంటాయి. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ కారు లాకింగ్ డిఫరెన్షియల్‌లతో వస్తుంది. కాబట్టి గొప్ప పర్ఫామెన్స్ అందిస్తుంది.

హమ్మర్ ఈవీ (Hummer EV)

అమెరికన్ కార్ల తయారీ సంస్థ హమ్మర్.. 2010లోనే హెచ్3 ఉత్పత్తిని నిలిపివేసింది. ఆ తర్వాత కంపెనీ ఈ మోడల్ కార్లను తయారు చేయలేదు. అయితే 2021లో కంపెనీ దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది. ఆ తరువాత కంపెనీ హమ్మర్ హెచ్3 ఎలక్ట్రిక్ కారును గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసింది. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు ఇండియన్ మార్కెట్లో అందుబాటులో లేదు. కానీ దీనిని కావాలనుకుంటే.. దిగుమతి చేసుకోవచ్చు. దిగుమతి సుంకాలు మరియు ఇతర రోడ్ ట్యాక్స్ వంటివన్నీ కలిపితే దీని ధర రూ. 3.85 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

Also Read: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న కియా కొత్త కారు: మార్కెట్లో మోత మోగిస్తున్న సిరోస్

హమ్మర్ హెచ్3 ఈవీ 2ఎక్స్ మరియు 3ఎక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. 2X వేరియంట్ డ్యూయెల్ అల్టిమేట్ మోటార్ కలిగి ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ పొందుతుంది. ఇది 625 Bhp పవర్ అందిస్తుంది. 3X వేరియంట్ 830 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 505 కంటే ఎక్కువ కిమీ మైలేజ్ ఇస్తుందని సమాచారం. సుమారు 4500 కేజీల బరువున్న ఈ కారు కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. కాబట్టి ఇది ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ అత్యుత్తమ పర్ఫామెన్స్ అందిస్తుందని తెలుస్తోంది.

Leave a Comment