బాలీవుడ్ హీరోయిన్ కొరియన్ బ్రాండ్ కారు.. దీని ధర తెలిస్తే షాకవుతారు!

Bollywood Actress Akansha Ranjan New Kia EV6: సినీ తారలు కొత్త కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. చాలామంది సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు వారికి నచ్చిన కార్లను కొనేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే ఇటీవల ప్రముఖ బాలీవుడ్ నటి ‘ఆకాంక్ష రంజాన్ కపూర్’ (Akansha Ranjan Kapoor) సౌత్ కొరియా బ్రాండ్ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. నటి ఈ కారుతో కనిపించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నటి ఆకాంక్ష రంజన్ కొనుగోలు చేసిన కారు కియా మోటార్స్ యొక్క ఈవీ6 ఎలక్ట్రిక్ కారు అని తెలుస్తోంది. జిమ్ వెలుపల కారు దగ్గర ఈమె కనిపించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కారు ఆపిన తరువాత రోడ్డు దాటే సమయంలో ఆమె ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

 

కియా ఈవీ6 (Kia EV6)

భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి కియా ఈవీ6. ఇది అత్యధిక రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే నటి ఆకాంక్ష రంజన్ కొనుగోలు చేసిన కారు తెలుపు రంగులో ఉండటం చూడవచ్చు. ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, బ్రాండ్ లోగోతో కూడిన స్లొపింగ్ బానెట్ వంటివి పొందుతుంది. ఇవన్నీ కారుకు ప్రీమియం డిజైన్ ఇవ్వడంలో ఉపయోగపడతాయి.

చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన కియా ఈవీ6 4695 మిమీ పొడవు, 1890 మిమీ వెడల్పు మరియు 1550 మిమీ ఎత్తు కలిగి ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా, కంఫర్ట్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. చూడటానికి హ్యాచ్‌బ్యాక్‌గా అనిపించినా.. ఇది పరిమాణంలో పెద్దగానే ఉంటుంది. ఈ కారు 19 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు యొక్క వెనుక భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఈ కారు లోపల 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 14 స్పీఎకర్ మెరిడియన్ సౌండ్ సిస్టం, 60 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్, సరౌండ్ వ్యూ కెమెరా మొదలైనవి ఉంటాయి. ఈ కారులో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఏడీఏఎస్ వంటి లేటెస్ట్ టెక్నలజీ కూడా ఉంటుంది.

కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారు కంప్లిట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ) మార్గం ద్వారా మన దేశంలో విక్రయించబడుతున్నాయి. కాబట్టి దీని ధరలు రూ. 64.11 లక్షల నుంచి రూ. 69.35 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) ఉన్నాయి. ధరల పరంగా ఈ కారు ఇప్పటికే విక్రయానికి ఉన్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇక కియా ఈవీ6 బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ కారు 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది రియర్ వీల్ డ్రైవ్ (RWD), ఆల్ వీల్ డ్రైవ్ (AWD) వెర్షన్లలో లభిస్తుంది. ఆర్డబ్ల్యుడీ వెర్షన్ 229 పీఎస్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. అదే సమయంలో ఏడబ్ల్యుడీ వెర్షన్ 325 పీఎస్ పవర్, 605 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే నటి ఆకాంక్ష రంజన్ ఏ వేరియంట్ కొనుగోలు చేసిందో ఖచ్చితంగా వెల్లడి కాలేదు.

Don’t Miss: రోజువారీ ప్రయాణానికి బెస్ట్ స్కూటర్లు.. ఎంచుకో ఓ మంచి ఆప్షన్

కియా ఈవీ6 కారు 5.2 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 528 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ 350 కేడబ్ల్యు డీసీ ఛార్జర్‌ ద్వారా 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. 53 కేడబ్ల్యు ఛార్జర్ ద్వారా 73 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది 22 కేడబ్ల్యు వాల్ బాక్స్ ఛార్జర్ కూడా పొందుతుంది.

ఈవీ6 ఎలక్ట్రిక్ కారును కలిగి ఉన్న ప్రముఖులు

నటి ఆకాంక్ష రంజన్ మాత్రమే కాకుండా.. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని, మలయాళీ నటుడు మోహన్ లాల్, అక్కినేని నాగార్జున భార్య అమల కూడా ఈ కియా ఈవీ6 కార్లను కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కియా ఈవీ6 కారు మీద సెలబ్రిటీలకు ఎంత మక్కువో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కారు కొనుగోలుపైన కంపెనీ ఈ నెలలో (జులై) భారీ డిస్కౌంట్ కూడా అందిస్తున్నట్లు సమాచారం.