Shilpa Shetty Arrives Expensive Ferrari Portofino Supercar: సాధారణంగా చాలామంది సెలబ్రటీలు విలాసవంతమైన వాహనాలలో తిరుగుతారని అందరికి తెలుసు. ఇప్పటికే పలు సందర్భాల్లో కొంతమంది సెలబ్రిటీలు ఖరీదైన కార్లలో కనిపించారు. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ నటి ‘శిల్ఫా శెట్టి’ (Shilpa Shetty) ఏకంగా రూ. 4 కోట్ల కంటే ఎక్కువ విలువైన సూపర్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో గమనిస్తే.. నటి శిల్పా శెట్టి ‘ఫెరారీ ఫోర్టోఫినో’ (Ferrari Portofino) కారులో నుంచి బయటకు రావడం చూడవచ్చు. ఈ కారులో రాజ్ కుంద్రా కూడా ఉండటం చూడవచ్చు. ఈ సన్నివేశం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. కారు దిగి ఎయిర్‌పోర్ట్ లోపలికి శిల్పా శెట్టి వెళ్తుంది, ఆ సమయంలో ఫరాజ్ కుంద్రా కారును డ్రైవ్ చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఫెరారీ పోర్టోఫినో
నిజానికి ఫెరారీ కంపెనీ పోర్టోఫినో కారును ఉత్పత్తి చేయడం లేదు. ఈ సూపర్ కారు స్థానంలోనే ఫెరారీ రోమా పుట్టుకొచ్చింది. అయితే ఇక్కడ కనిపించే కారు శిల్పా శెట్టి ఫ్యామిలీ కొనుగోలు చేసిందా? లేదా అనే విషయం ఖచ్చితంగా వెల్లడికాలేదు. ఒకవేలా కొనుగోలు చేసినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరి గ్యారేజిలో ఇప్పటికే అనేక లగ్జరీ బ్రాండ్ కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫెరారీ కారును కొనుగోలు చేసినట్లైయితే.. గ్యారేజిలో మరోకారుకు చోటు లభించినట్లే అవుతుంది.
పోర్టోఫినో అనేది ఫెరారీ బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవెల్ సూపర్ కారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 4.04 కోట్లు అని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఇది కూడా ఒకటని తెలుస్తోంది. ధర ఎక్కువగా ఉండటం వల్ల వీటిని చాలా తక్కువమంది మాత్రమే కొనుగోలు చేస్తారు.
ఫెరారీ పోర్టోఫినో సూపర్ కారు హార్డ్ టాప్ కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారు. ఇది అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) ఫీచర్స్ మరియు వెంటలేటెడ్ అండ్ హీటెడ్ సీట్లను పొందుతుంది. డిజైన్ పరంగా.. చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. ఫీచర్స్ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించేలా ఉన్నాయి.
పోర్టోఫినో సూపర్ కారు 3.9 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 620 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిన ఈ కారు 3.45 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే గంటకు 200 కిమీ వేగంతో ప్రయాణించడానికి పట్టే సమయం 9.8 సెకన్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే దీని పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
రాజ్ కుంద్రా మరియు శిల్పా శెట్టి కనిపించిన ఈ ఫెరారీ పోర్టోఫినో కారును ఇప్పటికే బాలీవుడ్ నటుడు రామ్ కపూర్ కొనుగోలు చేశారు. బహుశా ఈ కారును కొనుగోలు చేసినవారి సంఖ్య చాలా తక్కువనే తెలుస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కార్ల యొక్క ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. దీని స్థానంలోనే ప్రస్తుతం రోమా కారును విక్రయిస్తోంది.
శిల్పా శెట్టి కార్ కలెక్షన్
నటి శిల్పా శెట్టి ఉపయోగించే కార్ల జాబితాలో లంబోర్ఘిని అవెంటడోర్, బీఎండబ్ల్యూ ఐ8, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 730ఎల్‌డీ మొదలైన కార్లు ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా పోర్స్చే కయెన్ జీటీఎస్ కారును రాజ్ కుంద్రా ఉపయోగిస్తారు.
Don’t Miss: గోవాలో జరిగే ‘ఇండియా బైక్ వీక్’ డేట్స్ వచ్చేశాయ్.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే?
ఖరీదైన కార్లను ఉపయోగించే ప్రముఖ సెలబ్రిటీల జాబితాలో శిల్పా శెట్టి ఫ్యామిలీ మాత్రమే కాకుండా.. జెనీలియా ఫ్యామిలీ, అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ, షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ కూడా ఉన్నాయి. వీరు ఉపయోగించే కార్ల ధరలు చాలా ఎక్కువ. ఇందులో రోల్స్ రాయిస్, బెంట్లీ, లంబోర్ఘిని బ్రాండ్లకు చెందిన ఖరీదైన కార్లు ఉన్నాయి.