BSA Gold Star 650 Launched in India: ప్రముఖ బ్రిటీష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ బీఎస్ఏ (BSA) దేశీయ మార్కెట్లో ‘గోల్డ్ స్టార్ 650’ (Gold Star 650) లాంచ్ చేసింది. ఒక్కప్పుడు టూ వీలర్ అమ్మకాల్లో ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించిన ఈ బైక్ మళ్ళీ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ మరియు బుకింగ్స్ & ధర వంటి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
ధర & బుకింగ్స్
దేశీయ మార్కెట్లో అధికారంగా లాంచ్ అయిన కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ధర రూ. 3 లక్షల నుంచి రూ. 3.35 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. ఈ బైక్ బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న జావా / యెజ్డీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. బీఎస్ఏ క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకారం.. గోల్డ్ స్టార్ 650 బుకింగ్స్ భారతదేశంలోని 52 అవుట్‌లెట్‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా కంపెనీ తన పరిధిని మరింత విస్తరించే యోచనలో ఉంది. అయితే డెలివరీలు మరో 10 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
డిజైన్ & ఫీచర్స్
చూడటానికి ఆకర్షణీయంగా ఉండే కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ క్లాసిక్ రోడ్‌స్టర్ మాదిరిగా ఉంటుంది. ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ వంటివి చూపించడానికి డిజిటల్ గేజ్ మరియు రెట్లో డిజైన్ వంటివి చూడవచ్చు. వార్ణింగ్ లైట్స్, స్పీడో మీటర్, టాకొమీటర్ ఉండే రెండు అనలాగ్ క్లాక్స్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా.. ఫ్యూయెల్ ట్యాంక్ మీద బ్రాండ్ గుర్తులు కూడా చూడవచ్చు. మొత్తం మీద ఈ బైక్ ఆధునిక కాలంలో రైడర్లను ఆకర్శించే విధంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో అనలాగ్ డయల్స్, బీఎస్ఏ లోగోలు, లేటెస్ట్ క్లాసిక్ డిజైన్ ఎగ్జాస్ట్ మరియు టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్, స్పోక్ వీల్స్, రౌండ్ హెడ్‌లైట్, డే టైమ్ రన్నింగ్ లాంప్ (డీఆర్ఎల్) వంటివి ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
కలర్ ఆప్షన్స్
బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ మొత్తం ఆరు రంగులలో లభిస్తుంది. అవి హైలాండ్ గ్రీన్, ఇన్‌సిగ్నియా రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, డాన్ సిల్వర్, షాడో బ్లాక్ మరియు లెగసీ ఎడిషన్. ఇవన్నీ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కాబట్టి వాహన ప్రియులు నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. బైకులో అక్కడక్కడా క్రోమ్ బిట్స్ ఉన్నాయి.
ఇంజిన్
ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవలసిన అంశం ఇంజిన్.. ఇందులో 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 45 Bhp పవర్ మరియు 55 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. కాబట్టి ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే పవర్ మరియు టార్క్ అన్నీ కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ బైకుల కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది.
డిజైన్, ఫీచర్స్ మరియు ఇంజిన్ వంటి వివరాలు పక్కన పెడితే.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ బ్రెంబో కాలిపర్‌లతో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ (320 మిమీ ఫ్రంట్ మరియు 255 మిమీ రియర్ బ్రేక్స్), అల్యూమినియం స్పోక్ వీల్స్ మరియు పిరెల్లి టైర్లు ఉన్నాయి. ఈ బైక్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది. అంతే కాకుండా.. ఈ బైక్ 41 మిమీ టెలిస్కోపిక్ పోర్క్ మరియు రియర్ ట్విన్ షాక్స్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి.
Don’t Miss: ప్రపంచ కుబేరులు.. వేలకోట్ల సంపద: వీళ్ళు వాడే కార్లు మాత్రం ఇవే
భారతీయ మార్కెట్లో ఇప్పటికే 650 సీసీ బైకులకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని బీఎస్ఏ 650 గోల్డ్ స్టార్ లాంచ్ చేసింది. ఒకప్పుడు గణనీయమైన అమ్మకాలను పొందిన బీఎస్ఏ బైక్.. మళ్ళీ దేశీయ విఫణిలో పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నాము. ఇప్పటికే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి బుకింగ్స్ పొందుతుందని త్వరలోనే తెలుస్తుంది.