అమ్మను చూడగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ‘కిష్కింధపురి‘. ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 12) థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతకంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల కూడా హాజరయ్యారు.

నాన్నకు అమ్మంటే భయమా?

కిష్కింధపురి సినిమా గురించి మాట్లాడుతూ.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించారు. ఇప్పటికి రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుందని సుష్మితా వెల్లడించారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మీకు ఏదంటే భయం అన్న ప్రశ్నను.. మనం భయపెట్టడమే గానీ భయపడటం ఉండదని అన్నారు. నాన్నగారికి అమ్మను చూస్తే భయమా? అని సుమ అడిగారు.

సుమ అడిగిన ప్రశ్నకు.. ఈ రోజు జరిగిన సంఘటన ఒకటుందని సుష్మిత చెప్పారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ సందర్భంగా ఒక సాంగ్ షూట్ చేసాము. ఈ సమయంలో అమ్మ సెట్లోకి అడుగు పెట్టింది. అమ్మను చూడగానే.. అప్పటి వరకు డ్యాన్స్ బాగా వేస్తున్న నాన్న స్టెప్ తడబడింది. డ్యాన్స్ బాగా చేయలేకపోయారు అని నవ్వుతూ చెప్పింది. ఎంత మెగాస్టార్ అయిన భార్యకు భయపడాల్సిందే అని సుమ నవ్వుతూ చెప్పేసింది. అంతే కాకుండా.. కిష్కిందపురి సినిమా మంచి హిట్ సాధించాలని కోరుకున్నట్లు సుష్మిత కొణిదెల వెల్లడించారు.

కిష్కింధపురి సినిమా గురించి

బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరం ప్రధాన పాత్రలలో కనిపించే కిష్కింధపురి సినిమా హర్రర్ థ్రిల్లర్. కౌశిక్ పెగాళ్ళపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాహు గారపాటి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, హైపర్ ఆది, మకరంద్ దేశ్ పాండే తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం చిత్ర రూ. 25 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కలెక్షన్ ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాపై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ చివరగా భైరవం సినిమాలో కనిపించారు. ఇప్పుడు కిష్కింధపురి సినిమాలో కనిపించబోతున్నారు.

సుష్మిత కొణిదెల

1982 మార్చి 3న జమించిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల.. కాస్ట్యూమ్ డిజైనర్. అంతే కాకుండా ఈమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహారెడ్డి వంటి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సుష్మిత సేనాపతి అనే సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి

1993 జనవరి 3న జన్మించిన బెల్లంకొండ శ్రీనివాస్.. 2014లో అల్లుడు శీను సినిమాతో చిత్ర సీమలో అడుగుపెట్టాడు. మొదటి సినిమా మంచి హిట్ సాధించిన తరువాత స్పీడున్నోడు, జయ జానకీ నాయక, సాక్ష్యం, కవచం, సీత, రాక్షసుడు, అల్లుడు అదుర్స్ వంటి సినిమాల్లో నటించారు. ఇక కిష్కింధపురి రేపు (శుక్రవారం) రిలీజ్ అవుతుంది. కాగా ఈయన ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనే వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.

Leave a Comment