Citroen Basalt Debuts in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ ఎట్టకేలకు తన కొత్త ఎస్‌యూవీ ‘బసాల్ట్’ (Basalt)ను అధికారికంగా భారతీయ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ దశలో కనిపించిన ఈ కారు ఎలాంటి హంగు, ఆర్బాటం లేకుండానే మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీ ధరలను సంస్థ ఆగష్టు 7న ప్రకటించనుంది.
డిజైన్
ఈ ఏడాది మార్చిలో కనిపించిన ప్రొడక్షన్ స్పెక్ మోడల్ మాదిరిగానే.. బసాల్ట్ ఉంది. అయితే ఇక్కడ ఓ చిన్న చేంజ్ ఏమిటంటే? బాడీ క్లాడింగ్ స్కెచ్‌లో కనిపించినట్లు గ్లోస్ బ్లాక్ ఫినిషింగ్‌కు బదులుగా.. మ్యాట్ ప్లాస్టిక్ ఫినిషింగ్ పొందుతుంది. ఈ కారు డిజైన్ కొంత సీ3 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ మాదిరిగా అనిపిస్తుంది. అయితే కొన్ని భిన్నమైన ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ముందు భాగంలో క్రోమ్ లైన్డ్ లోగో, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ చూడవచ్చు. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉన్నాయి.
కొత్త సిట్రోయెన్ బసాల్ట్ యొక్క వీల్ ఆర్చ్‌ల మీద స్క్వేర్డ్ ఆఫ్ క్లాడింగ్, రెండు వైపులా ఒక పించ్డ్ విండోలైన్ మరియు బూట్ లిడ్ వరకు సాగిన రూఫ్ లైన్ వంటివి చూడవచ్చు. సైడ్ ప్రొఫైల్ 17 ఇంచెస్ అల్లవ్ వీల్స్ పొందుతుంది. వెనుక చిన్నగా ఉన్న టెయిల్ గేట్, 3డీ ఎఫెక్ట్ హాలోజన్ టెయిల్ లాంప్ మరియు బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ ఛంకీ డ్యూయెల్ టోన్ బంపర్ చూడవచ్చు. మొత్తానికి డిజైన్ చూపరులను ఆకట్టుకునే విధంగా ఉంది.
కలర్ ఆప్షన్స్ మరియు డైమెన్షన్
దేశీయ విఫణిలో అడుగెట్టిన కొత్త సిట్రోయెన్ బసాల్ట్ మొత్తం ఐదు సింగిల్ టోన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, గార్నెట్ రెడ్ మరియు కాస్మో బ్లూ. ఇందులోని రూప్ మాత్రం బ్లాక్ కలర్ పొందుతుంది.
పరిమాణం పరంగా కూడా బసాల్ట్ ఉత్తమగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ వీల్‌బేస్ 2651 మిమీ వరకు ఉంటుంది. ఇది సీ3 ఎయిర్‌క్రాస్ వీల్‌బేస్ కంటే కూడా 20 మిమీ తక్కువ. అయితే గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ వరకు ఉంటుంది.
ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్
కొత్త ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ బసాల్ట్ యొక్క ఇంటీరియర్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. సీ3 ఎయిర్‌క్రాస్ నుంచి తీసుకున్న డ్యాష్‌బోర్డ్, మాన్యువల్ ఏసీ వెంట్స్ మీద డిజిటల్ రీడౌట్, టోగుల్ స్విచ్‌లు, ఆటో ఏసీ ఫంక్షన్‌తో కూడా బటన్స్ అన్నీ కూడా ఇక్కడ గమనించదగ్గ అప్డేట్స్. అంతే కాకుండా పెద్ద ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు రీడిజైన్ చేయబడిన కాంటౌర్డ్ రియర్ హెడ్‌రెస్ట్ వంటివి ఉన్నాయి. ఈ కారులో బూట్ స్పేస్ 470 లీటర్ల వరకు ఉంది. ఇంకా రూప్ మరియు సెంటర్ ఆర్మ్‌రెస్ట్ వద్ద ఏసీ వెంట్స్ ఉన్నాయి.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 10.25 ఇంచెస్ మౌంటెడ్ ప్లోటింగ్ టచ్‌స్క్రీన్, 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు 15 వాట్స్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ కూడా ఇందులో ఉంటుంది. అయితే బసాల్ట్ సన్‌రూఫ్ ఫీచర్ కోల్పోతుంది.
ఇంజిన్
కొత్త బసాల్ట్ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. మొదటి ఇంజిన్ 81 బీహెచ్‌పీ పవర్ మరియు 115 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 18 కిమీ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది.
ఇక రెండో ఇంజిన్ టర్బో పెట్రోల్ విషయానికి వస్తే.. ఇది 108 బీహెచ్‌పీ పవర్ మరియు 195 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికను పొందుతుంది. మాన్యువల్ వేరియంట్ 19.5 కిమీ మైలేజ్, ఆటోమాటిక్ వేరియంట్ 18.7 కిమీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.
సేఫ్టీ ఫీచర్స్
ముఖ్యంగా తెలుసుకోవలసిన అంశం సేఫ్టీ ఫీచర్స్. సిట్రోయెన్ బసాల్ట్ యొక్క అన్ని వేరియంట్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని తెలుస్తోంది.
Don’t Miss: తక్కువ ధర & ఎక్కువ మైలేజ్.. వచ్చేసింది ‘హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ సీఎన్‌జీ’
ప్రత్యర్థులు
దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన సిట్రోయెన్ బసాల్ట్ దాని విభాగంలో గట్టి పోటీని ఎదుటర్కోవాల్సి ఉంటుంది. ఇది ప్రధానంగా టాటా కర్వ్ ఎస్‌యూవీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అంతే కాకుండా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి కార్లకు కూడా ప్రత్యర్థిగా ఉంటుంది. కంపెనీ బసాల్ట్ ఎస్‌యూవీ ధరలను అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉండొచ్చని సమాచారం.