Daily Horoscope in Telugu 2025 March 15th Saturday: శనివారం (15 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం, పాడ్యమి. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు.
మేషం
ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. అవసరానికి కావలసిన ధనం సమకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆత్మీయుల సలహాలు అనుకూలంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆనందంగా కాలం గడుపుతారు.
వృషభం
సమస్యలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం, చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
మిథునం
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు, ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కొత్త సమస్యలు పుడతాయి. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దైవ దర్శనం చేస్తారు.
కర్కాటకం
సన్నితులతో వివాదాలు, కుటుంబ వాతావరణం చికాకును కలిగిస్తుంది. ఆర్ధిక పరిస్థితి బాగాలేదు. చిన్న నాటి స్నేహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపించవు.
సింహం
పెట్టుబడులకు కావాల్సిన ధనం అందుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
కన్య
నూతన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, దూరప్రయాణాలు ఉన్నాయి. మిత్రుల నుంచి ఒక శుభవార్త వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం, ఆర్ధిక విషయాల్లో లేదా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు.
తుల
వృధా ఖర్చులు, అవసరానికి తగిన ధనం అందదు. దూరప్రయాణాలు చేస్తారు. చేపట్టిన పనులు ఆలస్యంగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో వివాదాలు, చిన్ననాటి స్నేహితలను కలుసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఉద్యోగంలో సమస్యలు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అవసరానికి కావాల్సిన ధనం అందుతుంది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
ధనుస్సు
శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల సలహాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రయాణంలో నూతన పరిచయాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
మకరం
వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, అవసరానికి కావలసిన డబ్బు అందదు. ఉద్యోగంలో స్థాన చలనం ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రమకు తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
కుంభం
ఆర్ధిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో.. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. బంధువులతో ఆనందంగా కాలం గడుపుతారు.
మీనం
శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నితులతో మాటపట్టింపులు ఉన్నాయి. కొన్ని వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు వద్దు.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. 12 రాశుల స్థితిగతులు ఫలితాలను నిర్థారిస్తాయని ఖగోళ శాస్త్రం చెబుతుంది. కాబట్టి వీటి స్థితిగతులలో ఏర్పడే మార్పు లాభాలను లేదా నష్టాలను కలిగించవచ్చు. పైన చెప్పినదే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. దైవ నామస్మరణ తప్పకుండా శుభాలను కలుగజేస్తుంది.