Daily Horoscope in Telugu 2025 March 17th Monday: సోమవారం (2025 మార్చి 17). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుంచి 9:00 వరకు. యమగండం 10:30 నుంచి 12:00 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు. అమృత గడియలు ఉదయం 5:35 నుంచి 7:21 వరకు.
మేషం
శుభకార్యాలలో పాల్గొంటారు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
వృషభం
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత బాధకలిగిస్తుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
మిథునం
ఇంటా బయట అనుకూలం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన డబ్బు లభిస్తుంది. దైవ దర్శనం చేసుకుంటారు.
కర్కాటకం
బంధు మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు ఉన్నాయి. ఉద్యోగులకు మంచి కాలం, అధికారుల ప్రసంశలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
సింహం
అవసర ఖర్చులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలనం. ఇంటా బయట కొన్ని చికాకులు, దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య
కుటుంబంలో చికాకులు, సన్నిహితులతో మాటపట్టింపులు, ఆర్ధిక ఇబ్బందులు కొంత చికాకును కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. నూతన కార్యక్రమాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులను కలిగిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు.
తుల
ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. అలోచించి తీసుకున్న నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
వృశ్చికం
నూతన పరిచయాలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. అవసరానికి తగిన ధనం అందుతుంది. చాలా కాలంగా ఓ కొలిక్కిరాని సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు
దైవ దర్శనం చేసుకుంటారు. అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్తవారితో కొంత జాగ్రత్తగా మెసులుకోవాలి. వృత్తి, ఉద్యోగాలలో ఒడిదుడుకులు ఉన్నాయి. బంధు మిత్రులతో కలహాలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి కొంత క్షీణిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడి ఉంటుంది.
మకరం
అవసరానికి కావలసిన ధనం చేకూరుతుంది. చేపట్టిన పనులలో అంతరాయాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
కుంభం
ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. కీలక వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. పెద్దవారి నుంచి ప్రశంసలు లభిస్తాయి.
మీనం
నూతన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. అనారోగ్య సమయాలు తలెత్తుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి.