బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

Deepika Padukone Birthday Special Car Collection: ప్రముఖ నటి, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలో చెప్పుకోదగ్గ ‘దీపికా పదుకొనే’ (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ కాలంలో ఎంతో పాపులర్ సాధించిన ఈమె 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా నిలిచి 2022 టైమ్100 ఇంపాక్ట్ అవార్డును సైతం కైవసం చేసుకుంది.

1986 జనవరి 05న కోపెన్‌హాగన్‌లో జన్మించింది. అయితే ఈమె బెంగళూరులో పెరిగినట్లు సమాచారం. ఈమె తండ్రి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొణె. తండ్రి బ్యాడ్మింటన్ ఆడటంతో ఈమె కూడా యుక్త వయసులోనే జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లలో బ్యాడ్మింటన్ ఆడింది.

ఫ్యాషన్ మీద ఉన్న మక్కువతో బ్యాడ్మింటన్ వదిలేసింది. ఆ తరువాత చలన చిత్ర సీమలో అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే 2006లో కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఆ తరువాత 2007లో షారుఖ్ ఖాన్ సరసన నటించింది. ఆ తరువాత అనేక సినిమాల్లో నటించిన చిత్ర సీమలో తనదైన ముద్ర వేసి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత 2018లో తన సహనటుడు రణ్‌వీర్ సింగ్‌ను ఇటలీలోని లేక్ కోమోలో వివాహం చేసుకుంది.

దీపిక పదుకొనె కార్ కలెక్షన్స్ (Deepika Padukone Car Collection)

సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే దీపిక పదుకొనె ఖరీదైన అన్యదేశ్య కార్లను కూడా ఇష్టపడుతుంది. ఈ కారణంగానే ఈమె వద్ద జర్మన్, ఇటాలియన్ సూపర్ కార్లు ఉన్నాయి.

ఆడి క్యూ7 (Audi Q7)

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడే కార్ల జాబితాలో ఆడి కార్లు చెప్పుకోదగ్గవి. దీపిక పదుకొనె గ్యారేజిలో చేరిన మొదటి కారు ఆడి కంపెనీకి చెందిన క్యూ7. ఒకప్పటి నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఈ కారుని చాలామంది సెలబ్రిటీలు ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. దీని ధర సుమారు రూ. 80 లక్షలు. అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ SUV మంచి పనితీరుని అందిస్తుంది. దీపిక వద్ద ఉన్న ఆడి క్యూ7 సిల్వర్ కలర్ షేడ్ పొందిన ఉండటం గమనించవచ్చు. ఈ కారు మార్కెట్లో 2007 నుంచి 2015వరకు భారతీయ మార్కెయిలో అందుబాటులో ఉంది.

ఆడి ఏ8ఎల్ (Audi A8L)

దీపిక పదుకొనె వద్ద ఉన్న మరో ఆడి కంపెనీ కారు ఏ8ఎల్. సుమారు రూ. 1.20 కోట్లు ఖరీదైన ఈ కారు సీబీయూ మార్గం ద్వారా భారతీయ తీరాల్లో అడుగుపెట్టింది. ఏ8 అనేది లాంగ్ వీల్‌బేస్ వెర్షన్. ఈ సెడాన్ పరిమాణం పరంగా విశాలంగా ఉండి, మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఆడి ఏ8ఎల్ కూడా ఒకటి కావడం విశేషం.

మినీ కూపర్ కన్వర్టిబుల్ (Mini Cooper Convertible)

నటి దీపిక గ్యారేజిలోని మరో ఖరీదైన కారు ‘మినీ కూపర్ కన్వర్టిబుల్’. రూ. 45 లక్షల ఖరీదైన ఈ కారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారుని డ్రైవ్ చేస్తూ దీపిక పలుమార్లు కనిపించింది. ఎలక్ట్రిక్ బ్లూ కలర్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు కస్టమ్-మేడ్ వైట్ కలర్ ఇంటీరియర్‌లతో వస్తుంది. ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రెండు డోర్లు కలిగి ఉన్న ఈ కారు పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది.

మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500 (Mercedes Maybach S500)

దీపిక పదుకొనె గ్యారేజిలోని మరో జర్మన్ బ్రాండ్ కారు ‘మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్500’. సుమారు రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ మొత్తం లైనప్‌లో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమైన సెడాన్. ఈ కారు కొనుగోలు చేసిన మొదటి నటి దీపిక కావడం విశేషం. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ కారు వాహన వినియోగదారులకు మంచి లగ్జరీ అనుభూతిని అందిస్తుంది.

Don’t Miss: Mahindra కార్లపై భారీ డిస్కౌంట్స్ – ఏకంగా రూ.1.25 లక్షల వరకు..

మొత్తం ఆస్తి (Networth)

దీపికా పదుకొణె నికర విలువ 2023 నాటికి సుమారు 60 మిలియన్ డాలర్లు అని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 499 కోట్లు కంటే ఎక్కువ. ఈమె లోరియల్, నైక్ మరియు తనిష్క్ వంటి అనేక ప్రముఖ బ్రాండ్‌లతో పని చేసింది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 12 నుంచి రూ. 15 కోట్లు పారితోషికం తీసుకుంటుందని సమాచారం.