చియాన్ విక్రమ్ కుమారుడు హీరోగా ధృవ్ విక్రమ్.. హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా బైసన్ (కాలమాదన్). వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు మారీ సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. నీలం స్టూడియోస్ మరియు అప్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై.. దర్శక నిర్మాత పా. రంజిత్, సమీర్ నాయర్, దీపక్ సెగల్, అదితి ఆనంద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివాస్ కే ప్రసన్న ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. పశుపతి.. హీరో తండ్రిగా ప్రధాన పాత్రలో కనిపించునున్నారు.
ధృవ్ విక్రమ్ ఆశలన్నీ బైసన్ పైనే..
ఇప్పటి వరకు ధృవ్ విక్రమ్ రెండు సినిమాల్లో మాత్రమే నటించాడు. అందులోను మొదటి చిత్రమే తెలుగులో వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేశారు. వరమా అనే పేరుతో తీసిన ఫస్ట్ వెర్షన్‌లో అంత బలం లేకపోయేసరికి మళ్ళీ రీషూట్ చేసి ఆదిత్య వర్మ అనే పేరుతో విడుదల చేశారు. ఇందులో దృవ్ నటన, స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికి క్రిటిక్స్ నుంచి మిక్సడ్ పోసిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ వ్యాపార పరంగా చూసుకుంటే యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఇక రెండో సినిమా తండ్రి చియాన్ విక్రమ్‌తో కలిసి నటించిన మహాన్. అది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో రిలీజ్ అవ్వడంతో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. థియేటర్లలో రిలీజ్ కాకపోవడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నష్టపోయిందా, ఫలితాలు రాబట్టిందా అనడానికి వీలులేకుండా పోయింది. కానీ ప్రేక్షకుల్లో.. యువత ఎక్కువుగా అట్రాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఇప్పుడు మూడవ చిత్రం బైసన్.. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17న అతి పెద్ద అంచనాలతో ప్రేకక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు అద్భుతంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో మిలయన్స్ వ్యూస్‌తో అత్యంత ఆదరణ పొందాయి. ధృవ్ విక్రమ్ మంచి మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కంటెంట్ బాగుంటే ఇదే అతనికి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంది అని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
మారీ మార్క్ మళ్ళీ రిపీట్!
మారీ తీసిన సినిమాలు ఇప్పటి వరకు ఫెయిల్ అయిన దాఖలాలే లేవు. నాలుగు చిత్రాలు పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్, మామన్నన్, వాలై అఖండ విజయాన్ని సృష్టించ్చాయి. కులము, సమాజము, రాజకీయం, అధికారము వీటన్నింతో ఆయన పాత్రలు పోరాటం చేస్తుంటాయి. ధృవ్ లుక్ మిగిలిన రెండు చిత్రాల కంటే భిన్నంగా ఉంది. రఫ్, మాస్ స్టైల్‌లో ఉన్న ధృవ్‌ను చూస్తుంటే తన జీవితంలో ఇదే టర్నింగ్ సినిమా అవుతుందని సినీ క్రిటిక్స్ వర్గాలు చెబుతున్నాయి. మారీ సెల్వరాజ్ కెరీర్‌లో భారీ విజయం పొందనునున్నట్లు అర్థమవుతోంది. మారీ మార్క్ మళ్ళీ రిపీట్ అవ్వాలని కోరుకుందాం.
కథ విషయానికి వస్తే.. పల్లెటూరు వ్యవసాయ కుటుంబం మరియు కబడ్డీ ఆడే క్రీడాకారుని నేపథ్యంలో ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు ఆడిన సినిమాలు.. తండ్రి చియాన్ విక్రమ్ ఇమేజ్ చట్రంలోనే చూస్తున్నారు. బైసన్ ధృవ్‌కు ఒక సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేస్తుందని అందరూ భావిస్తున్నారు. అందుకు తగినట్టే విడుదలైన పాటలు.. అన్నీ నిరూపిస్తున్నాయి. ఈ నెల అక్టోబర్ 17న దీపావళి సంధర్బంగా మారీ, ధృవ్ అభిమానులకు కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఇందుకోసం ఫ్యాన్స్ కూడా అదే ఉత్సహంతో ఎదురుచూస్తున్నారు.