తెలుగులోనూ బైసన్ సినిమా: ధృవ్ విక్రమ్ & అనుపమ లవ్ సాంగ్ వచ్చేసింది!

మారీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం బైసన్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 17వ తేది రోజున దీపావళి సందర్బంగా విడుదల కానుంది. దీనికి సంబంధించిన నాలుగు పాటలను తమిళంలో రిలీజ్ చేశారు. అవి ఒక రేంజ్‌లో హిట్ అయ్యాయి. ఇప్పటికి మిలయన్స్ వ్యూస్‌తో ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు తెలుగులో ఎటువంటి పాటలు, టీజర్, ప్రకటనలుగానీ.. ప్రచారంగానీ జరగలేదు.

బైసన్ తెలుగు సాంగ్

సాధారణంగా సినిమా డైరెక్ట్ మారీ సెల్వరాజ్‌కు తెలుగులో కూడా ఒక ప్రత్యేకమైన అభిమానుల సమూహం ఉంది. ఆయన తీసే విభిన్నమైన చిత్రాలు తెలుగులో కూడా రిలీజ్ అయితే బాగుంటుంది అని ఎంతో ఆత్రుతతో సినిమా కోసం ఎదురుచూసే వారి సంఖ్య రోజురోజుకి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. బైసన్ సినిమా తెలుగులో రాదేమో అని నిరాశ చెందిన మారీ అభిమానులకు ఎట్టకేలకు ఒక సంతోషాన్ని కలిగించే అప్డేట్ ఇచ్చారు. నిన్న (గురువారం) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మూవీకి సంబంధించిన తీరేనా తీరేనా గుండెల్లోనా మండుతుండే మూగ వేదనా.. అనే అత్యంత పెయిన్ ఫుల్ లవ్ సాంగ్‌ను సోషల్ మీడియాలో విడుదల చేశారు.

ఇంకో ఏడురోజులే

బైసన్ రిలీజ్‌కు.. ఇంకా ఏడురోజులే సమయం ఉండటంతో అన్ని రాష్ట్రాల్లో ప్రచారం ముమ్మరం చేసినట్టుగా కనిపిస్తోంది. అందుకే మూవీ పట్ల ఆసక్తిని పెంచడానికి తెలుగులో వీడియో సాంగ్ విడుదల చేసినట్టున్నారు. తమిళంలో రిలీజ్ అయిన పాటలన్నీటికీ అక్కడి ప్రజల్లో, సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. అంతే కాకుండా సినిమా రిలీజ్ చేసే ప్రతి థియేటర్ ముందర బైసన్ తలకాయ ఉన్న నమూనాను పెడుతున్నారు. ఇది ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది.

మ్యూజిక్ డైరెక్టర్ నివాస్ కే ప్రసన్న, సింగర్ సత్యన్, హీరో ధృవ్ విక్రమ్, హీరోయిన్స్ అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్ లు షాపింగ్ కాంప్లెక్స్ లాంటివాటిలో ప్రొమోషన్లలో పాల్గొని ఫ్యాన్స్ అండ్ పబ్లిక్‌తో ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఇది సినిమాపట్ల సానుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నది.

ప్రేమ విరహ గీతం

తెలుగులో విడుదలైన బైసన్ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ & సింగర్ నివాస్ కె ప్రసన్న. అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడంతో పాటు వినసొంపైన గాత్రంతో పాడి దానికి జీవం పోశారని చెప్పొచ్చు. ఇంకా ఆ గేయంలో ఉన్న ప్రేమ మరియు ప్రియురాలుకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలిపే పదాలు రాసిన విధానం హృదయాన్ని ధ్రవింప చేస్తుంది.

ఇందులో పాటలన్నింటికి సాహిత్యాన్ని డైరెక్టర్ మారీ సెల్వరాజ్ అందించడం విశేషం. “నువ్వు మనువాడి పోతే నే తల్లాడి పోనా, నీ కథ మారిపోతే నే కడితేరిపోతాను, లాంటి పాటలో పదాలు హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ మధ్య ఎంత గాఢమైన ప్రేమ, సాన్నిహిత్యం, బాధ ఉందో అర్థవుతోంది. “తీరేనా తీరేనా గుండెల్లోనా మండుతున్న మూగవేదన, మారేనా మారేనా కళ్ళల్లోనా కానవచ్చే నేటి వేదనా” లాంటి లోతైన అర్థాన్ని ఇచ్చే పదాలు వింటుంటే ఇది కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని.. డైరెక్టర్ మారీ సెల్వరాజ్, హీరో ధ్రువ్ విక్రమ్‌లకు ఒక మంచి తీపి గుర్తులు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కుమ్మరిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్ బైసన్ పేరుతో ఫ్యాన్స్ అంతా మూవీని ట్రెండ్ చేస్తున్నారు.