లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్‌ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!

Dulquer Salmaan Nissan Patrol Y60 Car in Lucky Bhaskar: ‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపై కనపడాలి’ ఇలా ఒక్కొక్క డైలాగ్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన లక్కీ భాస్కర్ సినిమా.. ఇటీవల కాలంలో ఓ సంచలనం అనే చెప్పాలి. ఎన్నో జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ మూవీ ఎంతోమందిని కదిలించింది. మరెంతోమందికి ఆదర్శమైంది. నటుడు దుల్కర్ సల్మాన్, నటి మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచేసింది. అయితే ఈ సినిమాలో కనిపించే ఒక కారు మాత్రం వాహన ప్రియులకు ఫిదా చేసింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేద్దాం.

గోల్డ్ షాపుకు వెళ్లి బంగారం కొనుక్కున్న తరువాత.. బ్యాంక్ చెక్ యాక్సెప్టబుల్ కాదని సేల్స్‌మెన్ (నాగి) చెబుతాడు. ఆ తరువాత దుల్కర్ సల్మాన్.. మీనాక్షి చోదరితో వెళ్లి కారు కొనుక్కుని.. మళ్ళీ అదే గోల్డ్ షాపుకు వస్తాడు. ఇక్కడ కనిపించే కారు మోడల్ ఎంతోమందికి ఒక్క చూపుకే తెగ నచ్చేసింది. ఈ కారు నిస్సాన్ కంపెనీకి చెందిన ‘పట్రోల్ వై60’ మోడల్. ఎరుపు రంగులో కనిపించే ఈ కారు చాలా విశాలంగా.. చాలా లగ్జరీగా కనిపిస్తోంది.

నిస్సాన్ పట్రోల్ వై60 (Nissan Patrol Y60)

ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన ‘నిస్సాన్ పట్రోల్ వై60’ మోడల్ కారు 1987 నుంచి 1997 వరకు ఉత్పత్తిలో ఉండేది. ఆ తరువాత ఈ కారులో అప్డేటెడ్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇది భారతదేశంలో కూడా 1999 వరకు కూడా అమ్మకానికి అందుబాటులో ఉండేది. ఇది విలాసవంతమైన డిజైన్, మరియు ఫీచర్స్ కలిగి వినియోగదారులకు లగ్జరీ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే దశాబ్దాలు ఇది గ్లోబల్ మార్కెట్లో అమ్మకానికి నిలిచింది.

నిస్సాన్ పట్రోల్ వై60 మోడల్ కారులో 4.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండేది. ఇది 4000 rpm వద్ద 170 హార్స్ పవర్, 3200 rpm వద్ద 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పొందింది. కాబట్టి ఇది అత్యుత్తమ పనితీరును అందించేది. ఈ కారు ధర రూ. 80 లక్షల వరకు ఉండేది సమాచారం. 5 డోర్లు కలిగిన ఈ కారు ఉత్పత్తి ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయింది. అయితే కొంతమంది ఆటోమోటివ్ ఔత్సాహికుల గ్యారేజిలో మాత్రమే ఈ కారు కనిపిస్తోంది. ఈ కారు నటుడు దుల్కర్ సల్మాన్ గ్యారేజిలో కూడా ఉంది.

దుల్కర్ సల్మాన్ కార్ కలెక్షన్ (Dulquer Salmaan Car Collection)

సాధారణంగా నటుడు ‘దుల్కర్ సల్మాన్’ను కార్లన్నా.. బైకులన్నా అమితమైన ఇష్టం ఈ కారణంగానే ఈయన గ్యారేజిలో అన్యదేశ్య, ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. ఇందులో నిస్సాన్ పెట్రోల్ వై60 మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ 7 సిరీస్, బీఎండబ్ల్యూ ఈ30, మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ఎస్ ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం3 ఈ46, జీ63 ఏఎంజీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ మరియు పోర్స్చే పనామెరా వంటి కార్లు ఉన్నాయి.

కార్లు మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ ఖరీదైన బైకులను కూడా వినియోగిస్తున్నారు. ఇందులో ట్రయంఫ్ బోన్నెవిల్లే, బీఎండబ్ల్యూ ఆర్1200జీఎస్, డుకాటీ స్క్రాంబ్లర్ మొదలైన బైకులు ఉన్నాయి.

దుల్కర్ సల్మాన్‌కు మాత్రమే కాకుండా.. ఈయన తండ్రి మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టికి కూడా కార్లంటే చాలా ఇష్టం. ఈయన ఉపయోగించే కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాచ్ జీఎల్ఎస్600, ఏఎంజీ ఏ45ఎస్, ఫెరారీ 296 జీటీబీ, మినీ కూపర్ ఎస్, జాగ్వార్ ఎక్స్‌జే, ఆడి ఏ7, టయోటా ల్యాండ్ క్రూయిజర్, టయోటా ఫార్చ్యూనర్ మరియు మిస్టీబిషి పజెరో స్పోర్ట్స్ వంటి మరెన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి.

Also Read: కొత్త పెళ్లి కూతురు ‘కీర్తి సురేష్’ ఇష్టపడి కొన్న కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

ఇక ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే.. మమ్ముట్టి మరియు దుల్కర్ సల్మాన్ ఉపయోగించే కార్లన్నింటికీ 369 అనే నెంబర్ ప్లేట్ ఉంటుంది. కొందరు సెలబ్రిటీలు ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఇలాంటి నెంబర్ ప్లేట్స్ ఉపయోగిస్తుంటారు. ఈ కారణంగానే మమ్ముట్టి గ్యారేజిలోని అన్ని కార్లకు ఇదే నెంబర్ (369) ఉంటుంది.

Leave a Comment