ప్రపంచ కుబేరులు.. వేలకోట్ల సంపద: వీళ్ళు వాడే కార్లు మాత్రం ఇవే

Billionaires Prefer to Drive These Affordable Cars: సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు, క్రికెటర్ల నుంచి రాజకీయ నాయకలు దాకా.. పారిశ్రామిక వేత్తల నుంచి బిలినీయర్ల వరకు అందరికి వాహాలంటే ఇష్టమే. అయితే ఆర్థిక స్థోమతను బట్టి ఎవరికి వారు తమకు కావలసిన వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే బిలినీయర్లు లేదా ప్రపంచ కుబేరులు కావాలనుకుంటే.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించవచ్చు. కొందరు ఉపయోగిస్తున్నారు కూడా. ఎవరెన్ని ఖరీదైన కార్లను ఉపయోగిస్తున్నా.. వారి గ్యారేజీల్లో కోట్ల రూపాయల విలువ చేసే కార్లున్నా కొందరు ధనవంతులు మాత్రం సాధారణ కార్ల వాడకానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో అమెజాన్ ఫౌండర్ దగ్గర నుంచి ఫేస్‌బుక్ స్థాపించడానికి సహాయపడిన డస్టిన్ మోస్కోవిట్జ్ వరకు ఉన్నారు.

జెఫ్ బెజోస్ (Jeff Bezos)

ప్రపంచ కుబేరులలో ఒకరు.. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ గురించి అందరికి తెలుసు. వేలకోట్ల సామ్రాజ్యానికి నాయకుడైన ఈయన గ్యారేజిలో ఖరీదైన కార్లు చాలానే ఉన్నాయి. కానీ ఈయన మాత్రం 1999నాటి హోండా అకార్డ్ ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఎక్కువగా ఆ కారును డ్రైవ్ చేయడానికి బెజోస్ ఆసక్తి చూపుతారు. వేలకోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన బెజోస్ ఎందుకు ఈ కారును ఉపయోగిస్తారు అని ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు.. ఇది చాలామంది డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుందని నవ్వుతూ సమాధానమిచ్చారు.

మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg)

ఖరీదైన కార్లను ఉపయోగించడం కంటే సరసమైన కార్లను వినియోగించడానికి ఇష్టపడే మరో బిలినీయర్ ఫేస్‌బుక్ ఫౌండర్ మరియు సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఒకరు. కారు విషయంలో మాత్రమే కాకుండా ఈయన దుస్తుల విషయంలో కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. రూ. 81వేలకోట్ల కంటే ఎక్కువ సంపద కలిగిన మార్క్ గ్యారేజిలో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. కానీ ఈయనకు నచ్చిన కారు మాత్రం బ్లాక్ అకురా టీఎస్ఎక్స్. ఈ మోడల్ భారతీయ మార్కెట్లో జాజ్ పేరుతో విక్రయిస్తున్నారు.

అకురా కారు మాత్రమే కాకుండా మార్క్ జుకర్‌బర్గ్ గ్యారేజిలోని మరో సరసరమైన కారు పగని హుయ్రా. ఓ సందర్భంలో అకురా కారును ఎందుకు ఉపయోగిస్తున్నారు అని మార్క్‌ను ప్రశ్నించినప్పుడు.. ఇది చాలా సురక్షితమైన, సౌకర్యవంతమైన మరియు ఆడంబరం లేని అనుభూతిని ఇస్తుందని ఆయన వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే వీరికి ఖరీదైన వాహనాల కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉండే కార్లను ఉపయోగించడమే ఇష్టమని అర్థమవుతోంది.

ఆలిస్ వాల్టన్ (Alice Walton)

లక్షల కోట్లకు అధినేత్రి వాల్ మార్ట్ వ్యవస్థాపకుడు సామ్ వాల్టన్ కుమార్తె ‘ఆలిస్ వాల్టన్’ కూడా లగ్జరీ కార్ల కంటే సరసమైన కార్లను ఉపయోగించడానికి ఇష్టపడతారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఒకరైన ఈమె చాలా పొదుపుగా ఖర్చు చేస్తారని చాలామంది చెబుతాను. ఈమె వాడే కారు 2006 ‘ఫోర్డ్ ఎఫ్-150 కింగ్ రాంచ్’.

ఆలిస్ వాల్టన్ ఈ కారును ఎక్కువగా ఉపయోగించడానికి కారణం సెంటిమెంట్ అని తెలుస్తోంది. ఆమె తండ్రి 1979 ఫోర్డ్ ఎఫ్-150 ఉపయోగించేవారు. ఈ కారణంగా ఆలిస్ కూడా ఎఫ్-150 కార్లతో కొంత ఎమోషనల్ టచ్ ఉంది. ఇది మాత్రమే కాకుండా ఇది ఎక్కువ సురక్షితమైనదని భావించడం కూడా మరో కారణమని చెబుతారు. 1993లో అద్దెకు తీసుకున్న జీప్ కారు కంట్రోల్ తప్పినప్పుడు కారులు దెబ్బ తగిలింది. దీంతో ఇతర కార్ల కంటే కూడా ఫోర్డ్ ఎఫ్-150 చాలా సురక్షితమైనదని భావించి తరచుగా ఈ కారునే ఉపయోగించడానికి ఇష్టపడుతోందని తెలుస్తోంది.

వారెన్ బఫెట్ (Warren Buffett)

ప్రముఖ అమెరికన్ వ్యాపార దిగ్గజం మరియు ప్రపంచ ధనవంతులలో ఒకరు వారెన్ బఫెట్ కూడా సరసమైన లేదా తక్కువ ధర కలిగిన కారును ఉపయోగించడానికి ఇష్టపడతారు. బెర్క్‌షైర్ హాత్వే ఛైర్మెన్ మరియు సీఈఓ అయిన ఈయన 2006 కాడిలాక్ డీటీఎస్ కారును వినియోగిస్తున్నారు. ఆ తరువాత ఆ కారు ఇబ్బందిగా ఉందని తన కుమార్తె ఒప్పించడంతో 2014 కాడిలాక్ ఎక్స్టీఎస్ కారును కొనుగోలు చేశారు.

వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ కొత్త కారును ఎందుకు కొనుగోలు చేయరు అనే ప్రశ్నకు బఫెట్.. నేను సంవత్సరానికి 3500 మైళ్ళు మాత్రమే డ్రైవ్ చేస్తాను. కాబట్టి కొత్త కారు కొనుగోలు చేయను అని చెప్పారు. అంతే కాకుండా 1958లో కొనుగోలు చేసిన ఇంట్లోనే ఈయన నివాసముంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు, ఎక్కడ లాభాలు వస్తాయో బాగా తెలిసిన ఈయన వాల్ స్ట్రీట్‌లో కోట్ల డబ్బు సంపాదించారు. ఎంతోమందికి ఆర్ధిక విషయాలకు సంబందించిన లేదా జీవితంలో ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ఎదగాలి అనే చాలా విషయాలను గురించి చెబుతూ ఉంటారు.

స్టీవ్ బాల్మెర్ (Steve Ballmer)

మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ మరియు లాస్ ఏంజిల్స్ క్లిప్పర్స్ యజమాని స్టీవ్ బాల్మెర్ కూడా లగ్జరీ కార్లను డ్రైవ్ చేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఈయన ఫోర్డ్ కార్లను ఉపయోగిస్తారు. 2000 నుంచి 2014 వరకు మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓగా పనిచేసిన ఈయన చాలామంది బిలినీయర్ల మాదిరిగానే సరసమైన కార్లను ఉపయోగిస్తున్నారు.

లారీ ఫేజ్ మరియు సెర్గీ బ్రిన్ (Larry Page & Sergey Brin)

గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఫౌండర్స్ లారీ ఫేజ్ మరియు సెర్గీ బ్రిన్ ఇద్దరూ కూడా కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో చెప్పుకోదగ్గ వారు. వేళా కోట్ల సంపదకు వార్సాకులైన వీరు ఎక్కువ డబ్బు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. ఈ కారణంగానే లారీ ఫేజ్ టయోటా ప్రియస్ కారును, సెర్గీ బ్రిన్ సరసమైన హైబ్రిడ్ కారును ఉపయోగిస్తారు.

Don’t Miss: 2024 క్లాసిక్ 350 వచ్చేసింది.. ప్రత్యర్థుల పని అయిపోయినట్టే!
డస్టిన్ మోస్కోవిట్జ్ (Dustin Moskovitz)

ప్రముఖ సోషల్ మీడియా సైట్ ఫేస్‌బుక్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన డస్టిన్ మోస్కోవిట్జ్ కూడా చెప్పుకోదగ్గ ధనవంతుడు. ఫేస్‌బుక్‌లో 2.34 శాతం వాటా కలిగి, 25 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపద కలిగి ఉన్న ఈయన ఫోక్స్‌వ్యాగన్ ఆర్32 కారును ఉపయోగించడానికి ఆసక్తి చూపుతారు. వేలకోట్ల డబ్బు ఉన్నప్పటికీ.. కార్ల విషయంలో మాత్రమే కాకుండా సాధారణ జీవితాన్ని గడపడానికే డస్టిన్ ఎక్కువ ఆసక్తి చూపుతారు.