Do You Know Why Sunny Leone Sold Benz And BMW: చిత్రసీమలో అగ్ర కథానాయకిగా.. తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న సెలబ్రిటీ ‘సన్నీ లియోన్’ (Sunny Leone) గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈమె ఒకప్పుడు తన ఖరీదైన కార్లను విక్రయించి.. కొంత తక్కువ ధరలో లభించే కారును కొనుగోలు చేసింది. సన్నీ లియోన్ ఇలా చేయడానికి కారణం ఏమిటి? ఈమె ప్రస్తుతం ఏ కారును ఉపయోగిస్తోంది అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సన్నీ లియోన్ విక్రయించిన కార్లు
నిజానికి ఇతర సెలబ్రిటీల మాదిరిగానే సన్నీ లియోన్ ఒకప్పుడు ఖరీదైన బీఎండబ్ల్యూ 7 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ క్లాస్ కారుతో పాటు మరో లగ్జరీ కారును ఉపయోగించేది. సన్నీ లియోన్ ఉపయోగించిన మూడో కారు ఏదనేది స్పష్టంగా వెల్లడికాలేదు. అయితే ఈమె ఆ మూడు కార్లను విక్రయించి రూ. 38 లక్షల విలువైన ‘ఎంజీ గ్లోస్టర్’ (MG Gloster) కారును కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సమాచారం.
లగ్జరీ కార్లను విక్రయించడానికి కారణం?
రుతుపవనాల కారణంగా ముంబైలో విపరీతమైన వర్షాలు కురిశాయని, దీంతో గ్యారేజిలోకి వర్షపు నీరు చేరడం వల్ల ఖరీదైన కార్లను విక్రయించాల్సి వచ్చిందని సన్నీ లియోన్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసుకున్న అత్యంత ఖరీదైన కార్లు కొన్ని సార్లు వర్షాల కారణంగా చాలా దెబ్బతింటాయి. ఆ సమయంలో వాటిని రిపేర్ చేసుకోవడానికి భారీమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది వర్షపు నీటివల్ల రిపేర్ అయిన వాహనాలను దాదాపు విక్రయించేస్తారు.
ఒకసారి నీటిలో మునిగిన కార్లలో చాలా సమస్యలు తలెత్తుతాయి. కారులోని ఎలక్ట్రానిక్స్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఇంజిన్‌లోకి నీరు చేరటం వల్ల దాని పనితీరు కూడా బాగా తగ్గిపోతుంది. ఇలాంటి వాటిని రిపేర్ చేయడానికి చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోలేకనే.. ఎంత ఖరీదైన కారు అయినా.. వర్షపు నీటిలో మునిగితే దానిని నిర్దాక్షిణ్యంగా విక్రయించే అవకాశం ఉంది.
ఎంజీ గ్లోస్టర్ కొనుగోలు
నటి సన్నీ లియోన్ లగ్జరీ కార్లను విక్రయించి ఎంజీ గ్లోస్టర్ కారును కొనుగోలు చేసింది. ఈ కారుకు సన్నీ లియోన్ ‘ఇండియన్ ట్రక్’ అని పేరుపెట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఎక్కువగా ఈ కారునే వినియోగిస్తున్నట్లు సమాచారం.
ఎంజీ గ్లోస్టర్ కారును కంపెనీ 2020లో మొదటిసారి పరిచయం చేసింది. చూడటానికి విలాసవంతంగా కనిపించే ఈ కారు భారీ ఎస్‌యూవీ. గ్లోస్టర్ 2.0 లీటర్ సింగిల్ టర్బో ఛార్జ్డ్ మరియు ట్విన్ టర్బో ఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. స్లిగిల్ టర్బో వేరియంట్ 158 బిహెచ్‌పీ పవర్ మరియు 373 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ట్విన్ టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ 212 బిహెచ్‌పీ, 478 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
Also Read: సన్నీలియోన్ గ్యారేజీలో ఇన్ని కార్లున్నాయా? ఒక్కో కార్ రేటు చూస్తే మతిపోవడం ఖాయం!
గ్లోస్టర్ యొక్క హై-ఎండ్ వేరియంట్ 4×4 ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ కారు ధరలు రూ. 38.30 లక్షల నుంచి రూ. 43.87 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఎంజీ గ్లోస్టర్ ఆధునిక డిజైన్ కలిగి.. చాలా వరకు అప్డేటెడ్ ఫీచర్లను పొందుతుంది. ఇందులో ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పెద్ద సన్‌రూఫ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు.
సన్నీ లియోన్ ఉపయోగించిన కార్లు (Sunny Leone కార్ Collection)
నటి సన్నీ లియోన్ ఎంజీ గ్లోస్టర్ కారును మాత్రమే కాకుండా మసెరటి కంపెనీకి చెందిన కార్లను ఉపయోగించారు. ఇందులో మసెరటి ఘిబ్లీ నెరిస్సిమో, మసెరటి క్వాట్రోపోర్టే, ఆడి ఏ5, బీఎండబ్ల్యూ 7 సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జెఎల్350డీ వంటివి ఉన్నాయి. ఇతర సెలబ్రిటీలతో పోలిస్తే మసెరటి బ్రాండ్ కార్లను ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసిన నటి సన్నీ లియోన్ కావడం గమనార్హం.