Actress Pooja Hegde Admits She Was a Victim of Targeted Trolling: ఒక లైలా కోసం సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన బుట్టబొమ్మ ‘పూజా హెగ్డే’ అతి తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానుల మనసు దోచుకుంది. ఇప్పుడు బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. డబ్బులిచ్చి మరీ తనను తిట్టించినట్లు చెప్పుకొచ్చింది.
సినీరంగంలో చాలా వేగంగా పాపులర్ అయిన హీరోయిన్లలో పూజ హెగ్డే పేరు తప్పకుండా చెప్పుకోవాల్సిందే. తన ఎదుగుదలను చూసి కొందరు కావాలనే నన్ను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కొందరు లక్షలు ఖర్చు చేసి మరీ నన్ను ట్రోల్స్ చేయిస్తున్నట్లు తెలిసింది. ఇది నన్ను, నా కుటుంబాన్ని ఎంతో వేదనకు గురి చేసింది. ఎప్పటికప్పుడు నా కుటుంబానికి సర్దిచెబుతూ వచ్చాను.
డబ్బు కావాలని చెప్పారు
అసలు నన్ను ఎందుకు టార్గెట్ చేసి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారనే విషయం తెలుసుకోవడానికి.. కొన్ని మీమ్స్ పేజీలను చెక్ చేస్తే.. అక్కడ ఎలాంటి వివరాలు ఉండవు. వీళ్ళు ఎందుకు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు అనే విషయాన్ని కనుక్కోమని నా టీమ్‌కు చెప్పాను. వారు కనుక్కున్నప్పుడు ఆశ్చర్యకరమైన నిజాలు బయటపడ్డాయి. నన్ను తిట్టడానికే కొందరు డబ్బులు ఇస్తున్నట్లు ఆ మీమ్స్ పేజెస్ వాళ్ళు చెప్పారని నా టీమ్ నాతో చెప్పింది. అంతే కాకుండా.. నన్ను తిట్టడం ఆపేయాలన్నా?, అవతలి వాళ్ళను తిట్టాలన్నా? డబ్బు కావాలని డిమాండ్ చేసినట్లు కూడా నా టీమ్ నాకు చెప్పింది.
ఎంతగానో బాధించాయి
ఒక వ్యక్తి గురించి అనవసరంగా ఎందుకు కామెంట్ చేస్తారనే విషయం నాకు అర్థం కాలేదు. నన్ను తిట్టడం ఆపేయాలన్నా.. అవతలివాళ్ళని తిట్టాలన్నా.. డబ్బు డిమాండ్ చేయడం వంటివి కూడా నన్ను ఎంతగానో బాధించాయి. అలా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
నిజానికి ప్రస్తుతం మీమర్స్ లేదా ట్రోలర్స్ వల్ల మానసికంగా బాధపడుతున్న నటీమణుల జాబితాలో పూజ హెగ్డే మాత్రమే కాకుండా.. చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. కొందరు కావాలని చేసే పనుల వల్ల ఎంతోమంది మానసిక వేదనకు గురవుతుండటంతో.. ప్రభుత్వాలు కూడా అలాంటివారిపైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.
Also Read: అభిమాని కోసం బంగారం ఇచ్చేసిన హీరోయిన్ – వీడియో
పూజా హెగ్డే సినీ ప్రస్థానం
ఒక లైలా కోసం సినిమాతో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టిన ‘పూజా హెగ్డే’.. ఆ తరువాత ముకుంద సినిమాతో పాపులర్ అయింది. ఆ తరువాత దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, అల వైకుంఠపురంలో మరియు ఆచార్య వంటి సినిమాల్లో నటించింది. అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి అగ్ర హీరోల సరసన పూజ హెగ్డే నటించింది.
పూజా హగ్దే రెమ్యునరేషన్
నటి పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా రూ. 4 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈమె మొత్తం సంపద రూ. 50 నుంచి రూ. 60 కోట్లు వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈమె రేంజ్ రోవర్, పోర్స్చే, జాగ్వార్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ బ్రాండ్ కార్లను వినియోగిస్తోంది.